బృహస్పతి కంటే పెద్దగ్రహం..!
బృహస్పతి కంటే పదమూడు రెట్లు పెద్దగావున్న గ్రహాన్ని
అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. బహుశా ఈ కొత్త గ్రహం మన సౌర కుటుంబంలో
అతిపెద్ద గ్రహం కావచ్చని అంటున్నారు వీరు. ఈ కొత్త గ్రహం 'కప్పా
ఆన్ద్రోమీడా' అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. సూర్యుడి కంటే
రెండున్నర రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉన్న ఈ భారీ గ్రహం భూమికి 170
కాంతి సంవత్సరాల దూరంలో వుంది. ఇంత భారీ గ్రహాన్ని గత నాలుగేళ్ళలో
గమనించలేదని పరిశోధకులు అంటున్నారు. అంతరిక్షం నిత్యం కొత్త వింతల్ని
చూపుతూనే ఉంది కదా!
No comments:
Post a Comment