Thursday, 5 April 2012

వీటిని ఇలా తీసుకోవచ్చు...


* కాచి, వడపోసి, చల్లార్చిన నీరు మంచిది.
* ఉప్పు, నిమ్మరసం కలిపిన చల్లని మజ్జిగ.
* లస్సీ - పెరుగును చిలక్కొట్టి పంచదార లేక ఉప్పు కలిపిన చిక్కటి మజ్జిగ.
* తాజా పండ్లరసాలు మంచిది. అందుబాటులో లేకపోతే నిల్వ పండ్లరసాలు (పండ్లతో చేసినవే) వాడొచ్చు.
* కొబ్బరినీళ్లు, నిమ్మరసం, కమల, ద్రాక్ష, పైనాపిల్‌ (అనాస), సపోటా, మామిడి తదితర పండ్ల రసాలు. వీటిని పాలు (మిల్క్‌ షేక్‌) లేదా మజ్జిగ కలిపి కూడా ఇవ్వొచ్చు.
మీకు తెలుసా..?
* నీరు విశ్వపానీయం - యూనివర్శల్‌ డ్రింక్‌.
* మన శరీరం నుండి రోజుకు కనీసం రెండున్నర లీటర్ల నీరు ఆవిరైపోతుంది. శ్వాస, చెమట, మూత్రం తదితరాల ద్వారా ఈ నీటిని కోల్పోతాం.
* ఎక్కువ వ్యాయామం, ఆటలు ఆడినా శరీరంలో 'నిర్జలీకరణ' కలుగవచ్చు.
* నీటివల్ల కలిగే అనారోగ్యాలు.. అతిసార, కలరా, విషజ్వరా లు (టైఫాయిడ్‌ వంటివి), కామెర్లు, తరచుగా వస్తాయి. నీరు ఎక్కువగా తీసుకోవాల్సిన సమయంలోనే నాణ్యమైన నీరు అందుబాటులో లేనివారికి ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి.

No comments:

Post a Comment