Thursday, 5 April 2012

వడదెబ్బ తగిలిన ఏం చేయాలి?


నిర్జలీకరణ జరిగిన సందర్భాలలో వడదెబ్బ తగిలిన వ్యక్తిని మొదటగా చల్లని ప్రదేశంలో ఉంచాలి. చల్లని నీరు, దానిలో ఉప్పు, నిమ్మరసం, పంచదార వేసి కలిపి తాగించాలి. మధుమేహం ఉన్న వారికి పంచదారను మొదట బాగా తగ్గించాలి, ఆ తర్వాత పూర్తిగా మానేయాలి. ఈ మిశ్రమ ద్రవాన్ని తరచుగా తాగించాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడవాలి. మజ్జిగలో ఉప్పు, నిమ్మరసం కలిపి తాగించినా ప్రయోజనం కలుగుతుంది.
పండ్లరసాలు కూడా బాధితులు వేగంగా కోలుకోవడానికి దోహదపడతాయి. బత్తాయి, కమలా, పుచ్చకాయి, కర్బూజ, మామిడి పండ్ల రసాలు చాలా ఉపయోగం. అవసరమను కుంటే కొద్దిగా ఉప్పు, పంచదారను కూడా ఈ రసాల్లో కలపవచ్చు. కొంచెం ఉపశమనం తర్వాత ఈ పండ్లను నేరుగా తినిపించవచ్చు.

No comments:

Post a Comment