Saturday, 13 April 2013

వేసవిలో వేధించే - కిడ్నీ స్టోన్స్

  • డాక్టర్ పావుశెట్టి శ్రీధర్

ప్రస్తుత కాలంలో అనేకమంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. వేసవికాలంలో ఈ
సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత
పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉండటమే. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి
శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గకుండా చూస్తూ జీవకార్య నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని
విసర్జిస్తాయి. రాళ్లకు కారణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో
కొన్ని ముఖ్యమైనవి మూత్రావయవాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్.. నీరు తగినంతగా తాగకపోవడం, ఆహారపు
అలవాట్లు కొన్ని జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్లు. రాళ్లల్లో రకాలు మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో కొన్ని
ముఖ్యమైన రకాలు కాల్షియం ఆగ్జలేట్స్,  కాల్షియం ఫాస్పేట్, సిలికా స్టోన్స్, యూరిక్ ఆసిడ్ స్టోన్స్
మొదలైనవి. మూత్రపిండాల్లో రాళ్లను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే యూరినరీ
ట్రాక్ట్‌లో ఆటంకం ఏర్పడి మూత్ర వ్యవస్థ సమస్యలు తీవ్రమవుతాయి. లక్షణాలు
మూత్రపిండాల్లో తయారయ్యే రాళ్లు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. ఇవి మూత్రనాళం ద్వారా
మూత్రాశయంలోకి చేరే ముందు నొప్పి తీవ్రంగా ఉంటుంది. రాళ్లు నునుపుగాకాక వివిధ
కోణాకృతుల్లో ఉండటంవల్ల అవి జారేప్పుడు లేదా కదిలినప్పుడు మూత్రకోశానికి గుచ్చు
కోవడంవల్ల నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. రాళ్లు కోశానికి గుచ్చుకోవడం వల్ల రక్తస్రావం
జరుగుతుంది కనుక మూత్రంలో రక్తం వెలువడుతుంది.
జాగ్రత్తలు
* మద్యం ఇతర మత్తుపానీయాలు సేవించకూడదు. టీ, కాఫీలు మానేయాలి.
* మాంసాహారం తగ్గించాలి.
* పొగాకు ఉత్పత్తుల వినియోగం, ధూమపానం త్యజించాలి.
* ఫాస్ట్ఫుడ్స్, మసాలాలు, నూనెపదార్థాలు ఉప్పు ఎక్కువగా వాడటం వంటివి తగ్గించాలి. వీటిని
   వీలైతే పూర్తిగా మానుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.
* సాత్వికాహారం తీసుకోవాలి.
* తగినంత నీరు తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల నీరు త్రాగాలి.
* ద్రవపదార్థాలు పండ్లు, తాజాకూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
  చికిత్స:
            వ్యాధి నిర్థారణ జరిగిన ప్రారంభ దశలో హోమియో మందులను వాడితే
            శస్త్ర చికిత్సనుండి నివారణ పొందవచ్చును.
* అరుదుగా రాళ్లు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఇటువంటివారికి హోమియో మందులను
   తత్వానుసారం వాడిన పదేపదే రాళ్లు రాకుండా ఆగిపోతాయి.
   మందులు
            లైకోపోడియం: కుడివైపు కిడ్నీలో ఏర్పడే రాళ్లకు ఈ మందు  ఆలోచించదగినది.
                                 కుడి కిడ్నీ వైపు నొప్పివస్తుంటుంది. మూత్రాన్ని గమనిస్తే
                                 ఇటుక రంగులో ఉంటుంది. ఈ పర్సనాలిటీ వ్యక్తులు చూడటానికి
                                 సన్నగా కనపడతారు. వీరు దైనందిన జీవితంలో ఆచి తూచి అడుగు
                                 వేస్తారు.  మానసిక స్థాయిలో కొంచెం భయస్తులు. భయం వలన
                                 సామర్థ్యం ఉన్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తారు. ఇలాంటి
                                 వ్యక్తులకు ఈ మందు ముఖ్యమైనది.
      బెర్బెరీస్ వల్గారీస్:  ఎడమ కిడ్నీ వైపు నొప్పి ప్రారంభమై ముందుకు వ్యాపిస్తుంది. నొప్పి
                                  మంటతోకూడి భరించలేకుండా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి,
                                  ఎడమ వైపు కిడ్నీలో ఏర్పడే రాళ్లకు ఈ మందు ఆలోచించదగినది.
      ఎపిస్:                   కిడ్నీలో రాళ్లవలన ఇన్‌ఫెక్షన్‌కు గురై మూత్ర విసర్జన బాధాకరంగా
                                  ఉంటుంది. మూత్రం పోసే సమయంలో మంట, చురుక్కుమని గుచ్చు
                                  కున్నట్లు నొప్పితో బాధపడటం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు
                                  తప్పక ఆలోచించదగినది.
       టెరిబెంటైనా:          మూత్రం నల్లగా ఉండి చుక్కలు చుక్కలుగా వస్తుంది. మూత్రం
                                  తరుచుగా ఎక్కువసార్లు పోస్తూ ఉంటారు. మూత్రం ఎరుపు రంగులో
                                  ఉండి మంటగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ మందు
                                  వాడుకోదగినది.
      బెల్లడోనా:               నొప్పి తీవ్రంగా ఉండి, ఏ మాత్రం కదిలినా నొప్పి వస్తుంది.
                                  ఇలాంటి సందర్భాల్లో ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.
                                  ఈ మందులే కాకుండా హైడ్రాంజియా, నక్స్‌వామికా, తూజా,
                                  మెర్కురియస్, ఫాస్ఫారస్, టాబాకమ్ వంటి మందులను లక్షణ
                                  సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన
                                  యెడల మూత్రపిండాల్లో తయారయ్యే రాళ్లకు శస్తచ్రికిత్స లేకుండా
                                  విముక్తి పొందవచ్చు.

