- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Thu, 22 Nov 2012, IST
మన దేశంలో రాబందులు కనుమరగవుతున్నాయని మొన్నటివరకూ ఆందోళన
నెలకొంది. కానీ తాజా అంచనాల ప్రకారం, గతంలో 99 శాతం పడిపోయిన రాబందుల సంఖ్య
కాస్త పెరిగిందని తెలిసింది. 90వ దశకంలో రాబందులు తీవ్రంగా తగ్గిపోయాయి.
అంతకు ముందు అవి దాదాపు నాలుగు కోట్ల వరకూ వుంటే, గతేడాదికి వాటి సంఖ్య ఒక
లక్షకు పడిపోయింది. వాటి తగ్గుదలకు కారణం దైక్లోఫినాక్ అనే ఒక నొప్పి
తగ్గించే మందు అని తేలింది. ఆ మందును పశువులకు విస్తృతంగా వాడతారు (అంతకంటే
విస్తృతంగా మనమూ వాడతాము. అయితే మనల్ని రాబందులు తినే అవకాశం లేదు).
పశువుల శక్తివంతమైన జీర్ణశక్తి వల్ల ఆ మందు వాటిపై దుష్ప్రభావం కలిగించదు;
కానీ వాటి కళేబరాలని తిన్న రాబందులకు మాత్రం ఆ మందు ప్రాణాంతకంగా
మారుతుంది. ఆ మందు వాడకాన్ని నిషేధించిన తరువాత రాబందుల సంఖ్యలో కాస్త
పెరుగుదల కనిపించిందట.
No comments:
Post a Comment