భారీ కాయంతో..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 26 Dec 2012, IST
అధికబరువు, ఊబకాయం వంటివి ఎన్నో ఇబ్బందులను కలిగిస్తాయని
తెలుసు. ఇప్పుడు ఊబకాయం వున్న స్త్రీలు గర్భం ధరిస్తే పుట్టబోయే బిడ్డకు
ప్రమాదం అంటున్నారు. ఊబకాయం వల్ల శరీరంలో కొవ్వేకాక ఇతరరకాల సమస్యలూ
ఎక్కువే. ముఖ్యంగా గర్భాశ యం, దానికి సంబంధిత నాళాలు వంటివి కూడా సక్రమంగా
ఉండవని పరిశోధకులు గమనించారు. భారీకాయులు గర్భం ధరించడమే కష్టం. ఒకవేళ
ధరించినా, దాన్ని నిలుపుకోవడం మరింత కష్టం అంటున్నారు. హార్మోనులు, శరీర
చర్యలు (మెటబాలిజం) సక్ర మంగా జరగవని, అందువల్ల బిడ్డ సరిగా అభివృద్ధి
చెందదని పరిశోధకులు గమనించారు.
No comments:
Post a Comment