తరచుగా వీటిని తీసుకునేవారికి ఊబకాయం వస్తుంది. టైప్-2 మధుమేహమూ రావచ్చు. పళ్ల మధ్య ఖాళీలు ఏర్పడతాయి. కెఫిన్ వల్ల ఆందోళన కర మనస్తత్వం పెరుగుతుంది. కలతనిద్ర అధిక మవుతుంది. ఇవి అధికంగా తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. పిల్లలు పాలు తాగడానికి ఇష్ట పడరు. దీంతో విటమిన్ డి, బి12, కాల్షియం, మాంసకృత్తులు తగ్గుతాయి. ఫాస్ఫరస్, అధికంగా ఉన్నప్పుడు ఎముకల్లోని కాల్షియం లోపం ఏర్పడి, అవి పెళుసుగా మారతాయి. వీటిని సేవించినప్పు డు దీనిలోని యాసిడ్స్‌వల్ల పళ్లమీద ఎనామిల్ దెబ్బ తింటుంది. అంతేకాదు, పళ్లు పుచ్చిపోతాయి. వీటి వల్ల జీర్ణవ్యవస్థలో రసాయనాల శాతం పెరిగి, ఎసిడిటీ సమస్య వస్తుంది. మన దేశంలోని భూగర్భజలాల్ని ఉపయోగించి, ఈ పానీయాల్ని తయారుచేస్తున్నారు. ఈ జలాల్లో సస్యరక్షణ మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటు న్నాయి. దీంతో ఇవి కూడా కోకోకోలా, పెప్సీకోలాల్లో అధికంగా ఉండి, అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
Thursday, 5 April 2012
కూల్‌డ్రింక్స్..

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment