ఎటువంటి నొప్పి వచ్చినా వెంటనే ఒక పెయిన్ కిల్లర్‌ను
మింగడం చాలామందికి అలవాటు. అయితే ఈ మందులు, ప్రత్యేకించి ఇబుప్రోఫెన్,
పారాసిటామాల్ వంటివి మహిళల్లో వినికిడి శక్తిని తగ్గిస్తాయని ఇటీవల
తేలింది. వారానికి కేవలం రెండుసార్లు ఇటువంటి మందులు తీసుకున్న మహిళల్లో 13
శాతం వినికిడి శక్తి తగ్గే ప్రమాదముందని తేలింది. పారాసిటామాల్‌ని
వారానికి ఐదురోజులు వాడిన వారిలో 21 శాతం వినికిడి సమస్యలు వచ్చాయి. అయితే,
ఆస్పిరిన్ వాడుతున్న స్త్రీలల్లో ఇటువంటి సమస్యలు తలెత్తలేదు. ఈ వినికిడి
సమస్య తాత్కాలికమా కాదా అన్న విషయం ఇంకా తేలాలి.
No comments:
Post a Comment