డెంగీ వ్యాధికి టీకా మనదే..!
Tue, 27 Nov 2012, IST
ప్రస్తుతం మనుషులని గజ గజలాడిస్తున్న డెంగీ వ్యాధికి అతి ప్రతిభావంతమైన టీకా పరీక్షలు మనదేశంలోనే జరగనున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే మరో రెండేళ్లలో డెంగీ టీకా మందు ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతుంది. ఒక ఫ్రెంచ్ మందుల కంపెనీ 'సనోఫీ పాశ్చర్' ఈ టీకాను పరీక్షిస్తోంది. ప్రస్తుతం థారులాండ్ నుండి ఇండియా వరకూ ఈ టీకాను పరీక్షించాలని నిర్ణయించారు. ఈ టీకా కనీసం మూడు నాలుగు రకాల డెంగీని ఎదుర్కొంటుంది. టైపు-2 డెంగీ అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల హేమరేజిక్ జ్వరం వచ్చి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కానీ ఇప్పుడు రూపొందించిన టీకా ఈ రకం డెంగీని అరికట్టదు.
No comments:
Post a Comment