మధ్య, తూర్పు హిమాలయాలు ఆందోళనకర రీతిలో కరిగిపోతున్నట్టు
తాజా అధ్యయనాలలో తెలిసింది. అయితే, పశ్చిమ హిమాలయాలు స్థిరంగా ఉన్నట్టు
తెలిసింది. హిందూ కుష్ హిమాలయ ప్రాంతం ఎనిమిది దేశాలకు విస్తరించింది. ఈ
కొత్త అధ్యయనం ప్రకారం కరుగుతున్న హిమాలయాలు ఆ ఎనిమిది దేశాల నదీ వ్యవస్థా
జనాభాపై దాని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంత వాతావరణం
మొత్తం మారుతోంది. కానీ, ఆ మార్పు తాలూకు ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో
అంచనాకి అందటం లేదు. టిబెట్ ప్రాంతంలో హిమాలయాలు వేడిగా మారుతున్నాయి.
కానీ, ఇతర ప్రాంతాలలో అటువంటి వేడి కనిపించడం లేదు. ఏదేమైనా, ఇటువంటి
మార్పుల వల్ల భవిష్యత్తులో హిమాలయ పర్వతాల దిగువనున్న నదులు, భూగర్భజలాల్లో
పెనుమార్పులు జరగడం ఖాయం అని ఈ అధ్యయనం సూచిస్తుంది.
No comments:
Post a Comment