Thursday, 5 April 2012

పండ్ల కంటే పాప్‌కార్న్‌ బెస్ట్‌..!


పాప్‌కార్న్‌ (మొక్కజొన్న పేలాలు) చిరుతిండిగా పరిగణించడం మామూలే. కానీ, ఎప్పుడూ దాన్ని ఆరోగ్యకరమైన పదార్థంగా మాత్రం చూడటం లేదు. అటువంటిది, ఇప్పుడు పండ్లకంటే పాప్‌కార్న్‌ మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. పాప్‌కార్న్స్‌లో నూరు శాతం 'యాంటీ ఆక్సిడెంట్‌' పదార్థాలు ఉంటాయి. వీటిల్లో ఉండే పాలీఫెనాల్‌లు పండ్లు, కూరగాయలలో కంటే చాలా ఎక్కువట. పైగా పాప్‌కార్న్‌ని వెన్నలోగానీ, నూనెలోగానీ, ఉప్పులోగానీ కలిపినప్పుడు మరింత ఎక్కువగా ఈ పాలీఫెనాల్స్‌ వెలికి వస్తాయట! పాప్‌కార్న్‌ తినటంవల్ల పళ్ళల్లో ఇరుక్కుంటుందని భయపడే బయటిపొరలోనే ఈ పదార్థాలు ఎక్కువట! దీనికితోడు, అందులో అధికంగా పీచు పదార్థం కూడా ఉందట. మరి, పాప్‌కార్న్‌ తినటం వల్ల పండ్లకంటే మంచి ఆరోగ్యం కలుగుతోందని ఆశిద్దామా? ఏమో? మరిన్ని ప్రయోగాల ద్వారా నిర్ధారించుకోవాల్సిందే మరి!

No comments:

Post a Comment