గత వందేళ్లుగా భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంది.
అందుకు కారణాలు అనేకమున్నా, ఆ పెరుగుదల కొన్ని జంతువులకు ప్రాణాంతకమయ్యే
ప్రమాదకరంగా గోచరిస్తోందని పరిశోధకులు అంటున్నారు. వాతావరణంలో వేడి
పెరుగుతూ పోతే జంతువులు మరొక వీలైన ప్రదేశానికి తరలిపోవడం ప్రకృతి లో
మామూలుగా జరుగుతున్న విషయం. అయితే, ఇటువంటి వీలు అన్ని జంతువు లకీ ఉందని ఈ
మధ్య తెలిసింది. అమెజాన్ వంటి వర్షారణ్యాలలోని జంతువులు వాతా వరణం మారేంత
వేగంగా తమ నివాస స్థలాన్ని మార్చుకోలే వని వెల్లడైంది. అలా తమ నివాసాన్ని
మార్చుకోలేని పక్షంలో అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. పది కంప్యూటర్
ప్రోగ్రాంలతో ఇప్పటికీ, 2100కీ మధ్య జరిగే వాతావరణ మార్పులు, వాటి వేగాన్ని
అంచనా వేశారు. అలాగే, జంతువులూ తమ స్థావరాన్ని మార్చే ప్రక్రియనూ అంచనా
వేసి, ప్రతి వంద జంతువులలో తొమ్మిది ప్రాణాపాయస్థితిలోకి చేరుకుంటాయని
నిర్థారించారు. పెరుగుతున్న వేడితో అన్నిటికీ సమస్యే.
No comments:
Post a Comment