నడకే పరమౌషధం..!
డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 7 Nov 2012, IST
నడిచి వెళ్ళే దూరాలకి కూడా కార్లు, బైకులు వాడటం
భారతీయులకు బాగా అలవాటు అని ఒక అధ్యయనంలో తేలింది. పదమూడు దేశాల ప్రజల్లో
జరిపిన ఈ అధ్యయనంలో మనవాళ్లు కాస్త దూరాలకి కూడా వాహనాలు వాడుతున్నారని
తేలింది. మనదేశంలోనే కాదుగానీ ప్రపంచ వ్యాప్తంగా మనుషుల్లో నడక అలవాటు
తగ్గింది. చైనాలో నడక తగ్గడం వలన ఊబకాయం పెరిగిందని పరిశోధకులు గమనించారు.
రోజూ కేవలం 15 నిమిషాలపాటు నడిస్తే రెండు, మూడేళ్ళ ఆయుష్షు పెరుగుతుందని
అంచనా వేశారు. ఆయుష్షు పెరిగినా పెరగకపోయినా, ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండటం
ముఖ్యం కదా! అందుకని, ఎలాగోలా కనీసం ఓ పావుగంట పాటన్నా చురుగ్గా నడిస్తే
జీవితం చలాకీగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడిస్తే, ఊబకాయం రాకుండా
ఉండటమే కాదు. ఇబ్బంది పెట్టే షుగర్ వంటి సమస్యలు కూడా దరికి
రావంటున్నారు.
No comments:
Post a Comment