ఈ దినోత్సవాన్ని మొదట 1992, బ్రెజిల్‌లో జరిగిన 'అత్యున్నత
స్థాయి భూగోళ సమావేశం (ఎర్త్ సమ్మిట్)'లో కెనడా ప్రతిపాదించింది. దీనిని
ఐక్యరాజ్య సమితి 2008లో అధికారికంగా గుర్తించింది. మహాసముద్రాల రక్షణ ఒక
జీవన విధానంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘమైన,
శాశ్వతమార్పులు తీసుకురావడానికి 2011-12లో దీన్ని 'యువకులు - మార్పుకోసం
వచ్చే కొత్త అలలు' అనే లక్ష్యంతో నిర్వహించాలని ప్రకటించింది. పర్యావరణ
సమస్యలపై వీరికి గల ఆసక్తి, అవగాహన ఈ సమయంలో దృష్టిలో ఉంచుకోవడం జరిగింది. ఈ
సందర్భంగా ఐక్యారాజ్యసమితి ప్రధానకార్యదర్శి సందేశమిస్తూ 'సముద్రాల
పర్యావరణ పరిరక్షణ బాధ్యత' మనందరిపై ఉందని, ఈ వనరులను జాగ్రత్తగా
వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. మానవ సంక్షేమంలో సురిక్షతమైన,
ఆరోగ్యకరమైన ఉత్పత్తినివ్వగల మహా సముద్రాలు, సముద్రాలు మన ఆర్థిక భద్రతకు,
సుస్థిరాభివృద్ధిలో అంతర్గత భాగమని ఆయన నొక్కి చెప్పారు.
No comments:
Post a Comment