Thursday 27 March 2014

చిప్స్‌, కోక్‌, క్యాడ్‌బరీస్‌     
                 మన సమాజంలో అతి తక్కువ ఆలోచించేది పిల్లల గురించి. అదేమిటి, తల్లిదండ్రులు ఇవాళా, రేపూ తాము అపురూపంగా కని పెంచుతున్న ఒకరిద్దరు పిల్లల్ని గురించి తప్ప మరేమీ ఆలోచించటం లేదే- అలాంటి పిల్లల గురించి ఎవరూ ఆలోచించట లేదనటం పొరపాటు కదా అనుకుంటున్నారా? తల్లిదండ్రులు తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు. దాని గురించి కాదు మేం మాట్లాడేది. ఒక సమాజంగా, పోనీ ఒక సమూహంగా పిల్లల హక్కుల గురించి, వారి బాల్యానందాల గురించి, వారు మోస్తున్న బరువుల గురించి, మరీ ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవటం చాలా తక్కువ. ప్రస్తుత పౌరుల గురించి పట్టించుకోటానికి తీరికలేని ప్రభుత్వాలు భావి పౌరుల గురించి నిర్లక్ష్యంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? వారికి ఓటుహక్కు కూడా లేదాయె-
కానీ అప్పుడప్పుడూ, ఏ బాలల దినోత్సవం రోజునో, ఐక్యరాజ్యసమితి పంపిన నివేదికలో, ఆదేశాలో, ఒప్పందాలో చూసినప్పుడో ప్రభుత్వానికి పిల్లలు గుర్తొస్తారు. ఏదో ఒక రూలు వాళ్ళ గురించి పాస్‌ చేసి చేతులు దులుపుకుని ''అబ్బా చివరికి పిల్లలు కూడా మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ పిల్లలు పాడుగాను'' అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. ఈ మధ్య ప్రభుత్వం నిద్రలేచి చేసిన ఒక ఆలోచన ఏమిటంటే, పాఠశాలల్లో గానీ పాఠశాలల పరిసర ప్రాంతాల్లోగాని చెత్త ఆహార పదార్థాన్ని (జంక్‌ఫుడ్‌ అని ముద్దుగా పిలుస్తారు ఇంగ్లీషులో) అమ్మకుండా నిషేధించాలని. పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టే పనికిమాలిన చిరుతిండ్లుగా ప్రభుత్వం కొన్ని పదార్థాల్ని బాగానే గుర్తించింది. చిప్స్‌, బాగా నూనెలో వేయించిన రకరకాల పదార్థాలు, కోకా కోలా వంటి పానీయాలు, చాక్లెట్లు, బర్గర్లు, సమోసాల వంటి వాటిని పాఠశాల లోపల నడిపే క్యాంటిన్లలో గానీ, పాఠశాలకు యాభై మీటర్ల దూరంలో ఉన్న దుకాణాలలోగాని అమ్మకూడదని ప్రభుత్వం చాలా స్పష్టంగానే చెప్పింది. పిల్లలు ఈ పిచ్చి తిళ్ళు తినకుండా ఆరోగ్యంవంతమైన ఆహారం తినేలా ప్రోత్సహించాలనీ, దానికి అన్ని పాఠశాలలకీ వర్తించే విద్యా పాలసీగా రూపొందించాలనీ ప్రభుత్వం అనుకుంటోంది. అనుకోవటం, చెప్పటం, కాగితాల మీద రాసి సంబంధిత శాఖలలకు పంపటం ఇవన్నీ చాలా తేలిక. ఎవరికి తెలియని విషయాలు గనుక కానీ అమలు చేయటం ఈ వ్యాపార ప్రపంచంలో ఎంత కష్టమో రోజూ టి.వి చూసే వారందరికీ తెలుసు. ఆరోగ్యం సంగతలా ఉంచండి. పేద పిల్లల కోసం పెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎలా విఫలమైందో మనకు తెలుసు. ఇది ఆ పిల్లల కోసం కాదు.
యాభై సంవత్సరాల వయసు దాటిన వారందరికీ ఒక రుచికరమైన జ్ఞాపకం ఉంటుంది. స్కూల్ల్లో పొద్దున రీసెస్‌ బెల్‌ కొట్టగానే, మధ్యాహ్నం 'లంచ్‌బెల్లు' కొట్టగానే, సాయంత్ర 'ఇంటిబెల్లు' కొట్టగానే స్కూలు గేటు బైటకి పరిగెత్తేవాళ్ళం. అక్కడ బుట్టలో రకరకాల చిరుతిళ్ళు పెట్టుకుని ఒక ముసలమ్మో, ఒక ముసలయ్యో, లేదా చలాకీగా ఉండే కుర్రవాళ్ళో పిల్లల కోసం రెడీగా ఉండేవాళ్ళు వేరుశనక్కాయలు, జీడిలు, ఉప్పు శనగలు, నిమ్మతొనలు, బఠానీల వంటి పాటితోపాటు సీజన్‌ని బట్టి దొరికే జామకాయలు, తేగలు, ఉప్పు, కారం రాసిన మామిడికాయ ముక్కలు, ఉసిరి కాయలు - అబ్బా రాస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి- పిల్లలు ఆ బుట్టల చుట్టూ మూగి ఏదో ఒకటి కొనుక్కొని మళ్ళీ బెల్లు కొట్టే లోపల వాటిని నమిలేసి ఆ రుచితో రెట్టించిన ఉత్సాహంతో క్లాసులకు వెళ్ళే వాళ్ళు. కొనుక్కోటానికి డబ్బులేని వాళ్ళకు స్నేహితులు పిసరంత పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ దృశ్యాలు దాదాపు అదృశ్యమై పోయాయి. ఆ ముసలమ్మలు ఇప్పుడు దేవాలయాల ముందు అడుక్కోవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. సరే వాళ్ళ సంగతి మనం ఆర్చగలిగేది, తీర్చగలిగేది కాదు. పిల్లల సంగతి ఆలోచిద్దాం.
ఇప్పుడు పిల్లల దగ్గర డబ్బులు దండిగానే ఉంటున్నాయి. చిరుతిళ్ళ కోసం ఆశపడకపోతే వాళ్ళు పిల్లలే కాదు. మరి ఇంత అందమైన, ఆకర్షణీయమైన, చురుకైన 'బాల్యం' అనే మార్కెట్‌ని చూస్తూ చూస్తూ మల్టీ నేషనల్‌ కంపెనీలు ఒదులుకుంటాయా? టి.విల్లో పూర్వం ఆడవాళ్ళ శరీరాలను ఆకర్షణీయంగా చూపి అమ్ముకునే వస్తువుల ప్రకటనలే ఉండేవి. ఇప్పుడు ప్రకటనల నిండా పిల్లలే. అది బట్టల సబ్బయినా, పియర్స్‌ సబ్బయినా, పిల్లలే కనపడి ముచ్చట గొలుపుతారు. ఇక చిప్స్‌, చాక్లెట్లు, నూడిల్స్‌ వంటి వాటి సంగతి చెప్పేదేముంది. అందమైన పిల్లలు వాటిని తింటుంటే, వారి ఆనందం చూస్తుంటే పెద్దల కడుపు నిండుతుంది. పిల్లల కోరిక పెరుగుతుంది. అర్జంట్‌గా చాక్లెట్ల ఆకలి, చిప్స్‌ ఆకలి, కోక్‌ దాహం కలిగి వాటిని తీర్చుకుంటారు. ఈ చిప్స్‌, ఇంకా అలాంటి పదార్థాల్లో ఎమ్‌ఎస్‌జి కలుపుతారు. దాంతో ఇక పిల్లలు ఆ రుచికి బానిసలవుతారు. పెద్దలూ మినహాయింపు కాదు. ఎమ్‌ఎస్‌జి ఎడక్టివ్‌- దాని రుచి మరిగితే ఒదిలించుకోవటం కష్టం. ఇట్లాంటి ఆహార పదార్థాలు విచ్చలవిడిగా మార్కెట్‌లోకి ఒదిలి, వాటిని ఇంత బాగా ప్రచారం చేస్తూ పిల్లలు వాటిని తినకూడదని, స్కూళ్ళలో అమ్మగూడదనీ నిషేధించటం కుదిరే పనేనా? అందరికీ సమానమైన, ఒకే విధమైన ప్రాథమిక విద్య గురించిన పాలసీనే లేదు. ఆరోగ్యకరమైన ఆహారం గురించి స్కూలు స్థాయిలో ఒక విద్యా పాలసీ ప్రవేశపెట్టటం సాధ్యమయ్యే పనేనా?
పిల్లలు బడి ఆవరణలో ఇడ్లీలు, దోశెలు కొనుక్కొని తింటారనుకోవటం అమాయకత్వం. వెర్రితనం. వాటిని ఇళ్ళల్లోనే తినటం లేదు. పైగా ప్యాకెట్లలో దొరికే వాటికి లేని ప్రమాదం వీటికి ఉంది. ఈగలు, దోమలు తదితర బాక్టీరియాలు తాకకుండా వీటిని పిల్లలకు సురక్షితంగా అందించగలిగిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఎన్ని పాఠశాలల్లో కనీసపు పారిశుధ్యానికి మనం హామీ ఇవ్వగలం? పిల్లలకేంటి, పెద్దలకేంటి అందరికీ అంగడి సరుకులంటే, నూనె సరుకులంటే మనసు లాగుతుంటుంది. వాటిని ఇళ్ళల్లో తయారు చేసుకునన్నా తింటాం. లేదా ఏ పెళ్ళిళ్ళల్లోనో తింటాం. పిల్లలు కాబట్టి బజార్లోవైనా సరే కొనుక్కుని తినాలనుకుంటారు. పెద్దలను విసిగించి కొనుక్కుతింటారు. ఆరోగ్యం పాడు చేసుకుంటారు. పెద్దలు ఆస్పత్రులు, మందులూ అంటూ మళ్ళీ ఇంకో కొత్త మార్కెట్‌కి బలిపశువులవుతారు.
దీనిని ప్రభుత్వ ఉత్తర్వులు ఆపలేవు. ప్రజలే, తల్లిదండ్రులే ఒక సమూహంగానో, సంఘంగానో ఏర్పడి సమస్య తీవ్రత గురించి ఆలోచించాలి. ఎంత తీవ్రమైన సమస్య కాకపోతే ప్రభుత్వం నామమాత్రంగానైనా దీని గురించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో పడుతుంది. పిల్లలు ఊబకాయంతో ఉండటం, చురుగ్గా లేకపోవటం, తరచు అనారోగ్యాల పాలవటం, చిన్నతనంలోనే మధుమేహం వంటి వ్యాధుల బారిన పడటం, పోషకాహార లోపంతో కంటి చూపు మందగించటం, పళ్ళు పుచ్చిపోవటం ఇంకా సవాలక్ష ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనం - ఔను మనమే కాపాడుకోవాలి. టి.విలలో కనపడే బొమ్మల్లాంటి అందమైన పిల్లల్ని మైమరచి చూసే అమ్మలూ, నాన్నలు, అమ్మమ్మలూ, తాతయ్యలూ ఆలోచించండి. ఆరోగ్యం ఒక హక్కు. మన పిల్లల ఆరోగ్య హక్కును హరించి వేస్తున్న వారి గురించైనా మనం పట్టించుకోమా? ఆదివాసీల భూముల్ని అక్రమ మైనింగుల కోసం లాక్కొంటున్న కంపెనీలు, రైతుల భూముల్ని సెజ్‌ల పేరుతో లాక్కొంటున్న కంపెనీలు - అవన్నీ చాలా పెద్ద విషయాలు, మనకు అనవసరమైన విషయాలు. మనవల్ల కాని విషయాలు. కానీ మనం బతికేదే మన పిల్లల కోసం గదా- ఆ పిల్లల ఆరోగ్యం గురించైనా పట్టించుకుందాం పట్టండి. ఏమో తీగ లాగితే డొంకంతా కదుల్తుందేమో

