Wednesday, 7 March 2012

20 ఏళ్ల తర్వాత మీరెలా వుంటారు ...?

20 ఏళ్ల తర్వాత మీరెలా వుంటారు ...?

ప్రతి ఒక్కరూ తాము ఎలా వుంటామో చూసుకోవాలనుకోవడం సహజం. అద్దంలోనో, ఫొటోల్లోనో చూసుకొని మురిసిపోవడమూ సహజం. ఇది మానవ నైజం కూడా. అదే విధంగా మన ఫొటోను ఒక కార్టూన్‌గానో, పెయింటింగ్‌గానో చూసుకోవడం మరింత ఆసక్తికరంగా వుంటుంది. ఇదే ఇంత ఆసక్తికరంగా వుంటే.... 20 ఏళ్ళ తర్వాతో 30 ఏళ్ళ తర్వాతో ఎలా వుంటామో చూసుకోవడం అంటే ఇక ఆ ఆసక్తి, ఆ ఉద్విగత చెప్పనవసరమే లేదు. అయితే ఇదెలా సాధ్యం మీ దగ్గరేమైనా మంత్రశక్తులున్నాయా? 20 ఏళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి.. 'ఇదొట్టి ట్రాష్‌' అని కొట్టేయకండి మరీ.... ఇటువంటి అద్భుతాలన్నీ చేయడానికి కొన్ని వెబ్‌సైట్స్‌ వున్నాయి. ఆ సైట్స్‌లోకి మన ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే చాలు... మీరు కోరుకున్న రూపం కార్టూన్‌గానో, 20 ఏళ్ళ తర్వాత మీరెలా వుంటారో చూసుకోవచ్చు. ఇక మీ అనుమానాలన్నీ పక్కనపెట్టి కింద చెప్పిన సైట్స్‌లోకి మీ ఫొటోలను అప్‌లోడ్‌ చేసే పనిలోపడండి....

