- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Thu, 22 Nov 2012, IST
చాలా జంతువులలాగే మనం కూడా భయాన్ని వాసన ద్వారా
పసిగట్టవచ్చు అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. మానవులు ఆవిర్భావ క్రమంలో
తమ వాసన గ్రహించే శక్తిని కోల్పోతూ వచ్చారు. అయితే ఆ శక్తి
సన్నగిల్లిందేగానీ పూర్తిగా సమసిపోలేదని ఇపుడు అంటున్నారు. కొంతమంది
స్వచ్ఛంద పురుషులకు భయంకర సినిమా చూపించి అప్పుడు వెలువడిన చెమటను
సేకరించారు. ఆ తరువాత ఇంకొంతమందిని ఆ చెమటను వాసన చూడవలసినదిగా కోరారు. భయం
గొలిపే దృశ్యాలు చూసినప్పుడు వచ్చిన చెమట వాసన చూడగానే కనుపాపలు
విచ్చుకోవడం వంటి ఫలితాలు కనిపించాయి. ఈ పరిశోధన ద్వారా తేలింది ఏమిటంటే
మనకీ పూర్వపుశక్తులు కొన్ని ఇంకా మిగిలి మరుగున వున్నాయి.
No comments:
Post a Comment