Sunday 23 March 2014

ఈ దధీచి ఎముకనే సృష్టిస్తున్నాడు




      దధీచి అనే మహర్షి తన వెన్నెముకనే వజ్రాయుధంగా చేసి ఇంద్రుడికి ఇచ్చాడంటారు. కానీ బిక్రమ్‌ జిత్‌ బసు ఎముకనే సృష్టించి జనారోగ్యరంగానికి ఒక గొప్ప ఆయుధంగా అందిస్తున్నాడు. నిజమైన ఎముకలా పనిచేసే ఈ ఎముక వైద్యరంగంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ.
        అక్కడికి వెడితే జనసందోహంతో కోలాహలంగా ఉండే బెంగళూరులో ఉన్నామనిపించదు. అది చాలా చల్లగానే కాక, నిశ్శబ్దంగా కూడా ఉంది. అందులో ఒక వ్యక్తి తన వృత్తికి సంబంధించిన పరికరాల మధ్య పచార్లు చేస్తున్నారు. అవి మరేవో కావు, జీవకణాలు, ఒక మైక్రోస్కోప్‌, ఒక ఆవిరి పాత్ర, పరికరాలను శుభ్రంగా ఉంచడానికి ఒక అతినీలలోహిత కిరణాల చాంబర్‌, రిఫ్రిజరేటింగ్‌ యూనిట్లు. అవన్నీ బయోలజీతో ముడిపడిన వన్న సంగతి తెలుస్తూనే ఉంది. బయోలజీ పని జీవపదార్థాన్ని శోధించడమే. 'ఇది మీకు ఒక మెడికల్‌ లేబరేటరీగా కనిపిస్తోంది కదూ?' అన్నాడు, ముసిముసిగా నవ్వుకుంటూ. ఆయన పేరు బిక్రమ్‌జిత్‌ బసు. వయసు 40 ఏళ్లు. ఆయన ఒక ఇంకుబేటర్‌ తెరిచారు. అది అప్పుడే పుట్టిన శిశువును ఉంచిందని అనుకునేరు, కాదు. అందులో 37 డిగ్రీల సెల్సియెస్‌ వద్ద మానవజీవకణాలు పెరుగుతున్నాయి. మానవశరీర ఉష్ణోగ్రత అదే.
ఆయనది 'విద్యుత్‌' భాష
2013లో యువశాస్త్రవేత్తలకు ఇచ్చే శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు ను అందుకున్న బసు, 114 ఏళ్ల చరిత్ర ఉన్న బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సులో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. వైద్యరంగంలో ఒక నూతనశకాన్ని ఆవిష్కరించబోయే ప్రయత్నంలో ఆయన మునిగి తేలుతున్నారు. అది: కృత్రిమ వాతావరణంలో జీవకణాలను అభివృద్ధి చేయడం. అందుకు ఆయన ఉపయోగించే ప్రధాన సాధనం, విద్యుత్తు. మనదేశంలో ఆ రంగంలో కృషి చేస్తున్నవారు చాలా తక్కువ. వారిలోనూ బసు ముందడుగులో ఉన్నారు. ఆయన గురించి ఇంకో విశేషం ఏమిటంటే, ఆయన 12వ తరగతివరకు తన మాతృభాష అయిన బెంగాలీ మాధ్యమంలోనే చదువుకున్నారు.
చిన్నపాటి రెండు గదులు మాత్రం ఉన్న ఆ లేబరేటరీలో డీప్‌ ఫ్రీజర్‌ పరిమాణంలోని ఒక త్రీడీ ప్రింటర్‌ ఉంది. అది సరదాగా ఎవరో ఒక మోడల్‌ కారు తయారుచేయడానికి ఉద్దేశించిందా అన్నట్టుగా ఉంది. అందులో మాగెట్లు, బ్యాటరీలు, ఒక గ్యాస్‌ సిలెండర్‌ ఉన్నాయి. ఇవన్నీ కృత్రిమ పరికరాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్‌ సామగ్రే. ఈ చిన్న లేబరేటరీలోనే బసు విద్యార్థులతో కలసి తన ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. తను ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థేకాక, తనింతకుముందు పనిచేసిన కాన్పూర్‌ ఐఐటి, ఆమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ ఆయన ప్రయోగాలను స్పాస్సర్‌ చేస్తున్నాయి.
ఇంతకీ బసు ప్రయోగాలు ఎలాంటివంటే, ఆయన జీవరహితపదార్థం మీద జీవకణాలను అభివృద్ధి చేస్తూ, వాటితో కొత్త ఎముకల ప్రోటో టైపులు అంటే, మాతృకలు తయారుచేస్తున్నారు. ఇంతేకాదు, ఇదే పద్ధతిలో గుండె, నరాలకు సంబంధించిన జీవకణాలను కూడా ఉత్పత్తిచేసే పనిలో ఉన్నారు. ఆయన పరిశోధనలన్నింటికీ కీలకం విద్యుత్తు. అది కూడా అతి తక్కువ విద్యుత్‌ ప్రసారం. ఇటువంటి విద్యుత్తుతో పనిచేయించడానికి ఎంతో నైపుణ్యం కూడా ఉండాలి. జీవకణాలతో మాట్లాడడానికి బసు ఉపయోగించే భాష ఈ తరహా విద్యుత్తే. జీవకణాలు ఎలా పెరగాలో విద్యుత్తే బోధిస్తుందనడం కొత్త విషయం ఏమీ కాదు. జీవులన్నింటిలోనూ నిరంతరం మంద్రస్థాయిలో విద్యుత్తు ప్రవహిస్తూనే ఉంటుంది. వోల్టేజిలలో మార్పులు చేసి కళ్లు వెనుక వైపు, గుండె మరో చోట ఉండే కప్పలను సైంటిస్టులు ఎన్నో దశాబ్దాలుగా సృష్టిస్తూనే ఉన్నారు.
బసు చేస్తున్నది ఏమిటంటే, కృత్రిమ పరిసరాలలో విద్యుత్తును ఉపయోగించి ఎముకలను, గుండె, నరాలకు చెందిన జీవకణాలను, చివరికి స్టెమ్‌ కణాలను (ఇవి ఇతర రకాల కణాలను కూడా అభివృద్ధి చేస్తాయి) కూడా పెరిగేలా చేయడం. ఇదంత తేలిక కాదు. అపరిచిత పరిసరాలలో జీవకణాలను పెంచడానికి ఎప్పుడు, ఎంత విద్యుత్తును ప్రసరింపజేయాలో బయో ఇంజనీర్‌కు కచ్చితంగా తెలిసి ఉండాలి. కణవిభజన దెబ్బతినకుండానూ, కణాలు చనిపోకుండానూ చూడాలి. 'రెండు కణాలు మాట్లాడుకునేటప్పుడు, మనం ఉపయోగించే పదార్థం అందుకు వెసులుబాటు కలిగించేదిగా ఉండాలి' అంటారు బసు.
నిజమైన ఎముకలా...
ఉదాహరణకు, బసు బృందం మనిషి ఎముకలను తలపించే హైడ్రోగ్జ్యాపటైట్‌ అనే మిశ్రమాన్ని ఎముకల అభివృద్ధిలో ఉపయోగిస్తుంది. ఎముకకు ఉండే మరో స్వభావం ఏమిటంటే, నడవడం వంటి మెకానికల్‌ ఒత్తిడి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం. హైడ్రోగ్జ్యాపటైట్‌ స్ఫటికాలను, టైటానియం, సిల్వర్‌ వంటి రకరకాల సామగ్రితో పులియబెట్టడంలో బసు లేబరేటరీ నైపుణ్యం సంపాదించింది. ఈ ఎముకల నిర్మాణానికి వాడే పదార్థాలనుంచి వివిధ ఆకృతులు అల్లడానికి త్రీడీ ప్రింటర్‌ ఉపయోగిస్తారు. ఈ కృత్రిమ ఎముక నిజమైన ఎముకలా పనిచేయాలంటే, అది విద్యుద్వావహకంగానూ, కఠినంగా ఉంటూనే వంగే విధంగానూ, బరువులు మోసేదిగానూ ఉండాలి. అదే సమయంలో, కొత్త ఎముక కణాలను ఉత్పత్తి చేసుకోగలిగేలానూ, సూక్ష్మజీవుల దాడిని నిరోధించేదిగానూ ఉండాలి. కృత్రిమంగా