- డాక్టర్ కాకర్లమూడి విజయ్
డింకెన్ డ్రైవింగ్ వీరుల్ని పట్టుకునేందుకు మన ట్రాఫిక్
పోలీసులు అష్టకష్టాలూ పడుతుంటారు. ఇప్పుడు 'మందు' మీదున్న వారిని కెమెరాలో
చూస్తూ పసిగట్టవచ్చు. శరీరంలో ఉష్ణోగ్రతా మార్పులను బట్టి మందు ఎక్కువైందో
లేదో చెప్పే సాఫ్ట్‌వేర్‌ని గ్రీసు పరిశోధకులు రూపొందించారు. దీనిని
కెమెరాలో ఎక్కించి, తద్వారా ఒక మనిషివైపు ఫోకస్ చేస్తే ఆ వ్యక్తి ఎటువంటి
స్థితిలో ఉన్నాడో తెలుసుకోవచ్చట! ఇటువంటి కెమెరాల వల్ల గుంపుల్లో, రద్దీ
ప్రదేశాల్లో కూడా దూరం నుండే ఎవరు 'అదుపు'లో లేరో గమనించవచ్చు. మన దేశంలో ఈ
సాంకేతికాన్ని ప్రవేశపెడితే మందుబాబులు కాస్త ఒళ్ళు దగ్గరలో పెట్టుకునే
బయటకు వెళ్లాల్సి వస్తుంది! ముందుచూపుతో మందును మానేస్తే మంచిదేమో..!!
మందుబాబులూ
No comments:
Post a Comment