Share
విజ్ఞాన వీచిక డెస్క్
Wed, 27 Jun 2012, IST
నిత్యం మంచుతో ఉండే అంటార్ట్కికాలో పెంగ్విన్‌లు
రాజ్యమేలుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వాటి ఉనికికే ప్రమాదం వాటిల్లేట్టుంది.
అందంగా ఉండే ఈ నాలుగు అడుగుల ఎత్తు పక్షులు సముద్ర మంచుపైనే గుడ్లు
పెడతాయి. పొదుగుతాయి. పిల్లల్ని సాకుతాయి. గుడ్లు పెట్టే సమయంలో మంచు గనక
లేకపోతే వాటి సంతానోత్పత్తి సన్నగిల్లుతుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటార్ట్కికా మంచుని సైతం క్రమేపీ
కరిగిస్తున్నాయి. ఇదే ఇంకొంతకాలం కొనసాగితే సముద్ర మంచు సన్నగిల్లి,
పెంగ్విన్‌ల ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా
వేస్తున్నారు. ఇప్పటికే అంటార్ట్కికా తీరప్రాంతం అయిన 'టెఏ అదేలీ'లో
పెంగ్విన్లు తగ్గుముఖం పట్టినట్టు ఫ్రెంచ్ పరిశోధకులు గమనించారు. 1970వ
దశకంలో 150 పక్షులు గుడ్లకు సిద్ధం కాగా, 1999లో కేవలం 20 జతలు మాత్రమే
కనిపించాయి. 2009 కల్లా ఒక్క పక్షి కూడా రాలేదు. ఒక ప్రత్యేక వాతావరణంలోనే
మనుగడ సాగించగల ఈ జీవులు వాతావరణ మార్పులతో సతమతమై కనుమరగయ్యే ప్రమాదముంది.
No comments:
Post a Comment