విజ్ఞాన వీచిక - డాక్టర్ కాకర్లమూడి విజయ్
Thursday, 27 September 2012
వెన్నునొప్పి జన్యువులు..!
మనిషి కళ్లు చీకట్లో మెరవవు ఎందుకు?
-
ఎందుకని? - ఇందుకని!
- ఎ.భారతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జగన్నాయకపుర, తూర్పుగోదావరి జిల్లా
వ్యవసాయం... జీవవైవిధ్యం..!
వ్యవసాయానికి మూలాధారం దాదాపు 27 వేల ఉన్నత వృక్షజాతుల్లో వున్న వైవిధ్యమే. వీటిలో 7 వేల జాతులు సేద్యంలో ఉండేవి. ఇప్పుడు కేవలం 30రకాల పంటలు సేద్యమవుతున్నాయి. వీటిలో కూడా కేవలం గోధుమలు, వరి, మొక్కజొన్న - ఈ మూడు పంటలు సగంపైగా ప్రపంచ ఆహార అవసరాల్ని తీరుస్తున్నాయని 'ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ)' అంచనా వేసింది. తరిగిపోతున్న ఈ జాతులు వ్యవసాయంలో క్షీణిస్తున్న వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. పర్యావరణ వ్యవస్థలో ఇలా తరిగిపోతున్న జాతు లకు ఏదీ ప్రత్యామ్నాయం కాదు. ఈ నేపథ్యంలో, వ్యవసాయ వైవిధ్య పరిరక్షణ కీలకంగా మారుతుంది. మారుతున్న భూ వాతా వరణం నేపథ్యంలో వైవిధ్యం వున్నచోటే (ఇన్‌సిటు) పరిరక్షించడం కీలకం. ఇది వాతావరణమార్పుల్ని తట్టుకోడానికి తోడ్పడుతుంది. ప్రత్యామ్నాయంగా వైవిధ్య గుణగణాలు గల రకాల్ని సేకరించి, క్షేత్రాలలో వేరేచోట బహిరంగంగా పరిరక్షించవచ్చు. పూర్తిగా నియంత్రించగల వాతావరణంలో జన్యు పరిరక్షణ జరుగుతున్న ప్పటికీ వాతావరణ ఒడుదుడుకుల్ని తట్టుకోగల రకాల్ని గుర్తించడానికి 'బహిరంగ' పునరుత్పత్తి తోడ్పడుతుంది.
నేలల వైవిధ్యం..
వ్యవసాయంలో ప్రాథమిక అవసరం భూమి (నేల). భూగో ళంలో అన్ని జీవులకు ఇది అతిపెద్ద వైవిధ్యం గల నివాస స్థలం. దీనిలో ఎన్నో బ్యాక్టీరియాలు, బూజులు (ఫంజీ), ఇతర కీటకాలు, సూక్ష్మజీవులు, వానపాములు, చీమలు, సాలీడుల్లాంటి జీవాలూ వున్నాయి. వీటి పరిరక్షణ సుస్థిర ఉత్పత్తికి అవసరం.
వ్యవసాయ వైవిధ్య వ్యవస్థను నేలలో వుండే సూక్ష్మజీవులు, పరపరాగ సంపర్కంలో తోడ్పడే కీటకాలు, వాతావరణ, పర్యావరణ పరిస్థితులు, పంటలు, అడవులు, గడ్డి, జలచరాలు ఇవన్నీ కలిసి ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ వ్యవసాయ వైవిధ్యంలో ముఖ్య భాగాలే. స్థానిక జలవనరులు, ముఖ్యంగా నీటికుంటలు, చెరువులు, నదులు, సముద్ర తీరప్రాంతాలు కూడా ఈ వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వృత్తిదారులు, మత్స్యకారులు, చిన్నకమతాల రైతులు వైవిధ్య పరిరక్షణకు, వీటి సుస్థిర వినియోగంలో ఎంతో పాత్రను కలిగి వున్నారు. ఉత్పత్తవుతున్న చేపలు, రొయ్యలు, పీతలు తదితర జలచరాలు మన ఆహారంలో ముఖ్యభాగంగా కొనసాగుతున్నాయి. వీటి వినియోగంలో మత్స్యకారుల, ఇతర వృత్తిదారుల, చిన్నకమతాల రైతుల ఆదాయం, జీవనం వీటిమీదే ఆధారపడి వున్నాయి. దీనితో వీరందరూ మన వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ ఆహార సరఫరాలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్నారు.
సేద్య వాతావరణం, సేద్య పద్ధతులు, సేద్యంలో వినియోగించే ఇతర ఉపకరణాలు భూమి లోపల వుండే జీవుల వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీర్ఘకాలం రసాయన ఎరువులతో సేద్యం చేసినప్పుడు భూమిలో వీటి వైవిధ్యం క్షీణిస్తుంది. కానీ, సేంద్రియ ఎరువులతో, సేంద్రియ పద్ధతులతో సేద్యం చేసినప్పుడు భూమిలోని జీవ వైవిధ్యం పరిరక్షింపబడుతుంది. పెరుగుతుంది కూడా.
సేద్యమవుతున్న రకాలు..
సేద్యమవుతున్న రకాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: ఆధునిక, సాంప్రదాయ రకాలు. వ్యవస్థీ కరించిన ప్రజననం ద్వారా రూపొందించినవి ఆధునిక రకాలు. ఈ రకాలు అధిక దిగుబడినివ్వగలవిగా గుర్తింపు పొందాయి. కానీ, సాంప్రదాయ రకాలను రైతులే స్వయంగా తరతరాలుగా ఎంపిక చేస్తూ, రూపొందించారు. రైతుల రకాలుగా లేదా స్థానిక రకాలుగా కూడా ఇవి పేరొందాయి. సాంప్రదాయ లేదా రైతు రకాలు ఎంతో వైవిధ్యంతో కూడుకొని, వాతావరణ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కోగలవిగా గుర్తింపు పొందాయి. జన్యు వైవిధ్య పరిరక్షణలో సాంప్రదాయ రకాలు ప్రతీకలుగా కొనసాగుతున్నాయి. అందువల్ల, జన్యు వైవిధ్య పరిరక్షణకు ఈ రకాలపైనే కేంద్రీకరిస్తున్నారు.
'హైబ్రిడ్ వరి' ఎవరికోసం..?
మనదేశ వరిలో ఎంతో వైవిధ్యం వుంది. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని ముఖ్యంగా బెట్టను, వరదల్ని, చీడపీడల్ని తట్టుకొనే రకాలున్నాయి. ఒరిస్సాలోని కటక్ దగ్గరగల 'జాతీయ వరి పరిశోధనా సంస్థ'లో దాదాపు 42వేల రకాలు సేకరించి, పరిరక్షించబడుతున్నాయి. సేద్యమవుతున్న అధికదిగుబడి వంగడాలు వరి వైవిధ్యాన్ని నష్టపరిచినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎంతో వైవిధ్యం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఫలితంగా రైతులు కంపెనీల మీద ఆధారపడకుండా తమ విత్తనాల్ని తామే సేకరించుకుని, వినియోగించుకోగలుగుతున్నారు. ప్రజలు కూడా తమకు నచ్చిన రకాలను తినగలుగుతున్నారు. ఇటువంటి రకాలకు బదులు హైబ్రిడ్ వరిని ప్రోత్సహించ డానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రయివేటు కంపెనీలు ప్రపంచ మార్కెట్‌శక్తుల ప్రమేయంతో తీవ్ర కృషి చేస్తున్నాయి. మొదటి హైబ్రిడ్ వరి రకం ఆంధ్రప్రదేశ్‌లోనే రూపొందించినప్పటికీ, వీటిని రైతులు, వినియోగదారులు ఆదరించ లేదు. దేశంలో వినియోగమయ్యే మొత్తం హైబ్రిడ్ వరి విత్తనాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్పత్తవుతున్నప్పటికీ, ఈ రాష్ట్రంలో 'హైబ్రిడ్ వరి' సేద్యం కొన్ని వేల ఎకరాలకే పరిమితమైంది. అయినా, రాష్ట్రంలో హైబ్రిడ్ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. ఇలా వచ్చే హైబ్రిడ్ రకాలు ఇప్పటికే సేద్యంలో వున్న అధికదిగుబడి వంగడాలకన్నా ఏ కోణంలోనూ మేలైనవి కాదు. దిగుబడిలో కూడా పోటీకి రాలేకపోతున్నాయి. హైబ్రిడ్ రకం వరి జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుందని తెలిసినా, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికే కంకణం కట్టుకున్న ప్రభుత్వం హైబ్రిడ్ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఎందుకిస్తున్నట్లు? కేవలం హైబ్రిడ్ విత్తనం ద్వారా వరి సేద్యాన్ని కంపెనీలకి అప్పగించేందుకే. తద్వారా దేశ ఆహారోత్పత్తిపై బహుళజాతి కంపెనీల నియంత్రణకు అవకాశం కల్పించేందుకే..!
గిరిజనుల సేద్యం..
గిరిజనులు ప్రధానంగా వుండే అటవీ ప్రాంతాలలో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో పంటల్ని పండిస్తున్నారు. వీరి సేద్యంలో ఎంతో వైవిధ్యం వుంది. పంటలతో బాటు పశువుల్ని, కోళ్లను, ఇతర జీవాలను పెంచుతున్నారు. రసాయన ఎరువుల్ని దాదాపు వాడరు. సేంద్రీయపు పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా వీరి సేద్యంలో వైవిధ్యం నేటికీ కొనసాగుతుంది. వీరి ఆచారాలు, కట్టుబాట్లు, సాంస్కృ తిక అలవాట్లు ఇక్కడి జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి ప్రాంతాల్ని గుర్తించి, అక్కడున్న సాంప్రదాయ పంటల్ని, విజ్ఞానాన్ని పరిరక్షించాలి. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరగాలి. మెదక్ జిల్లా జహీరాబాద్ దగ్గర 'దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ' ఆధ్వర్యంలో వ్యవసాయ వైవిధ్య కేంద్రం గుర్తింపుకు కృషి కొనసాగుతుంది.
కొత్తజాతుల ప్రవేశం..
కొత్తజాతులు బయటి నుండి ప్రవేశించినప్పుడు పోటీని తట్టుకోలేని స్థానిక జాతులు నష్టపోతాయి. ఉద్దేశ్యపూర్వకంగా కొత్త రకాల్ని లేదా జాతుల్ని ప్రవేశపెడతారు. ఇప్పటికే పండిస్తున్న ఎన్నో పంటలు ఇలా ప్రవేశపెట్టబడినవే. వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ఈ కోవ కిందకే వస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వు, సోయాచిక్కుడు ఇటీవల కాలంలో వంటనూనెకు ప్రవేశపెట్టబడ్డాయి. వీటివల్ల స్థానిక వైవిధ్యం కోల్పోవాల్సి వస్తుంది. వేగంగా విస్తరించిన సోయాచిక్కుడు మధ్యప్రదేశ్‌లో దాదాపు సగంపైగా సేద్య విస్తీర్ణాన్ని ఆక్రమించింది. అంతకుముందు సేద్యంలో వున్న పంటలన్నీ అంతరించిపోయాయి. మరికొన్ని సందర్భాలలో అనుకోకుండా ఇవి రావచ్చు. ఇవి దిగుమతులతో కలిసిరావచ్చు. వేగంగా విస్తరిస్తున్న 'పార్థీనియం' కలుపు విత్తనాలు దిగుమతైన గోధుమల ద్వారా వచ్చిందే. దీనిని 'వయ్యారిభామ' లేక 'కాంగ్రెస్ కలుపు'గా కూడా పిలుస్తున్నారు. ఒకో చెట్టులో మిలియన్ల గింజలుంటాయి. ఒకసారి ఈ చెట్టు వచ్చిన తర్వాత దానంతటదే వ్యాప్తి చెందుతూ స్థానిక రకాల్ని పెరగనివ్వదు. అణచి వేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే. వీటి నియంత్రణ ఇపుడు మన వ్యవసాయంలో పెద్ద సమస్యగా కొనసాగుతుంది. 'లాంటెనా' అనే మరో కలుపు జాతి మొక్క కూడా ఇలానే వచ్చింది. కానీ, పార్థీనియం అంత ఉధృతంగా విస్తరించడం లేదు.
వృక్షజాతుల్లో...
మనదేశం అతి విశాలమైనది. వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంతో వైవిధ్యం వుంది. దీనితో సేద్య విలువ కలిగిన వృక్షజాతుల్లో ఎంతో వైవిధ్యం ఏర్పడింది. జాతీయ వృక్షజాతు ల జన్యు వనరుల సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జనటిక్ రీసోర్సెస్) సమాచారం ప్రకారం ఆహారధాన్యాల్లో 1,12,278 రకాలు మనదేశంలో వున్నాయి. వీటిలో చిరు ధాన్యాలు, గడ్డి జాతుల్లో 30,488 రకాలున్నాయి. గింజలను ఇవ్వగల లెగ్యూమ్ (పప్పు) జాతి 40,604 రకాలున్నాయి. నూనెగింజల్లో 30,170 రకాలు, నూలు ఇవ్వగల రకాలు 8,387, కూరగాయలు 15,671 రకాలున్నాయి. పండ్లు 172 రకాలుంటే, ఔషధ, సుగంధ మొక్కలు 15,051 రకాలు మన దేశంలో సేద్యానికి పనికొస్తున్నాయి.
జంతువుల్లో..
సాధుజంతు జాతుల వైవిధ్యంలో మనదేశం ప్రపంచంలో 7వ స్థానంలో వుంది. మన దేశంలో 255 జంతుజాతులు పెంపకంలో వున్నాయి. వీటిలో 64 రకాల పశువులు. 23 రకాల బర్రెలు, 63 రకాల గొర్రెలు, 34 రకాల మేకలు, ఇతర జంతువులు 72 రకాలున్నాయి. ప్రపంచబర్రెల్లో 26.5 శాతం రకాలు మనదేశంలోనే వున్నాయి. మేకల్లో 8.6 శాతం, పశువుల్లో 7.75 శాతం వైవిధ్యం మనదేశంలోనే వుంది.
మనదేశ వరిలో ఎంతో వైవిధ్యం వుంది. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని ముఖ్యంగా బెట్టను, వరదల్ని, చీడపీడల్ని తట్టుకొనే రకాలున్నాయి. ఒరిస్సాలోని కటక్ దగ్గరగల 'జాతీయ వరి పరిశోధనా సంస్థ'లో దాదాపు 42వేల రకాలు సేకరించి, పరిరక్షించబడుతున్నాయి. సేద్యమవుతున్న అధికదిగుబడి వంగడాలు వరి వైవిధ్యాన్ని నష్టపరిచినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎంతో వైవిధ్యం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఫలితంగా రైతులు కంపెనీల మీద ఆధారపడకుండా తమ విత్తనాల్ని తామే సేకరించుకుని, వినియోగించుకోగలుగుతున్నారు. ప్రజలు కూడా తమకు నచ్చిన రకాలను తినగలుగుతున్నారు. ఇటువంటి రకాలకు బదులు హైబ్రిడ్ వరిని ప్రోత్సహించ డానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రయివేటు కంపెనీలు ప్రపంచ మార్కెట్‌శక్తుల ప్రమేయంతో తీవ్ర కృషి చేస్తున్నాయి. మొదటి హైబ్రిడ్ వరి రకం ఆంధ్రప్రదేశ్‌లోనే రూపొందించినప్పటికీ, వీటిని రైతులు, వినియోగదారులు ఆదరించ లేదు. దేశంలో వినియోగమయ్యే మొత్తం హైబ్రిడ్ వరి విత్తనాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్పత్తవుతున్నప్పటికీ, ఈ రాష్ట్రంలో 'హైబ్రిడ్ వరి' సేద్యం కొన్ని వేల ఎకరాలకే పరిమితమైంది. అయినా, రాష్ట్రంలో హైబ్రిడ్ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. ఇలా వచ్చే హైబ్రిడ్ రకాలు ఇప్పటికే సేద్యంలో వున్న అధికదిగుబడి వంగడాలకన్నా ఏ కోణంలోనూ మేలైనవి కాదు. దిగుబడిలో కూడా పోటీకి రాలేకపోతున్నాయి. హైబ్రిడ్ రకం వరి జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుందని తెలిసినా, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికే కంకణం కట్టుకున్న ప్రభుత్వం హైబ్రిడ్ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఎందుకిస్తున్నట్లు? కేవలం హైబ్రిడ్ విత్తనం ద్వారా వరి సేద్యాన్ని కంపెనీలకి అప్పగించేందుకే. తద్వారా దేశ ఆహారోత్పత్తిపై బహుళజాతి కంపెనీల నియంత్రణకు అవకాశం కల్పించేందుకే..!
గిరిజనుల సేద్యం..
గిరిజనులు ప్రధానంగా వుండే అటవీ ప్రాంతాలలో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో పంటల్ని పండిస్తున్నారు. వీరి సేద్యంలో ఎంతో వైవిధ్యం వుంది. పంటలతో బాటు పశువుల్ని, కోళ్లను, ఇతర జీవాలను పెంచుతున్నారు. రసాయన ఎరువుల్ని దాదాపు వాడరు. సేంద్రీయపు పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా వీరి సేద్యంలో వైవిధ్యం నేటికీ కొనసాగుతుంది. వీరి ఆచారాలు, కట్టుబాట్లు, సాంస్కృ తిక అలవాట్లు ఇక్కడి జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి ప్రాంతాల్ని గుర్తించి, అక్కడున్న సాంప్రదాయ పంటల్ని, విజ్ఞానాన్ని పరిరక్షించాలి. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరగాలి. మెదక్ జిల్లా జహీరాబాద్ దగ్గర 'దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ' ఆధ్వర్యంలో వ్యవసాయ వైవిధ్య కేంద్రం గుర్తింపుకు కృషి కొనసాగుతుంది.
కొత్తజాతుల ప్రవేశం..
కొత్తజాతులు బయటి నుండి ప్రవేశించినప్పుడు పోటీని తట్టుకోలేని స్థానిక జాతులు నష్టపోతాయి. ఉద్దేశ్యపూర్వకంగా కొత్త రకాల్ని లేదా జాతుల్ని ప్రవేశపెడతారు. ఇప్పటికే పండిస్తున్న ఎన్నో పంటలు ఇలా ప్రవేశపెట్టబడినవే. వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ఈ కోవ కిందకే వస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వు, సోయాచిక్కుడు ఇటీవల కాలంలో వంటనూనెకు ప్రవేశపెట్టబడ్డాయి. వీటివల్ల స్థానిక వైవిధ్యం కోల్పోవాల్సి వస్తుంది. వేగంగా విస్తరించిన సోయాచిక్కుడు మధ్యప్రదేశ్‌లో దాదాపు సగంపైగా సేద్య విస్తీర్ణాన్ని ఆక్రమించింది. అంతకుముందు సేద్యంలో వున్న పంటలన్నీ అంతరించిపోయాయి. మరికొన్ని సందర్భాలలో అనుకోకుండా ఇవి రావచ్చు. ఇవి దిగుమతులతో కలిసిరావచ్చు. వేగంగా విస్తరిస్తున్న 'పార్థీనియం' కలుపు విత్తనాలు దిగుమతైన గోధుమల ద్వారా వచ్చిందే. దీనిని 'వయ్యారిభామ' లేక 'కాంగ్రెస్ కలుపు'గా కూడా పిలుస్తున్నారు. ఒకో చెట్టులో మిలియన్ల గింజలుంటాయి. ఒకసారి ఈ చెట్టు వచ్చిన తర్వాత దానంతటదే వ్యాప్తి చెందుతూ స్థానిక రకాల్ని పెరగనివ్వదు. అణచి వేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే. వీటి నియంత్రణ ఇపుడు మన వ్యవసాయంలో పెద్ద సమస్యగా కొనసాగుతుంది. 'లాంటెనా' అనే మరో కలుపు జాతి మొక్క కూడా ఇలానే వచ్చింది. కానీ, పార్థీనియం అంత ఉధృతంగా విస్తరించడం లేదు.
వృక్షజాతుల్లో...
మనదేశం అతి విశాలమైనది. వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంతో వైవిధ్యం వుంది. దీనితో సేద్య విలువ కలిగిన వృక్షజాతుల్లో ఎంతో వైవిధ్యం ఏర్పడింది. జాతీయ వృక్షజాతు ల జన్యు వనరుల సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జనటిక్ రీసోర్సెస్) సమాచారం ప్రకారం ఆహారధాన్యాల్లో 1,12,278 రకాలు మనదేశంలో వున్నాయి. వీటిలో చిరు ధాన్యాలు, గడ్డి జాతుల్లో 30,488 రకాలున్నాయి. గింజలను ఇవ్వగల లెగ్యూమ్ (పప్పు) జాతి 40,604 రకాలున్నాయి. నూనెగింజల్లో 30,170 రకాలు, నూలు ఇవ్వగల రకాలు 8,387, కూరగాయలు 15,671 రకాలున్నాయి. పండ్లు 172 రకాలుంటే, ఔషధ, సుగంధ మొక్కలు 15,051 రకాలు మన దేశంలో సేద్యానికి పనికొస్తున్నాయి.
జంతువుల్లో..
సాధుజంతు జాతుల వైవిధ్యంలో మనదేశం ప్రపంచంలో 7వ స్థానంలో వుంది. మన దేశంలో 255 జంతుజాతులు పెంపకంలో వున్నాయి. వీటిలో 64 రకాల పశువులు. 23 రకాల బర్రెలు, 63 రకాల గొర్రెలు, 34 రకాల మేకలు, ఇతర జంతువులు 72 రకాలున్నాయి. ప్రపంచబర్రెల్లో 26.5 శాతం రకాలు మనదేశంలోనే వున్నాయి. మేకల్లో 8.6 శాతం, పశువుల్లో 7.75 శాతం వైవిధ్యం మనదేశంలోనే వుంది.
క్షీణిస్తున్న వ్యవసాయ, పశువుల వైవిధ్యం..
సేద్యం చేస్తున్న రకాల్ని మార్చడం. దున్నడం. అతిగా పంటల్ని పండించడం, పెరుగుతున్న జనాభా వత్తిడి, పర్యావరణ క్షీణత, పచ్చిక బయళ్లలో అతిగా మేపడం, ప్రభుత్వ విధానాల మార్పులు, వ్యవసాయంలో ప్రవేశపెడుతున్న వ్యవస్థాగత మార్పులు (చిన్న కమతాల సేద్యానికి బదులు కార్పొరేట్ సేద్యం) తదితరాలు కొనసాగుతున్న జీవ వైవిధ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. అయితే, స్థానిక రకాలను అధిక దిగుబడినిచ్చే రకాలతో మార్చడం వల్ల లేదా బయటి నుంచి కొత్తరకాల్ని తెచ్చి, పెంచడం వల్ల వ్యవసాయ వైవిధ్యం బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా, సాంప్రదాయ సేద్యంలో జన్యుమార్పిడి పంటల్ని ఇటీవల ప్రవేశపెట్టడం వల్ల వ్యవసాయ వైవిధ్యం బాగా క్షీణించింది. ఆధునిక సేద్యం పెరుగుతున్న కొద్దీ ఎంపిక చేసిన పంటల జన్యువులు, పర్యావరణ పరిస్థితుల్లో జీవ వైవిధ్యం హరించిపోతుంది. మిశ్రమ సేద్య పద్ధతులకు బదులు ఏకపంట సేద్యపద్ధతుల్ని పవేశపెట్టడంతో జీవ వైవిధ్యం బాగా తగ్గుతుంది. సుస్థిర ఉత్పత్తి దెబ్బతింటుంది. రిస్క్ పెరుగుతుంది. రైతు కమతాల సేద్యానికి బదులు పెద్దకమతాల్లో భారీ యంత్రాలతో చేపట్టే వ్యవసాయరంగ కార్పొరేటీకరణ జీవవైవిధ్యాన్ని బాగా కుదిస్తుంది. ఇదేవిధంగా, విస్తరిస్తున్న ఆహార పరిశ్రమ, యాంత్రికీ కరణ, ఒకే విధమైన సేద్య పద్ధతుల్ని అనుసరింపజేస్తూ జీవ వైవిధ్యాన్ని హరింపజేస్తున్నాయి. కార్పొరేట్ వ్యవసాయం రసాయనాల అధిక వినియోగంపై ఆధారపడుతూ జీవ వైవిధ్యాన్ని హరింపజేస్తాయి.
