జిప్సీలు మనవాళ్లే..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 12 Dec 2012, IST
ప్రపంచమంతా వున్న సంచారజాతి జిప్సీల మూలాలు మనదేశంలోనే
వున్నాయని తాజా పరిశోధన తెలిపింది. అనేక దేశాలలో వున్న జిప్సీల రక్త
నమూనాలు సేకరించి, వాటిలో డిఎన్‌ఏను పరీక్షించి ఈ వాస్తవాన్ని
నిర్ధారించారు. యూరప్, మధ్య ఆసియా దేశాల జిప్సీల డిఎన్‌ఏలకు, మన దేశ
జిప్సీ తెగల డిఎన్‌ఏలతో పోల్చి చూస్తే, సుమారు 1500 ఏళ్ళ క్రితం
భారతదేశాన్ని వదిలి వెళ్ళిన ఒక తెగ నుండి విదేశీ జిప్సీలు ఆవిర్భవించారని
తేలింది. క్రీ.శ.500 లో మన పంజాబ్ ప్రాంతం నుండి మొదటి జిప్సీ గుంపు
దేశాన్ని విడిచి వెళ్లిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వాళ్ళు
బల్గేరియా, యూరప్ చేరారనీ, ఆ తరువాత విస్తరించారనీ తెలిసింది. వారి
ప్రయాణంలోనే ప్రతికూల వాతావరణపరిస్థితుల వల్ల కేవలం 47 శాతం మంది మాత్రమే
యూరప్ చేరుకోగలి గారట! అక్కడా జన్యుపరమైన ఇబ్బందుల వల్ల, యూరప్‌లో
అప్పటికే స్థిరంగా వున్న ప్రజలలో గల వివక్ష వంటి అంశాల కారణంగా జిప్సీల
జనాభా బాగా క్షీణించిపోయిందట..!
No comments:
Post a Comment