సృష్టించిన జీవసామగ్రి విజయవంతంగా పనిచేయాలంటే, వాటిని శరీరం తనలో ఇముడ్చుకోగలిగేలా ఉండాలి. ఇలాంటి కృత్రిమ సామగ్రిని శరీరంలో అమర్చినప్పుడు ప్రధానంగా ఎదురయ్యే సమస్య, ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా బ్యాక్టీరియా ద్వారా. ఈ బ్యాక్టీరియా అభివృద్ధిని నిరోధించడానికి బసు బృందం ప్రకృతిలోని మరో శక్తిని రంగంలోకి దింపింది. అది, మేగటిజం. ఈ రకంగా తయారుచేసిన ఎముకను ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఒక ఎలుక తొడ ఎముకలో డ్రిల్లింగ్‌ చేసి రెండు మిల్లీ మీటర్ల వ్యాసార్థం ఉన్న చిన్నపాటి సిలిండర్‌ లాంటి కృత్రిమ ఎముకను అందులోకి చొప్పించారు. అది పాత ఎముకలానే పనిచేయడం ప్రారంభించింది. తదుపరి అడుగు, ఇతర జీవులపై, ముఖ్యంగా మనుషులపై ప్రయోగాలు జరపడమే. అయితే అందుకు మరింత పరిశోధన జరగాలి. అలాగే, అనుమతులు వగైరాలు అవసరమవుతాయి. ఆ దశకు చేరేది 2015 తర్వాతే.
బసు ఇంకో సమస్యను కూడా ఎదుర్కోవాలి. పశ్చిమదేశాల్లో బసు నిర్వహించే లేబరేటరీలాంటివి ఆసుపత్రులకు అనుబంధంగా ఉంటాయి. మనదేశంలో అలా కాదు. ఇక్కడ అంతా కంపార్ట్‌మెంటల్‌ పద్ధతిలో ఉంటుంది. ఇది మా శాఖకాదు, అంటూ ఎవరికి వారు గిరిగీసుకుని కూర్చుంటారు. కనుక ఓ వైపు అసుపత్రులను, ఇంకోవైపు కంపెనీలను బసు సంప్రదించుకుంటూ ఉండాలి. మనదేశంలో ఆసుపత్రులపైన డాక్టర్లపైన కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌, హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటివి ఏవో కొన్ని మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఇవి క్యాన్సర్‌ చికిత్సలోనే స్పెషలైజ్‌ చేస్తున్నాయి. టాటా ఆసుపత్రిలో బసుకు మద్దతుదారుగా ఉన్న ఆర్థోపెడిక్‌ ఆంకాలజీ చీఫ్‌ అజరు పురి పదేళ్ల క్రితం తక్కువ ధరకు లభించే ఒక మెటాలిక్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు. బోన్‌ క్యాన్సర్‌ ఉన్నప్పుడు ఏ రోగికైనా శస్త్రచికిత్స జరిపి ఏదైనా అవయవాన్ని తొలగించినప్పుడు దాని స్థానంలో పురి అభివృద్ధి చేసిన పరికరాన్ని అమర్చవచ్చు. అయితే ఈ పరికరం పూర్తిగా యాంత్రికం కనుక దీని ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. బసు అభివృద్ధి చేసే ఎముక స్వతాహా పెరగగలగడమే కాక, దాని ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉంటుంది.
జనోపయోగంగా...
హైదరాబాద్‌లోని ఎక్సెల్‌ మ్యాట్రిక్స్‌ బయొలాజికల్‌ డివైసెస్‌ సహా వివిధ కంపెనీలు బసు ప్రయోగాలకు ప్రస్తుతం మద్దతు ఇస్తున్నాయి. బసు మాటల్లో ఎంతో ఆశాభావం, పట్టుదల వ్యక్తమవుతుంటాయి. 'ఈ పరిశోధననంతటినీ జనానికి ఉపయోగపడే పరికరాలుగా మార్చడమే నా లక్ష్యం' అంటారాయన. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సులో కొత్తగా ఒక బయోమెటీరియల్స్‌ విభాగాన్ని ప్రారంభించాలని కూడా ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం దానిని పరిశీలిస్తోంది.
దధీచి అనే మహర్షి తన వెన్నెముకనే వజ్రాయుధంగా చేసి ఇంద్రుడికి ఇచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి. బసు కొత్త ఎముకనే సృష్టించి మానవాళి ఆరోగ్యానికి గొప్ప ఆయుధాన్ని ఇవ్వబోతున్నారు. 
' తేనె' లొలుకు ఆరోగ్యం

        గొంతు నొప్పి, జలుబు, పెద్దప్రేగు శోథ, మధుమేహం లాంటి సమస్యలకు విరుగుడు తేనె అని, తేనె ఔషద సుగుణాలను గురించి మన పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాం. ఇప్పుడు బ్యాక్టీరియాను నిరోధించే శక్తి తేనెకు ఉందని తాజా అధ్యయనం తెలుపుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్‌ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో ''వివిధ స్ధాయిలలో బ్యాక్టీరియాను నిరోధించే సామర్ధ్యం ఒక్క తేనెకే ఉందని, ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నిరోధించి రోగనిరోధకశక్తిని పెంచుతుందని'' శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ఆమ్లత్వం, ద్రవాభిసరణ ప్రభావం, అధిక చక్కెర గాఢత, పోలీఫెనాల్స్‌లతో తేనె కలిసినప్పుడు అది ఒక ఆయుధంగా పనిచేసి బ్యాక్టీరియా కణాలను చంపడానికి ఎంతో చురుకుగా పనిచేస్తుందని కనుగొన్నారు. రోగాలకు కారణమయ్యే బ్యాక్టీరియాల తయారీని తేనె నిరోధిస్తుందని మునుపటి అధ్యయనాలు కూడా ధృవీకరించాయి.
తేనెలో ఉండే సాంప్రదాయిక యాంటీ బయోటిక్స్‌ బ్యాక్టీరియా అభివృద్ధి చెందే క్రమంపై దాడి చేయదు. కాని అది అభివృద్ది చెందిన తర్వాత దానిపై దాడి చేస్తుంది. అందుకే మందులలో కూడా తేనెను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తేనె ఎంతో బలవర్ధకమైనది. ఇది శరీరానికి రక్షణ కవచంగా పనిచేసి ఆరోగ్యకరంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తేనెలో ఫినోలిక్‌ ఆమ్లాలు, కెఫిక్‌ యాసిడ్‌, పి-క్యేమరిక్‌ ఆమ్లం, గాలిక్‌ ఆమ్లం లాంటి అనేక రసాయన కారకాలు కూడా ఉన్నాయి. అనేక ఇతర అధ్యయనాలు కూడా సూక్ష్మక్రిములు లేని పెరాక్సైడ్‌కు, యాంటీ ఆక్సిడెంట్లుగల తేనెకు గల సంబంధాన్ని వివరించాయి.
విస్తృతమైన యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్‌ , యాంటివైరల్‌ లక్షణాలు తేనెలో ఉన్నాయని అనేక రసాయనిక ప్రయోగాలు కూడా ధ్రువీకరించాయి. అందుకే తేనె సమర్ధవంతమైన బ్యాక్టీరియా నివారిణిగా కనుగొన్నారు.