ఫొటోలను కార్టూన్‌ క్యారక్టర్‌ గా మార్చితే ఎలా వుంటుందో ఈ వెబ్‌సైట్‌ నుండి చూసుకోవచ్చు. అదీ ఒకే ఒక క్లిక్‌తో! అయితే http://www.cartoonize.net/ సైట్‌కి వెళ్ళాల్సిందే. ముందుగా యుఆర్‌ఎల్‌ నుండిగాని లేదా మన కంప్యూటర్‌లో నుండిగాని ఒక ఫోటోను అప్‌ లోడ్‌ చెయ్యాలి. మన కంప్యూటర్‌ నుండి అయితే ఈ సైట్‌ ఓపెన్‌ చేసిన చేసిన తర్వాత 'అప్‌ లోడ్‌ ఫ్రం ది డిస్క్‌' సెలెక్ట్‌ చేసుకొని, దాని కిందనే వున్న 'బ్రౌజ్‌'పై క్లిక్‌ చేయాలి. అనంతరం కార్టూన్‌గా మార్చాల్సిన ఇమేజ్‌ సెలెక్ట్‌ చేసుకొని దాని కిందనేవున్న Cartoonize now పై క్లిక్‌ చెయ్యాలి. అంతే ఫొటో కార్టూన్‌ గా మారిపోతుంది. అవసరం అనుకొంటే ఆ కార్టూన్‌ ని డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. దీనంతటికి ఎటువంటి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. Convert To Cartoon gif, jpeg, jpg, png, bmp లేదా xbm వంటి ఇమేజ్‌ ఫార్మేట్లను సపోర్ట్‌ చేస్తుంది.
ఫన్నీ ఫొటోల కోసం...
ఫొటోలను రకరకాల మోడల్స్‌గా మార్చుకోవచ్చు. పుస్తకాల కవర్‌ పేజీలుగా, వాల్‌పోస్టర్స్‌, పెయింటింగ్స్‌, పెన్సిల్‌ ఆర్ట్స్‌, యానిమేషన్స్‌, సైన్‌బోర్డ్స్‌... ఇలా రకరకాలుగా మన ఫొటోలను మార్చుకునేందుకుhttp://photofunia.com/ సైట్‌కి వెళ్లాలి. ఈ సైట్‌లో సుమారు 196 ఫొటోలు వివిధ రకాల ఎఫెక్ట్స్‌తో కనిపిస్తాయి. వీటిలో మనకు నచ్చిన ఫొటోను ఎంపిక చేసుకొని దానిపై క్లిక్‌ చేయాలి. మనం ఎంపిక చేసుకున్న ఫొటో పెద్దగా వచ్చి, దాని పక్కనే 'ఛూజ్‌ ఫైల్‌' అనే బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. 'బ్రౌజ్‌' అనే మరో విండో వస్తుంది. దానిలో బ్రౌజ్‌ బటన్‌పై క్లిక్‌ చేసి, మన కంప్యూటర్‌లోని ఫొటోను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ ఫొటో ఈ సైట్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంది. ఫొటో చుట్టూ ఒక సెలెక్షన్‌ వస్తుంది. ఫొటో సరిగా వుండేలా ఆ సెలెక్షన్‌ను అడ్జస్ట్‌ చేసుకొని ఓకె బటన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం ఫొటో కన్వర్ట్‌ కావడానికి దాని కిందనే వున్న 'గో' బటన్‌ క్లిక్‌ చేయాలి. అంతే క్షణాల్లో మీరు కోరుకున్న ఎఫెక్ట్‌లో మీ ఫొటో ప్రత్యక్షమవుతుంది.
ఫొటో ఫేస్‌ ఫన్‌...
ఇది కూడా ఫొటోలను ఫన్నీగా మార్చుకోడానికి ఉపయోగపడే వెబ్‌సైటే. ఇందులో 27 పేజీలున్నాయి. ఒక్కో పేజీలో 18 ఫొటోలు రకరకాల ఎఫెక్ట్‌లతో వున్నాయి. పైన చెప్పిన పద్ధతిలో, దానికంటే ఇంకా సులువుగా ఫొటోలను మనకు కావాల్సిన ఎఫెక్ట్‌లోకి కన్వర్ట్‌ చేసుకోవచ్చు. దాని కోసం http://www.photofacefun.com/ వెబ్‌సైట్‌లో చూడండి.
ఇరవై ఏళ్ళ తర్వాత మీరెలావుంటారు....
పైన పేర్కొన్న దానికంటే ఇది భిన్నమైనది, ఆసక్తికరమైనది. ప్రస్తుత మన ముఖవర్చస్సు 20ఏళ్ళ తర్వాతనో, 30ఏళ్ళ తర్వాతనో ఎలావుంటుందో చూసుకోవాలనుకోవడం ఆసక్తికరంగానే వుంటుంది కదా! మిమ్మల్ని మరీ టెన్షన్‌లో పెట్టకుండా ఆ సైట్‌ పేరు చెప్పేస్తున్నా.... అదీ...http://in20years.com/. ఈ సైట్‌ ఓపెన్‌ చేయగానే ఫొటోలు కన్వర్ట్‌ అవడానికి ముందు, కన్వర్ట్‌ అయిన తర్వాత వున్న తేడాను చూపే కొన్ని ఫొటోలు రొటేట్‌ అవుతుంటాయి. దాని కిందనే మూడు ఆప్షన్స్‌ వుంటాయి. 1. జెండర్‌, 2. ఏజ్‌, 3. డ్రగ్‌ ఎడిక్ట్‌. ఈ మూడు ఆప్షన్స్‌ను మనకు కావాల్సిన విధంగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ముఖ్యంగా రెండో ఆప్షన్‌లో 20 లేదా 30 ఏళ్ళు అనేది సెలెక్ట్‌ చేసుకోవాలి. ఈ మూడు ఆప్షన్స్‌ను సెలెక్ట్‌ చేయకపోతే ముందుకు వెళ్ళలేం. ఆ తర్వాత దీని కిందనే వున్న 'అప్‌లోడ్‌ యువర్‌ ఫొటో' అనే బటన్‌పై క్లిక్‌ చేసి, బ్రౌజ్‌ అని ఫొటో సెలెక్ట్‌ చేసుకోవాలి. అంతే.... ప్రస్తుత ఫొటో, 20 ఏళ్ళ తర్వాత ఎలావుంటారో చూపే ఫొటో రెండు పక్కపక్కనే ప్రత్యక్షమవుతాయి. దీని కిందనే సేవ్‌ ఇమేజ్‌పై క్లిక్‌ చేసి ఆ ఫొటోను సేవ్‌ చేసుకోవచ్చు. థ్రిల్లింగ్‌గా వుందా....అయితే ఓకె. 20 ఏళ్ళ తర్వాత మీరెలా వుంటారో వెంటనే ప్రయత్నించండి మరి....
ఒక ఫార్మెట్‌ నుండి మరొక ఫార్మెట్‌లోకి...
ఇప్పటివరకు ఫొటోలను రకరకాల ఎఫెక్ట్‌లలోకి మార్చాం గదా... ఒక ఫార్మెట్‌లో వున్న ఫైల్‌ను మరో ఫార్మెట్‌లోకి సులభంగా మార్చేయవచ్చు. అదేంటో ఇప్పుడుచూద్దాం... ఆన్‌లైన్‌లో FreeFile Convert ద్వారా ఫైళ్ళను ఒక ఫార్మెట్‌ నుండి మరొక ఫార్మెట్‌లోకి మార్చటానికి!!! ఎటువంటి రిజిస్ట్రేషన్‌ మరియు ఫైళ్ళను అప్‌లోడ్‌ చెయ్యకుండా ఒక ఫార్మెట్‌ నుండి మరొక ఫార్మెట్‌లోకి సులభంగా మార్చవచ్చు, అదీ కేవలం మూడే మూడు స్టెప్పుల్లో. దీనికోసంhttp://www.freefileconvert.com/ సైట్‌ వెళ్ళాలి. దీనిలో Convert File టాబ్‌పై క్లిక్‌ చెయ్యాలి. అక్కన్న స్టెప్‌ 1) Input File దగ్గర వున్న Choose File క్లిక్‌ చేసి కన్వర్ట్‌ చెయ్యవలసిన ఫైల్‌ని ఎంచుకోవాలి, ఫైల్‌ సైజ్‌ 300MB మించి వుండరాదు. 2) Output Format‌ దగ్గర మనం సెలెక్ట్‌ చేసుకున్న ఫైల్‌కి అనుగుణంగా మార్చదగిన ఫైల్‌ ఫార్మెట్లను చూపిస్తుంది, వాటిలో కావలసిన దానిని సెలెక్ట్‌ చేసుకోవాలి. 3) Convertదగ్గర వున్న Convert బటన్‌ పై క్లిక్‌ చెయ్యాలి. అంతే.... ఫైల్‌ కన్వర్ట్‌ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్‌ లింక్‌ జెనెరేట్‌ అవుతుంది, ఆ లింక్‌ పై క్లిక్‌ చేసి ఫైల్‌ని డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. ఈ లింక్‌ సైట్‌ సర్వర్‌లో 12 గంటల వరకు అందుబాటులో వుంటుంది.

No comments:

Post a Comment