పారిశ్రామిక, సేంద్రియ సేద్యపద్ధతులు..
ఆధునిక, పారిశ్రామిక సేద్యపద్ధతులు వ్యవసాయంలో వైవిధ్యాన్ని హరించి వేస్తుండగా సేంద్రియ పద్ధతులు జాతుల వైవిధ్యాన్ని పెంచుతున్నాయి. సేంద్రియ సేద్యంలో కనీసం 30 శాతం అధికంగా వైవిధ్యం వున్నట్లు అంచనా వేయబడుతుంది. ముఖ్యంగా రసాయనిక ఎరువులను, సస్యరక్షణ మందులను అతిగా పెంచే సేద్యంలో మిత్ర పురుగులు, పరపరాగ సంపర్కం దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. అదే రసాయనాల్ని నియంత్రిస్తూ, సహజ పద్ధతుల్లో సేద్యం చేసినప్పుడు మిత్ర పురుగులు, పరపరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు ఉధృతంగా జీవిస్తూ దిగుబడులను పెంచగలుగుతున్నాయి. మొత్తం మీద, సేంద్రీయ వ్యవసాయం జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు తోడ్పడుతోంది. ఇది జన్యు, జాతుల స్థాయిల్లో, పర్యావరణ వ్యవస్థ స్థాయిలో కొనసాగుతుంది.
(జన్యుమార్పిడి పంటల ప్రభావం వచ్చే సంచికలో తెలుసుకుందాం..!)
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
Friday, 21 September 2012
మేం మూఢనమ్మకాలకు వ్యతిరేకం.. ఏ మతానికి కాదు..
-
అశాస్త్రీయ ఆచారాలు19
సుబ్బారావు వచ్చి కూర్చున్నాడు. మాటల్లో ఇలా అన్నాడు. 'కాంతారావ్! మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నువ్వు అనేక వ్యాసాలు రాస్తున్నావు. అవి చదువుతుంటే నాకొక అనుమానం వస్తుంది. ఆ సందేహాన్ని తీరుస్తావా?'
'ఏమిటా సందేహం?' నవ్వుతూ అడిగాను.
'నీవు రాసేదంతా హిందూమతానికి వ్యతిరేకమనిపిస్తోంది ఏమంటావ్?' అన్నాడు.
'మంచిప్రశ్న వేశావు సుబ్బారావు! సమాధానం చెబుతాను. అదేమిటంటే మూఢనమ్మకాలు వేరు, మతం వేరు. గొప్ప గొప్ప మత నాయకులు, మత ప్రచారకులు మతాన్ని గూర్చి ప్రచారం చేశారు; చేస్తున్నారు. కానీ వారు మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు; ఖండించారు; ఖండిస్తున్నారు. మూఢనమ్మకాలను వారు వ్యతిరేకించడం మత వ్యతిరేకం కానప్పుడు మేం జన విజ్ఞాన వేదిక వాళ్ళం ఖండించడం మత వ్యతిరేకమెలా అవుతుంది?'
'మూఢనమ్మకాల్ని మతపెద్దలే వ్యతిరేకించారా? ఎవరు? ఏమిటో? వివరించు' అడిగాడు సుబ్బారావు.
'చెబుతాను. జ్యోతిష్యాన్ని ఉదాహరణకు తీసుకో. జ్యోతిషమంటే హిందూ దేవతలైన సూర్యుడు, చంద్రుడు, శని మొదలైనవారి చలనాలకూ, వాటి పరిణామాలకూ సంబంధించిన విషయమనీ, అందువలన జ్యోతిష్యాన్ని విమర్శించడం అంటే హిందూమతాన్ని విమర్శించడమేననీ కొంతమంది జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. కానీ జ్యోతిష్యాన్ని ఒక గొప్ప హిందూమత నాయకుడైన స్వామివివేకానంద తీవ్రంగా ఖండించేవారు. జ్యోతిష్యాన్ని నమ్మవద్దంటూ ఆయన ఒక ఉపన్యాసాన్నే చేశారు. ఆయన రచనల సంకలనం (ఇంగ్లీషులో) ''ది సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ స్వామీవివేకానంద, వాల్యూం 8''లో ''మాన్.. ది మేకర్ ఆఫ్ డెస్టినీ'' అనే ఉపన్యాసంలో జ్యోతిష్యం ఎంత అశాస్త్రీయమో వివరంగా తెలియజేశారు. వివేకానంద జ్యోతిష్యాన్ని విమ ర్శించితే, మత వ్యతిరేకత కానప్పుడు మేం విమర్శిస్తే, మత వ్యతిరేకమవు తుందా? అంతేకాదు సమాజంలోని అనేక మూఢనమ్మకాల్ని విమర్శిస్తూ, అత్యంత సరళమైన భాషలో వివేకానందుల వారు చేసిన ఈ ప్రకటనను చదువు..' అని నా వద్ద ఉన్న 21-7-2002 నాటి 'వార్త' అనే దినపత్రికను సుబ్బారావుకు అందించాను. దానిలో ఇలా ఉంది.
''ఒక బంగాళదుంప వంకాయకు తగిలితే విశ్వ ప్రళయం ఎన్నాళ్ళలో వస్తుంది? చేతులు శుద్ధి చేసుకోవడానికి పన్నెండుసార్లు మట్టితో తోముకొనకపోతే ఎన్నితరాల పితరులు నరకానికి పోతారు? జనాభాలో నాల్గవవంతు మంది తిండి లేక పస్తులుంటుండగా ఇలాంటి వ్యర్థ విషయాల గురించి రెండువేల సంవత్సరాలుగా చర్చిస్తున్నారు.''
అది సుబ్బారావు చదివిన తర్వాత ఇలా అన్నాను. ''సుబ్బారావ్! మూఢనమ్మ కాలను ఖండించిన మరో మతనాయకుని గూర్చి వివరిస్తాను. ఆయనే అరుణాచల నివాసి రమణమహర్షి. ఆయన చెప్పిన అంశాలను గూర్చి చాగంటి కోటేశ్వరరావు 10-9-2012న 'మాగోల్డ్' టి.వి. ఛానల్‌లో ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమంలో వివరించారు. దాని సారాంశం ఇది. 'రమణ మహర్షిని కొంతమంది భక్తులు మూఢంగా ఆరాధించేవారు. ఆ మూఢారాధన ఎంతవరకు పోయిందంటే రమణమహర్షి స్నానం చేసిన నీటిని వారు తాగినా, ఆయన భోజనం చేసిన తర్వాత చెయ్యి కడిగిన నీటిని తాగినా తమ పాపాలు అన్నీ కడిగినట్లు పోతాయని భావించి, తూముల గుండా వస్తున్న ఆ నీటిని గ్లాసుల్లో పట్టుకొని తాగుతుండేవారు. ఇది రమణమహర్షి దృష్టికి వచ్చి వారిని తీవ్రంగా మందలించారు. ఇంకెప్పుడూ అలా చేయవద్దని హెచ్చరించారు.
(ఇతర మతాల నాయకుల ఖండనలు వచ్చేవారం..)
ఇలా మతనాయకులూ, మత ప్రచారకులూ మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. హిందూ మతనాయకులేగాదు, ముస్లిం, క్రిష్టియన్ మత నాయకులు కూడ మూఢనమ్మకాలను ఖండిస్తూనే ఉన్నారు. వాటిని వివరిస్తాను'' అని 24-8-2012 నాటి ''ది హిందూ'' పత్రికను సుబ్బారావుకిచ్చాను. దానిలో ''వదంతులు చిక్కగా, వేగంగా వ్యాపిస్తాయి'' అనే వార్త సారాంశమిది. ''షహీనానగర్ ఏరియా (హైదరాబాద్)లో ఒక బాలిక జన్మించిందనీ, ఆ అమ్మాయి 22-8-12 నాటి రాత్రి ఎవరైనా పిల్లలు నిద్రపోతే వారు చనిపోతారని చెప్పిందనే వదంతి హైదరాబాద్ పాతబస్తీలో ప్రజలను భయభ్రాంతులను చేసింది. ఈ వదంతిని సెల్‌ఫోన్లు చాలా వేగంగా వ్యాప్తి చేశాయి. అంతే! పాతబస్తీలోని అనేక ప్రాంతాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను నిద్రలేపి, వాళ్ళు మరల నిద్రపోకుండా ఉండేందుకు నానా తంటాలుపడ్డారు. కొంతమంది పిల్లలతో ఆటలాడించారు. కొంతమంది మోటారు సైకిళ్ళ మీదా, ఆటోలలోనూ వారిని తిప్పారు. అయితే, ముఖ్యమైన విషయమేమిటంటే, మత నాయకులు స్థానిక మసీదులలో ఏర్పాటు చేయబడిన లౌడ్‌స్పీకర్లలో వదంతులను నమ్మవద్దనీ, పిల్లలు నిద్రపోయినా ఏమీకాదనీ చెప్పడం జరిగింది. అయినా ప్రజలపై లౌడ్‌స్పీకర్ల ప్రచారం ఏమీ ప్రభావం కలిగించలేదు.'' కాబట్టి సుబ్బారావ్! అనేక సందర్భాలలో మతనాయకులు, మత ప్రచారకులు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం మనం గమనించవలసిన విషయం.
ఇక క్రిష్టియన్ మతనాయకులు కూడా మూఢనమ్మకాలను ఖండిస్తున్నారు. ఉదాహరణకు 17-9-1998 నాటి ఈనాడు పత్రికలోని ఒక వార్తను వినిపిస్తాను విను'' అని ఆ వార్తను చదివి వినిపించాను. ఆ వార్తలో ఇలా ఉంది. జ్యోతిష్యాన్ని గూర్చి పోప్ జాన్‌పాల్ ఇలా ప్రకటించారు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ధారించుకొనేందుకు, జాతకాలను తిరగేయాల్సిన పనిలేదు. రాశి ఫలాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హస్త సాముద్రికుల దగ్గరకు వెళ్ళవలసిన పనిలేదు. గ్రహబలాన్ని నమ్ముకోరాదు.''
కాబట్టి సుబ్బారావ్! మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తే, మతాన్ని విమర్శించినట్లు కాదు. ఎందుకంటే వాటిని తనకు తెలిసిన మేర మత నాయకులు ఖండిస్తున్నారు. మత ప్రచారకులు వాటిని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం మోసగాళ్ళూ, అవకాశవాదులే మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారాన్ని మత వ్యతిరేక ప్రచారంగా ప్రకటించి, మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేం ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు. కానీ, అన్ని మతాలవారూ మూఢనమ్మకాలను తరిమికొట్టాలి. శాస్త్రీయాలోచనా విధానాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనదేశం శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగమిస్తుంది. ఆ రంగంలోని విజయాలు అన్ని రంగాలకూ విస్తరించి, మన దేశం ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఏమంటావ్?'' అన్నాను.
''నీవు చెప్పింది ఆమోదయోగ్యం అంటాను'' అన్నాడు దృఢంగా సుబ్బారావు.
''సంతోషం'' అంటూ ముగించాను.
- కె.ఎల్.కాంతారావు జనవిజ్ఞాన వేదిక.
పాములు గుడ్లు తింటాయా?
- జి. సింధూ (7), హైదరాబాద్
గతవారం పాము పగపడుతుందా అన్న ప్రశ్నకు జవాబుగా పాముల్లో ఉన్న విషసర్పాల గురించి, విషరహిత సర్పాల గురించి సూక్ష్మంగా తెలుసు కున్నాం. ఈ వారం ప్రశ్నలు చాలానే ఉన్నాయి కాబట్టి అన్నింటికీ వివరంగా జవాబు చెప్పాలంటే అనకొండలాగా పెద్ద చేంతాడంత జవాబు వచ్చే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రశ్నలకు టూకీగానే జవాబు ఇస్తాను.
పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. అవి గుడ్లు తింటాయా?
నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా! అదెలా?
నాగుపాముకు అస్తిపంజరం దృఢంగా ఉండడం వల్ల తలను బాగా నిక్కజాపి పడగ విప్పుతుంది. ఇతర పాములు కూడా కొద్దిగా తల పైకెత్తి నిటారుగా ఉంచగలవు కానీ, పడగవిప్పవు. నాగుపాముకు ఉన్న రూపం, భయానక వివరణ, పుక్కిటి పురాణ వర్ణన, విష ఫణిగుణం వల్ల కొందరు దాన్ని బుట్టలో పెట్టుకొని వచ్చి పిల్లలకి, పామరులకు, సకల శాస్త్రాలు చదివినా తల, తోక అనక నిలువెల్లా అశాస్త్రీయతను నింపుకొన్న కల్ల మేధావులకు నాగనాట్యం చూపుతారు. నీటిపాము, వానపాము, పసిరిక పాము, ఏలిక పాములకు ఆ ఘనత లేదు. వాటిపైనా ఏ పురాణ పురుషుడూ శయనుడు కాదు. కాబట్టి వాటిని బుట్టలో పెట్టుకొని ఏ గారడీవాడు ఊరి కూడలి వద్ద ప్రదర్శనలు చేయడు. నిజానికి నోట్లో వేలుపెట్టినా పెద్దగా కొరకలేని నీటిపామును బుట్టలో పెట్టి మూత తీసి నాగస్వరం పాముల గారడీవాడు ఊదినట్లుగా ఊదితే ఆ పాము కూడా తల ఆడిస్తుంది. కాబట్టి నాగస్వరానికి అలాగ ఊదితే ఊగడం నాగుపాము అబ్బ సొమ్ము కాదు. పూడుపాము కూడా ఆడగలదు. ఇక్కడ అండర్‌లైన్ చేయడానికి కారణం ఉంది. గతవారమే చెప్పుకొన్నట్లు ఏ పామూకూ చెవులు ఉండవు. కళ్లు ఉంటాయి. నాగుపాము గారడీవాడు నాగస్వరం ఊదేప్పుడు గమనించండి. ఆ బూరను అటూ ఇటూ పాముకన్నా జోరుగా ఊపుతూ ఊదుతాడు. పైగా, తల కూడా అటూ యిటూ ఊపుతాడు. దానికితోడు తన కాలి తొడ, మోకాలు దగ్గర కూడా అటూ ఇటూ కదులుతాడు. విడ్డూరంగాను, వింతగాను అతడు తల, బూర ఊపుతుంటే పాము ఆశ్చర్యంగా వాడి బూరను చూస్తూ అటూయిటూ తల ఊపుతుందేగానీ.. 'గానరసం.. ఫణిః' అన్నట్లు నాగస్వరపు మాధుర్యాన్ని గ్రోలుతూ కాదు.
పాములు వాసన చూస్తాయా?
పాములు వాసనను చూడ్డానికి కొద్ది మోతాదులోనే తమ ముక్కుల్ని వాడతాయి. ప్రధానంగా పాములు తమ నాలుక (చీలిక ఉన్న) ద్వారా వాసన చూస్తాయి. అందుకే పదే పదే అవి నాలుకను బయటికి చాచి ఆడిస్తాయి. అపుడు వాతావరణంలో ఉన్న రసాయనిక ద్రవ్యాల్ని ఆస్వాదించి జాకబ్సన్స్ అవయవాలు (Jacobson’s organs) అనే నోటిలో ఉన్న శరీరభాగాల ద్వారా మెదడుకు సంకేతాల్ని పంపి వాసనను గ్రహిస్తాయి. పాములు రుచి చూడలేవు. అందుకే అపుడపుడూ అవి తమకేమాత్రం ఉపయోగపడని మెత్తని వృథా పదార్థాల్ని కూడా 'గుడ్డిగా' భోంచేస్తాయి.
పాములెందుకు బుసకొడ్తాయి?
అన్ని పాములూ బుసకొట్టవు. చాలావరకు పాములు చురుకైన (active) జంతువులు. అంటే వాటికి శ్వాసక్రియ చాలా అవసరం. కానీ ముక్కు రంధ్రాలు సన్నగా ఉండడం వల్ల సాధారణ శ్వాసక్రియే (మనలో కొందరిలో గురక - snoring - లాగా) కొంత బుసలాగా అనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నపుడు‘fight or flight (పోరాడు లేదా పారిపో)్ణ అనే అసంకల్పిత ప్రతీకార చర్య (involuntary reaction) కారణంగా మరింత వేగంగా చేసే శ్వాసక్రియే మనకు బుసలాగా తోస్తుంది.
పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి?
పాములే కాదు పొలుసులు (scales) గట్టి ఫలకాలు (plates) ఉన్న చాలా జంతువులు కుబుసం (moulting) విడుస్తాయి. శరీరం పెరుగుతున్న క్రమంలో మనలాంటి జంతువులకు సాగే లక్షణం చర్మానికి ఉండడం వల్ల దేహం పెద్దదవుతున్నా చర్మానికేమీ కాదు. కానీ బొద్దింకలు, పాములు, మొసళ్లు, తొండలు, కొన్ని తాబేళ్లు, కొన్నిరకాల ఎండ్రకాయలు, రొయ్యలు వంటివాటికి చర్మం సహజ కవచ కుండలాల్లా బిగుతుగా ఉంటుంది. తమ శారీరక ఎదుగుదలకు ఆ చర్మం ప్రతిబంధకంగా ఉన్నపుడు మనం బిగుతుగా ఉన్న పాత చొక్కాలను వదిలేసి, కొత్త చొక్కా వేసుకున్నట్టు అవి పాత చర్మాన్ని విసర్జిస్తాయి. పెరిగే క్రమంలో మెత్తని కొత్త చర్మాన్ని అంతరంగంలో సంత రించుకొంటాయి. ఇలా తమ ఎదుగుదల ఆగే వరకూ అడపాదడపా కుబుసం విడుస్తూ ఎదుగుతాయి.
బుడగలు రాకుండా మరగడం..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
కరుగుతున్న హిమాలయాలు..!
సూర్యుడిని మించిన నక్షత్రం..!
మానవ వ్యర్థాలతో నడిచే వాహనాలు!
పెయిన్‌కిల్లర్స్‌తో వినికిడి సమస్య..!
అంతరిస్తోన్న కోరల్ రీఫ్..
Thursday, 20 September 2012
జీవవైవిధ్యం.. జాతుల పరిరక్షణ..
'పక్రృతి, జీవవైవిధ్య పరిరక్షణ' మన సంస్కృతి, ఆచారాల్లో భాగంగా పురాతన కాలం నుండీ కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, ఖనిజాల సేకరణ పేరుతో జరిగిన, జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, పెద్దపెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, పునరుత్పత్తి శక్తికి మించి అడవుల వినియోగం జీవవైవిధ్య విధ్వంసానికి దారితీస్తుంది. ముఖ్యంగా వలసకాలంలో, ప్రపంచీకరణలో ఈ విధ్వంసం ఎన్నోరెట్లు పెరిగింది.
పరిరక్షించే పద్ధతులు..
జీవవైవిధ్యం.. జాతుల పరిరక్షణ.. ప్రధానంగా రెండు పద్ధతుల్లో కొనసాగుతోంది. వివిధ జాతుల నివాస స్థలంలోనే పరిరక్షించడం (ఇన్‌సిటు కన్జర్వేషన్‌్) మొదటి పద్ధతి. సహజ నివాస స్థలాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేయడం రెండో పద్ధతి.
జాతీయ పార్కులు, జీవరక్షిత కేంద్రాలు, ప్రకృతి వనరుల రక్షణ కేంద్రాలు, రక్షిత అడవులు, భద్రతనిచ్చే నివేశిత స్థలాలు నివాస స్థలంలోనే పరిరక్షించే (మొదటి) పద్ధతి కిందకు వస్తాయి. దీనిలో భాగంగా 1936లో '(జిమ్) కార్బెట్ జాతీయ పార్కు' ఏర్పాటు చేయబడింది. ఇటువంటి కేంద్రాలలో ఎటువంటి మానవ కార్యక్రమాలనూ అనుమతించరు. అయితే, రక్షిత ప్రాంతాల్లో మాత్రం కొన్ని పరిమితమైన కార్యక్రమాలను అనుమతిస్తారు. జీవ రక్షిత కేంద్రాలలో వన్యప్రాణులకు రక్షణ కల్పిస్తారు. అయితే, ఈ ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఉండవచ్చు. ఇలా మన దేశంలో ఏడు జాతీయ జీవ రక్షిత కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేందుకు ప్రత్యేక అటవీ రక్షిత కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో (జాయింట్ ఫారెస్ట్ మేనేజిమెంట్ స్కీం) పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. వీటిలో పర్యావరణ, ఆర్థిక కార్యక్రమాల్ని సమన్వయంతో కొనసాగిస్తారు. మన దేశంలో దాదాపు 4.2 శాతం భూభాగంలో స్థానిక జీవ పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్దేశించబడింది. దీనిలో 85 జాతీయ పార్కులు, 448 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
జంతు ప్రదర్శనశాలలు, వృక్ష సంరక్షిత కేంద్రాలు (బొటానికల్ గార్డెన్స్), అటవీ సంస్థలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా నిర్వహించడం 'వేరే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ కేంద్రాల ఏర్పాటు' (రెండో) పద్ధతి కిందకు వస్తాయి. వీటిలో సాధ్యమైనన్ని పంటలు, జంతువులు, పక్షులు, చేపల రకాలను సేకరించి, స్వేచ్ఛగా పెరుగుతూ జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే లక్ష్యంతో జాతీయ, వృక్ష జన్యు వనరుల బ్యూరో (నేషనలన్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్ రీసోర్సెస్), జంతు జన్యు వనరుల జాతీయ బ్యూరో (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జనటిక్ రీసోర్సెస్) తదితర సంస్థలు మన దేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో లక్షలాది జాతుల జన్యువులు భద్రపరచ బడ్డాయి. ఇతర ప్రాంతాల నుండి తెచ్చి, పునరుత్పత్తి చేసి పూర్తిగా అంతరించిన నివాస స్థలాల్లో విడుదల చేసి, మళ్లీ పెరిగేలా దోహదపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విధంగా ప్రత్యేక మొసలి జాతి (గంగానదిలోని ఘర్‌వాల్ రకం) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో విడుదల చేయబడినాయి. విత్తన బ్యాంకులు, వృక్ష, ఫల సంరక్షిత (బొటానికల్, హార్టికల్చరల్ రిక్రియేషన్) తోటలు కూడా ఇలా వృక్షజాతుల్ని పరిరక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. స్థానిక పరిరక్షణా కార్యక్రమాలకు తోడు బయట పరిరక్షణా కార్యక్రమాలు అదనంగా తోడ్పడుతున్నాయి.
జన్యు బ్యాంకులు..
ఇది అత్యంత ఆధునిక పద్ధతి. పునరుత్పత్తి కాగల రూపంలో ప్రత్యేకంగా ఏర్పర్చిన జన్యు బ్యాంకుల్లో వివిధ జంతుజాలాల 'జన్యువులను' సేకరించి, నిల్వ వుంచుతారు. ముఖ్యంగా సేద్యమయ్యే వృక్ష జాతుల వైవిధ్యాన్ని (విత్తన రూపం) పరిరక్షించడానికి ఈ బ్యాంకులు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అంతరించే ప్రమాదంలో వున్న జంతువుల ఆడ, మగ జన్యు కణాల్ని కూడా నిల్వ వుంచడానికి ఈ బ్యాంకులు ఉపయోగపడు తున్నాయి. విత్తన బ్యాంకులు, 'కణజాల (టిష్యూ)' బ్యాంకులు, మొగ్గలు, ఇతర వృక్షభాగాల కణజాలాల్ని నిల్వ వుంచుతున్నారు. 'అతి శీతల' బ్యాంకుల్లో విత్తనం లేక అండాన్ని ద్రవ నత్రజనిలో -196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ వుంచుతారు. అంతరించే ప్రమాదంగల జీవుల్ని పరిరక్షించడానికి ఇవి తోడ్పడతాయి. 'పుప్పొడి' బ్యాంకుల్లో నిల్వ వుంచిన పుప్పొడి నుండి అంతరించే ప్రమాదంగల మొక్కల్ని ప్రత్యేక సాంకేతికంతో పునరుద్ధరించవచ్చు.