Tuesday 18 March 2014

ప్రాచీన కట్టడం - చార్మినార్‌



       






               హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రాచీన కట్టడమైన చార్మినార్‌ కేవలం ఆ నగరానికేగాక మొత్తం భారతదేశానికే ఓ గర్వకారణమైన అంశంగా నిలుస్తోంది.
'ముత్యాల నగరం'గా ప్రసిద్ధి పొందిన భాగ్యనగరానికి ఓ కొండ గుర్తులా నిలుస్తున్న చార్మినార్‌ క్రీ.శ. 1591లో నిర్మించబడింది. అతి భయంకరమైన ప్లేగువ్యాధి నివారణకు ఓ చిహ్నంగా కట్టబడిన ఈ మహా నిర్మాణం ఆ వ్యాధితో అసువులుబాపిన మానవులకు ఓ నివాళిగా నిలవడమేగాక, మొత్తం మానవజాతి అత్మస్థైర్యానికీ ఓ నిదర్శనంగానూ నిలుస్తోంది.
చార్మినార్‌ని మహ్మద్‌ కులీకుతుబ్‌షా అనే చక్రవర్తి కట్టించాడు. అతను తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కి (భాగ్యనగరం) మార్చిన కొంతకాలానికే దీని నిర్మాణం చేపట్టడం విశేషం. ఇప్పుడు హైదరాబాద్‌ ఎంతగానో విస్తరించి, పాతనగరం అందులో ఓ చిన్న భాగమైపోయింది గానీ, అప్పట్లో సరిగ్గా హైదరాబాద్‌ నడిబొడ్డున చార్మినార్‌ వుండేది. గ్రానైట్‌ రాళ్లు, సున్నం, బంకమట్టి, ఇంకా పాలరాతి తునుకలను ఉపయోగించి ఈ అందాల కట్టడాన్ని నిర్మించారు.
చార్మినార్‌ మౌలికంగా ఓ చతురస్రాకారంలో వుంటుంది. ఘనాకృతిలో వుండే ప్రధాన కట్టడంపైన నాలుగు మూలల్లోనూ ఓ నాలుగు పొడవైన శిఖరాలు (మినార్‌లు) వుంటాయి. నేల నుంచి మినార్‌ పైకొస దాకా మొత్తం 48.7 విూటర్ల ఎత్తు వుంటుంది. చార్మినార్‌లో ప్రతివైపున ఉన్న భాగమూ 20 విూటర్ల పొడవుంటుంది. ప్రతివైపున 11 విూటర్ల పొడల్పుతో వుండే ఓ పెద్ద కమాను (ఆర్చీ) వుంటుంది. ఈ కమానుకు చెందిన అత్యున్నత ప్రదేశం నేల నుంచి 20 విూటర్ల ఎత్తులో వుంటుంది.
చార్మినార్‌లోని ప్రతి మినార్‌లోనూ మొత్తం 4 అంతస్తులు వుంటాయి. ప్రతి అంతస్తు చివరన కమానులతో కూడిన నిర్మాణం వుంటుంది. మినార్‌పైకి చేరుకునేందుకుగానూ కింది నుంచి పైకి 149 సర్పిలాకారపు మెట్లు వున్నాయి. చార్మినార్‌ కింది నుంచి పైదాకా, అన్నివైపులా అందమైన వంపులు, డిజైన్లు అనేకం మనకు కన్పిస్తాయి.
చార్మినార్‌ ప్రధాన కట్టడం ఉపరిభాగంలో పడమటి దిక్కున ఓ అందమైన మసీదు ఉంది. కాగా మిగతా భాగాన్ని కుతుబ్‌షాహీ రాజు కాలంలో ఒక దర్బారులా ఉపయోగించేవారు. చార్మినార్‌ మొత్తం మీద ప్రార్ధించుకునేందుకు అనువుగా మొత్తం 45 ప్రదేశాలు ఉండటం విశేషం. ఇకపోతే మొదటి అంతస్తుపైన ఉన్న బాల్కనీ నుంచి చూస్తే చుట్టూ ఉన్న నగరం ఎంతో అందంగా దర్శనమిస్తుంది.
వెన్నెల ఎందుకు చల్లగా ఉంటుంది?














               సూర్య కిరణాలు ఎందుకు వేడిగా ఉంటాయి? సూర్య కిరణాలు కూడా వెన్నెలలాగా చల్లగా ఎందుకుండవు?
- ఎస్‌. జయనాగలక్ష్మి శ్రీవిద్య
     కాంతి ఓ శక్తి రూపం. మన భూమిని చేరే సౌరకాంతి తనంత తానుగా వేడిగా ఉండదు. ఉష్ణశక్తి అనేది మరో శక్తి రూపం. ఇది పదార్థాలలోనే ఉంటుంది. పదార్థాలనే గూళ్లు లేకుండా ఉష్ణశక్తి అనే పక్షులు ఉండవు. కానీ కాంతిశక్తి అలాకాదు. పదార్థాలు లేకున్నా అది మనగలదు. కాంతిని విద్యుదయస్కాంత శక్తి (electromagnetic energy) అంటారు. కాంతిని ఓ పాత్రలోనో, సంచిలోనో, ఏదైనా పదార్థంలోనో స్థిరంగా ఉండేలా దాచుకోలేము. కాంతి నిలకడగా ఉండదు. ఇది ప్రవహించే శక్తి రూపం. కాంతిశక్తిని కాంతి తరంగాల పౌన్ణపున్యం (frequency) ద్వారాగానీ కాంతి తరంగాల తరంగ తీవ్రత (wave intensity) ద్వారాగానీ చెప్పగలం. కాంతికి కణ (particulate) స్వభావం, తరంగ (wave) స్వభావం రెండూ ఏకకాలంలో ఉంటాయి. అందుకే కాంతికి కణ తరంగ ద్వంద్వ స్వభావం (wave-particle duality) ఉంటుందని అంటాము. కాంతి శక్తిని కాంతి కణాల (photons) సంఖ్య ద్వారా చెప్పడం రివాజు. ఉష్ణశక్తిని పదార్థాల్లో నిలువ ఉంచగలం. ఒక పదార్థం బాగా వేడిగా ఉందంటే అర్థం అందులో ఎక్కువ ఉష్ణశక్తి ఉన్నట్లు, అధిక ఉష్ణోగ్రత (temperature) లో ఉన్నట్లు. అంతే బరువున్న అదే వస్తువు చల్లగా ఉందన్నా, తక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నా ఆ పదార్థంలో తక్కువ ఉష్ణశక్తి ఉన్నట్లు అర్థంచేసుకోవాలి. కాంతిశక్తి శూన్యంలోనూ, పదార్థాలలోనూ పదేపదే (లయబద్ధంగా పెరుగుతూ, తరుగుతూ మారే విద్యుత్‌ క్షేత్రం) అయస్కాంతక్షేత్రాల రూపంలో పయనిస్తుంది. అయితే ఉష్ణశక్తి ఏ రూపంలో ఉంటుంది? పదార్థాలలో ఉండే అణువుల లేదా పరమాణువుల చలనమే ఉష్ణశక్తి. అంటే మరోమాటలో చెప్పాలంటే పదార్థాలకు అంతరంగిక నిర్మాణాన్ని (internal structure) కలిగించే పాదార్థిక రూపాల (material constituents) యిన పరమాణువుల, అణువుల యాంత్రిక చలనాల (mechanical motions) లో దాగున్న యాంత్రిక శక్తినే ఉష్ణం అంటారు. కాంతి శక్తిని ఉష్ణశక్తిగా మార్చగలం. కాంతి పదార్థాల మీద పడ్డపుడు ఆ కాంతి శక్తిని గ్రహించి, పదార్థాల ఆంతరంగిక నిర్మాణ దోహదకారులైన అణువుల్లోనూ, పరమాణువుల్లోనూ కదలికలు పెరుగుతాయి. ఒక్కో అణువు ఎన్నో రకాలైన యాంత్రికతలను ప్రదర్శిస్తుంది. ద్రవ వాయువుల్లో అయితే ఈ చలనాలు అటూ యిటూ కదలడం ద్వారా, తిరగడం ద్వారా, డోలనాల ద్వారా ఉంటాయి. ఘనపదార్థాల్లో డోలనాల ద్వారా ఉంటాయి. ఉష్ణశక్తి గురించి, కాంతి శక్తి గురించి ఈ మేరకైనా ప్రాథమిక అవగాహన ఏర్పడితే మీ ప్రశ్నకు జవాబును సులభంగా అర్థంచేసుకోవచ్చును. సూర్యకాంతి చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే అరచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతి మొత్తాన్ని ఆపలేముగానీ అరచేయి మందానికి ఆపగలిగినట్లే. ఏదైనా నిశ్చితమైన వైశాల్యం (given area) గుండా శూన్యంలో దూరే పగటిపూట సౌరకాంతినీ, అంతే వైశాల్యం గుండా వెళ్లే వెన్నెల కాంతినీ పోలిస్తే సౌరకాంతి విలువ కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాంటి సౌరకాంతి భూ వాతావరణంలో ప్రవేశించాక గాలిలోని అణువుల యాంత్రికతను, మన శరీరంలో ఉన్న చర్మపు కణాల్లో ఉండే అణువుల యాంత్రికతను, నేల మీదున్న ప్రతి పదార్థపు అణువుల, పరమాణువుల యాంత్రికతను పెంచుతుంది. తద్వారా ఆయా పదార్థాలు వేడెక్కుతాయి. కాంతిలో ఎంతమేరకు తరంగ తీవ్రత ఉంటుందో, ఎంత ఎక్కువగా కాంతి కణాలు ఉంటాయో అంతమేరకు పదార్థాలలో వేడి జనిస్తుంది. సౌరకాంతిలో ఉన్న కాంతి కణాలు పలు పౌనఃపున్యాల్లో ఉండడమే కాకుండా చాలా తీవ్రమైన సంఖ్యలో ఉండడం వల్ల పెద్ద పదార్థాల్లో చాలా పరమాణువుల, అణువుల యాంత్రికత పెరుగుతుంది. అందుకే మనం సౌరకాంతిని వేసవికాలంలో భరించలేము. మన శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడి, వడదెబ్బ (sun stroke) తగిలే ప్రమాదం ఉంది. కానీ సౌరకాంతి చంద్రుని మీద పడగా చాలాభాగాన్ని చంద్రోపరితలం గ్రహించాక కొంత భాగాన్ని మాత్రమే పరావర్తనం (reflection) చేయగా అది వెన్నెల రూపంలో మనల్ని చేరుతుంది. అది సౌరకాంతితో పోలిస్తే వేల రెట్లు తక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోనూ, శరీరంలోనూ, పదార్థాలలోనూ ఉన్న అణువుల, పరమాణువుల యాంత్రికతల్లో గణనీయమైన పెంపుదలను సాధించలేదు. అందువల్లే వెన్నెల వేడిగా ఉండదు అంటాము. వెన్నెల చల్లగా ఉంటుందనడం అశాస్త్రీయం. కాంతి ఏదైనా అది వెచ్చగానే ఉంటుంది. కానీ సౌరకాంతి చాలా ఎక్కువ వెచ్చగా, చంద్రుని కాంతి చాలా చాలా తక్కువ వెచ్చగా ఉంటుంది.
-   ప్రొ|| ఎ. రామచంద్రయ్య
  సంపాదకులు, చెకుముకి,జన విజ్ఞాన వేదిక

