Friday, 9 March 2012

జనవిజ్ఞాన వేదిక


                                                  జనవిజ్ఞాన వేదిక
                                     గౌరవ ప్రధానోపాధ్యయులు/ఉపాధ్యాయులకు

మిత్రులారా !

                1988 ఫిబ్రవరి 28న స్థాపించిన జనవిజ్ఞాన వేదిక శాస్త్రీయ దృక్పదాన్ని ప్రజలలో పెంచడానికి కృషి చేస్తూ 24 సంవత్సరాలు  పూర్తి చేసుకొంది.25వ రజతోత్సవ సంవత్సరాన్ని ఈ 2012 సంవత్సరం జరుపుకొంటుందీ జనవిజ్ఞాన వేదిక. ఇంత ఎదమడానికి మధ్య తరగతి వర్గమేధావులు, ప్రజల ఆదరించారు. జె.వి.వి. లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిది. ఈ కృషి రాబోవు కాలంలో కొనసాగించాలని ఆశిస్తున్నాము. ఈ సందర్బంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాము.  వీటి విజయవంతంలో మీ సూచనలు, సలహాలతోపాటు మీ సహకారాన్ని కోరుతున్నాము.

 @  విద్యార్ధులలో శాస్త్రీయ దృక్పదం పెంచేదాని కోసం విద్యార్ధి చెకుముకి పత్రిక
      (సంవత్సర చందా రూ!! 130/- లు)   మీ  పాఠశాల గ్రంధాలయ నిధుల నుండి
      కట్టే ప్రయత్నం  చేయగలరు.
@  2012 జూన్ 6 ఉదయం 7.30 గం!! ల లోపు శుక్ర గ్రహణం
      ( సూర్యునికి అడ్డంగా శుక్ర గ్రహం వస్తుంది )    ఇది ఖగోళ అద్బుతం.
      దీని  గురించి విధ్యార్థులకు చెప్పాలి ( దీనికి సంబందించిన నోట్ పంపిస్తాము )
@  ప్రతి పాఠశాల గోడ బైట  ఆరోగ్య దీపిక బోర్డు ఏర్పాటు చేసి ప్రతి వారం ఆరోగ్య
     సూత్రాలు విద్యర్ధులతో వ్రాయించాలి.
@  ప్రముఖ శాస్త్రవేత్తల పుట్టిన రోజులను పాఠశాలలో నిర్వహించాలి. దీనిని ఉదయం
     పాఠశాలప్రార్ధన సమయం లో నిర్వహించవచ్చు. ( శాస్త్రవేత్తల పుట్టిన రోజుల
     క్యాలెండర్ను పాఠశాలలకు పంపిస్తాము )
@  ప్రముఖ శాస్త్రవేత్తల పుట్టిన రోజులను పాఠశాలలో నిర్వహించాలి. దీనిని ఉదయం
     పాఠశాల ప్రార్ధన సమయం లో నిర్వహించవచ్చు. ( శాస్త్రవేత్తల పుట్టిన రోజుల
     క్యాలెండర్ను పాఠశాలలకు పంపిస్తాము ) 
@  ప్రతి పాఠశాలలో సైన్స్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ సైన్స్
     విభాగం నుండి పాఠశాలకు  ప్రయోగాలతో కూడిన మెటీరియల్  ఉచితంగా పంపిస్తారు.

  ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి మాతో సహకరించగలరని    ఆశిస్తున్నాము.
          
                                             జనవిజ్ఞాన వేదిక
                                             
                                          గుంటూరు జిల్లా శాఖ

        అధ్యక్షులు                      ప్రధాన కార్యదర్శి                          ఆర్ధిక కార్యదర్శి

 డా !! బి. సాంబిరెడ్డి               ఎన్. వెంకటేశ్వర్లు                   యం.ఉదయ్ భాస్కర్
     9440262072                      9492084527                           9441394911

No comments:

Post a Comment