విశ్వంలో సూర్యుడి కన్నా అతి పెద్ద నక్షత్రాన్ని
గుర్తించారు శాస్త్రజ్ఞులు. భూమికి 60 వేల కాంతి సంవత్సరాల దూరాన వున్న ఈ
భారీ నక్షత్రం ఎన్‌జిసి 1624-2. ఈ నక్షత్రం సూర్యునికన్నా 35 రెట్ల అధిక
ద్రవ్యరాశి కలిగి వుంది. దీనిచుట్టూ బలమైన అయస్కాంతశక్తితో పాటు అధిక
ఇంధనం, కాంతి, ఉష్ణం ఉన్నాయట! ఈ రకంగా ఉండటం చాలా అరుదైన విషయం అని
పరిశోధకులు అంటున్నారు. ఈ కొత్త నక్షత్ర ఉనికితో నక్షత్రాల అయస్కాంత శక్తి,
వాటి పరిణామక్రియలో ఏ విధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకునే వీలు కలిగే
అవకాశం ఉందని వీరు భావిస్తున్నారు.
No comments:
Post a Comment