'హెచ్5ఎన్1' ఇన్ఫూయెంజా అనే బర్డ్‌ఫ్లూ వ్యాధి కొన్ని
సంవత్సరాల క్రితం మనల్ని ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతానికి ఈ వ్యాధి
పక్షుల నుండి మాత్రమే మనకి వ్యాపిస్తుంది. కానీ, ఆ వైరస్ మరో రెండు, మూడు
రూపాంతరాలు చెందితే దీని వ్యాధి నేరుగా మానవుడి నుండి మానవు లకు
వ్యాపించగలదట! ఇప్పటికే ఈ లక్షణాలు అక్కడకక్కడ కనిపించాయి. ఒక ఐదు
ఉత్పరిణామాలు (మ్యూటే షన్లు) జరిగితే, హెచ్5ఎన్1 వైరస్ గాలి ద్వారా
మానవులకు వ్యాపించే రకంగా రూపొందుతుందట. ప్రస్తుతానికి, ఆ ఐదు
ఉత్పరిణామాలలో రెండు జరిగిపోయాయి. అయితే, మిగతా మూడు ఎప్పటికీ పూర్తవుతాయో
శాస్త్రజ్ఞులు అంచనా వేయలేకపోతున్నారు. ఆ ఉత్పరిణామాలు రాకుండా
జాగ్రత్తపడలేమా?
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
No comments:
Post a Comment