Wednesday, 11 April 2012

తేనెటీగల క్షీణతకు కారణం..?!


గత ఆరు సంవత్సరాల నుండీ ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల కాలనీలు క్షీణించిపోతున్నాయి. 'కాలనీ కొలాప్స్‌ డిసార్డర్‌ (సిసిడి)' అనే ఒక విచిత్ర పరిస్థితి ఇపుడు నెలకొని, తేనెపట్టులోని తేనెటీగలు చనిపోవడం వల్ల కాల నీలు క్షీణించడం ప్రారంభమైంది. ఇటువంటి విపత్కర పరిస్థితికి విరివిగా వాడే ఇమిడాక్లోప్రిడ్‌ అనే ఒక కీటక నాశిని మందు కారణమని తెలిసింది. పూల మకరందంలోను, తేనెటీగల పెంపకంలో వాడే సిరప్‌లోనూ ఇది అతి తక్కువ మోతాదులో ఇప్పుడు ఉంటుందట. మామూ లుగా పంటలపై వాడే మోతాదు కంటే చాలా తక్కువ మోతాదులోనే ఇంత నష్టం కలుగుతుందని అంటున్నారు. తేనెటీగల ద్వారా కేవలం తేనె ఉత్పత్తి మాత్రమే కాకుండా అనేక పంటల పరాగసంపర్కం కూడా జరుగుతుంది. కీటకనాశన మందులు వాడడం వల్ల అటువంటి ముఖ్య కీటకాల సంఖ్య తగ్గిపోతే 'పరాగ సంపర్కం' కొరతతో దిగుబళ్ళు తగ్గిపోతాయని తరచుగా ఇపుడు గమనిస్తున్నదే.

No comments:

Post a Comment