జూపిటర్‌పై కన్నేసిన నాసా..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 26 Dec 2012, IST
మరో దశాబ్దకాలంలో జూపిటర్ చంద్రుడిపై కాలుపెట్టాలని
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్ణయించింది. జూపిటర్‌కి యూరోపా చంద్రుడు.
అది ఆ గ్రహానికి నాల్గవ అతి పెద్ద సహజ ఉపగ్రహం. మంచుతో నిండి వుండే ఆ
ఉపగ్రహానికి చేరువలో అంతరిక్ష నౌకను ప్రయాణింప జేసే ఉద్దేశంలో నాసా వుంది.
మానవ రహిత 'యూరోపా క్లిప్పర్'ని రెండు బిలియన్ల డాలర్లతో రూపొందించి, 2021
కల్లా సిద్ధం చేయాలని నాసా ఆలోచిస్తుంది. యూరోపా ఉపగ్రహం సుమారు 3,100
కి.మీ. విస్తీర్ణంతో ఉంది. దానిపై జీవం ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని
పరిశోధకుల అంచనా. పైకి ఘనీభవించిన మంచు ఉన్నా, దానికింద విశాలమైన ద్రవ
రూపంలో నీరున్న సముద్రం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment