విజ్ఞాన వీచిక - డాక్టర్ కాకర్లమూడి విజయ్
చాలామందికి
పెరుగుతో భోజనం ముగించందే భోజనం చేసినట్లు భావించరు. వారికి ఇప్పుడొక
శుభవార్త. పెరుగును అధికంగా తింటే రక్తపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని
పరిశోధనల్లో గమనించారు. దీర్ఘకాలంగా పెరుగు తినే అలవాటున్న వారిలో రక్తపోటు
తక్కువగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. పదిహేనేళ్ల అధ్యయనంలో సుమారు
రెండువేల మంది స్వచ్ఛందంగా వచ్చినవారిని పరీక్షించారు. వారందరూ తొలుత అసలు
రక్తపోటు లేని వారే. కనీసం మూడురోజులకోసారి తక్కువ కొవ్వుగల పెరుగు
తిన్నవారిలో 31% తక్కువ రక్తపోటు వచ్చిందని గమనించారు. అయితే, కేవలం పెరుగు
తిని ఊరుకుంటే బీపీ సమస్య ఉండదని భావించరాదు. ఈ సమస్య వచ్చే అవకాశాలు
తక్కువేకానీ, వీరు ఇతరత్రా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందట!
No comments:
Post a Comment