మనస్తత్వ శాస్త్రము

PSYCHOLOGY


పోరాడితేనే విజయం దక్కేది! 

  • 15/02/2012
  •  | 
  • -వాసిలి వసంతకుమార్,

‘‘ఏరా! ఏం చేస్తున్నావ్?’’ అని అడిగాను- ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రుడ్ని.
‘‘ఏముంది.. పడుతూ లేస్తూ పోరాటం సాగిస్తున్నాను’’ అన్నాడు.
‘‘అదేమిటి? మంచి ఉద్యోగం, మంచి సంపాదన... ఇంకా పోరాటం దేనికి?’’ అన్నాను.
‘‘అవును. మంచి ఉద్యోగమే. మంచి సంపాదనే. అయినా పోరాట తత్వాన్ని
వదులుకోలేకపోతున్నాను’’ అన్నాడు క్లాస్ ఒన్ ఎంప్లాయ్ అయిన నా మిత్రుడు.
‘‘అర్థం కావటం లేదు’’.
‘‘ఉద్యోగం మంచిదే! నేను మంచి ఉద్యోగిగా ఉండాలంటే అనేక అడ్డంకులను
తొలగించుకుంటుండాలి. ప్రతీ రోజూ నా ఛాంబర్‌లోకి అడుగుపెట్టేలోపు అనేక
కోరచూపుల్ని జీర్ణించుకోవలసి ఉంటుంది. కనిపించని ముళ్లను ఎన్నింటినో
సమయస్ఫూర్తితో ఏరుకుంటూ పోవాలసి ఉంటుంది. ఎన్నోవిధాల ఒళ్లు దగ్గర
పెట్టుకోవలసి ఉంటుంది. ఇలా ఉద్యోగంలోనే కాదు- జీవితంలో సైతం అనేక దిశల
విజయాన్ని సాధించాలంటే పోరాడుతూ పోవలసిందే. ఆగితే ఎటునుండయినా
అపజయం దండెత్తవచ్చు. ఆగి ఆగి అడుగులేసే వాడినే ఆపద తరుముకొస్తుంటుంది.
పరిగెత్తేవాడినే విజయం ముందుండి మార్గం చూపిస్తుంటుంది’’.
మిత్రుడు చెప్పుకుపోతుంటే If there is no struggle, there is no progress
అన్న ఫ్రెడరిక్ డగ్లస్ మాటలు గుర్తుకువచ్చాయి.
ఉద్యోగంలోనయినా, వ్యాపారంలో నయినా, విద్యాభ్యాసంలోనయినా పోరాడక తప్పదు.
ఒక్కసారి విజయ పథాన్ని అందుకున్నవారికి గెలుపు మత్తు ఏమిటో తెలుస్తుంది.
ఈ మత్తెక్కినవారు జోగరు. పోరాటతత్వంతో రగిలిపోతుంటారు.
‘‘స్ట్రగుల్.. స్ట్రగుల్... స్ట్రగుల్’’ అనే పదం మంత్రంలా ఉచ్ఛరిస్తున్నంతకాలం పోరాడాలి అనే
అగ్గిలోనుంచి రాజుకుంటూనే ఉంటుంది. అది మంట పుట్టిస్తుంటుంది. నిలకడగా కూర్చోనివ్వదు.
