పెరుగుతున్న జనాభా, అడవులు, మడ అడవుల నరికివేత, విస్తరిస్తున్న సేద్యం జీవవైవిధ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. ఇటీవలకాలంలో ఉదృతంగా ప్రవేశపెడుతున్న బిటి సాంకేతిక విజ్ఞానం ఆయా పంటల్లో జీవవైవిధ్యాన్ని బాగా తగ్గిస్తుంది. నిరంతరం కొనసాగిస్తున్న నీటిప్రాజెక్టుల నిర్మాణం జీవవైవిధ్యాన్ని తగ్గిస్తున్నాయి. లోయల్లో నిర్మించే పెద్ద రిజర్వాయర్ల (ఉదా: సర్దార్ సరోవర్, సైలెంట్ వాలీ) వల్ల అపార జీవవైవిధ్యాన్ని, కొన్ని జాతుల్ని కోల్పో యాం, కోల్పోతున్నాం. ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర కట్టడాల వల్ల కొన్ని జాతులు తమ నివాస స్థలాల్ని పూర్తిగా లేక పాక్షికంగా కోల్పోతున్నాయి. వున్న పెద్ద నివాసస్థలాలు చిన్నచిన్నవిగా విడిపోతున్నాయి. ఫలితంగా స్థానికంగా జరిగే పునరుత్పత్తి పెరిగి, జీవవైవిధ్యం క్షీణిస్తుంది.
ఒక నివేదిక ప్రకారం మన దేశంలో ఇప్పటికే 19 జాతులు పూర్తిగా అంతరించాయి. మరో 1236 జాతులు ప్రమాదంలో ఉన్నాయి. వీటిలో 41 వర్గాలకు సంబంధించిన జీవజాతులు సహజ పర్యావరణంలో అంతరించాయేమోనని భావిస్తున్నారు. 152 అంతరించిపోయే దిశలో ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. 251 జాతుల్లో సంఖ్య బాగా తగ్గింది. వీటి లో కొన్నింటిని మాత్రమే అప్పుడప్పుడు చూడగలుగుతు న్నాం. చిరుతపులులతో సహా 23 జంతువులు సహజ వాతావరణంలో దాదాపు అంతరించిపోయాయి.
No comments:
Post a Comment