రానున్న మూడేళ్లలో మానవ వ్యర్థాలతో నడిచే వాహనాలు రావచ్చని
పరిశోధకుల అంచనా! జపాన్‌లో ఈ విషయమై పరిశోధన జరుగుతోంది. మానవ విసర్జకాల
నుండి హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేసి, దానిని వాహనాలకు వాడొచ్చనేది
ఇప్పటి సూచన. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ద్రవ రూప సహజ వాయువుల నుండి
హైడ్రోజన్‌ను వెలికి తీయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికంటే మానవ
విసర్జకాల నుండి ఉదజనని ఉత్పత్తి చేయడం తేలికని పరిశోధకులు అంటున్నారు. ఈ
ప్రక్రియ వల్ల కర్బన ఉద్గారాలు 75% తగ్గుతాయి. ఈ పద్ధతిలో ముందుగా మీథేన్
వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువును వేడి చేస్తే అధిక మోతాదులో ఉదజని
లభిస్తుంది. ఈ ప్రక్రియను 2015 కల్లా వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని
పరిశోధకులు కృషి చేస్తున్నారు.
No comments:
Post a Comment