భూతాపాన్ని ఎదుర్కోవచ్చు..!
డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 19 Dec 2012, IST
అనూహ్యంగా అధికమవుతున్న భూతాపోన్నతిని అధిగమించడానికి ఒక
అమెరికన్ శాస్త్రవేత్త పరిష్కారం సూచించాడు. ఆర్కిటిక్ ప్రాంతాన్ని
పునఃఘనీభవించడమే ఆ సూచన. 'డేవిడ్ కీత్' అనే హార్వార్డ్ ఆచార్యుడు
కాంతిని పరావర్తనం చెందించే పదార్థాలను అక్కడి వాతావరణంలోకి వదిలితే, అవి
సూర్యరశ్మిని భూమి మీదకు తక్కువగా వచ్చేలా చేస్తాయని ఆయన అంటున్నారు. ఆ
విధంగా ఆర్కిటిక్ ప్రాంతంలో శీతల వాతావరణాన్ని తిరిగి కలిగించి, మంచు
ఏర్పడేలా చేయవచ్చు అంటున్నారు. సూర్యరశ్మిని కేవలం 0.5% తగ్గించినా కూడా
ఆర్కిటిక్ ప్రాంతంలో మంచుని గణనీయంగా పెంచవచ్చని ఆయన సెలవిచ్చాడు. గత
సెప్టెంబర్‌లో ఆర్కిటిక్ మహాసముద్రంపై మంచు 20 ఏళ్ళ క్రితం వున్న దానికంటే
సగం వుంది.
No comments:
Post a Comment