Tuesday 11 March 2014

ఉప్పుతో పళ్ల ఆరోగ్యం


     






                              కొంతమంది మాట్లాడుతున్నా, నవ్వుతున్నా నోటిలో దుర్వాసన వస్తుంది. ఇలా రావడానికి పళ్లు సరిగ్గా బ్రష్‌ చేయకపోవడం, చిగుళ్ల సమస్యతో బాధపడటం, పళ్లపై గారలు ఏర్పడి, ఎన్నిసార్లు శుభ్ర పర్చుకున్నా పోకపోవడం.. వంటి అనేక కారణాలు ఉంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, నోటి దుర్వాసనను నివారించడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం...
కొంచెం ఉప్పు తీసుకొని, దాంట్లో నీళ్లుపోసి, పేస్ట్‌లా చేసుకొని బ్రష్‌తో పళ్లు తోముకుంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టిరియాను చంపే గుణం ఉప్పులో ఉంటుంది కాబట్టి, చిగుళ్లు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఇదెంతో దోహద పడుతుంది. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు ఉప్పు, బేకింగ్‌ సోడా సమానపాళ్లలో కలిపి, పళ్లపొడిని తయారుచేసుకొని, రోజూ పళ్లు తోముకోవడానికి ఉపయోగించవచ్చు. కొంచెం మిరియాలపొడి, పసుపు, ఉప్పు కలిపి, దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి, పేస్ట్‌లా చేసి చిగుళ్లకు రుద్దితే చిగుళ్లు వ్యాధులు తగ్గుతాయి. పళ్లపై ఉండే పచ్చటి చారలు పోవాలంటే స్ట్రాబెర్రీపై కొంచెం ఉప్పు కలిపి పళ్లను తోమాలి. బ్రెడ్‌ను కాల్చి పొడిచేసి అందులో తేనె, కొంచెం ఉప్పు కలిపి పళ్లు తోమాలి. పళ్లు మెరుస్తూ ఉండాలంటే రెండు చెంచాలు ఉప్పు, రెండు చెంచాల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను ఒక పెద్ద గ్లాసెడు వేడినీటిలో కలిపి, పుక్కిలించాలి. పేస్ట్‌పై కొంచెం ఉప్పువేసి తోముకుంటే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
కేవలం కొన్ని వందల నక్షత్రాలే వుండే గెలక్సీలూ వుంటాయా?



         మన విశ్వంలో సుమారు 10 వేల కోట్ల నక్షత్ర మండలాలు (గెలక్సీలు), ఒక్కో నక్షత్ర మండలంలోనూ సగటున 10 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అయితే ప్రతి గెలక్సీలోనూ అన్నేసి కోట్ల నక్షత్రాలు ఉండాలన్న నియమమేదీ లేదు.
సాధారణంగా ఒక నక్షత్ర మండలంలో కొన్ని వేల కోట్లు లేదా కొన్ని వందల కోట్ల నక్షత్రాలయినా వుంటాయి. మన సౌర మండలం ఉన్న పాలపుంతలో 20 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నట్లుగా అంచనా వేశారు. అయితే ఇలాంటి బ్రహ్మాండమైన నక్షత్ర మండలాల చుట్టూ పరిభ్రమించే కొన్ని చిన్న చిన్న నక్షత్ర మండలాలను కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. వీటికి శాటిలైట్‌ గెలక్సీలు (ఉపగ్రహ నక్షత్ర మండలాలు) అని పేరు పెట్టారు. ఇప్పటి దాకా, మన పాలపుంత చుట్టూ తిరుగుతూ వుండే ఇలాంటి 24 చిట్టి నక్షత్ర మండలాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
ఒక్కో శాటిలైట్‌ గెలక్సీలోనూ కొన్ని వందల నుండి కొన్ని లక్షల నక్షత్రాల దాకా ఉంటాయి. శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే కనుగొన్న సెగూ-1 అనే నక్షత్ర మండలంలో కేవలం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే నక్షత్రాలు ఉన్నాయి. మన పాలపుంత కన్నా 100 కోట్ల రెట్లు తక్కువ కాంతివంతంగా వుండే ఈ నక్షత్రమండలంలో ఉన్నవి కొన్ని నక్షత్రాలే అయినా వాటి ద్రవ్యరాశి మాత్రం మనకు కనిపించే దానికన్నా 100 నుంచి 1000 రెట్లు దాకా ఎక్కువగా ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇందుకు కృష్ణ పదార్థమే (డార్క్‌ మేటర్‌) ప్రధాన కారణమని కూడా వారంటున్నారు.
ఇప్పటిదాకా మనం కనుగొన్న నక్షత్ర మండలాల్లో ఈ సెగూ-1 యే అత్యంత కాంతి హీనంగా ఉండటానికి ఈ కృష్ణ పదార్థమే కారణమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏదేమైనా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగిన ట్లుగా పాలపుంత (మిల్క్‌ వే) లాంటి పెద్ద పెద్ద నక్షత్ర మండలాల చుట్టూ మరికొన్ని చిన్న చిన్న నక్షత్ర మండలాలు తిరగడం అనేది చాలా అద్భుతంగా ఉంది కదా!
ఉష్ణోగ్రతల్లో మార్పులతోనే మంచు



