దోమల నివారణ చర్యలు
* మీ ప్రాంతంలో దోమలు ఎక్కువుంటే పంచాయతీ లేదా మున్సిపల్ అధి కారులకు తెలియజేయండి.
* ఆరోగ్య శాఖ సిబ్బంది క్రిమి సంహారక మందులు ఇళ్లల్లో చల్లినప్పుడు ప్రతీ గదిలోనూ చల్లించడండి. మందు చల్లిన తర్వాత గోడలు తుడవకూడదు. గోడలకు సున్నం వేయరాదు.
* దోమల నివారణకి పొగవదిలినప్పుడు (ఫాగింగ్), ఇళ్లల్లో కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి.
* మీ ఇళ్లచుట్టూ నీరు నిల్వ ఉండకుండా, మురుగు నీటి కాల్వలో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తపడండి. మీ ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోండి.
* మురుగు నీటి కాల్వల్లో, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కిరోసిన్, ఇతర దోమల సంహారక మందులు చల్లించండి.
* దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్లు, చేతులు పూర్తిగా కప్పుకోవాలి.
* మీకు వీలైతే మీ ఇంటి కిటికీలకు, తలుపులకు దోమలు రాకుండా మెష్ అమర్చుకోవాలి.
* వారానికి ఒక రోజు నీటి తొట్లు, పాత్రలు, కుండీలు, కూలర్లలో నీరు పూర్తిగా తీసివేయాలి. దీన్నే డ్రైడే పాటించడం అంటారు.
* దోమల నివారణకు దోమ తెరలు వాడటం అత్యుత్తమమైన మార్గం.
మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !
డాక్టర్ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్
అనారోగ్య సమస్యలా ...?
అయితే మాకు రాసి పంపండి. ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో సమాధానాలిప్పిస్తాం. ప్రశ్నలు పంపే వారు వయస్సు, బరువు, జబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచాలి.
No comments:
Post a Comment