విజ్ఞాన వీచిక - డాక్టర్ కాకర్లమూడి విజయ్
మానవులలో
సంతాన లేమికి అనేకానేక కారణాలున్నాయి. తాజాగా మరో కారణం గుర్తింపు
పొందింది. శుక్రకణం అండంతో కలిశాక 'పిఎల్‌సి' జీటా అనే ఒక ప్రొటీన్‌ను
విడుదల చేస్తుందట. ఆ ప్రొటీన్ ఫలదీకరణం చెందిన అండాన్ని పిండంగా మార్చే
ప్రక్రియకు దోహదపడుతుందట. ఒకవేళ ఆ ప్రొటీన్ సక్రమంగా లేకపోయినా లేక
సరిగ్గా విడుదల కాకపోయినా పురుష ఇన్‌ఫర్టిలిటీ (వంధ్యత్వం) వస్తుందట! అంటే
శుక్రకణాలు అండాన్ని ప్రేరేపించవు. ఇప్పుడు ఆ ప్రొటీన్‌ను గనక ఏదోవిధంగా
శరీరంలో ప్రవేశపెట్టగలిగితే సంతానలేమితో బాధపడే వారిలో సత్ఫలితాలు
పొందవచ్చని ఇపుడు భావిస్తున్నారు.
No comments:
Post a Comment