మంచు ఎలా ఏర్పడుతుంది?
- బి.రాంబాబు, కాకినాడ
         మనం చూసే పదార్థాల్లో దాదాపు 90 శాతం వరకు సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ఘనస్థితిలో ఉండేవే. నీరు, పెట్రోలు, నూనెలు, సారాయి, పాదరసం వంటివి ద్రవస్థితిలో కనిపిస్తాయి. నైట్రోజన్‌, ఆక్సిజన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌, ఎల్‌పిజి, క్లోరీన్‌, జడ వాయువులు వంటివి వాయుస్థితిలో ఉంటాయి. ఒక పదార్థపు భౌతికస్థితిని నిర్ణయించేది ప్రధానంగా ఆ పదార్థపు ఉష్ణోగ్రత. అయితే పీడనం (జూతీవరరబతీవ) ప్రభావం కూడా బాగానే ఉంటుంది. 25 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత, 760 మిల్లీమీటర్ల పాదరసపు ఎత్తున్న పీడనం ఉండే పరిస్థితుల్ని సాధారణ ఉష్ణోగ్రతా పీడనాలు (చీశీతీఎaశ్రీ ువఎజూవతీa్‌బతీవ aఅస ూతీవరరబతీవ) లేదా చీుూ పరిస్థితులు అంటాము. ఇది శాస్త్రీయంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వచించబడ్డ ఓ నిర్దిష్ట పరిస్థితి. సున్నా డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత, 760 మి.మీ. పాదరసపుటెత్తున్న పీడనం ఉన్న పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక ఉష్ణోగ్రతా పీడనాలు (ూ్‌aఅసaతీస ువఎజూవతీa్‌బతీవ aఅస ూతీవరరబతీవ) లేదా ూుూ పరిస్థితులు అంటారు. ఈ పరిస్థితినే సార్వత్రిక ఉష్ణోగ్రతా పీడనాలు (ఖఅఱఙవతీరఝశ్రీ ువఎజూవతీa్‌బతీవ aఅస ూతీవరరబతీవ) లేదా ఖుూ పరిస్థితులు అని కూడా అంటారు. సాధారణంగా చీుూ పరిస్థితుల దగ్గర పదార్థాల భౌతికస్థితిని ఆయా పదార్థాల స్థితులుగా అందరం గుర్తిస్తాము. ఉదాహరణకు నీరు ద్రవరూపంలో ఉందనీ, బంగారం ఘనరూపంలో ఉందనీ, మీథేన్‌ వాయువు వాయు రూపంలో ఉందనీ అంటారంటే అర్థం చీుూ దగ్గర వాటి భౌతికస్థితిని సూచించడమన్న మాట. అంతేగానీ అన్ని పరిస్థితుల్లోనూ మీథేన్‌ వాయువనీ, నీరు ద్రవమనీ, బంగారం ఘనమనీ అర్థంకాదు. ఉష్ణోగ్రతను -200 సెంటీగ్రేడ్‌ డిగ్రీలకు తగ్గిస్తే (పీడనం 760 మి.మీ. పాదరసపుటెత్తు దగ్గర ఉంచి) జడ వాయువుగా పిలవబడే నైట్రోజన్‌ ద్రవనైట్రోజన్‌ అవుతుంది. అదే పీడనం దగ్గర ఉష్ణోగ్రతను సుమారు 1100 సెంటీగ్రేడు డిగ్రీలకు పెంచితే బంగారం ద్రవమవుతుంది. ఇంకా ఉష్ణోగ్రతను సుమారు 2900 సెంటీగ్రేడ్‌ డిగ్రీలకు పెంచితే అదే ద్రవ బంగారం కంటికి కనిపించకుండా ఇలా ప్రతి పదార్థానికీ, ఆయా భౌతిక పరిస్థితుల్ని బట్టి రూపాలుంటాయి. నీరు సాధారణ చీుూ పరిస్థితుల దగ్గర ద్రవరూపంలో ఉన్నా ఎంతో కొంతమేరకు వాయురూపంలో కూడా ఉంటుంది. ఇలా ప్రతి ద్రవానికి ద్రవస్థితితో పాటు, కొంతలో కొంత ఆ ద్రవానికి అనుబంధంగా వాయుస్థితి కూడా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే ద్రవ, వాయు స్థితులు సమతాస్థితి (వనబఱశ్రీఱbతీఱబఅ) లో ఉంటాయన్న మాట. ఉదాహరణకు చీుూ దగ్గర 100 మిల్లీలీటర్ల నీటిని ఓ గ్లాసులో తీసుకొంటే అందులో చాలా భాగం ద్రవంగానే ఉన్నా కొంత భాగం (చాలా తక్కువే) వాయు రూపంలోకెళ్లి ఆ ద్రవపు ఉపరితలంపై పొరలాగా ఉంటుంది. అపుడు వాతావరణంలో ఆ మేరకు నీటిఆవిరి కలిగించే పీడన భాగాన్ని నీటి బాష్పపీడనం (ఙaజూశీబతీ జూతీవరరబతీవ) అంటారు. మొత్తం గాలి పీడనంలో నీటిఆవిరి పీడన శాతాన్ని పాక్షిక పీడనం (జూaత్‌ీఱaశ్రీ జూతీవరరబతీవ) అని అంటారు. ఇది వేసవికాలంలో ఎక్కువగాను, చలికాలంలో తక్కువగాను ఉంటుంది. పగలంతా సూర్యుని కాంతివల్ల వాతావరణం వేడెక్కి ఉంటుంది. అపుడు గాలిలో నీటి ఆవిరి శాతం (తేమ శాతం) ఎక్కువే ఉంటుంది. వేసవి కాలాల్లో పగలైనా, రాత్రయినా వాతావరణంలో ఉష్ణోగ్రత బాగానే ఉండడం వల్ల గాలిలో తేమ శాతం రోజంతా 24 గంటలూ ఒకేలా ఉంటుంది. కానీ చలికాలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. ఉదాహరణకు జనవరి నెలలో వరంగల్‌ పట్టణంలో పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉన్నా రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయిన ఘటనలున్నాయి. అంటే పగలంతా గాలిలో కొంత ఎక్కువగా ఉన్న నీటిఆవిరి శాతం రాత్రిళ్లు కూడా అలాగే ఉండలేదు. అంటే నీటిఆవిరి శాతం రాత్రిళ్లు తగ్గిపోవాలి. పదార్థం నాశనం కాలేదు కాబట్టి ఆ మేరకు నీటిఆవిరి ద్రవరూపంలోకి మారాలి. ఇలా ద్రవరూపంలోకి మారే స్థితిలో విడివిడిగా ఉన్న నీటి అణువులు సంధానించుకొని, మొదట చాలా తక్కువ సైజులున్న బృందాలు (aస్త్రస్త్రతీవస్త్రa్‌వర) గా మారతాయి. వీటినే నీటితుంపరలు (ఎఱర్‌) అంటారు. అలా రాత్రుళ్లు తుంపరలుగా మారిన నీటిఆవిరి చెట్ల ఆకుల మీద, బయటపడేసిన లోహపు వస్తువుల మీద, గడ్డి పరకల మీద జమవుతాయి. ఆ క్రమంలో కొన్ని కొన్ని తుంపరలు కలిసిపోయి, నీటి బిందువులుగా మారతాయి. ఈ బిందువుల్నే మనం మంచు (రఅశీష) అంటాము. ఏ ఆధారం లేకుండా గాలిలోనే తుంపరలు చాలా చిన్న సైజులో ఉన్నట్లయితే ఆ మంచును పొగమంచు (టశీస్త్ర) అంటాము. ఇలా ద్రవరూపంలో ఉన్న నీరు పగటి ఉష్ణోగ్రత దగ్గర కొంత ఆవిరి రూపంలో ఉండి, రాత్రి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల తిరిగి ద్రవరూపంలోకి వచ్చే క్రమంలో ఏర్పడ్డ చిన్నపాటి బిందు సమూహాల్నే మంచు అంటారు. ఈ ఉష్ణోగ్రత ఇంకా పడిపోయి సున్నా కన్నా తగ్గినట్లయితే ఇదే మంచు ఘన రూపంలోకి వెళ్లి పత్తిలాగా సెటిలవుతుంది. అమెరికాలాంటి దేశాల్లో చలికాలంలో రోడ్డు మీద పరచుకొనే మంచు గడ్డలు (ఱషవ) ఇవే! రిఫ్రిజిరేటర్లలో డీప్‌ఫ్రీజర్‌లో గోడలకు అంటుకుని ఇబ్బందిపెట్టే మంచు పేటికలు (ఱషవ రషaశ్రీవర) కూడా ఇలా నీటి ఆవిరి గడ్డకట్టిన బాపతుదే!

