- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 14 Nov 2012, IST
ప్రతి సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో దక్షిణ ధృవప్రాంతంలో
భూమిని అతినీలలోహిత కిరణాల బారి నుండి రక్షించే ఓజోన్ పొర పలచబడుతుంది. ఆ
పల్చబడిన భాగాన్ని మనం ఓజోన్ రంధ్రంగా పిలుస్తాం. గత సెప్టెంబర్‌లో ఆ
రంధ్రం సుమారు 21 చదరపు కిలోమీటర్ల మేర ఏర్పడింది. ఇది 1990 నుండి ఏర్పడిన
ఓజోన్ రంధ్రాల కన్నా అతి చిన్నదని తెలిసింది. క్లోరోఫ్లోరో కార్బన్ వంటి
మానవ జనిత పదార్థాలు ఓజోన్ పొరను క్షీణింపజేస్తాయి. అతిశీతల వాతావరణం ఈ
క్షీణతకు తోడ్పడుతుంది. కానీ, ఈ ఏడాది వాతావరణంలో మార్పులు అంటార్కిటికా
ప్రాంతంలో వెచ్చని ఉష్ణోగ్రతలను కలిగించాయి. ఆ కారణంగా ఓజోన్ పొర క్షీణత
కాస్త తగ్గిందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
No comments:
Post a Comment