Wednesday, 11 April 2012

మందులకు లొంగని మలేరియా..!


మందులకు లొంగక, గత కొన్ని దశాబ్ధాలుగా మానవులను భయభ్రాంతుల్ని చేస్తున్న మలేరియా గత కొన్ని సంవత్సరాలుగా ఒక చైనీస్‌ మొక్క, ఆర్తెమీసియాకు కాస్త లొంగినట్టే కనిపించింది. కానీ, ఇటీవలి పరిశోధనలో ఒకరకం మలేరియా ఆ మందుకి కూడా లొంగడం లేదని తేలింది. 'ప్లాస్మోడియం ఫాల్సిఫేరం' అనే మలేరియా పరాన్నజీవి థాయిలాండ్‌, బర్మా ప్రాంతాలలో విజృంభిస్తుందనీ, అది అతి శక్తివంతమైన మందులకూ లొంగడం లేదనీ చెబుతున్నారు. ప్రస్తుతానికి 'ఆర్తెమైసినిన్‌' మందు తప్ప మరో శక్తివంతమైన మందు కూడా ఈ రకం మలేరియాకు లేదు. పైగా, కొత్త మందులేవీ పరిశోధనలో చూడలేకపోవడం వల్ల రానున్న రోజుల్లో ఈ మహమ్మారిని నియంత్రించడం కష్టమైన పనిలాగే కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి మలేరియా చికిత్సలో మనల్ని పదిహేను సంవత్సరాల వెనక్కి నెట్టేస్తుంది. ఆర్తెమైసినిన్‌ కనుగొనకముందు క్లోరోక్విన్‌ అనే మందు బాగా పనిచేసేది. కానీ, 70వ దశకంలో మలేరియా జీవి ఈ మందుకీ లొంగని విధంగా మారిపోయింది. మరి ఏదీ పరిష్కారం? పరిశోధనల్ని ఉధృతం చేయాల్సిందే..!! మరో ప్రత్యామ్నాయం లేదు మరి..!!!

No comments:

Post a Comment