ఆ మంట ఎంతలా నిన్ను దహించివేస్తుంటే అంతలా అభివృద్ధి సాధ్యమవుతుంది.
అప్పుడు ‘పదండి ముందుకు.. పదండి ముందుకు’ అంటూ ఎవరూ నీ వెంట
పడనవసరం లేదు. నీకు నువ్వుగానే నడక ప్రారంభిస్తావు. పరుగు అందుకుంటావు.
గమ్యాన్ని, గమనవేగాన్ని నిర్దేశించుకుంటావు. అలా అభివృద్ధి అనేది నీ పోరాట పటిమపై
ఆధారపడి ఉంటుంది.
ఈ విషయంలో ‘విజేత’లందరూ మనకు స్ఫూర్తిప్రదాతలే. ఎన్నోసార్లు విజయం వారిని
వరించినా మరోమారు పోరాటానికి సిద్ధమై కొత్త పంథాలో ఆలోచిస్తుంటారు. విజయాన్ని
మళ్లీ కొత్తదిగానే పరిగణిస్తుంటారు. అంతెందుకు ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా,
మరో అధికార సంపన్నుడైనా ఈ పోరాటతత్వం లేనిదే ఆ పీఠాన్ని అధిష్ఠించలేరు..
ఆ పదవిలో కొనసాగలేరు.
ఒక్కసారి మీరూ విజేతకండి! పోరాటతత్వం ఎంత రుచికరంగా ఉంటుందో మీకే తెలిసివస్తుంది.
================
ప్రతి ఒక్కరూ ఆశించేది -సక్సెస్. పనిలో, ప్రణాళికలో, చదువులో, మానవ సంబంధాల్లో..
ఇలా మనిషి కోరుకునేదే -సక్సెస్. అది కొనుక్కుంటే దొరికేది కాదు, కష్టపడి సాధించుకోవలసింది.
ఆ కష్టం గుడ్డిది కాకుండా ఉండాలంటే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలి. వాటిని ఆచరణలో
పెట్టేందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. అవే -వ్యక్తిగత ప్రతిభకు గీటురాళ్లవుతాయ.
సక్సెస్‌కు మార్గాలు వేస్తాయ. విశిష్ట వ్యక్తులుగా నిలబెడతాయ. ఆ లక్షణాలను అక్షరాలుగా
అందించేందుకే -విజయం. అనుమానాలుంటే డాక్టర్ వాసిలి వసంతకుమార్‌ను అడగండి.
ఠక్కున సమాధానమిస్తారు. ఇంకెందుకు ఆలస్యం పోస్టు కార్డు రాయండి. లేదా మెయిల్
పంపించండి.. అడ్రస్..
ఎడిటర్,
(విజయం) యువ, ఆంధ్రభూమి,
36, సరోజిని దేవి రోడ్, సికిద్రాబాద్
______________________________________________________________

