తోక పొడవే కీలకం..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 26 Dec 2012, IST
వీర్యకణాల సంఖ్య తక్కువై పిల్లలు పుట్టకపోవడానికి కారణం
కావడం మనకు తెలుసు. కానీ వీర్యకణాల సంఖ్య కంటే వాటి తోకల పొడవుపైనే బీజాల
సంయోగం ఆధారపడుతుందని తాజా పరిశోధన తేల్చింది. వీర్యకణాల తోకల పొడవుల్లో
తేడాలు ఎక్కువగా ఉంటే వాటి సామర్ధ్యత తగ్గుతుందని అంటు న్నారు ఈ పరిశోధకు
లు. దీని మూలం గానే 300 మిలియన్ల వీర్యకణాలు ఉత్పత్తి అయితే, వాటిలో కేవలం
ఒక శాతం మాత్రమే గర్భాశయం వరకూ వెళ్తాయి. కేవలం కొన్ని డజన్లు మాత్రమే అండం
సమీపానికి చేరతాయి. వీర్యకణాలు సరిగా ప్రయాణించలేవని కూడా ఈ పరిశోధనలో
తెలిసింది. అవి మార్గంమధ్యలో కాకుండా గోడల్ని పట్టుకుని ప్రయాణిస్తాయనీ,
కాస్త ఎక్కువ మలుపుల్లో ప్రయాణించడానికి కష్టపడతాయనీ తేలింది.
No comments:
Post a Comment