క్షేత్రస్థాయి జన్యు బ్యాంకులు
జన్యువుల పరిరక్షణ కోసం క్షేత్రాల్లో వైవిధ్యభరితమైన మొక్కల్ని పెంచుతూ పరిరక్షించవచ్చు. తద్వార అన్ని మొక్కల లక్షణాలనూ, వైవిధ్యాల్ని గుర్తించి, రికార్డుల్లో నిక్షిప్తం చేయవచ్చు. అయితే, దీనికి ఎక్కువ భూమి, వనరులూ అవసరమవుతాయి. ఈ విధంగా కేంద్ర వరి పరిశోధనా సంస్థ కటక్‌లో 42 వేల వరి రకాల్ని దాచిపెట్టింది. ఇలా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఇఆర్) మన దేశంలో దాదాపు అన్ని పంటల్లోని రకాల్ని సేకరించి, పరిరక్షిస్తుంది. ఫిలిఫైన్స్‌లోని మనీలా వద్దగల అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రంలో లక్షకు పైగా వరి రకాలు పరిరక్షింపబడు తున్నాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ.
అంతర్జాతీయ కృషి...
జీవవైవిధ్య సదస్సు (కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ) 1993 డిసెంబరులో ప్రారంభమైంది. ఇదేవిధంగా ఆహారం, వ్యవసాయం కోసం వృక్ష, జంతు వనరుల అంతర్జాతీయ ఒప్పందం 2004 నుండి ప్రారంభమైంది. ఈ రెండు సంస్థలూ ప్రపంచంలో దొరికే అన్ని జీవజాతుల పరిరక్షణా కార్యక్రమాలను సమన్వయపరు స్తున్నాయి. జన్యువును అందించిన దేశం యొక్క హక్కుల్ని పరిరక్షిస్తూనే ఇతర దేశాలకు అవసరమైనప్పుడు వారు కోరిన గుణగణాలు కలిగిన రకాల్ని అందించడానికి ఈ సంస్థలు తోడ్పడుతున్నాయి. పరస్పర అంగీకారంతో ఇది జరుగుతుంది. ఇలా సేకరించే దేశాలు తమ తమ చట్టాలకు లోబడి 'క్వారంటీన్' నిబంధనల్ని పాటిస్తున్నాయి.
ప్రాధాన్యత.. హాట్-కోల్డ్ స్పాట్స్..
ప్రపంచస్థాయిలో పరిరక్షించాల్సిన జీవజాతుల్ని ప్రాధాన్యతతో గుర్తించి, ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్ రెడ్ లిస్టును ప్రకటిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం 'హాట్ స్పాట్స్'గా గుర్తించడానికి ఒకేచోట 1500లకు పైగా జాతులు ఉండాలి. ఈ జాతుల్లో 70 శాతం వైవిధ్యం తరిగిపోవాలి. జీవవైవిధ్యం గల ఈ హాట్ స్పాట్‌లను గుర్తించి, అంతరించే జాతుల్ని పరిరక్షించాలి. కానీ, వీటిని గుర్తించడం ఖర్చుతో కూడికున్న ప్రక్రియ. ఒకే ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని తెలపడాన్ని 'కోల్డ్ స్పాట్స్'గా గుర్తిస్తున్నారు. 'హాట్-కోల్డ్ స్పాట్'ల గుర్తింపు పరోక్షంగా జీవవైవిధ్య వ్యాప్తిలో కొన్నిచోట్ల కేంద్రీకరణ చూపుతుంది. ఉదాహరణకు కేవలం 25 హాట్ స్పాట్‌లు భూభాగంలో కేవలం 1.4 శాతం మాత్రమే ఆక్రమిస్తున్నాయి. వీటిలో అన్ని ఉన్నత వృక్ష జాతుల్లో 44 శాతం, వెన్నెముకగల నాలుగు గ్రూపుల్లో 35 శాతం జాతుల్ని గుర్తించారు. ఈ హాట్ స్పాట్‌లలో కేంద్రీకరించి, కొద్ది ఖర్చుతో ఎక్కువ జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. ఈ కోల్డ్ స్పాట్‌లలో జీవవైవిధ్యం హాట్ స్పాట్‌ల కన్నా 10 రెట్లు వేగంగా అంతరిస్తుంది. ఒకవేళ హాట్ స్పాట్‌ల పరిరక్షణకే పరిమితమైతే స్టెఫీలు (ఒక విధమైన గడ్డిజాతి పెరిగే ప్రాంతం), సెరింగేటీ, అర్కెటిక్ లేదా టైగా ప్రాంతాలు జీవవైవిధ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కమ్యూనిటీ విత్తన బ్యాంకు..
మన రాష్ట్రంలో మెదక్ జిల్లాలో జహీరాబాద్ మండలంలో ప్యాలవరం గ్రామంలో 34 మంది మహిళా రైతులు కమ్యూనిటీ జన్యు (విత్తన) బ్యాంకులను నిర్వహిస్తున్నారు. బెట్టను తట్టుకోగల చిరుధాన్యాల (రాగి, కొర్రలు తదితర) పంటల్లో స్థానికంగా దొరికే రకాలను పరిరక్షిస్తున్నారు. వీరంతా 'మనుగడ సేద్యం' చేస్తున్నారు. వీరు పరిరక్షించే రకాలన్నీ బెట్ట పరిస్థితుల్ని తట్టుకోడానికి దోహదపడుతున్నాయి. పెరుగుదలకు అవసరమైన పోషకాల్ని అందించగలుగుతున్నాయి. ఇంత సంక్షోభ సమయంలో కూడా వీరు తమ పంటల వైవిధ్యాన్ని కాపాడుకొంటూ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొని, జీవించ గలుగుతున్నారు. వీరిలో ఆత్మహత్యలు లేవు. స్థానిక పరిస్థితులకు అనుగుణమైన జన్యుపర వైవిధ్య పరిరక్షణ అవసరాన్ని నిర్ధారించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇలా మరెన్నో కమ్యూనిటీ జన్యు (విత్తన) బ్యాంకులు కావాలి.
ఇక్రిశాట్ కార్యక్రమాలు..
హైదరాబాద్‌లోని ఈ అంతర్జాతీయ సంస్థ జొన్న, సజ్జ, మంచి శనగ, కంది, వేరుశనగ, చిరుధాన్యాలు (రాగి, కొర్ర తదితరాలు) పంటలపై పరిశోధనల్ని కొనసాగిస్తోంది. ఈ పైర్లన్నింటిలో ప్రపంచంలో వున్న వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా అన్నిరకాల విత్తనాల్ని సేకరించి, పరిరక్షిస్తోంది. పునరుత్పత్తిని పరిరక్షించ డానికి విత్తనాల్ని నియంత్రిత ఉష్ణోగ్రత, తేమల వద్ద నిల్వ చేస్తోంది. దీనివల్ల పునరుత్పత్తి చేయవలసిన అవసరం తగ్గిపోతుంది. పునరుత్పత్తి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా, పునరుత్పత్తి సమయంలో ఒకోసారి జన్యుమార్పులు జరిగే ప్రమాదమూ వుంది. వీటికి తోడు వేరుశనగ, మంచిశనగల మూల రకాలు (వైల్డ్ వెరైటీస్) అవసరమైన పరిమాణంలో గింజల్ని ఇవ్వవు. వీటిని గ్రీన్‌హౌసుల్లో మామూలు చెట్లమాదిరి పెంచుతారు. అయితే, కంది, జొన్న, సజ్జ మూల రకాల్ని మామూలుగా క్షేత్ర జన్యు బ్యాంకుల్లో పెంచుతారు.
ఈ సంస్థ హైదరాబాద్‌లో మూడు స్థాయిల్లో జన్యు బ్యాంకుల్ని నిర్వహిస్తుంది. స్వల్పకాలంలో నిల్వ వుంచడానికి 18-20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో 30-40 శాతం తేమ వద్ద విత్తనాల్ని నిల్వ వుంచుతుంది. మధ్యకాలిక జన్యు బ్యాంకుల్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో 20-30 శాతం తేమ వద్ద విత్తనాల్ని నిల్వ వుంచుతుంది. దీర్ఘకాలం జన్యువుల్ని -20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ వుంచుతుంది. దీనికి బాధ్యతగల అన్ని పంటల్లో ప్రపంచంలో దొరికే వేలరకాల్ని సేకరించి, నిల్వ చేస్తుంది. వీటన్నింటినీ ఇలా నిల్వ చేయడంవల్ల పరిరక్షిస్తుంది. వీటిలో అభిలషించే లక్షణాలు గల ఆడ, మగ రకాల్ని తీసుకుని ప్రజననం ద్వారా కొత్తరకాల్ని రూపొందిస్తారు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అవసరమైన దేశాలకు ఉచితంగా విత్తనాల్ని అందిస్తారు. అయితే, ఇలా విత్తనాల్ని పొందే దేశాలు అంతర్జాతీయ నియమ, నిబంధనలకు లోబడి వినియోగించాలి.
Tuesday, 18 September 2012
చినుకుల వేళ దోమలతో నరకమే..
‘‘ఇందుగలవందు లేవని సందేహము వలదు. దోమలెందెందు వెదకి చూసినా అందందే కలవు.. !’’
‘‘దోమలెక్కడున్నవీ.. దోమలెక్కడున్నవీ.. నీ చుట్టూనే తిరుగుతున్నవీ...’’- ఇవి ఎక్కడో చదివిన పేరడీలు.
చూడటానికి అవి చిన్న జీవులే అయినా ప్రాణాంతకమైన పెద్ద పెద్ద వ్యాధులకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోయ దోమలు వృద్ధి చెంది, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులకు కారణమవుతున్నాయ. పలు ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి తమవంతు కృషిని వేగవంతంగా సాగిస్తున్నాయి. రక్తం లేకుండా మనుగడ సాగించలేని ఆడదోమలు ఈ వ్యాధుల విజృంభణకు కారణం. మగ దోమలవల్ల పచ్చటి పైర్లు నాశనమైతే, ఆడదోమలవల్ల మానవులు వ్యాధుల బారిన పడి కొందరు ఖరీదైన వైద్యంతో బతికి బట్ట కడితే.. పేదలు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు.
దోమల బారి నుండి మనలను మనం రక్షించుకోవాలి. జాలిపడి అవి మనల్ని వదిలేయటం జరగదు. వీటి కారణంగా చిన్న పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
దోమల నివారణకు నేడు రసాయనిక పదార్థాలతో తయారైన మస్కిటో కాయిల్స్, లిక్వడ్ వాడటం చూస్తున్నాం. తాత్కాలికంగా దోమల బెడద నుంచి తప్పించుకోవటానికి వీటిని వాడుతున్నాం. కానీ, దీర్ఘకాలంలో రసాయనాల వల్ల అనారోగ్యం కలిగే పరిస్థితి వుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే వీలుంది.
కొన్ని సాంప్రదాయక పద్ధతులను పాటిస్తే దోమల బారి నుంచి మనం బయటపడే అవకాశాలున్నాయ.
-ఒక పళ్లెంలో నీటిని పోసి అందులో కర్పూరం బిళ్లలను వేయండి. కర్పూరం వాసనకు దోమలు దూరంగా వెళతాయి.
-పలుచటి గుడ్డలో కర్పూరం కట్టి దానిని చిన్న పిల్లలకు మొలలో కట్టినా ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు. స్వశక్తితో దోమలు తరమలేని పిల్లలకు ఈ విధంగా మేలవుతుంది.
-దోమతెరలను వాడటం మరీ మంచిది. దీనివలన ఎలాంటి అనారోగ్యం కలిగే అవకాశం లేదు. శిశువులకు గొడుగు మోడల్‌లో ఉండే దోమతెరలు వాడటం మంచిది.
-కరెంట్ చార్జింగ్‌తో పనిచేసే దోమల బ్యాట్స్ ప్రస్తుతం వాడుకలోకి వచ్చాయి. వాటి ద్వారా దోమలను దగ్గరకు రాకుండా నిరోధించడంతోపాటు పూర్తిగా నివారించే వీలుంది.