సక్సెస్... అంతంకాని ఆరంభం 

  • 15/02/2012
  •  | 
  • -వాసిలి వసంతకుమార్, drvaasili@yahoo.co.in: 9393933946

‘‘టెన్త్‌లో ఫస్ట్ క్లాస్ రావటమే నా గమ్యం అనుకున్నాను. ఇంటర్‌లో ఎయిటీ పర్సెంట్
తెచ్చుకుని బీటెక్‌లో విజయగర్వంతో చేరాను. కాంపస్ సెలక్షన్‌తో హండ్రెడ్ పర్సెంట్
సక్సెస్ అయ్యాను. నౌ ఐయామ్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సెన్...’’ -సంతోషంగా చెప్పుకుపోతున్నాడు
ఫోన్‌లోని కుర్రాడు. పేరు మైత్రేయారెడ్డి. పులివెందులనుంచి మాట్లాడుతున్నాడట.
సమాధానాన్ని ‘యువ’లో చూసుకోమని సెల్ సంభాషణకు ముగింపు పలికాను.
‘సక్సెస్’ అంటే ఏమిటి? మంచి మార్కులతో డిగ్రీ చేతబట్టుకుని, ఉద్యోగం వచ్చేసినంత
మాత్రాన ‘సక్సెస్’ అయినట్లా? సంపాదిస్తున్నంత మాత్రాన సక్సెస్‌ఫుల్ పర్సెన్
అయిపోయినట్లా? సహచరితో సంసారంలోకి అడుగుపెడితే సక్సెస్ టాగ్ తగిలించుకోవచ్చా?
-ఇలాగయితే ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ సక్సెస్‌ఫుల్ పర్సెన్ అయితీరాలి! కానీ అందరూ
సక్సెస్‌ఫుల్ అనుకోవటం లేదే! అసలు సక్సెస్‌ను నిర్వచించుకోలేక చతికిలపడుతున్న
వారెందరు లేరు? ఇంతకీ సక్సెస్ అనే పదానికి అర్థం నిఘంటువులో వెతుక్కోవాలా?
జీవితం నుంచి చేదుకోవాలా?
దళ యౄఒఆ ఒఖషషళఒఒచిఖ ఇఖఒజశళఒఒ్ఘౄశ జఒ ఆ్దళ ఘౄశ త్ద్యీ ద్యజూఒ
యశఆ్య ఆ్దళ యజూ ఖఒఆ ఘఒ యశ ఘఒ జఆ జఒ య్యజూ, శజూ ఘూఇఒ
ఆ్దళ శళతీ ఖఒఆ ఘఒ ఒ్య్యశ ఘఒ జఆ జఒ ఇళఆఆళూ అంటాఢు రాబర్ట్
వాండర్‌పోల్. పడుకునేంతవరకూ నిన్నంతా సంతృప్తికరంగానే సాగింది. మళ్లీ సూర్యోదయంతో
కొత్తగా సుస్నాతులం కావలసిందే. వర్తమానానికి ప్రతినిధిగా మిగలాల్సిందే. నిన్న
వాతావరణం బాగానే వుంది. ఈ రోజూ బాగానే ఉండవచ్చు.. రేపూ ఇలాగే ఉంటుందన్న
గారంటీ లేదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని జీవించేవారే ‘సక్సెస్‌ఫుల్ పర్సెన్’ అవుతారు.
ఉద్యోగం సంపాదించటం సక్సెస్ అనుకుంటే అది ఒక ఆరంభం మాత్రమే. ఆ ఉద్యోగంలో
మేనేజర్ మెప్పు పొందటం గిఫ్టే. ఆరు నెలలకే ప్రమోషన్ అనేది ఒక బోనస్. ఇవన్నీ
సక్సెస్‌తో జత కలిసే బాధ్యతలు. సక్సెస్ అనేది ఒక సర్ట్ఫికెట్ అయితే ఆ సర్ట్ఫికెట్‌తో
మురిసిపోకుండా మరో సర్ట్ఫికెట్ కోసం ప్రయత్నించడం గెలుపు మార్గం. వర్తమానంలో
గెలవటం ఎంత ముఖ్యమో రేపూ గెలవాలనుకోవటం అంతే ముఖ్యం. రేపు సైతం ఒక
వర్తమానమే అయినపుడు గెలుపు ఎప్పటికప్పుడు ఒక ఆరంమే అవుతుంటుంది.
గెలవటానికి ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఒక్కో మైలురాయినీ దాటుకుంటూ
పోవటం ఒక్కో గెలుపే తప్ప ఆ ఒక్క గెలుపుతోనే జీవితం సంపూర్ణం కాదు.
సక్సెస్ అనేది హైవే వంటిది. అది లైఫ్‌లాంగ్ జర్నీ. ఒకవిధంగా డెస్టినేషన్ లేని జర్నీ.
మరొక విధంగా ఒక సర్క్యులర్ జర్నీ. ప్రయాణించటంలోని ఆనందం తెలిసినవాడికి
డెస్టినేషన్‌తో పని ఉండదు. ప్రయాణిస్తూండటమే డెస్టినీ. ప్రారంభం ఉంటుంది. ప్రయాణం
సాగిస్తూంటాం. ప్రయాణం సాగుతూనే ఉంటుంది. స్టేషన్లు వస్తూనే ఉంటాయి. సమయానికి
ఆకలి తీరుతూనే ఉంటుంది. దాటిన స్టేషన్ మళ్ళీ కనబడదు. ఇలా భూప్రదక్షిణ చేయటానికి
ఈ జన్మ సరిపోదు. ఒక్కో స్టేషన్ చూస్తూ గమ్యం చేరామనుకోవటం సక్సెస్ కాదు.
ప్రతీ స్టేషన్ చూస్తూ గమ్యం చేరామనుకోవటం సక్సెస్ కాదు. ప్రతీ స్టేషన్ కొత్తదే.
ప్రతీ సక్సెస్ సంతృప్తిని మిగులుస్తూనే ఉంటుంది. అయినా ప్రయాణం కొనసాగుతూనే
ఉంటుంది. సరదాగాను ఉంటుంది. మరో స్టేషన్ చేరేవరకు ఆతృతగానూ ఉంటుంది.
ఆ ఆరాటమే సక్సెస్ తత్వం. అంతేకానీ సంతృప్తిపడటం సక్సెస్ సూత్రం కాదు.
ఈ తత్వం తెలిస్తే విజయ రహస్యం తెలిసినట్లే!
గడియారంలో పనె్నండు దాటిన తర్వాత సెకండ్స్ ముల్లు ఒకటి వైపు కదలాల్సిందే!
ఒకటి దగ్గర ప్రయాణం ప్రారంభించిన ముల్లు మళ్లీ పనె్నండు మీదికి చేరాలంటే అరవైసార్లు
కదలాల్సిందే! అప్పుడే మళ్లీ ఒకటి కనిపిస్తుంది. కదలకుండా కూర్చుంటే మళ్లీ ఆ ఒకటి
కనిపించదు. కదిలిన ప్రతిసారీ సక్సెస్ కదా అనుకుని సంతృప్తి చెందితే మరో సక్సెస్
కనిపించదు. మరో సక్సెస్ మురిపించదు. కాబట్టి సక్సెస్ విషయంలో నిరంతర ప్రయాణం
సాగాల్సిందే. అప్పుడే సక్సెస్ కొత్తగాను, సరికొత్తగాను ఉంటుంది. సరికొత్తది సక్సెస్
అవుతున్నంతకాలం పాతది నేటి సక్సెస్‌కి ఒక ఉపకరణం అవుతుంటుంది. అందుకే
జీవించాలనుకునేవారు వర్తమానంలో బ్రతుకుతుంటారే తప్ప గతాన్ని పట్టుకు వేలాడరు.
ఈ వర్తమాన జీవులే ఎప్పటికీ సక్సెస్‌ఫుల్ పర్సెన్స్.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తొంభై తొమ్మిదిసార్లు సెంచరీలు సాధించి సంతృప్తి
పడుతూనే వచ్చాడు. అయినా ఆరాటం తగ్గలేదు. తపన తగ్గలేదు. ఎంతో అనుభవం
 సంపాదించినా, ప్రపంచ మైదానాలలో మేటి ఆటగాడు అనిపించుకున్నా మరో సక్సెస్
ముందు తడబడుతూనే ఉన్నాడు. కారణం ప్రతీ సక్సెస్ మరో ప్రారంభమే. మరో కొత్త
అనుభవమే. ఈ తడబాట్లు, పొరబాట్లు ప్రతీ సక్సెస్‌లోను అంతర్భాగమే అనుకోగలిగిననాడు
అహంకారాలు, అహంభావాలు ఉండవు. ‘సక్సెస్’ అనుకుంటూ శాటిస్‌ఫై కావటమూ ఉండదు.
కాబట్టి మైత్రేయా! నీ సక్సెస్ ఒక చిగురింత వంటిది. నీది అంతం కాని ఆరంభం. నీ సక్సెస్
ఇంకా కేరాఫ్ అడ్రస్‌లోనే ఉంది. రేపు స్వంత ఇల్లు కట్టుకున్నా నీ చిరునామా మాత్రం కేరాఫ్
భూగోళమే! రేపటి నీ సక్సెస్‌కి ఈనాటి సక్సెస్ కేరాఫ్ కావాలి. తడబడకుండా ప్రయాణం సాగించు.
_______________________________________________________________

