నాభిలో బాక్టీరియా అడవులు..!
భూమి మీద వర్షారణ్యాలలో ఉన్నంత విస్తృతంగా, వైవిధ్యంగా
సూక్ష్మజీవులు మానవుల నాభిలో ఉంటాయని తెలిసింది. అమెరికా పరిశోధకులు నాభిలో
2,368 జాతుల బాక్టీరియాలను కనుగొన్నారు. వాటిలో 1,458 జాతులు ఇంకా
సైన్సుకి తెలియనివే కావడం విశేషం.70 శాతం కంటే ఎక్కువ వ్యక్తులలో కేవలం
ఎనిమిది జాతులే కనిపించాయట! ఇలా కొందరిలో కొన్ని జాతుల బాక్టీరియా మాత్రమే
ఉండటానికి కారణాలను అన్వేషిస్తున్నారు. అధికంగా కనిపించే జాతులు ఏ విధంగా
మార్పు చెందుతూ పరిణామం చెందాయో అధ్యయనం చేస్తున్నారు. ఇన్ని రకాల
బాక్టీరియా ఉన్నా, వాటివల్ల మనకి ప్రత్యేకంగా హాని లేదంటున్నారు ఈ
పరిశోధకులు. పైగా, ఆ బాక్టీరియా లేకపోతే, మన వ్యాధి నిరోధకవ్యవస్థ సరిగా
పనిచేయదని వీరు భావిస్తున్నారు.
- డాక్టర్ కాకర్లమూడి విజయ
No comments:
Post a Comment