బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం ఉపకరణాన్ని
రూపొందించారు. నడిచేటప్పుడు మన శరీర కదలికల్ని ఉపయోగించుకుని విద్యుత్‌ను
ఉత్తత్తిచేసే పరికరాన్ని వాళ్ళు తయారుచేశారు. మోకాలిపై అమర్చుకునే వీలున్న ఈ
పరికరం నడిచేటప్పుడు మోకాలి కదలికల మూలంగా విద్యుత్‌ని విడుదల చేస్తుంది.
ఆల్ట్రాసౌండ్ స్కానర్లు, సోనార్ సెన్సార్లలో ఉపయోగించే 'పీజో
ఎలక్ట్రిక్' పదార్థాలని వాడి దీనిని తయారుచేశారు. ఇప్పటికి ఈ పరికరం రెండు
మిల్లీవాట్ల విద్యుదుత్పత్తి చేయగలదు. కానీ, కొద్దిపాటి మార్పులుచేస్తే
ఇది 30 మిల్లీవాట్ల విద్యుత్‌ను విడుదల చేసే వీలుందని అంటున్నారు.
విపరీతంగా బరువున్న బ్యాటరీలను మోసుకెళ్ళే మిలిటరీలో ఈ పరికరం బాగా
ఉపయోగపడుతుందని దీని సృష్టికర్తలు అంటున్నారు.
No comments:
Post a Comment