మన సౌర కుటుంబం ఉంటున్న ఒక గేలాక్సీ పాలపుంత, మరో భారీ
గేలాక్సీ 'అన్ద్రోమెడ' రెండూ ఢీ కొట్టుకునే అవకాశం ఉందని అంతరిక్ష
పరిశోధకులు అంటున్నారు. అన్ద్రోమెడలో 2002, 2010లో ఒకే నక్షత్రాన్ని
కనుగొన్న బాల్టిమోర్‌లోని పరిశోధకులు ఆ గేలాక్సీ పాలపుంత మీదికి
వస్తున్నట్టుగా కనిపెట్టారు. అన్ద్రోమెడ ప్రస్తుతం 2.5 మిలియన్ కాంతి
సంవత్సరాల దూరాన ఉంది. అది పాలపుంత మీదకు గంటకు 2,50,000 మైళ్ల వేగంతో
వస్తోంది. ఈ రెండు గేలాక్సీలూ ఏకమైతే మన సూర్యుడు స్థానభ్రంశం చెంది మొత్తం
సౌర కుటుంబం విచిత్రంగా విడిపోతుందని కొంతమంది లెక్కలు కట్టారు. అయితే, ఈ
మహాకూటమి జరగడానికి మరో నాలుగు బిలియన్ సంవత్సరాల కాలం పడుతుందట!
No comments:
Post a Comment