- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 7 Nov 2012, IST
బంగారానికి దాని రంగు బట్టే విలువ అనుకునే రోజులు
పోనున్నాయి. అందరూ 'చౌక లోహాల'కి రంగు కోసం బంగారంతో తాపడం చేయిస్తుంటే,
సౌతాంప్టన్ యూనివర్శిటీలో బంగారానికే వేరే రంగు తాపడం వేయించే ప్రక్రియ
కను గొన్నారు. బంగారపు ఉపరితలంపై చిన్న చిన్న బొడిపలను ఏర్పాటు చేయడం
ద్వారా అది కాంతిని పరా వర్తనం చేసే విధానం మారి కొత్తరంగులో కనిపిస్తుందని
అక్కడి పరిశోధకులు నిరూపించారు. కేవలం బంగారినికేకాక, వెండి, అల్యూమినియం
వంటి ఇతర లోహాలకు కూడా ఈ ప్రక్రియ వర్తింపచేయవచ్చట. అప్పుడు రసాయనాల పూతలు
అవసరం లేకుండా, లోహం విలువ తగ్గకుండా రంగు మార్చుకోవచ్చు.
No comments:
Post a Comment