Wednesday, 20 March 2013

ఊపిరితిత్తులకు ‘పొగ’ పెట్టొద్దు..

  • -డా అజయ్‌సింగ్ ఠాగూర్ ఆలీవ్ హాస్పిటల్, మెహిదీపట్నం

 
 
  సిగరెట్లు మానేసిన మూడు నెలల తరువాత మీ ఊపిరితిత్తుల్లోని సీలియా అనే కేశసాదృశ్యమైన నిర్మాణాలు
సమర్థవంతంగా పనిచేయటం మొదలెడతాయి. దీంతో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన తార్ వంటి మలినాలు
కఫంతోపాటు వెలుపలికి దగ్గుతోపాటు బయటకు వచ్చేస్తాయి. దీని తరువాత మీరు బస్ కోసం పరుగెత్తినా, మెట్లు
ఎక్కినా ఆయాసం రాదు. -్ధమపానం ఆపిన తరువాత ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి. పది ఏళ్ళ తరువాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు కనీసం యాభై శాతం తగ్గుతాయి. -సిగరెట్లు మానేసిన ఏడాది తరువాత గుండె జబ్బులు వచ్చే అవకాశం సగానికి సగం తగ్గుతుంది (ఇతర ధూమపాన ప్రియులతో పోలిస్తే)
పదిహేను సంవత్సరాల తరువాత దాదాపు మీరు సిగిరెట్లు అలవాటు
ప్రారంభం నుంచి లేనివారితో సమానమైపోతారు-ప్రస్తుతం భారతదేశంలో ధూమపానం చేసేవారికంటే చేయనివారే ఎక్కువ. ధూమపానం మానేస్తే మీరు కూడా అత్యధికులు ఎంచుకున్న మార్గంలోకి వస్తారు.
-మనదేశంతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో క్రమంగా ధూమపానం చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
మనం అన్ని విషయాల్లోనూ విదేశాల మోజులోపడి ప్రభావితమవుతున్నపుడు ఈ విషయంలో మాత్రం ఎందుకు ప్రభావితం కాకూడదు? -బార్లలోనూ, రెస్టారెంట్లలోని స్మోక్ ఫ్రీ జోన్స్ అనేవి ఉంటున్నాయి. ఇలాంటి రెస్టారెంట్లను ఆదరిస్తే క్రమంగా అందరు యజమానులు ఈ దిశగా ఏర్పాటు చేస్తారు. -సిగరెట్లు మానేసిన కొన్ని గంటల్లోనే
మీ శరీరం నుంచి ప్రమాదకరమైన కార్బన్‌మోనాక్సైడ్ గ్యాస్ బహిర్గతమైపోతుంది. రెండు మూడు నెలల తరువాత మీ ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేయటం మొదలెడతాయి. హాయిగా, ఊపిరితిత్తుల నిండుగా గాలి
పీల్చుకోగలుగుతారు.
Courtesy with: Andhra Bhumi

పరీక్షల్లో భయం పోవాలంటే...?

  • డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, సెల్‌నెం. 9440229646, E-mail: drpsreedhar@ymail.com
 