-దోమలు దగ్గరకు రాకుండా తీసుకునే జాగ్రత్తలతోపాటు వాటి అభివృద్ధిని నిరోధించే చర్యలు కూడా అవసరం. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయ్యే దోమల నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వీలయినంత వరకూ దోమల బారినుండి బయటపడటానికి కృషి చేయడం కంటే, వాటి ఉత్పత్తి నివారణకు అవసరమైన మార్గాలను ఎచుకోవడం మంచిది.
- నీటి గుంటలు, మురికి కాలువలు నివాస ప్రాంతాలకు దగ్గరగా లేకుండా చూసుకోవాలి.
-ఇళ్ళల్లో మంచినీటి తొట్టెలను తరచూ శుభ్రం చేసుకోవాలి.
- మురుగు కాలవల్లో నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా వుండాలి.
-మురికి నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం వలన దోమల లార్వాలను చంపవచ్చు. తద్వారా దోమల ఉత్పత్తిని నిరోధించవచ్చు
- వ్యాధులకు గురయ్యాక వైద్యం కోసం వెంపర్లాడటం కంటే- ముందు జాగ్రత్తల ద్వారా దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలి.
Sunday, 16 September 2012
ఆహారం .. ఆరోగ్యం..
విజ్ఞాన వీచిక డెస్క్
జాతీయ పోషక పర్యవేక్షణ బ్యూరో సూచనల ప్రకారం చురుగ్గా ఉండే మనిషికి రోజుకు 400 గ్రాముల పిండిపదార్థాలు (బియ్యం, గోధుమలు, తదితరాలు), 80 గ్రాముల పప్పుధాన్యాలు (కందులు, మినుములు, పెసలు వంటివి), 300 గ్రాముల పాలు, 300 గ్రాముల కూరగాయలు, 30 గ్రాముల నూనె లేదా కొవ్వుపదార్థాలు అవసరం. కానీ, రోజుకు సగటున 345 గ్రాముల బియ్యం లేక గోధుమలు, 24 గ్రాముల పప్పుధాన్యాలు, 71 గ్రాముల పాలు, 43 గ్రాముల కూరగాయలు, 12 గ్రాముల నూనె / కొవ్వు పదార్థాలు మాత్రమే అందుతున్నాయని దీని తాజా నివేదిక తెలుపుతుంది. తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, పాలు, కూరగాయల లోటు తీవ్రంగా వుంది. ఐదేళ్ల లోపు పిల్లల్లో దాదాపు 70 శాతం మేర రక్తహీనత ఉంది. దాదాపు 75 శాతం మంది మహిళలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గర్భిణీల్లో దాదాపు సగం మంది రక్తహీనతతో వుంటున్నారు. దీనివల్ల 20 శాతం పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు. దీర్ఘకాల పోషకలోపాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం పురుషులు, 36 శాతం మహిళల్లో ఎదుగుదల సరిగ్గా లేదు. దాదాపు 16.7 కోట్ల మంది అయోడిన్ లోపంతో గొంతువాపు జబ్బులతో బాధపడుతున్నారు. ఏడాదికి దాదాపు 90 వేలమంది పిల్లలు పురిటిలోనే చనిపోతున్నారు. ఇక పోషకలోపాల వల్ల మధుమేహం, గుండెజబ్బులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. కాన్సరూ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో 16 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం మంది మధుమేహంతో బాధపడ్తున్నారు. ఇదేవిధంగా పట్టణాల్లో 7-5 శాతం, గ్రామాల్లో 3-5 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారు. కాన్సరూ క్రమంగా విస్తరిస్తోంది. లక్ష జనాభాకు 123 మంది స్త్రీలు, 113 మంది పురుషులు కాన్సరు బారిన పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ ప్రధాన పోషకాహార లక్ష్యాల్ని నిర్దేశించింది. అవి..
* ఆకాంక్షలకనుగుణంగా ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడాలి.
* గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు అవసరమైన పోషకాల్ని అందించాలి.
* జన్యుపర అవకాశాల్ని పూర్తిగా వినియోగించుకునేలా పిల్లల్లో పుట్టుక బరువును మెరుగుపరుస్తూ, వారి ఎదుగుదలకు దోహదపడాలి. అలాగే కౌమారదశకు అవసరమయ్యేలా, వయస్సు మీరిన వారూ ఆరోగ్యంగా ఉండేందుకూ తోడ్పడాలి.
* సమతుల పోషకాహారాన్ని అందిస్తూ పోషకలోప రోగాలను నిరోధించేలా ఉండాలి.
* దీర్ఘకాల పోషక లోప జబ్బుల్ని నివారించేందుకు తోడ్పడాలి.
* పెద్దవారు ఆరోగ్యంగా ఉండేలా, వారి జీవితకాలాన్ని పెంచేలా ఉండాలి.
(జాతీయ పౌష్టికాహార సంస్థ, హైదరాబాద్ సమాచారం ఆధారంగా...)
బ్రెస్ట్ క్యాన్సర్‌కి మందు పనే..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
నొప్పుల్ని తగ్గించే కాఫీ..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
ఇంజెక్షన్‌తో బానపొట్ట మాయం!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
'మందుబాబు'ల్ని పట్టించే కెమెరా!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
కాంటాక్ట్ లెన్స్‌తో అంధత్వం!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
ప్రధానిగా కొనసాగించలేని వాస్తు శాస్త్రం
-
అశాస్త్రీయ ఆచారాలు - 18
పాము పగ పడుతుందా?
-
ఎందుకని? - ఇందుకని!
-పి. కార్తీక్, నాన్నెబాలుర ఉన్నత పాఠశాల, 8వ తరగతి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
పాము సరీసృపాలు (reptiles) అనే సకశేరుక (vertebrate) జంతు వర్గానికి చెందిన జీవి. పాముల్లో చాలా రకాలున్నాయి. ఎడారులు, సముద్రాలు కాకుండా మామూలు నేలభాగాల్లో, పొలాల్లో, ఇళ్ల దగ్గర, పొదల్లో, బావుల్లో, చెరువుల్లో, చెట్లమీద కనిపించే చాలా పాములు విషరహితం (non-poisonous). అవి కరిస్తే మనిషి చనిపోడు. ఏదైనా పదునైన ఇనుపతీగలు ఓ సెంటీమీటరు లోపలికి చర్మంలో గుచ్చుకొంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అంతకుమించిన సమస్యలు ఏవీ ఈ పామల కాటు వల్ల రావు. చాలామంది పాము అంటేనే భయం అనిపించడం వల్ల విషరహిత సర్పాలు కాటేసినా విషసర్పాలేమోనని, ఇక మరణం తథ్యం అనుకుంటూ బెంబేలుపడుతూ చాలామంది లేనిపోని సమస్యల్ని కొనితెచ్చుకుంటారు. కొందరు ఆ భయంతోనే గుండె ఆగి చనిపోతారు కూడా. పైన చెప్పినచోట్ల కనిపించే ఎన్నోరకాల పాముల్లో కేవలం మూడుపాములు మాత్రమే విషపూరితమైనవి (1) త్రాచుపాము లేదా నాగుపాము (cobra), 2. కట్లపాము (krait), 3. రక్తపింజెర (viper). వీటిని సులభంగా గుర్తించగలం. నాగుపాము పడగ ద్వారాను, పడగమీద ఉండే గుర్తు ద్వారాను దీనిని గుర్తించవచ్చును. కట్లపాము వీపు మీద నల్లని అడ్డగీతలు ఉంటాయి. ఇది చాలా పొట్టిగా ఉంటుంది. ఒక మీటరుకన్నా తక్కువే ఉంటుంది. నాగుపాము సైజు ఓ మోస్తరు నుంచి రెండు మీటర్ల వరకూ ఉంటుంది. రక్తపింజెర వీపుమీద '8' గుర్తుల్ని అడ్డంగా రాసి, చైనులాగా కలిపినట్లు మచ్చలు ఉంటాయి. రక్తపింజెరి కూడా రెండు మీటర్ల వరకూ పెరుగుతుంది. చెట్లపై కనిపించే పసిరిక పాము, చెరువుల్లో, బావుల్లో ఉండే నీటిపాము లేదా పూడుపాము, జెర్రిపోతు అనబడే పెద్దపాములు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవేవీ విషసర్పాలు కావు.
విషపాములు కరిచినా భయం లేకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడేందుకు 90 శాతం అవకాశం ఉంది. పాము కాటేస్తే మంత్రాలు ఏవీ పనిచేయవు. చికిత్సతోనే పాము కాటు నుంచి బతికి బయటపడతాం. పాముల పుట్టలో పాలుపోస్తే వాటికి చాలా అయిష్టం. ఎందుకంటే పాములు పాలు తాగవు. 'పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది?' అన్న ప్రశ్నను కృతఘ్నతకు చిహ్నంగా వాడతారు. పాముకు పాలుపోస్తే చస్తుంది కాబట్టి, అన్యాయానికి (పాలు పోసి పెంచేవారి దుర్భిద్ధికి) గుర్తుగా ఆ సామెత వాడాలి.
వచ్చేవారం మనం పాము పుట్టల్లో గుడ్లు వేస్తారు. అవి తింటాయా? నాగస్వరం ఊదితే నాగుపాము పడగ ఆడిస్తుంది కదా? అదెలా? పాములు కుబుసం విడవడం, బుస కొట్టడం చేస్తాయి? దానివల్ల ఏమీ ప్రమాదం లేదా? వాసన తెలుస్తుందా? వంటి వివరాలు తెలుసుకుందాం..!
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
జీవవైవిధ్యం.. సుస్థిరాభివృద్ధి..
భూగోళంలో వున్న భిన్న వృక్ష, జంతుజాతులు, ఆ జాతుల్లో వున్న మొత్తం తేడాలన్నింటినీ కలిపి జీవవైవిధ్యంగా పరిగణిస్తున్నాం. జీవావిర్భావం తర్వాత గత 3,500 కోట్ల సంవత్సరాలకుపైగా జరిగిన పరిణామక్రమంలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. నిపుణుల అంచనా ప్రకారం భూగోళంలో భిన్నమైన, గుర్తించగల 100 నుండి 300 లక్షల వృక్ష, జంతుజాలాలు వున్నాయి. కానీ, వీటిలో ఇప్పటి వరకు అధ్యయనం చేసి, గుర్తించగలిగింది సుమారు 14.35లక్షల రకాలు మాత్రమే. వీటిలో అత్యధికంగా 7.51లక్షల రకాలు కీటకజాతి కి చెందినవి. ఆతర్వాత 2.81లక్షల జంతుజాతికి చెందినవి. ఉన్నత వృక్షజాతికి చెందినవి 2.48లక్షల రకాలు గుర్తించబడినవి. ఇక మిగ తావి ప్రోటోజోవా, ఆల్గేలు, ఫంజీ, బ్యాక్టీరియా తదితరాలు. అడవుల్లో కొత్తగా అధ్యయనం చేస్తున్న కీటకజాతుల్లో ఆరింటిలో ఐదు కొత్తరకా లుగానే గుర్తించబడుతున్నాయి. తద్వారా మనం గుర్తించిన జంతు జాలాల కన్నా ఇంకా గుర్తించాల్సినవే చాలా ఎక్కువగా వున్నాయని ఈ ధోరణి తెలుపుతుంది. ఇలా గుర్తించిన రకాలలో కూడా అంతర్గతంగా ఎంతో వైవిధ్యం గుర్తించబడింది. ఉదా: వరి శాస్త్రీయపరంగా ఒకే ఒక మొక్క. కానీ దీనిలో మన దేశంలోనే వేల రకాలు గుర్తించబడ్డాయి. ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొనే జీవప్రక్రియలో భాగంగా ఈ వైవిధ్యం రూపుదిద్దుకుంది. ఇప్పుడు మారుతున్న వాతా వరణ, పర్యావరణ ధోరణిని తట్టుకోవడానికి ఈ వైవిధ్యం ఎంతో ఉప యోగపడుతుంది. ఈ వైవిధ్యమే లేకుంటే భూగోళంలో ఏ చిన్న దుష్ప రిణామం వచ్చినా ఈ రకాలు అంతరించి, మానవ ఆహారలభ్యత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఎదురవుతున్న సవాళ్లు..
పరిణామక్రమంలో, ముఖ్యంగా మారుతున్న వాతావరణ, పర్యావరణ పరిస్థితులవల్ల, ఇతర కారణాల వల్ల కొన్ని జాతులు కొత్తగా పుట్టడం, మరికొన్ని అంతరించిపోవడం మామూలుగా జరిగేవే. గత 20 కోట్ల సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒకటిరెండు కొత్త రకాలు ఏర్పడుతున్నాయి. ప్రతి 10 లక్షల సంవత్సరాల్లో సుమారుగా 3, 4 కొత్త కుటుంబాలు రూపుదిద్దుకున్నాయి. సగటున ఒకోరకం జీవి 20 లక్షల నుండి కోటి సంవత్సరాలు ఉంటుందని అంచనా. అయితే, పెద్దఎత్తున జాతులు అంతరించిపోయిన సందర్భాలూ వున్నాయి. ఉదా: డైనోసార్. అతి పెద్ద జంతువు. 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఇలానే అంతరించిపోయింది. ఆధునిక కాలంలో మానవ కార్యక్రమాలు భిన్న జీవజాతుల కొనసాగింపును ప్రమాదంలో పడేస్తున్నాయి. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. పెద్దఎత్తున అంతరించిపోతున్న ఈ జంతుజాలాలకు ప్రధానకారణాలు..
. పెరుగుతున్న జనాభా..
మానవ జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రకృతి మీద ఆధారపడ టమూ పెరుగుతోంది. దీనికనుగుణంగా పెరుగుతున్న అవసరాల కోసం ఇతర జంతుజాలాల మీద దాడీ పెరుగుతోంది. గత 600 కోట్ల సంవత్సరాల్లో మానవాభివృద్ధిలో భాగంగా ఎన్నో అడవుల్ని నరికారు. పర్యావరణ పరిస్థితులూ మారాయి. దీంతో స్థానిక వాతా వరణ పరిస్థితులూ మారాయి. ఈ విధమైన కార్యక్రమాలు జీవ వైవిధ్యానికి పెద్ద ప్రమాదంగా కొనసాగుతున్నాయి.
. అధిక వేట..
. కనుమరుగు చేయబడుతున్న నివాసస్థలాలు..
అడవుల నరికివేత, గ్రామాల నిర్మాణం, వ్యవసాయభూములుగా మార్పు, మెట్ట భూముల్ని మాగాణీగా మార్చడం జీవవైవిధ్యాన్ని పెద్దఎత్తున దెబ్బతీస్తున్నాయి. ఉష్ణమండల అడవుల్లో 50 శాతం పైగా జీవవైవిధ్యం వుంది. అడవుల నరికివేత జీవవైవిధ్యాన్ని వేగంగా తగిస్తోంది.
. వలస తెచ్చిన జంతుజాలాలు..
మన అవసరాల కోసం ఎన్నో కొత్తరకాల్ని తీసుకొచ్చి స్థానికంగా పెంచుతున్నాం. ఇవి స్థానిక జంతుజాలాల్ని అంతరింపజేస్తున్నాయి. ఇలా ద్వీపకల్పాల్లో పెద్దఎత్తున జీవవైవిధ్యం అంతరించిపోయింది.
. కాలుష్యం.. వాతావరణమార్పులు..
కాలుష్యం, వాతావరణమార్పులు కూడా జీవవైవిధ్యాన్ని అంతరింపజేస్తున్నాయి.
. ఆధునిక ప్రజననం (బ్రీడింగ్) పద్ధతులు..
ఈ పద్ధతుల ద్వారా అధిక దిగుబడినివ్వగల కొత్తరకాల్ని రూపొం దించి, సేద్యం చేయడంతో పంటల్లో జీవవైవిధ్యం బాగా తగ్గిపోతుంది. వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి తదితర ఆహారధాన్యాలు, నూనెగిం జలు, పప్పుధాన్యాలు తదితరాల్లో మనదేశంలోనే ఎంతో వైవిధ్యం వుం డేది. కానీ, ప్రజననం ద్వారా అధిక దిగుబడి వంగడాలు సేద్యంలోకి తెచ్చిన తర్వాత, వీటి జీవవైవిధ్యం బాగా కుదించుకుపోతున్నాయి. ఇప్పుడు పత్తి పైరులో కొన్ని వందల రకాలు మాత్రమే సేద్యం చేయ బడుతున్నాయి. గతంలో వేలాదిరకాలు సేద్యమయ్యేవి. తాజాగా, బిటి పత్తి ప్రవేశపెట్టిన తర్వాత సేద్యమయ్యేవి వందకుపైగా రకాలకే పరి మితమయ్యాయి. ఈ కొత్త రకాలు ఏ కొద్దిపాటి ఒడుదుడుకుల్ని తట్టు కోలేక అంతరించే ప్రమాదమూ ఉంది. ఈ విధంగా జీవవైవిధ్యాన్ని కోల్పోవడం మానవ మనుగడకు, సుస్థిరాభివృద్ధికి ప్రమాదకరం.
జీవవైవిధ్య కేంద్రాలు (బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్)..
ఈ కేంద్రాలు జీవవైవిధ్యానికి నిలయాలు. కేవలం అదే ప్రాంతా నికి చెందిన జాతులతో నిండి, వాటి ఉనికి మానవ కార్యకలాపాల వలన ప్రమాదానికి లోనైతే అటువంటి ప్రాంతాన్ని 'జీవవైవిధ్య కేంద్రాలు'గా పేర్కొంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం ఈ ప్రాంతాల్లో నివసించడం వీటి విశిష్టత. భూ ఉపరితలంపై దాదాపు 12 శాతం మేర ఈ కేంద్రాలున్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు (అమెజాన్ అడవులు, మలేషియా దీవులు) జీవుల మధ్య వైవిధ్యానికి నిలయాలు. 'నార్మన్ మేయర్స్' అనే బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త తొలిసారిగా 1988లో 'హాట్‌స్పాట్స్' అనే పదాన్ని వాడాడు. 'వావిలోవ్' అనే రష్యన్ శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా పలు జీవవైవిధ్య కేంద్రాలను గుర్తించారు. కనీసం 1500 పుష్పించే మొక్క ల జాతులు ఒక జీవవైవిధ్య కేంద్రంలో ఉండాలని కన్సర్వేషన్ ఇంట ర్నేషనల్ పేర్కొంది. ఇలా 25 కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. మనదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రాధాన్యత..
మానవ మనుగడకు, అభివృద్ధికి ఎన్నో జంతుజాలాలను వినియోగించుకుంటున్నాం. ఈ జంతుజాలాల మనుగడ, కొనసాగింపు ఇతర జంతుజాలాలు, పర్యావరణం మీద ఆధారపడి వున్నాయి. ఈ గొలుసులో ఎక్కడ బంధం తెగినా మానవ మనుగడ ప్రమాదంలో పడవచ్చు. ఉదా: పెరుగుతున్న వృక్షజాతి సంతతి తమకవసరమైన నత్రజనిని నేరుగా సేకరించి, వినియోగించుకోలేదు. ప్రకృతిలో ఒకరకం బ్యాక్టీరియా (ఉదా: అజిటో బ్యాక్టర్) నత్రజనిని మొక్క వినియోగించుకోగల రూపంలోకి మారుస్తుంది. ఇదేవిధంగా మనం వేసే సేంద్రీయపు ఎరువుల్లోని నత్రజనిని నేరుగా మొక్కలు స్వీకరించలేవు. ఈ ఎరువులు చివికి దానిలోని సేంద్రీయ నత్రజని నైట్రేట్ రూపంలోకి మారిన తర్వాతనే మొక్కలు స్వీకరిస్తాయి. ఇదే విధంగా రసాయనిక ఎరువుల్లోని అమైడ్ లేక అమ్మోనియా రూపంలోని నత్రజని నేరుగా మొక్కలు వినియోగించుకోలేవు. వీటిని నైట్రేట్ రూపంలోకి మారిన తర్వాతనే మొక్కలు వినియోగించుకుంటాయి. ఈ మార్పులో కూడా బ్యాక్టీరియాలు ఇమిడి వున్నాయి. ఈ బ్యాక్టీరియా నేలలో లేకపోతే చెట్లు పెరగడం అసాధ్యం. ఫలితంగా, మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది. నేలల్లో నత్రజనిని చెట్లకు ఉపయుక్తంగా మార్చే బ్యాక్టీరియాల మనుగడ నేలలోని వాతావరణం మీద, ఇతర సూక్ష్మజీవుల మీద ఆధారపడి వుంది. ఇదేవిధంగా, పరపరాగ సంపర్కంలో పుష్పించి, ఫలాల్నిచ్చే ప్రక్రియలో ఎన్నోరకాల కీటకాలు కీలకపాత్ర వహిస్తాయి. ఈ కీటకాలు అంతరించిపోతే మనకు 'ఫలాలు' అందవు. ఆ మొక్కలు కూడా అంతరించిపోతాయి. అంతిమంగా మానవ మనుగుడ ప్రమాదంలో పడుతుంది. అందువల్ల, మానవ మనుగడ కొనసాగింపుకు భూగోళంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం, బాధ్యత నేడు మన ముందున్నది.
సుసంపన్నమైన జీవవైవిధ్యానికి, తరగని జీవ సంపదకు భారతదేశం నిలయం. పలురకాల ఆవాసాలకు, ఆవరణ వ్యవస్థలకు, వాటి వైవిధ్యానికి మనదేశం పెట్టింది పేరు. ఉష్ణమండల వర్షారణ్యాల నుండి, ఆల్పైన్, సమశీతోష్ణ అడవులు, తీరప్రాంత చిత్తడి అడవులు, మడ అడవులు ఇలా ఎంతో వైవిధ్యభరిత జీవావరణ వ్యవస్థల్ని ఇక్కడ చూడవచ్చు. దేశంలో ప్రధానంగా రెండు జీవవైవిధ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వైశాల్యంలో కేవలం 2.4 శాతం ఉన్న మనదేశంలో 7.3 శాతం జీవజాతులు (సుమారుగా 89,451 జాతులు) ఉండటం విశేషం. జీవ భూగోళ ప్రాంతాలు పది ఉన్నాయి. వీటిలో ఎడా రులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఉష్ణ, సమశీతోష్ణ అరణ్యాలు, గడ్డి మైదానాలు, నదీపరీవాహక ప్రాం తాలు, అర్చిపెలాగో ద్వీపాలు, మడ (మాంగ్రూస్) అడవులు ఇందుకు నిదర్శనాలు. ప్రపంచపు 18 స్థూల వైవిధ్యం ఉన్న దేశాల్లో మనదేశం ఒకటి. క్షీరదాల్లో 7.6 %, పక్షుల్లో 12.6%, సరీసృపాలు 6.2%, ఉభయచరాల్లో 4.4%, చేపల్లో 11.7%, పుష్పించే మొక్కల్లో 11.7% మనదేశంలోనే ఉన్నా యంటే జీవవైవిధ్యపరంగా మనదేశ ప్రాధాన్యతను అంచనా వేయవచ్చు. ఆసియా ఏనుగు, బెంగాల్ పులి, ఆసియా సింహం, చిరుత, రైనాసెరాస్ వంటి ఎన్నోరకాల ప్రత్యేక జాతులకు మనదేశం ప్రసిద్ధి. ఈ జీవ వైవిధ్య కేంద్రాల్లోనే మనం పండించే అనేకరకాల మొక్కలు ఉద్భవించాయి. రకరకాల పంట మొక్కల ఉద్భవానికి నిలయమైన 12 కేంద్రాల్లో మనదేశం ఒకటి. ఇంతటి గొప్ప జీవవైవిధ్య వనరులు క్రమంగా అదృశ్యం అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అందుకే ముఖ్య వనరుగా, సంపదగా ఉన్న మనదేశ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు ఈ జరగబోయే 'అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశాలు' స్ఫూర్తినిచ్చి, కార్మోన్ముఖులను చేస్తాయని ఆశిద్దాం.
సుస్థిరాభివృద్ధి..
