ఈ మధ్య క్యాన్సర్ రావడానికి కారణాలు పెరుగుతున్నట్టు
అనిపిస్తున్నాయి. తాజాగా డీజిల్ ఇంజన్ల నుండి వెలువడే ఉద్గారకాలు
క్యాన్సర్‌ను కలిగిస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఈ అనుమానం
1988లోనే ఉన్నా, దీనిని నిర్ధారించడానికి ఇప్పటికి వీలైంది. సిగిరెట్ పొగ
పీల్చడంకంటే డీజిల్ వాహనాలు వెదజల్లే పొగవల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్
వచ్చే ప్రమాదం ఎక్కువ అని ఇపుడు తేల్చారు. అంతేకాకుండా దీనివల్ల మూత్రకోశ
క్యాన్సర్ కూడా వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. డీజిల్ నాణ్యతను
మార్చితే ఇటువంటి ప్రమాదాలు తగ్గుతాయా అనే విషయంపై ఇంకా తర్జనభర్జనలు
కొనసాగుతున్నాయి. కానీ, అటువంటి మార్పువల్ల మానవులకి జరిగే నష్టం మాత్రం
పెద్దగా తగ్గదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment