ప్రపంచవ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయని పరిశోధనలు
చెబుతున్నాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇటువంటి ప్రక్రియ జరుగుతోందని
అంటున్నారు. ఈ తరహా తగ్గుదల మన దేశంతో సహా కాలిఫోర్నియా, చైనా, మధ్య
ప్రాచ్య ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉందని తేలింది. అందుకు కారణం ఈ నీటిలో
విస్తరిస్తున్న వ్యవసాయమే అంటున్నారు. 'కారు' అంత పరిమాణంలో ఉండే రెండు
ఉపగ్రహాల సాయంతో ఈ అధ్యయనం చేశారు. సహజంగా భూగర్భజలం నిండే ప్రక్రియకన్నా
మనం దానితోడి వాడే వేగమే ఎక్కువ. అందువల్ల ఇటువంటి దుష్పరిణామం ఏర్పడింది
అని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య మరింత జటిలం కానుంద నీ వాళ్ళు
హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులు కూడా ఇందుకు ఒక కారణం. రానున్న
రోజులలో భూగర్భ నీటిమట్టం మరింత దిగజారుతుందని వీరు ఆందోళనపడుతున్నారు.
No comments:
Post a Comment