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

Friday 7 March 2014

వెన్నుపై ఒత్తిడి పెంచే 'స్పాండిలోలిస్తెసిస్‌'



      







క్రీడాకారుల్లో కొంతమందికి వెన్ను కింది భాగంలో నొప్పి వస్తుంటుంది. తర్వాత ఎక్స్‌రే తీయిస్తే వెన్ను పూసలో ఒకదానిలో ప్రాక్చర్‌ కనిపి స్తుంది. ఇలా వెన్ను పూసలో ఒకటి విరగడాన్ని, 'స్పాండిలోలైసిస్‌' అంటారు. సాధారణంగా ఫ్రాక్చర్‌ నడుము కింది భాగంలోని ఐదవ లుంబార్‌ వెన్నుపూసలో అవుతుంది. ఇలా జరిగిన వెన్నుపూసల మీద పైనుంచి భారం పడటంతో ఇది పక్కకు కదులుతుంది. ఈ స్థితిని 'స్పాండిలోలిస్తెసిస్‌' అంటారు. మరికొంచెం పక్కకు కదిలితే ఈ వెన్నుపూస నరాలమీద ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి కలుగుతుంది. శస్త్ర చికిత్సతో ఈ స్థితిని సరిచేయాల్సి ఉంటుంది.
ఎవరిలో వస్తుంది?
స్పాండిలోలిస్తెసిస్‌ వంశపారం పర్యంగానూ వస్తుంది. వెన్నుపూసలు పల్చగా ఉన్నవాళ్లల్లో కూడా వెన్నెముక ఇలా విరగే అవకాశం ఉంటుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ చేసే వాళ్లకు, ఫుట్‌బాల్‌ ఆడేవాళ్లకు, జిమ్నాస్టిక్స్‌ లోనూ వెన్ను కింది భాగంలోని పూసల మీద ఒత్తిడి ఎక్కువ వుతుంది. స్ట్రెస్‌ కలుగుతుంది. ఇలాంటి ఇబ్బంది ఉన్నవాళ్లల్లో నొప్పి నడుం కింది భాగంలో కనిపించడంతో కండరాల నొప్పి అనుకుంటారు. స్పాండిలోలిస్తెసిస్‌ వల్ల స్పాజమ్‌ ఏర్పడి, నడుం కిందిభాగం స్టిఫ్‌ అవుతుంది. దాంతో ఫ్రాక్చర్‌లోనే మార్పు వస్తుంది. వెన్నుపూస ఎక్కువగా పక్కకు జరగడంతో నరాల మీద ఒత్తిడి కలుగు తుంది. వెన్నుపూసల మధ్య నరాలు విస్తరించడానికి ఉండే దారి స్పైనల్‌ కెనాల్‌ సన్నమవుతుంది.సిటీస్కాన్‌ గానీ, ఎంఆర్‌ఐగానీ తీయించి, పరిస్థితిని సరిగ్గా తెలుసు కోవచ్చు. ఉన్న తేడాను బట్టి చికిత్స ఎలా చేయాలో నిర్ణయిస్తారు. ఎందుకు స్పాండిలోలైసిస్‌ వచ్చిందో తెలుసుకోవ డానికి వాటిని ఆపేయాలి. ఇబుప్రాఫెన్‌ లాంటి యాంటి ఇన్‌ప్లమేటరీ మందుల్ని నొప్పి తగ్గడానికి వాడతారు. అవసరమైతే నడుం కింది భాగంలో బెల్టు పెట్టుకోమంటారు. ఫిజియోథెరపీ చేయమంటారు. స్ట్రెచ్చింగ్‌, స్ట్రెనైనింగ్‌ ఎక్సర్‌ సైజెస్‌తో నడుం కింది భాగంలో నొప్పిని పోగొట్టడమేగాక, భవిష్యత్తులో నొప్పి కలగకుండా కాపాడవచ్చు. ఎక్స్‌రేలు వరుసగా తీయిస్తూ వెన్ను పూసల స్థితిని తెలుసుకోవచ్చు. అప్పటికీ నొప్పి తగ్గకపోతే శస్త్రచికిత్స తప్పనిసరి. వెన్నుపూస, శాక్రమ్‌లను ప్యూజ్‌ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి లోపల స్క్రూస్‌, రాడ్స్‌ పెట్టి ప్యూజన్‌ చేయాల్సి రావచ్చు. శస్త్ర చికిత్సతో స్వస్థత చేకూరుతుంది.
మెడనొప్పి
మెడనొప్పితో చాలామంది బాధపడుతుంటారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలోని మిగతా భాగాలలాగే మెడలోని సర్వైకల్‌ స్పైన్‌లో ఎముకలు వయస్సుతోపాటు క్రమంగా అరుగుతాయి. ఆర్థరైటిస్‌తో లిగమెంట్స్‌కు, డిస్క్‌కు, సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వెన్నుపాములోని పూసల మధ్య నరాలు ప్రయాణించడానికి వీలుగా ఉన్న నాళం సన్నమై, నరాలమీద ఒత్తిడి పడుతుంది. దీనిని స్టినోసిస్‌ అంటారు. ఇది మెడ ప్రాంతంలోనూ కలుగ వచ్చు. దెబ్బల వల్ల వెన్నుమీద ఒత్తిడి కలుగుతుంది. ఈ మెడనొప్పి కొద్దిపాటి నుంచి తీవ్రస్థాయి వరకూ ఉండవచ్చు. మెడ నిలపడమే కష్టమైపోతుంది.
లక్షణాలు
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌తో నొప్పి మాత్రమేగాక, మెడ కూడా బిగుసుకుపోతుంది. ఆ నొప్పికి పైభాగాన భుజాలలో కూడా వ్యాపించవచ్చు. ఏదైనా పనిచేస్తుంటే నొప్పి తీవ్రతరం అవుతుంది. చేతుల్లో నీరసం, మొద్దుబారినట్లు ఉంటుంది. అరచేతులకూ, వేళ్లకూ నొప్పి వ్యాపించవచ్చు. కాళ్లల్లో నిస్సత్తువ ఏర్పడి, నడవటం కష్టమవుతుంది. మెడను కదిలిస్తున్న ప్పుడు శబ్దమవ్వొచ్చు. మెడనొప్పితో మెడ కండరాలు పట్టుకోవడం, తలనొప్పి రావడం జరగొచ్చు. ఈ లక్షణాలతో అసహనం పెరుగుతుంది. అలసటా కలుగుతుంది. నిద్రాభంగం అవుతుంది. పనిచేయలేని స్థితి కలుగవచ్చు.
పరీక్షలు
మెడనొప్పితో బాధపడుతున్నప్పుడు రోగి తన వైద్య చరిత్రను డాక్టర్‌కు చెప్పాలి. ఈ సమాచారంతో
డాక్టర్‌ సర్వైకల్‌ స్పాండిలో సిస్‌తోగాక, మరేదైనా కారణంతో ఈ నొప్పి వస్తున్నదేమో తెలుసు కోగలరు. భౌతిక పరీక్షలతోపాటు ఎక్స్‌రే, ఇతర ఇమేజింగ్‌ పరీక్షలతో మెదడు ప్రాంతంలోని వెన్ను పరిస్థితిని తెలుసుకోవచ్చు. మెడలో సరిగ్గా ఏ ప్రాంతంలో నొప్పి ఎక్కువగా ఉందో వైద్యుడికి చెప్పగలగాలి. ఎప్పటి నుంచి ప్రారంభమైందో, క్రమంగా పెరుగు తున్నదా? తగ్గుతున్నదా? లేక అలాగే ఉంటున్నదా? అనే విషయాలు చెప్పాలి.
చికిత్స
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఉంటే ఈ లక్షణాలు నెలల కొద్దీ బాధించవచ్చు. లక్షణాలు తక్కువ స్థాయిలో ఉంటే మందులు, ఫిజయోథెరపీ లాంటి వాటితో చికిత్స చేస్తారు. నొప్పి తీవ్రంగా ఉంటే మెడలోని వెన్ను దెబ్బ తింటే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. డిస్క్‌ను తీసివేయడం వంటి చికిత్స చేస్తారు.
రాడిక్యులోపతి
నరాల మొదట్లో తగిలిన దెబ్బతో నరాల చివర నొప్పి కనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ స్పర్శజ్ఞానం ఉంటుంది. ఉదాహరణకు వెన్నుపూసల్లో, డిస్క్‌ ఇబ్బంది కలిగితే చేతుల్లో, భుజాల్లో, మణికట్టులో జాలు వారడం, నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటాయి. మెడలోని వెన్నులో ప్రారంభమైన నరాలు చేతుల్లోకి వ్యాపిస్తాయి. కనుక నొప్పి చేతుల్లోకి వ్యాపిస్తుంది. చాలా కారణాల వల్ల మెదడులోని, వెన్నులోని నరాలపై ఒత్తిడి పడుతుంది. ఈ సర్వైకల్‌ రాడిక్యులోపతికి కారణాలు మెడ ప్రాంతంలోని వెన్ను డిస్క్‌లో దెబ్బతినడంతో లోపలి నరాలపై ఒత్తిడి పడుతుంది. వెన్ను లోపలి నరాలు విస్తరించే దారి సన్నం కావడంతోనూ నరాలపై ఒత్తిడి పడుతుంది.
డిస్క్‌ డీ జనరేషన్‌తో నొప్పి రావచ్చు. మెదడును కదిలించి, నొప్పి ఎక్కడ ఎలా వస్తుందో తెలుసుకుంటారు. ఎక్స్‌రేతో డీజనరేటివ్‌ డిస్క్‌లను పసిగట్టవచ్చు. అవసరమైతే ఎంఆర్‌ఐ పరీక్ష చేయిస్తారు. ముందు మందులు ఫిజియోథెరపీతో వెన్ను నరాల మీద ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తారు. విశ్రాంతితో కొన్నిరోజులు మెడకు కాలర్‌ వేసుకుంటారు. సర్వైకల్‌ ట్రాక్షన్‌గానీ, మరేదైనా వ్యాయామంగానీ వైద్యులు సూచించిన ప్రకారం ఫిజియోథెరపిస్టు చెప్తారు. కోల్డ్‌ థెరపీ, ఎలక్ట్రికల్‌ స్టిమ్యులేషన్‌, ఐసోమెట్రిక్‌-స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయించవచ్చు. ఆరు నుంచి 12 వారాలలోపు తగ్గకపోతే శస్త్రచికిత్స అవసరం అవుతుంది.
డాక్టర్‌ మాధవ్‌ యెండ్రు,
స్పైన్‌ సర్జన్‌, 
లక్డీకాపూల్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌.
ఫోన్‌: 9963022274

Tuesday 4 March 2014

శనిగ్రహానికి కొత్త వలయాన్ని కనుగొన్నారా?