చదువుతున్నారా?

  • 01/02/2012

ఈ నాలుగు అక్షరాలూ చదువుతున్నారంటే, మీకు చదవడం అలవాటని అర్థం! మరి చదవడం
గురించి మీకు ఒక ప్రణాళిక, పద్ధతి ఉన్నాయా? గమనించండి!
ఏం చదువుతున్నారు? ఎందుకు చదువుతున్నారు?: పరీక్ష కోసం చదువుతున్నారా? విషయం
నిజంగా తలకెక్కాలని చదువుతున్నారా? ఈ రెండూకాక కేవలం కాలక్షేపం కోసమేనా? కథలూ,
నవలలను కూడా సీరియస్‌గా చదవవచ్చునని మీకు అనిపించిందా?
చదువుతున్నది తలకు ఎక్కుతున్నదా?: కళ్లు కదులుతుంటాయి. పేజీలు తిరుగుతుంటాయి.
ఒక్క క్షణమాగి, గడిచిన పేజీలో ఏముందో గుర్తుతెచ్చుకుందామంటే, అంతా ఖాళీగా కనబడుతుంది.
కథను కూడా ఈ పద్ధతిలో చదవకూడదు. చివరికి దాని రుచి మనకు అందక తలనొప్పి పుడుతుంది.
ఇక చదువుతున్నది నిజంగా ‘చదువు’లో భాగమైతే, చదివిన ప్రతివాక్యం మెదడులో ముద్రవేయాలి.
కనుక మెదడుతో చదవాలి. మనసు పెట్టి చదివింది అరగంటయినా గుర్తుంటుంది. చదివే విషయం,
దానికిగల సంబంధం తెలుస్తూ ఉంటుంది.
మననం చేసుకోవడం మంచిది: గడిచిన పేజీలో ఏముంది? అది సినిమాలాగ కళ్లముందు కదలాలి.
ఖాళీ తెర ఎదురయితే, పుస్తకం కింద పెట్టి, మనసును మెదడును మళ్లీ వాటి అసలు చోటికి
తీసుకురావాలి! లేకుంటే చదివామన్న సంతృప్తి కూడా మిగలదు. ప్రయోజనం అంతకన్నా మిగలదు.
ఆగకుండా గంటలు చదివితే లాభం లేదు: ఒకసారి కూచుని చదవడం మొదలుపెడితే, కనీసం గంట
అయ్యేసరికి బ్రేక్ ఇవ్వడం మంచిది. ఆ ఖాళీలో మనకు తెలియకుండానే మెదడు, అంతవరకు చదివిన
 విషయాలను మరోసారి రివ్యూ చేస్తుంది. ఆ పని, మనం తెలిసి చేస్తే మరింత బాగుంటుంది.
లేకున్నా సరే, కొంచెంసేపు తీరిక అవసరం.ముఖ్యమయిన విషయాలను గుర్తించం,
గుర్తుంచుకోవడం ఒక కళ: దారిలో ఉండే ముఖ్యమయిన స్థలాలు గుర్తుంటే, సులభంగా,
వాటి మధ్య ప్రాంతం కూడా సినిమాలాగా కళ్లముందు కదులుతుంది. కథ, నవలలోనయినా
ముఖ్య సంఘటనలు, పాత్రలు, మాటలను గుర్తుంచుకోవాలి. పాఠ్యపుస్తకాలలోనయితే,
చదువు ముందుకు సాగడానికి, ఈ ముఖ్యాంశాలు, మెట్లలాగా సాయపడాలి. ఒకదాని
తరువాత ఒకటిగా వాటి వరుస గుర్తుంటే, తిరిగి గుర్తుకు తెచ్చుకుని జవాబులు ఇవ్వడం
సులభం. పరీక్ష సంగతి పక్కనపెట్టి, అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ క్రమం
ఎంతో అవసరం.ఏ రకమయిన చదువైనా సరదాగా సాగాలి. బలవంతపు చదువు దండగ!
చదువుతున్న ఆనందం ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తుంటే చాలా బాగుంటుంది!

No comments:

Post a Comment