పక్రృతి వనరుల వినియోగంలో భవిష్యత్తుతరాల అభివృద్ధి అవకాశాలను దెబ్బతీయకుండా ఇప్పటి అవసరాలను తీర్చుకోవడమే సుస్థిరాభివృద్ధి. దీనిలో పునరుత్పత్తి పొందలేని వనరుల (ఉదా: ఖనిజాలు) వినియోగం. పునరుత్పత్తి కాగల జీవవైవిధ్య వినియోగం, అనుకూల వాతావరణ పరిస్థితుల కొనసాగింపు ముఖ్యమైనవి.
విజ్ఞానం శాస్త్ర, సాంకేతికాలు అభివృద్ధి ద్వారా వచ్చిన పారిశ్రామిక విప్లవం తర్వాత అభివృద్ధి పేరుతో లేదా యుద్ధాలలో ప్రకృతివనరుల విధ్వంసం పెద్దఎత్తున కొనసాగుతుంది. దీనిని తక్షణ లాభాలకు ప్రాధాన్యత ఇచ్చే కార్పొరేట్ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వేగవంతం చేస్తుంది. ఫలితంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి కొనసాగింపు ప్రధాన సమస్యగా ముందుకొచ్చింది.
ఉత్పత్తిలో వినియోగించే సాంకేతికాలు అభివృద్ధి స్వభావాన్ని నిర్ధారిస్తాయి. పునర్వినియోగం (ఖనిజ మూలకం), పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడే సాంకేతికాలను హరిత సాంకేతికాలుగా వ్యవహరిస్తున్నాం. ఇవన్నీ సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. అందువల్ల, సుస్థిరాభివృద్ధిలో జీవవైవిధ్య పరిరక్షణ కీలకపాత్ర వహిస్తుంది. దీనికోసం పర్యావరణ పరిరక్షణ, ముఖ్యంగా భూగోళం వేడెక్కడాన్ని నిలవరించడం, పునరుత్పత్తి కాగల ఇంధనాల వినియోగ పెంపు, కాలుష్యాన్ని నివారించగల సాంకేతికాలు, ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంచే అన్ని సాంకేతికాలు అవసరమవుతాయి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
గురజాడ జయంత్యుత్సవాలు 2లక్షల కరపత్రాలు.. లక్ష పోస్టర్లు
ప్రజాశక్తి -హిమాయత్‌నగర్
Sun, 16 Sep 2012, IST
-
ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం
Thursday, 30 August 2012
మూఢనమ్మకాలుంటే నష్టాలేంటి?-2
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
-
అశాస్త్రీయ ఆచారాలు - 17
ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన 'నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?' అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపిం చాను. ఆ వ్యాస రచయిత ఎమ్.టెక్; ఎమ్.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. 'నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. అందరిలా బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగమూ ఉంది. దాచుకున్న డబ్బుంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడం లేదు.' అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకంగల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?
ఇక మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు చెప్తాను. విను.
(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)
కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.
(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)
వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడు తుంటే, స్థానిక ఆర్.ఎమ్.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.
(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)
చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.
(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)
మంత్రాలకు చింతకాయలు రాలతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.
(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.
(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)
ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.
(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)
సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.
(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని ఈ వార్త..
ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను 'మనమిద్దరం క్రితం జన్మలో భార్యా భర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!' అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు' అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.
కిషన్! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాలతో ఎన్ని నష్టాలున్నాయో తెలుసు కున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకే మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?' అని ముగించాను.
'అర్థమైంది అంకుల్!' అంటూ కిషన్ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
రక్తం లేకుండా మధుమేహ పరీక్ష..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
పండ్లను తాజాగా ఉంచే 'స్ప్రే'!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
మొక్కతో కాన్సర్ నివారణ..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
అదృశ్య హెల్మెట్..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
ఆకలిని చంపే పౌడర్..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wednesday, 22 August 2012
మూఢనమ్మకాలుంటే నష్టాలేంటి?-1
-
అశాస్త్రీయ ఆచారాలు17
'అసలు మూఢనమ్మకాలంటేనే నమ్మినవారినీ, నమ్మనివారినీ మానసికంగా, ఆర్థికంగా నాశనం చేసే వని అర్థంచేసుకో. అనేకసార్లు మూఢనమ్మకాలు ప్రాణాల్నే హరిస్తున్నాయి. వాటిని వివరంగా చెబుతా విను. వాస్తు అనేది ఒక మూఢనమ్మకం. దానిని నమ్మి నవారు లక్షలాదిమంది మనదేశంలో ఉన్నారు. ఆ నమ్మ కంతో వారు ఇళ్ళు కూలగొట్టుకుంటున్నారు. ఆస్తులు నాశనం చేసుకుంటున్నారు. ఉదా: ఒక పత్రికలో పాఠ కుడు వేసిన ప్రశ్న, దానికి వాస్తువాది సమాధానాన్ని 'ప్రజాశక్తి' 7-7-2002న పునర్ముద్రించింది. ప్రశ్న:'అయ్యా! నా ఇంటి ఉత్తర ప్రహరీగోడకు ఉత్తర ఈశాన్యంలో గేటు, ఉత్తర వాయువ్యంలో ఇంకో గేటుంది. నా ఇంటికి తూర్పు ఆగేయంలో లోతైన అండర్ గ్రౌండ్ సంపు ఉంది. ఆగేయంలో ఎత్తయిన బిల్డింగ్ కూడా ఉంది. నైరుతిభాగాన నా స్థలంలో మొయిన్ గృహానికి తగలకుండా ఉపగృహం నిర్మించాం. ఆ ఉపగృహానికి అండర్‌గ్రౌండ్ సెల్లార్ నిర్మించాం. మా పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారిపోయింది. కావునా తాము ఏమార్పులు చెప్పినా చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి చెప్పండి.
సిద్ధాంతి సమాధానం:శ్యామ్‌గారూ! సర్వరోగాలూ ఒకే మనిషికుంటే ఎలా ఉంటుందో అలా మీ ఇంటి అవలక్షణాలు కన్పిస్తున్నాయి. కాబట్టి చాలామార్పులు చేయించుకోవాల్సి ఉంటుంది. తూర్పుఆగేయంలో అండర్ గ్రౌండ్ సంపుందని చెబుతున్నారు. ఆగేయంలో ఎత్తయిన భవనమూ ఉందన్నారు. ఈ రెండూ అతి భయంకరమైనవి. రోజురోజుకూ శత్రువుల్ని అభివృద్ధి చేస్తాయి. కాబట్టి తూర్పు ఆగేయంలో ఉండే సంపును తీసేసి తూర్పు ఈశాన్యంలో అమర్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆగేయంలో ఎత్తయిన భవనాన్ని కూలగొట్టాలి. నైరుతిలో సెల్లార్ చాలా ప్రమాదకారి. కాబట్టి ఆ సెల్లార్‌ను పూడ్చేయాలి. ఇంటికి ఖాళీస్థలాలు ఎటువైపు ఎంతున్నాయో మీరు రాయలేదు. ఖాళీ స్థలాలనుబట్టి ఉచ్ఛనీచాలను నిర్ణ యించగలం. అందువల్ల మీరు వివరంగా మరో లెటరు రాస్తే ఇంకా ఏ ఏమార్పులు చేసుకోవాలో చెబుతాను.
వీటిని పునర్ముద్రించి, ప్రజాశక్తి పత్రిక చివరిలో ఇలా వ్యాఖ్యానించింది.. 'ఏ ఇల్లయినా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తూ ఆహ్లాదకరంగా ఉండాలి. అలా ఉంటే, అందులో నివాసం ఉండేవారి మనసులు ఉల్లా సంగా ఉంటాయి.అప్పుడే వారి భవిష్యత్తుకూ ఉజ్జ్వల మైన బాటలు వేసుకుంటారు. కానీ వాస్తుతోనే గీత మారుతుందని గుడ్డిగా నమ్మితే అధోగతే!'
అలా వాస్తును గుడ్డిగా నమ్మిన ఒక ధనవంతుడు ఆస్తి పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని స్వామీ జగదా నంద అనే స్వామీజీ తాను రాసిన 'ఆస్పిషస్ వాస్తు' అనే పుస్తకంలో ఇలా వివరించారు.
ఒక ఊళ్ళో రెండు గ్రానైట్‌ఫ్యాక్టరీలు, రెండు పత్తి ప్రాసెసింగ్‌మిల్లులు ఉన్న వ్యాపారి మరింత ధనం సంపాదిద్దామని ఒక వాస్తువాదిని సంప్రదించాడు. అతడు అతనింటికి అనేక మార్పులు సూచించాడు. అన్నీ చేశాడు. దానికి చాలా ఖర్చయి, అప్పులపాల య్యాడు. దీంతో పత్తి మిల్లొకటి అమ్మి, మరొకటి లీజుకీ యాల్సి వచ్చింది. ఆ ధనికుడు వాస్తుతో ఎంత బాధ అనుభవించాడంటే తన ఇంటి ముందు 'ఇచ్చట వాస్తు వాదులకు ప్రవేశంలేద'ని బోర్డుపెట్టాడు.' (పే: 5, 6)
'ఇది నేడు లక్షలాది ప్రజల స్వానుభవం. వాస్తు పేరుతో ప్రజలు ప్రతి ఏడాది రూ15వేల కోట్లు నాశనం చేసుకుంటున్నారని ఒక స్వచ్ఛందసంస్థ అంచనా. ఇప్పు డు చెప్పు. నీవు బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించినా, వాస్తు అనే మూఢనమ్మకం ఉంటే ఆస్తిని పోగొట్టుకొనే ప్రమాదం లేదా? అలాగే జ్యోతిష్యం విషయం చెప్తాను.' అన్నా.
(ఆ వివరాలు పైవారం తెలుసుకుందాం!)
ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన 'నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?' అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపించాను. ఆ వ్యాస రచయిత ఎమ్.టెక్; ఎమ్.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. 'నాకు పెళ్ళి చేసుకోవాలనుంది. అందరిలాగానే బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగం ఉంది. దాచుకున్న డబ్బు కూడా ఉంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడంలేదు.' అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకం గల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?
ఇక మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నీకు వినిపిస్తాను. విను.
(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)
కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.
(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)
వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుంటే, స్థానిక ఆర్.ఎమ్.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.
(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)
చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.
(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)
మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.
(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.
(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)
ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.
(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)
సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.
(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని యీ వార్త విను.
ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను 'మనమిద్దరం క్రితం జన్మలో భార్యాభర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!' అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు' అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.
(9) శృతిమించిన మూఢభక్తి - చితిపేర్చుకొని ఇద్దరు సజీవ దహనం (సాక్షి 24-2-2009)
ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం శివనూర్ గోండుగూడకు చెందిన ఇద్దరు శివభక్తులు మహాశివరాత్రికి కొన్నిరోజుల ముందు గ్రామ సమీపంలో గుడిసె వేసుకొని, అక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేయడం మొదలెట్టారు. మహాశివరాత్రి నాడు శివుడు ప్రత్యక్షమౌతాడనీ, అలా ప్రత్యక్షం కాకపోతే, తామే శివుడి దగ్గరకు వెళ్ళి పునర్జన్మ సాధిస్తామని ఇతర భక్తులతో అనేవారు. ఇందుకు ఉదాహరణ శివలీలామృతం అనే గ్రంథంలో ఉందనీ, అందులో ఒక రుషి శివుణ్ణి పూజిస్తూ సజీవదహనమయ్యాడనీ, తద్వారా పునర్జన్మ సాధించడనీ రాసి ఉన్నట్లు ఇతర భక్తులకు చెప్పేవారు. మహాశివరాత్రినాడు, రాత్రిపూట ఇతర భక్తులను ఇళ్ళకు పంపి, వారు అక్కడే ఉన్న కట్టెలను చితిగా పేర్చుకొని ఆత్మాహుతి చేసుకున్నట్లు అక్కడి ఆనవాళ్ళను బట్టి తెలుస్తోందని పత్రికావార్త తెలియజేస్తోంది.
కిషన్! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాల వలన ఎన్ని నష్టాలున్నాయో తెలుసుకున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకూ మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?' అని ముగించాను.
'అర్థమైంది అంకుల్!' అంటూ కిషన్ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
Subscribe to:
Posts (Atom)