- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Thu, 22 Nov 2012, IST
కోడి మాంసమో, మేక మాంసమో షాపు నుండి తెచ్చాక తెగ కడిగి
శుభ్రపరచడం మనకు అలవాటు. ఇక ఆ అలవాటు మానుకోవాలి అంటున్నారు శాస్త్రజ్ఞులు.
మనం కడిగితే ఆరోగ్యం అనుకుంటే, వారేమో కడక్కపోతేనే ఆరోగ్యం అంటున్నారు.
పచ్చి మాంసంపై సూక్ష్మక్రిములు విపరీతంగా ఉంటాయి. వాటిని నిర్మూలించాలనే
ఉద్దేశంతో మనం కడగటం వలన అవి పోవడం సంగతి అటుంచి మన చేతులు, నీటి ద్వారా
అవి మరిన్ని పదార్థాలకి విస్తరించే ప్రమాదం ఉందని తెలిసింది. పైగా మాంసం
ఉడుకుతున్న సమయంలో ముక్క ఉడికిందా లేదా అని రుచి చూడటం వలన కూడా
సూక్ష్మక్రిములు మనలో ప్రవేశించే వీలుందట! వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో కొద్ది
సమయం ఉడికించడం వలన మాత్రమే ఈ సూక్ష్మక్రిముల్ని తగ్గించవచ్చని అంటున్నారు.
నీటిని బాగా పీల్చుకునే పేపర్ నాప్కిన్‌తో మాంసాన్ని బాగా అద్ది,
వండుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని నిపుణులు సలహా. ఇది మనం పాటించడం కొంచెం
కష్టం కావచ్చు.
No comments:
Post a Comment