 
           బాగా చదివినప్పటికీ పరీక్షల సమయంలో సహజంగానే ఎక్కువమంది మానసిక ఒత్తిడికి గురై పరీక్షలు సరిగా రాస్తామోలేదో అని భయపడుతుంటారు. పరీక్ష హాలులోకి వెళ్ళగానే కొందరు ప్రశ్నపత్రం చూడకముందే ఆందోళనతో చెమటలు వచ్చి భయపడిపోతుంటారు. ఇలా పరీక్షలంటే భయపడేవారికి హోమియోలో మంచి మందులున్నాయి మందులతో పాటు వీరిలో ఆత్మవిశ్వాసం పెంపొందించటానికి కౌన్సిలింగ్ లాంటివి ఇస్తే ‘్భయాన్ని’ అధిగమించి పరీక్షలు సక్రమంగా రాయగలుగుతారు.
భయానికి కారణాలు
నెగెటివ్ ఆలోచనా విధానంతో పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. చదివినవి వస్తాయో రావో.. చదివినవి వచ్చినా సరిగ్గా రాస్తానో లేదో... అన్నీ గుర్తుకు వస్తాయో రావో... మంచి మార్కులు రాసిన వాటికి వేస్తారో లేదో.. తక్కువ మార్కులు వస్తే ఎలా? అని పరీక్ష రాయకముందే ఆలోచన చేస్తూ భయపడుతుంటారు.
కొందరు సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కాకపోవడం, పరీక్షల సమయానికి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ పూర్తిగా చదవకపోవడం, ఆయా సబెక్ట్స్‌కు చెందిన స్టడీ మెటీరియల్ పరీక్షల సమయానికి అందుబాటులో లేకపోవడం.
భయం - లక్షణాలు
-చెమటలు పట్టడం, కాళ్లు చేతులు వణుకు రావడం
-ఆకలి తగ్గి ఆహారం సరిగా తీసుకోకపోవడం
-ఆలోచనలతో నిద్ర పట్టకపోవడం
-మాటలు తడబడటం. ఎవరితో సరిగా మాట్లాడకపోవడం
-చదువుమీద శ్రద్ధ లేకపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం
-వీరి ప్రవర్తన బాధ్యతా రహితంగా ఉంటుంది.
-చిరాకు, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటుంది.
-ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం
-ఏకాగ్రత లోపించడం, తలనొప్పి రావడం
-తమలో తామే బాధపడటం వంటి లక్షణాలతో ఉంటారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
మానసిక ఒత్తిడికి లోనై భయపడే పిల్లలను గుర్తించాలి. వారి భయానికి కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిరాకు పడకుండా పరీక్షల భయాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. అవసరమైతే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి కౌనె్సలింగ్ లేదా సలహాలను ఇప్పించాలి. పరీక్షల సమయంలో పిల్లలకు మంచి పోషక ఆహారం అందించాలి. పరీక్షలకు అవసరమైన అన్ని విషయాలకు సంబంధించి పుస్తకాలు పిల్లలకు అందుబాటులో వుండే విధంగా చూడాలి.
పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి. వారిని భయపెట్టి చదివించే ప్రయత్నం చేయకూడదు. వారికి చదువుమీద శ్రద్ధ కలిగించే ఆదర్శవంతమైన మంచి మాటలు చెప్పి చదివించే ప్రయత్నం చేయాలి.
ఇలా బయటపడాలి.. పరీక్షల భయంతో బాధపడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఒంటరిగా ఉండకుండా మిత్రులతో గడపటం, అంతర్మథనాలకు దూరంగా ఉండడం, భావోద్వేగాలను, ఆలోచనలను అభిప్రాయాలను అణిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయులతో, తల్లిదండ్రులతో పంచుకోవడం వంటివి చేస్తే భయం నుండి తొందరగా బయటపడవచ్చు. అలాగే హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, పరీక్షల భయం నివారణకు నిత్యం యోగా, మెడిటేష్‌తోపాటు సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలి. నెగెటివ్ ఆలోచన విధానాన్ని విడనాడి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని మంచి జీవన విధానాన్ని అలవరచుకొనుటకు విద్యార్థులు ప్రయత్నం చేయాలి.
చికిత్స.. వీరిని వెంటనే గుర్తించి నలుగురితో కలిసి ఉండే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. పరిసరాలను మార్చడం వంటివి చేస్తూ హోమియో మందులను వాడి ప్రయోజనం పొందవచ్చును. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి వుంటుంది. కావున మానసిక రుగ్మతలకు హోమియో ఒకవరం. మందుల ఎంపికలోకూడా మానసిక శారీకతత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగుతుంది కనుక సమూలంగా రుగ్మతలను నయం చేయడం సాధ్యం అవుతుంది.
మందులు.. ఎకోనైట్:పరీక్షలకు ముందు ‘టెన్షన్’ పడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరికి మానసిక స్థాయిలో ఆందోళన, అస్తిమితం, ఉద్వేగపూరితమైన భయానికి లోనవుతారు. వీరికి నాడి వేగంగా, బలంగా కొట్టుకుంటుంది. వీరు భయంతో చనిపోతామన్న భావనకు గురవుతారు. వీరికి జన సమూహం, చీకటి అన్న ఎక్కువగా భయం. భయంతో వీరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.
జెల్సిమియం.. విద్యార్థులు పరీక్షలంటేనే భయపడిపోతారు. పరీక్ష హాలుకు వెళ్లాలంటే తత్తరపడిపోతారు. తత్తరపాటుతో విరేచనాలు కావడం ఈ రోగి యొక్క గమనించదగిన ప్రత్యేక లక్షణం. పరీక్షలంటేనే వణుకు, దడ, తలనొప్పి మొదలవుతుంది. మూత్రవిసర్జన అనంతరం తలనొప్పి తగ్గిపోవుట ఈ రోగి యొక్క మరొక విచిత్ర విశిష్ట లక్షణం. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
అర్జెంటం నైట్రికం: వీరికి ఏ పని తలపెట్టాలన్నా గందరగోళం పడిపోతుంటారు. రేపు పరీక్షలంటే ఈ రోజు రాత్రి వీరికి నిద్రపట్టదు. పరీక్ష హాలుకు ఒక గంట ముందే వెళ్లి కూర్చోవాలనిపిస్తుంది. వీరు పరీక్షకు వెళ్ళే ముందు విరేచనానికి వెళ్తారు. ‘ఎగ్జామినేషన్ ఫంక్’కి ఇదిమంచి ఔషధం. మానసిక స్థాయిలో ఈ రోగికి పంచదార, తీపి అంటే ప్రాణం. వీరు లిఫ్ట్‌లో వెళ్లాలన్నా రోడ్డుమీద నడవాలన్నా, వంతెన దాటాలన్నా భయాందోళనకు గురౌతారు. ఇటువంటి లక్షణాలతో పరీక్షలంటే భయపడే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
నైట్రోమోర్: వీరు భయంతో దిగులుగా కనిపిస్తారు. చిన్న చిన్న విషయాలపట్ల కూడా ఉద్రేకపడతారు. వీరు ఓదార్పును ఇష్టపడరు. జాలి చూపిస్తే కోపం తెచ్చుకునే వాళ్లకు ఈ మందు ఆలోచించదగినది. తలనొప్పితో బాధపడే పిల్లలకు ఈ మందు ముఖ్యమైనది. జ్ఞాపకశక్తి తగ్గి మతిమరుపుతో బాధపడుతుంటారు. వీరు వౌన స్వభావులు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా కాల్కేరియాఫాస్, జెన్సింగ్, సెఫియా, ఫాస్ఫారస్, బెల్లడోనా, కాల్కేరియా కార్బ్, సల్ఫర్, జింకంమెట్, ఆరంమెట్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకొని పరీక్షల భయం నుండి విముక్తి పొందవచ్చును.
Courtesy with: Andhra Bhumi