ఋతువులతో మారే గృహాలు..!
డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 19 Dec 2012, IST
బిట్రిష్ ఆర్కిటెక్ట్‌లు కొత్తరకం 'స్మార్ట్' ఇళ్ళను
ప్రతిపాదిం చారు. ఇవి ఋతువులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా తమను తాము
మార్పు చేసుకుంటాయి. ఉదాహరణకి ఉద యం నిద్రలేచినపుడు సూర్యోదయం అయితే, ఇల్లు
మొత్తం తిరుగుతూ రోజంతా ఇంట్లో సూర్య రశ్మి పడేలా మార్పు చెందు తుంది. ఈ
ప్రతిపాదన లకు మూలం గత శతాబ్ది ప్రారంభంలో 'హెన్రీ దాడినీ' అనే ఒక గణిత
శాస్త్రవేత్త కనిపెట్టిన సూత్రం. ఒక చతురస్రాన్ని ముక్కలుగా చేసి వాటిని
సమభుజ త్రికోణంగా అమర్చడం. ఈ గృహాలు తమ గోడలని మార్చుకుంటూ గదులను తిరిగి
రూపొందించు కుంటూ, తలుపులు కిటికీలుగా, కిటికీలు తలుపులుగా మారి కొత్త
కొత్తగా తయారవుతాయి. వేడినీ, చలినీ తప్పిస్తూ నిత్యం అనుకూల వాతావరణాన్ని
కల్పించే ఈ కొత్త తరహా గృహాలు 'డి హౌస్' అనే కంపెనీ ద్వారా
రూపొందనున్నాయి.
No comments:
Post a Comment