                             సౌరమండలంలో రెండవ అతి పెద్ద గ్రహమైన శనిగ్రహం చుట్టూ గిరగిరా తిరుగుతున్న లక్షలాది గ్రహ శకలాలు, ధూళి కణాలు కలసి మనకు అందమైన వలయాలుగా కన్పిస్తున్నాయి. అయితే మనకు ఇంత వరకూ కన్పించని మరొక పెద్ద వలయం కూడా శనిగ్రహం చుట్టూ ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు గత ఏడాది కనుగొన్నారు. స్పిట్జర్‌ అనే అంతరిక్ష టెలిస్కోప్‌ పంపిన ఫోటోల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్నారు.
శనిగ్రహం చుట్టూ దర్శన మిచ్చిన కొత్త వలయం అడ్డంగా 1.5 కోట్ల మైళ్ళ నుంచి 2.2 కోట్ల మైళ్ళ వ్యాసంతో ఉండటం విశేషం. ఈ ప్రదేశంలో అడ్డంగా ఒక 100 కోట్ల భూగోళాలను ఒక దాని పక్కన ఒకదాన్ని పేర్చవచ్చట. ఈ వలయంలోని కోట్లాది చిన్న చిన్న శిలల ముక్కలు ఉపగ్రహాల లాగా శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఈ అన్ని ముక్కలను కలిపితే ఒక అరమైలు వ్యాసంతో ఉండే శిల మాత్రమే రూపొందుతుందని అంచనా వేశారు. ఏదేమైనా ఈ శిలల ముక్కలు చాలా చిన్నగా ఉండటం వల్ల, పైగా అవి కోట్ల సంఖ్యలో ఉన్నప్పటికి వాటి మధ్య ఖాళీ ప్రదేశం చాలా ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం వలయం ఒక పారదర్శకమైన గొట్టం లాగా కన్పిస్తుంది. అది కూడా అంతరిక్ష టెలిస్కోపులతోనే కన్పిస్తుంది గాని, భూమి మీది టెలిస్కోపులతో కన్పించదు.
కొత్త వలయంలోని అన్ని శకలాలు శనిగ్రహపు ఉప గ్రహాల్లో ఒకటైన ఫోబ్‌ నుంచే ఉత్పన్నమయ్యాయని భావిస్తున్నారు. ఈ వలయంలో ఉన్న ఫోబ్‌ అనే ఉపగ్రహం వలయంలోని శకలాలు తిరిగే దిశలోనే పరిభ్రమిస్తుంటే, అయాపిటస్‌ అన బడే మరో ఉపగ్రహం మాత్రం సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ ఉపగ్రహానికి సంబంధించిన ఒక చిత్రమైన అంశం ఏమిటంటే దీనిలో సగభాగం బూడిద రంగులో ఉంటే, మిగతా సగభాగం ఎర్ర రంగులో ఉంటుంది. ఇలా రెండు రంగుల్లో ఉండే గ్రహం గాని, ఉపగ్రహం గాని సౌరమండలంలో ఇంకేదీ కనిపించలేదు.
Courtesy with: PRAJA SEKTHI DAILY 


మన శరీరంలో భాస్వరం (phosphorus) ఉపయోగం ఏమిటి?
భాస్వరం ప్రతి జీవిలోను ఉంటుంది. జీవకణం అంటే అందులో విధిగా DNA,RNA ఉండాలి. DNA లేదా RNAలో పూసల్లాగా న్యూక్లియోసైడులు ఉంటాయి. DNAలో అయితే ప్రతి న్యూక్లియోసైడులో ఓ నత్రజని క్షారం (Nitrogen bases), డీఆక్సీ రైబోస్‌ అనే చక్కెర అణువు సంధానించుకొని ఉంటాయి.RNA లోనైతే నత్రజని క్షారం రైబోస్‌ చక్కెర అణువుకు సంధానించుకొని ఉంటాయి. రైబోస్‌ చక్కెర లేదా డీఆక్సీ రైబోస్‌ చక్కెరలో కర్బన పరమాణువులు వలయాకృతి (cyclic) తో సంధానించుకొని ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం అందులో ఉన్న కర్బన పరమాణువులను అంకెల వరసతో చూపుతాము. పటం 1 లో రైబోస్‌ చక్కెరలను, డీఆక్సీ రైబోస్‌ చక్కెరలోను ఉన్న ఐదు కర్బనాలను ఏ విధంగా చూపించారో గమనించండి. RNA లో రైబోస్‌ చక్కెర, DNA లో డీఆక్సీ రైబోస్‌ చక్కెర పాల్గొంటాయని తెలుసుకున్నాక ఇపుడిక DNA  సంగతే చూద్దాం. DNA  లో డీఆక్సీ రైబోస్‌ చక్కెరతో పాటు నాలుగు ప్రధానమైన నత్రజని క్షారాల (Nitrogen bases) లో ఏదో ఒకటి ఉంటుంది. ఈ నాలుగు నత్రజని క్షారాలు సైటోసీన్‌(c), గ్వానైన్‌(g), అడినైన్‌ (A), థయమిన్‌(T) లో వృత్తంతో గుర్తించబడిన (H) పరమాణువు డీఆక్సీ రైబోస్‌ చక్కెరలో (1)వ కార్బన్‌ మీదున్న (ఉన) సమూహం కలిసి నీరు (న2ఉ)గా బయటికి వెళ్లిపోతే నత్రజని క్షారానికి డీఆక్సీ రైబోస్‌ చక్కెరలోని 1వ కార్బన్‌కు సంధానం ఏర్పడుతుంది. ఈ సమూహాన్నే న్యూక్లియోసైడు (nucleoside) అంటాము. ఇలాంటి రెండు న్యూక్లియోసైడుల్ని ఫాస్ఫేటు సంధానం చేస్తుంది. భాస్వరం మధ్యలో ఉన్న ఫాస్ఫేటు కారకం (Radical) ఎలా ఉంటుందో పటం 3 లో చూడండి. ఇందులో ఉన్న (ఉన) సమూహం అటువైపు న్యూక్లియోసైడులోని 3వ కార్బన్‌ మీదున్న (ఉన) లోని (న) తో కలిసి ఇటువైపు 5వ కర్బనం మీదున్న (ఉన) సమూహంలోని (న) తో కలిసి నీటిని ఇవ్వడం ద్వారా బంధించుకొంటుంది. ఇలా ప్రతి రెండు న్యూక్లియోసైడుల మధ్య సంధానకర్తగా ఫాస్ఫేటు ఉండడం వల్లనే ణచీA పేలిక ఏర్పడుతుంది. పటం 4లో ఈ వివరణ ఉంది. ఇలాంటి రెండు పేలికలు నత్రజని క్షారాల మధ్య ఏర్పడే హైడ్రోజన్‌ బంధాల ద్వారా జంట పేలిక (నిచ్చెనలో లాగా) ఉన్నDNAఎలా ఏర్పడిందో పటం 5 లో చూడండి. ఇలా ప్రాణానికి ఆయువుపట్టయిన DNAలోను, RNA  లోను భాస్వర పరమాణువు పాస్ఫేటు రూపంలో ఉంది. అలాగే ప్రాణి ప్రతి కదలికకు కారణమైన జీవశక్తిని ఇచ్చేది ATP (Adenosine Triphosphate). ఇది AణూADP (Adenosine Diphosphate) నుంచి ఏర్పడుతుంది. ఇందులో ఉన్నదీ ఫాస్ఫేట్‌. ఇంకా ముఖ్యమైన భాగం ఎముకలు, దంతాలు, పుర్రె. ఇందులో ఉన్న పదార్థం పేరు కాల్షియం ఫాస్ఫేటు (Ca3(PO4)2). ఇది చాలా గట్టిది. ఇంకా కణాల గోడలు ఫాస్ఫో లిపెడ్లు అనే పదార్థంతో తయారవుతాయి. ఇందులోను భాస్వరం ఉంది. కాబట్టి భాస్వరం జీవానికి స్వరం. సర్వస్వ భాసురం జీవావసర సర్వస్వభావసారం భాస్వరం.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక