టెక్నీషియన్ పోస్టులు
-
జాబ్స్...జాబ్స్...
అర్హతలు: పదవ తరగతితోపాటు ఐటిఐ పాసై ఉండాలి.
వయసు: 28 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను 2012 మే 10లోగా ఓపి బాక్స్ నెం. 21, హెడ్ పోస్టాఫీస్, బొకారో స్టీల్ సిటీ-827001, జార్ఖండ్ చిరునామాకు పంపాలి.
వివరాలకు:www.sail.in వెబ్‌సైట్ చూడండి.
బిఎస్‌ఎఫ్‌లో
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ (ఆర్కిటెక్ట్)-7 పోస్టులు, సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్)-183 పోస్టులు, సబ్ ఇన్స్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్)-50 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
వయసు: 25 సంవత్సరాలలోపు ఉండాలి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బిఇ/బిటెక్/డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి.
దరఖాస్తులను 2012 మే 5 లోగా ది కమాండెంట్ (రిక్రూట్‌మెంట్), బిఎస్‌ఎఫ్ హెడ్ క్వార్టర్స్, బ్లాక్-10, సిజిఓ కాంప్లెక్స్, లోఢ రోడ్, న్యూఢిల్లీ-1100003 చిరునామాకు పంపాలి.
వివరాలకు: www.bsf.nic.in చూడండి.
ఎస్‌ఎఫ్‌సిఐలో అసిస్టెంట్లు
స్టేట్ ఫార్మ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్స్ (విజిలెన్స్, అగ్రికల్చర్, హెచ్‌ఆర్, మార్కెటింగ్-20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: అగ్రికల్చర్, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్ విభాగాలకు బిఎస్‌సి (అగ్రికల్చర్), మిగిలిన వాటికి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 ఏప్రిల్ 30.
వివరాలకు:sfci.nic.in చూడండి.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్)-250, అసిస్టెంట్ (ఆఫీస్)-15, సీనియర్ అసిస్టెంట్ (స్టాటిస్టిక్స్)-6, సీనియర్ అసిస్టెంట్ (నర్సింగ్)-1 పోస్టు భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
అర్హతలు: జూనియర్ అసిస్టెంట్‌కు డిప్లొమా ఇన్ మెకానికల్ / ఆటోమొబైల్/ఫైర్ ఇంజనీరింగ్‌తోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
అసిస్టెంట్‌కు డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సీనియర్ అసిస్టెంట్‌కు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో డిప్లొమాతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: సీనియర్ అసిస్టెంట్‌కు 35 సంవత్సరాలు, మిగిలిన వాటికి 30 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 మే 15.
వివరాలకు:wwww./airportsindia.org.in చూడండి
ట్రాన్స్‌కో మిషన్ కార్పొరేేషన్‌లో
ఎపి ట్రాన్స్‌కో జూనియర్ అసిస్టెంట్స్ (ఎల్‌డిసి)-24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 16 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. గత ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసినవారు తిరిగి దరఖాస్తు చేయనవసరం లేదు.
అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: 18 నుండి 36 సంవత్సరాలలోపు ఉండాలి.క
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 ఏప్రిల్ 28.
వివరాలకు: www.aptransco.gov.in చూడండి.
జూనియర్ అసిస్టెంట్స్
ఎపిసిడిసిఎల్ జూనియర్ అసిస్టెంట్స్ (ఎల్‌డిసి)-149 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 100 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. గత ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసినవారు తిరిగి దరఖాస్తు చేయనవసరం లేదు.
అర్హతలు: డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా పిజి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి.
వయసు: 18 నుండి 36 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 మే 9.
వివరాలకు: www.ap centralpover.cgg.gov.in చూడండి.
No comments:
Post a Comment