COURTESY  WITH : Andhra Bhumi

Monday, 1 April 2013

గురుత్వాకర్షణను లెక్కచేయని గింజ


           ఒక అడుగు పొడవుగల దారాన్ని తీసుకోవాలి. ఒక కొనకు వేరుశనగ గింజను కట్టాలి. టేబుల్ అంచుకు రెండవ కొనను టేపు సహాయంతో అతికించాలి. అంచునుండి వేలాడదీసిన దారం రెండవ కొననుండి గింజ కింది వైపు వేలాడుతూ ఉంటుంది.
ఒక రబ్బరు బెలూన్‌ను గాలితో ఊదిన దానిని తీసుకోవాలి. దానిని ఉన్ని లేదా ఊలు లేదా మీ తలమీద గల పొడి జుట్టుతో రుద్దాలి. ఇప్పుడు బెలూన్ విద్యుదావేశితం కాబడుతుంది. దానిని వేరుశనగ గింజవద్దకు తీసుకురావాలి.
వేరుశనగ గింజను బెలూన్ ఆకర్షిస్తుంది. అయితే ఈ రెండూ కలవకుండా ఉండే విధంగా బెలూన్‌ను తగినంత దూరంలో ఉంచాలి. ఆ రెండూ కలిస్తే అనవసరంగా వాటి నడుమ విద్యుదావేశం బదిలీ అవుతుంది. ఇప్పుడు బెలూన్‌ను పైకి ఎత్తుతూ తీసుకువెళ్లాలి. వేరుశనగ గింజ కూడా బెలూన్‌తోపాటు గురుత్వాకర్షణను లెక్కచేయకుండా పైకిలేస్తుంది.
వేరుశనగ గింజ తటస్థ విద్యుదావేశం కల్గినది. అంటే దానిలో ధన, ఋణ విద్యుదావేశాలు సమంగా విస్తరించబడి ఉంటాయి. దీని దగ్గరకు ఋణ విద్యుదావేశంగావించబడిన రబ్బరు బెలూన్ తీసుకురాబడినది. ఇది వేరుశనగ గింజలోని ధనావేశాలను బెలూన్ వున్న వైపు ఆకర్షిస్తుంది. ఈ రెండు వ్యతిరేక విద్యుదావేశాలు ఆకర్షించుకుంటాయి.
వేరుశనగ గింజ, దానిని వేలాడ దీసిన దారం తేలిగ్గా ఉండడం వలన బెలూన్, గింజల నడుమ ఆకర్షణబలం ఇటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది.

Courtesy With: Andhra Bhumi

కాఫీ తాగితే... హృద్రోగం మాయంప్రొద్దున్నే వేడివేడి కాఫీ తాగందే.. బుర్ర పనిచేయదు. ‘కెఫెన్’ అనే పదార్థం వొంటికి అంత మంచిది కాదనీ..
అదే పనిగా కాఫీ తాగేస్తూంటే -లేనిపోని సమస్యలొస్తాయన్న మాట పక్కనపెట్టి - ప్రతిరోజూ రెండు
మూడు కప్పుల వేడి కాఫీ తాగటంవల్ల మహిళల్లో ‘హృద్రోగం’ ఛాయలు 19 శాతం కనిపించలేదని
యుఎస్ శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు.  83,076 మంది మహిళలపై జరిపిన పరిశోధనల ద్వారా
 ఈ సంగతి వెల్లడించారు. వీరంతా గతంలోవిపరీతంగా సిగరెట్లు తాగేవారు.. లేదా అస్సలు తాగని
 వారై ఉన్నారు. పొగ పీల్చేవారిలో 3 శాతం.. పీల్చని వారిలో 43 శాతం పురోభివృద్ధి కనిపించినట్టు 
 తెలిపారు. ఏది ఏమైతేనేం - కాఫీ తాగటంవల్ల హృద్రోగాన్ని పారద్రోల వచ్చునన్నమాట.

Courtsey With : Andhra Bhumi Daily