- 12/03/2012
TAGS:
ఆకాశంలోని ఒక నక్షత్ర సముదాయానికి మైక్రోస్కోపియం అని పేరుంది. మైక్రోస్కోపు అనే పరికరానికి గుర్తింపుగా ఈ పేరు పెట్టారు. లేకుంటే నక్షత్రాలకు, సూక్ష్మదర్శినికీ సంబంధమే లేదు.
మైక్రోస్కోపుల తయారీలో జర్మనీ, జపాన్, చైనా దేశాలది పైచేయి!
ఒకమంచి ఆప్టికల్ మైక్రోస్కోపులో రెండువందల నానోమీటర్లు (0.0000002) మీటర్ల వరకు వివరాలు కనబడతాయి.
అల్ట్రా మైక్రోస్కోపులో వివరాలు రెండు నానో మీటర్లు (0.000000002) వరకు కనబడతాయి.
మొదట్లో తయారయిన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులో పదార్థం పెరిగి కనబడాలంటే, దానిగుండా విద్యుత్ ప్రసరించాలి. అందుకే చూడదలచిన పదార్థం మీద పలచని కార్బన్ లేదా మిశ్రలోహం పొరను పరిచేవారు!
No comments:
Post a Comment