Thursday 30 August 2012

మూఢనమ్మకాలుంటే నష్టాలేంటి?-2


  • అశాస్త్రీయ ఆచారాలు - 17
ఇక జ్యోతిష్యం గురించి పరిశీలిద్దాం..
ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన 'నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?' అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపిం చాను. ఆ వ్యాస రచయిత ఎమ్‌.టెక్‌; ఎమ్‌.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. 'నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. అందరిలా బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగమూ ఉంది. దాచుకున్న డబ్బుంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడం లేదు.' అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకంగల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?
ఇక మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు చెప్తాను. విను.
(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)
కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.
(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)
వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడు తుంటే, స్థానిక ఆర్‌.ఎమ్‌.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.
(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)
చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.
(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)
మంత్రాలకు చింతకాయలు రాలతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.
(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.
(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)
ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.
(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)
సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.
(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని ఈ వార్త..
ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను 'మనమిద్దరం క్రితం జన్మలో భార్యా భర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!' అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు' అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్‌ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్‌ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.
కిషన్‌! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాలతో ఎన్ని నష్టాలున్నాయో తెలుసు కున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకే మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?' అని ముగించాను.
'అర్థమైంది అంకుల్‌!' అంటూ కిషన్‌ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

రక్తం లేకుండా మధుమేహ పరీక్ష..!


ఇకపై మధుమేహ పరీక్షలకి రక్తాన్నే ఇవ్వనక్కర్లేదట! దీనికి వీలుగా పరిశోధకుడు అనురాగ్‌ కుమార్‌ ప్రస్తుతం పర్డ్యూ యూనివర్శిటీలో పరిశోధన చేస్తూ ఒక కొత్త 'బయో సెన్సార్‌'ని రూపొందించాడు. దీనిద్వారా లాలాజలం, మూత్రం, చివరికి కన్నీళ్లలో కూడా సూక్ష్మస్థాయిలో ఉన్న గ్లూకోజ్‌ మోతాదుని కనుక్కోవచ్చట. శరీరంలో గ్లూకోజ్‌ మోతాదుని అంచనా వేయడానికి ఇప్పటివరకు రక్తాన్నే తీయాల్సి వస్తుంది. ఈ పరికరం గ్రాఫ్‌ను ఆధారం చేసుకుని పనిచేస్తుం దట. అతి సూక్ష్మ మోతాదులో కూడా గ్లూకోజ్‌ను అది పసిగడు తుందట! ఒక పేషంట్‌ కన్నీటి చుక్కను పరీక్షించి అతనికి మధు మేహం ఉందో లేదో తెలుసుకోవడం మంచి వెసులుబాటే కదా!

పండ్లను తాజాగా ఉంచే 'స్ప్రే'!


రొయ్యలు, పీతల పెంకులలోని ఒక పదార్థంతో తయారుచేసిన స్ప్రేతో అరటికాయ త్వరగా పండుగా మారకుండా ఆలస్యం చేయవచ్చట. ఇలా రెండువారాల పాటు చెడిపోకుండా ఉంచవచ్చట. చైనాలోని తియాన్జిన్‌ యూనివర్శిటీలో పనిచేసే శిహాంగ్‌ లీ అనే శాస్త్రవేత్త ఈ స్ప్రేని రూపొందించాడు. 'కైటోసాన్‌' అనే పదార్థంతో చేసిన స్ప్రే కాయల్లో సహజ మార్పులను అరికడుతుంది. తద్వారా కాయలుగానీ పండ్లుగానీ చెడిపోకుండా మరికొన్ని రోజులపాటు నిల్వ ఉంటాయట. ఇదే ఆచరణలోకి వస్తే ఇంటిలోనూ, సూపర్‌ మార్కెట్లలోనూ ఈ స్ప్రే బాగా ఉపయోగపడుతుంది.

మొక్కతో కాన్సర్‌ నివారణ..!


మనదేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ లభించే ఒక మొక్కతో కాన్సర్‌ను అరికట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 'వర్జిన్‌ మాంటిల్‌' అనే మొక్క కాన్సర్‌ కణాలను ఏకంగా చంపేస్తుందట! ఈ మొక్క ఆకులతో చేసిన టీని బ్రెస్ట్‌ కాన్సర్‌ ఉన్న మహిళలు సేవించడం గ్రామీణ పాకిస్తాన్‌లో మామూలే. ఆ మొక్కలోని పదార్థాలు కేవలం ఐదు గంటలలో కాన్సర్‌ కణాలను నిలువరించడమే కాకుండా 24 గంటలలో వాటిని చంపగలవని పరిశోధనల్లో గుర్తించారు. విశేషమేమిటంటే, కీమోథెరిపీ (మందుతో చేసే చికిత్స) లాగా ఇది మామూలు కణాలకు ఎటువంటి హానీ చేయదు. ఆఫ్రికా, యూరప్‌లో కొన్ని ప్రదేశాలలో కూడా కనిపించే ఈ దివ్య ఔషధమొక్కల శాస్త్రీయ నామం 'ఫాగోనియా క్రేతికా'.

అదృశ్య హెల్మెట్‌..!


హెల్మెట్‌ పెట్టుకోకుండా ఉండటానికి మనకి సవాలక్ష సాకులు తెలుసు. వాటిల్లో ముఖ్యమైంది శిరోజ సౌందర్యం పాడైపోవడం. తలనొప్పి వగైరాలు ఆ తరువాతే. ఇద్దరు స్వీడిష్‌ మహిళలు కలిసి ఒక కనిపించని హెల్మెట్‌ని రూపొందించారట! 'హౌవ్దింగ్‌' అనబడే ఈ సైకిల్‌ హెల్మెట్‌ మామూలుగా మెడమీద కాలర్‌లా కనిపిస్తుంది. దానిలో గాలి సంచులు ఉంటాయి. ఇటువంటి సంచులను ఇప్పుడు కార్లలో కూడా అమర్చుతున్నారు. అందులోనే ఒక బ్లాక్‌ బాక్స్‌ వంటి పరికరం ఉంటుంది. అది తల కోణాన్ని అంచనా వేసి గాలి సంచిని విడుదల చేస్తుంది. ప్రమాదం జరిగిన 0.1 సెకన్‌లోనే అది విచ్చుకుని సమర్థవంతమైన రక్షణను సమకూర్చుతుంది. ఈ అదృశ్య హెల్మెట్‌లో హీలియం వాయువు వుంటుంది. దీనిని యూ ఎస్‌ బి ద్వారా చార్జ్‌ చేసుకోవచ్చు.

ఆకలిని చంపే పౌడర్‌..!


త్వరలో మనకు నచ్చిన స్వీట్‌ని తినేసి బరువు గురించి దిగులుపడకుండా నిశ్చింతగా ఉండవచ్చట! దీనికోసం ఆకలిని తగ్గించే పౌడర్‌ని రూపొందించారు పరిశోధకులు. ఈ పదార్థాన్ని మనం తినే ఆహారంలో కలిపితే, కొద్దిగానే తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుందట. మామూలుగా మిథైల్‌ సెల్యులోజ్‌ పదార్థం జీర్ణవ్యవస్థలో వేగంగా ప్రయాణించి ఆకలిపై ఎటువంటి ప్రభావాన్నీ చూపించదు. కానీ, ఇప్పుడు కొత్తగా రూపొందిన పదార్థం జెల్‌ రూపంలోకి మారి శరీరంలో ఎక్కువకాలం ఉంటుందట! అందువల్ల, ఆకలి మందగిస్తుందట.

Wednesday 22 August 2012

మూఢనమ్మకాలుంటే నష్టాలేంటి?-1

  • అశాస్త్రీయ ఆచారాలు17
ఇటీవల మా ఇంటికి మా మిత్రుడి కుమారుడు సిద్ధూ వచ్చాడు. అతనితో అతని స్నేహితుడు కిషన్‌ కూడా వచ్చాడు. కొంతసేపటికి సంభాషణ మూఢనమ్మ కాలవైపు మళ్లింది. అప్పుడు వాళ్లకి నేను రాసిన 'మూఢ విశ్వాసాలు-సైన్సు సమాధానాలు' పుస్తకమిచ్చి, 'తీరిగ్గా ఉన్నప్పుడు చదవండయ్యా!' అన్నాను. అదిచూసిన కిషన్‌ ఇలా అన్నాడు. 'అంకుల్‌! మాకిప్పుడు కావల సింది మా సబ్జెక్ట్స్‌లో మంచిమార్కులు. వాటికోసం క్లాసు పుస్తకాలు బాగా చదవాలి. తర్వాత ఇంటర్వ్యూ లలో బాగా సమాధానాలివ్వడానికీ, వృత్తిలో రాణించ డానికీ మంచి వ్యక్తిత్వం కావాలి. దానికోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలి. అంతేకానీ, ఇలాంటి విషయాలు మాకెందుకు? మాకు మూఢనమ్మకాలుంటే నష్టమేంటి? ఇవి చదువులోగాని, వృత్తిలోగాని రాణించ డానికి ఏమైనా ఉపయోగపడతాయా?' నేను ఆ ప్రశ్న లకు ముందుగా ఆశ్చర్యపోయినా, తర్వాత ఆనందించి ఇలా అన్నాను. 'కిషన్‌! నీవు ఈ ప్రశ్నలు వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?' అని అడిగాను. 'ఉంది అంకుల్‌! చెప్పండి వింటాను' అన్నాడు కిషన్‌.
'అసలు మూఢనమ్మకాలంటేనే నమ్మినవారినీ, నమ్మనివారినీ మానసికంగా, ఆర్థికంగా నాశనం చేసే వని అర్థంచేసుకో. అనేకసార్లు మూఢనమ్మకాలు ప్రాణాల్నే హరిస్తున్నాయి. వాటిని వివరంగా చెబుతా విను. వాస్తు అనేది ఒక మూఢనమ్మకం. దానిని నమ్మి నవారు లక్షలాదిమంది మనదేశంలో ఉన్నారు. ఆ నమ్మ కంతో వారు ఇళ్ళు కూలగొట్టుకుంటున్నారు. ఆస్తులు నాశనం చేసుకుంటున్నారు. ఉదా: ఒక పత్రికలో పాఠ కుడు వేసిన ప్రశ్న, దానికి వాస్తువాది సమాధానాన్ని 'ప్రజాశక్తి' 7-7-2002న పునర్ముద్రించింది. ప్రశ్న:'అయ్యా! నా ఇంటి ఉత్తర ప్రహరీగోడకు ఉత్తర ఈశాన్యంలో గేటు, ఉత్తర వాయువ్యంలో ఇంకో గేటుంది. నా ఇంటికి తూర్పు ఆగేయంలో లోతైన అండర్‌ గ్రౌండ్‌ సంపు ఉంది. ఆగేయంలో ఎత్తయిన బిల్డింగ్‌ కూడా ఉంది. నైరుతిభాగాన నా స్థలంలో మొయిన్‌ గృహానికి తగలకుండా ఉపగృహం నిర్మించాం. ఆ ఉపగృహానికి అండర్‌గ్రౌండ్‌ సెల్లార్‌ నిర్మించాం. మా పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారిపోయింది. కావునా తాము ఏమార్పులు చెప్పినా చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి చెప్పండి.
సిద్ధాంతి సమాధానం:శ్యామ్‌గారూ! సర్వరోగాలూ ఒకే మనిషికుంటే ఎలా ఉంటుందో అలా మీ ఇంటి అవలక్షణాలు కన్పిస్తున్నాయి. కాబట్టి చాలామార్పులు చేయించుకోవాల్సి ఉంటుంది. తూర్పుఆగేయంలో అండర్‌ గ్రౌండ్‌ సంపుందని చెబుతున్నారు. ఆగేయంలో ఎత్తయిన భవనమూ ఉందన్నారు. ఈ రెండూ అతి భయంకరమైనవి. రోజురోజుకూ శత్రువుల్ని అభివృద్ధి చేస్తాయి. కాబట్టి తూర్పు ఆగేయంలో ఉండే సంపును తీసేసి తూర్పు ఈశాన్యంలో అమర్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆగేయంలో ఎత్తయిన భవనాన్ని కూలగొట్టాలి. నైరుతిలో సెల్లార్‌ చాలా ప్రమాదకారి. కాబట్టి ఆ సెల్లార్‌ను పూడ్చేయాలి. ఇంటికి ఖాళీస్థలాలు ఎటువైపు ఎంతున్నాయో మీరు రాయలేదు. ఖాళీ స్థలాలనుబట్టి ఉచ్ఛనీచాలను నిర్ణ యించగలం. అందువల్ల మీరు వివరంగా మరో లెటరు రాస్తే ఇంకా ఏ ఏమార్పులు చేసుకోవాలో చెబుతాను.
వీటిని పునర్ముద్రించి, ప్రజాశక్తి పత్రిక చివరిలో ఇలా వ్యాఖ్యానించింది.. 'ఏ ఇల్లయినా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తూ ఆహ్లాదకరంగా ఉండాలి. అలా ఉంటే, అందులో నివాసం ఉండేవారి మనసులు ఉల్లా సంగా ఉంటాయి.అప్పుడే వారి భవిష్యత్తుకూ ఉజ్జ్వల మైన బాటలు వేసుకుంటారు. కానీ వాస్తుతోనే గీత మారుతుందని గుడ్డిగా నమ్మితే అధోగతే!'
అలా వాస్తును గుడ్డిగా నమ్మిన ఒక ధనవంతుడు ఆస్తి పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని స్వామీ జగదా నంద అనే స్వామీజీ తాను రాసిన 'ఆస్పిషస్‌ వాస్తు' అనే పుస్తకంలో ఇలా వివరించారు.
ఒక ఊళ్ళో రెండు గ్రానైట్‌ఫ్యాక్టరీలు, రెండు పత్తి ప్రాసెసింగ్‌మిల్లులు ఉన్న వ్యాపారి మరింత ధనం సంపాదిద్దామని ఒక వాస్తువాదిని సంప్రదించాడు. అతడు అతనింటికి అనేక మార్పులు సూచించాడు. అన్నీ చేశాడు. దానికి చాలా ఖర్చయి, అప్పులపాల య్యాడు. దీంతో పత్తి మిల్లొకటి అమ్మి, మరొకటి లీజుకీ యాల్సి వచ్చింది. ఆ ధనికుడు వాస్తుతో ఎంత బాధ అనుభవించాడంటే తన ఇంటి ముందు 'ఇచ్చట వాస్తు వాదులకు ప్రవేశంలేద'ని బోర్డుపెట్టాడు.' (పే: 5, 6)
'ఇది నేడు లక్షలాది ప్రజల స్వానుభవం. వాస్తు పేరుతో ప్రజలు ప్రతి ఏడాది రూ15వేల కోట్లు నాశనం చేసుకుంటున్నారని ఒక స్వచ్ఛందసంస్థ అంచనా. ఇప్పు డు చెప్పు. నీవు బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించినా, వాస్తు అనే మూఢనమ్మకం ఉంటే ఆస్తిని పోగొట్టుకొనే ప్రమాదం లేదా? అలాగే జ్యోతిష్యం విషయం చెప్తాను.' అన్నా.
(ఆ వివరాలు పైవారం తెలుసుకుందాం!)

ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన 'నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?' అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపించాను. ఆ వ్యాస రచయిత ఎమ్‌.టెక్‌; ఎమ్‌.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. 'నాకు పెళ్ళి చేసుకోవాలనుంది. అందరిలాగానే బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగం ఉంది. దాచుకున్న డబ్బు కూడా ఉంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడంలేదు.' అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకం గల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?
ఇక మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నీకు వినిపిస్తాను. విను.
(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)
కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.
(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)
వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుంటే, స్థానిక ఆర్‌.ఎమ్‌.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.
(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)
చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.
(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)
మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.
(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.
(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)
ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.
(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)
సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.
(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని యీ వార్త విను.
ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను 'మనమిద్దరం క్రితం జన్మలో భార్యాభర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!' అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు' అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్‌ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్‌ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.
(9) శృతిమించిన మూఢభక్తి - చితిపేర్చుకొని ఇద్దరు సజీవ దహనం (సాక్షి 24-2-2009)
ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలం శివనూర్‌ గోండుగూడకు చెందిన ఇద్దరు శివభక్తులు మహాశివరాత్రికి కొన్నిరోజుల ముందు గ్రామ సమీపంలో గుడిసె వేసుకొని, అక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేయడం మొదలెట్టారు. మహాశివరాత్రి నాడు శివుడు ప్రత్యక్షమౌతాడనీ, అలా ప్రత్యక్షం కాకపోతే, తామే శివుడి దగ్గరకు వెళ్ళి పునర్జన్మ సాధిస్తామని ఇతర భక్తులతో అనేవారు. ఇందుకు ఉదాహరణ శివలీలామృతం అనే గ్రంథంలో ఉందనీ, అందులో ఒక రుషి శివుణ్ణి పూజిస్తూ సజీవదహనమయ్యాడనీ, తద్వారా పునర్జన్మ సాధించడనీ రాసి ఉన్నట్లు ఇతర భక్తులకు చెప్పేవారు. మహాశివరాత్రినాడు, రాత్రిపూట ఇతర భక్తులను ఇళ్ళకు పంపి, వారు అక్కడే ఉన్న కట్టెలను చితిగా పేర్చుకొని ఆత్మాహుతి చేసుకున్నట్లు అక్కడి ఆనవాళ్ళను బట్టి తెలుస్తోందని పత్రికావార్త తెలియజేస్తోంది.
కిషన్‌! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాల వలన ఎన్ని నష్టాలున్నాయో తెలుసుకున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకూ మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?' అని ముగించాను.
'అర్థమైంది అంకుల్‌!' అంటూ కిషన్‌ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మాట్లాడితే షాక్‌ కొట్టి చనిపోతారా?


           సెల్‌ఫోన్‌ ఛార్జి చేస్తుండగా కరెంటు షాక్‌ కొట్టి కొందరు చనిపోతున్నట్లు వార్తలు వస్తుంటాయి. అది ఎలా సాధ్యం? సెల్‌ ఛార్జింగ్‌ చేసేపుడు మనుషుల ప్రాణాలు తీసేంత హైవోల్టేజీ కరెంటు అక్కడ ఉండదు కదా? - అపరాజిత, హైదరాబాద్‌
కరెంటు షాక్‌ కొట్టి కొందరు చనిపోవడమన్న సంఘటన కేవలం సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ సమయంలోనే కాదు.. ఇస్త్రీ చేస్తుండగానో, ఎలక్ట్రికల్‌ హీటర్‌ పనిచేస్తున్నపుడో లేదా రిఫ్రిజిరేటర్‌ పట్టుకున్నప్పుడో, బకెట్లో నీళ్లు వేడిచేసుకోవడానికి తరచూ వాడే ఇమ్మర్షన్‌ కాయిల్‌ పట్టుకున్నపుడో లేదా వర్షాకాలంలో జస్ట్‌ లైటు ఆన్‌ చేయడానికి స్విచ్‌ వేసినపుడో ఇంకా ఇలాంటి ఎన్నో సందర్భాలలో విద్యుత్‌ షాక్‌ కొట్టి కొందరు చనిపోతున్నట్లు వార్తలు వస్తుంటాయి. ఈ సందర్భాల్లో ఎక్కడా ఆయా వస్తువులు, సాధనాలు సరిగ్గా, నాణ్యతా ప్రమాణాల ప్రకారం పనిచేస్తుంటే మనుషుల్ని చంపేంత హైవోల్టేజీ రాకూడదు. కానీ సరైన విధంగా ఎర్తింగ్‌ (earthing లేదాground) లేని అధికశక్తి విద్యుత్‌ సాధనాలు (high power electrical gadgets) ఒక్కోసారి తీవ్రస్థాయిలో ప్రమాదకరమైన వోల్టేజీని సాధనాలపైనే లీక్‌ చేసుకుంటాయి. అటువంటి వాటిని సరైన పాదరక్షలు లేకుండా పట్టుకొంటే షాక్‌ కొడుతుంది. కానీ పవర్‌ అడాప్టర్లు (power adapters), ఎలిమినేటర్లు సెల్‌ఫోన్‌ ఛార్జర్లు వంటి తక్కువస్థాయి విద్యుత్‌సాధనాల్ని ముట్టుకున్నపుడు సాధారణంగా ప్రాణాంతకమయ్యేంత తీవ్రస్థాయిలో విద్యుత్‌ వోల్టేజీ రాకూడదు. ఇలాంటి వాటికి ఎర్తింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి కేవలం రెండు పిన్నుల ప్లగ్‌లే వీటికి ఉంటాయి. ఇలాంటి అల్పస్థాయి విద్యుత్‌సాధనాల వాడకం సమయంలో కూడా షాక్‌ వచ్చిందంటే కేవలం ఆయా ఛార్జర్ల తయారీలో సరైన నాణ్యతా ప్రమాణాలు ఉండకపోవడమే. కొంత ఖరీదు ఎక్కువే అయినా ఆయా సెల్‌ఫోన్‌లను ఛార్జి చేసుకోవడానికి ఆయా సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీల బ్రాండ్‌తో అమ్మే ఛార్జర్లను కొనడమే శ్రేయస్కరం. బజార్లో దొరికే స్వల్ప ఖరీదు(cheap) అడాప్టర్లవల్ల, సెల్‌ఫోన్‌ బ్యాటరీల వల్ల ఎంతో కొంత రిస్క్‌ ఉన్న విషయాన్ని మరవొద్దు.
సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ చేయాలంటే మన సెల్‌ఫోన్‌లో ఉన్న రీఛార్జబుల్‌ బ్యాటరీ (సాధా రణంగా లిథియం, అయాను బ్యాటరీ) కి డైరెక్టు కరెంటు (DC) వోల్టేజీని అందిం చాలి. ఇదే శీర్షికలో గతంలో AC వోల్టేజీ అంటే ఏమిటో ణజ వోల్టేజీ అంటే ఏమిటో తెలియజేసి ఉన్నాను. ఒకే దిశలో ఏకోన్ముఖంగా నిర్ణీత విద్యుత్‌శక్మం (electrical potential) తో ప్రయాణించే విద్యుత్ప్రవాహా (electrical current) న్ని DC(Direct Current) కరెంటు అనీ లోలకం (pendulum) లాగా కాసేపు అటునుంచి ఇటూ, వెంటనే మరి కాసేపు ఇటునుంచి అటూ పదే పదే (భారతదేశంలో సెకనుకు 50 సార్లు) దిశను మార్చుకుంటూ ప్రయాణించే విద్యుత్‌ ప్రవాహాన్ని AC (Alternating Current) కరెంటు అంటారన్నదే ఆ వ్యాసపు అంతరార్థం.
మన ఇళ్లలో మనకు సుమారు 230 వోల్టులు ఉండే AC పవర్‌ను TRANSCO (Transmission Company) వాళ్లు సరఫరా ్లచేస్తున్నారు. కానీ మన సెల్‌ఫోన్‌ను ఛార్జి చేయడానికి కేవలం 3 లేదా 5 వోల్టుల DC సరిపోతుంది. అంతకుమించిన వోల్టేజీ వస్తే సెల్‌ఫోన్‌ బ్యాటరీకి ప్రమాదం. ఒక్కోసారి అది పేలిపోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇంట్లోకి వచ్చే లైన్‌ వోల్టేజీని మొదట సుమారు 5 వోల్టుల AC వోల్టేజీకి తగ్గించేలా యంత్రాంగం ఉంటుంది. ఇది మైఖేల్‌ ఫారడే కనుగొన్న విద్యుదయస్కాంత ప్రేరణ (electromagnetic induction) సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. 230 AC వోల్టేజీని మనక్కావలసిన తక్కువ వోల్టేజీ (సుమారు 5 వోల్టుల) కి Aజ తరహాలోనే తగ్గిస్తారు. ఇది మన ఛార్జర్‌లోనే అంతర్గతంగా ఉంటుంది. ఆ మాటకొస్తే ఛార్జర్‌లో ఉన్న ప్రధానభాగం, బరువు దీనిదే. దీన్నే స్టెప్‌డౌన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (Step-down transformer) అంటారు. ఇలా అల్పస్థాయికి చేరుకొన్న 3 లేదా 5 వోల్టుల Aజ వోల్టేజీని ప్రత్యేకంగా నిర్మితమైన ఎలిమినేటర్‌ అనే సర్క్యూట్‌ ద్వారా ణజ వోల్టేజీగా మారుస్తారు. ఈ రూపంలో మన సెల్‌ఫోన్‌లో ఉన్న లిథియం - అయాను బ్యాటరీ క్రమేపీ ఛార్జింగ్‌ అవుతుంది.
 

సెల్‌ఫోన్‌ ఛార్జర్లు ఛార్జ్‌ అవుతుండగా ముట్టుకొంటే షాక్‌ తగిలి కొందరు చనిపోయారంటే ఆ స్టెప్‌డౌన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సరిగా పనిచేయక మొత్తం 230 వోల్టుల విద్యుత్‌ సెల్‌ఫోన్‌ను చేరిందని అర్థం. ఆ వ్యక్తులు సరైన పాదరక్షలు (లేదా చెప్పులు, footwear) లేకుండా ముట్టుకున్నారని అర్థం. మన ఇంట్లోకి వచ్చే 230 వోల్టుల విద్యుత్‌ మరణాన్ని కల్గించేంత అధిక వోల్టేజీనే. కాబట్టి జాగ్రత్తగానే మసలుకోవాలి.

కాలుష్యాన్ని తగ్గించే ఆక్సైడ్స్‌!



       డీజిల్‌తో నడిచే వాహనాలు విపరీతమైన వాయుకాలుష్యాన్ని కలిగిస్తాయి. కాలుష్య నివారణకు ప్రస్తుతం డీజిల్‌ ఇంజన్లలో వాడే ప్లాటినమ్‌ స్థానంలో 'ముల్లైట్‌ ఆక్సైడ్‌' లను వాడితే కాలుష్యం తగ్గుతుందని టెక్సాస్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు. 'ముల్లైట్‌ ఆక్సైడ్‌' అనే పదార్థాన్ని వాడితే కాలుష్య మోతాదు 45% తగ్గిందని వీరు గుర్తించారు. పైగా, ప్లాటినం కన్నా ముల్లైట్‌ చాలా చౌక. పది టన్నుల ప్లాటినం ముడి ఖనిజం నుండి కేవలం పదిగ్రాముల లోహం తీస్తారు. రానున్న రోజుల్లో ముల్లైట్‌ ఆక్సైడ్‌ను కాలుష్య నివారణకు విస్తృతంగా వాడతారేమో చూద్దాం..!
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

పార్శ్వపునొప్పి తగ్గించే పరికరం..!



       భరించలేని తలనొప్పితో బాధపడే వారు రకరకాల అయింట్‌మెంట్లూ, టాబ్లెట్లూ, ఇంజెక్షన్లనూ వాడుతున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒక పరికరం రానున్నదట. ఎలక్ట్రిక్‌ షేవర్‌లా కనిపించే ఈ పరికరం బ్యాటరీలతో పనిచేస్తుంది. ఈ పరికరాన్ని మెడమీద కేవలం 90 సెకన్లు ఉంచుకుంటే చాలు పార్శ్వపు నొప్పి తీవ్రత తగ్గిపోతుంది. తీవ్ర, తలనొప్పులను లేకుండా చేయడమేకాక మళ్లీ రాకుండా కూడా చేస్తుందట ఈ పరికరం. మామూలు మందులకు స్పందించని శిరోభారాలకూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందట! కండరాలను కదిల్చి నొప్పిన హరిస్తుందని ఈ పరికరాన్ని రూపొందించిన వారు వివరిస్తున్నారు.

'మాయ'తో కాన్సర్‌ చికిత్స..!



      కాన్సర్‌ వ్యాధికి కారణాలు, చికిత్స కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ, ఇంతవరకు సరైన చికిత్సా పద్ధతి లభించలేదు. తాజాగా ఇజ్రాయెల్‌ పరిశోధకులు మూల కణాలతో (స్టెమ్‌ సెల్స్‌) కాన్సర్‌ని అడ్డుకోవచ్చని గుర్తించారు. ఈ చికిత్సలో 'మాయ' లేక ప్లాసెంటా లోని మూల కణాలని సేకరించి, వాటిలో కాన్సర్‌ కణాలతో పోరాడే మరిన్ని కణాలను అభివృద్ధిచేస్తారు. ఆ కణాలను ఎముక మజ్జలోకి ఎక్కించి, కొత్త మజ్జను రూపొందిస్తారు. అటువంటి మజ్జ నుండి లుకేమియా (రక్త కాన్సర్‌) వంటి కాన్సర్‌ను సమర్థ వంతంగా అడ్డుకోవచ్చని ఈ పరిశోధకులు భావిస్తున్నారు.

మరో గెలాక్సీ..!



     ఖగోళ పరిశోధనలో మరో ముందడుగు వేశారు అంతరిక్ష పరిశోధకులు. హబుల్‌ టెలిస్కోపు ద్వారా వారు మరొక గెలాక్సీని గుర్తించగలిగారు. మన సౌర కుటుంబానికి సుమారు 90 లక్షల కాంతి సంవత్సరాల దూరాన ఉన్న ఈ గెలాక్సీకి డిడిఓ 190 అని పేరు పెట్టారు. డిడిఓ అంటే 'డేవిడ్‌ డన్‌లాప్‌ అబ్జర్వేటరీ (David Dunlap Observatory)µ అని అర్థం. ఈ గెలాక్సీ మన పాలపుంత సమీపంలోనే ఉంది. డిడిఓ 190 లాంటి మరుగుజ్జు గెలాక్సీలు అంతరిక్షంలో చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో చాలావరకూ మిగతా గెలాక్సీలతో 'సత్సంబంధాలు' లేకపోవడం విశేషం.

చిప్‌ సైజ్‌లో ఉపగ్రహ థ్రస్టర్‌..!



        అంతరిక్షంలో అనేకానేక ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. సాధారణంగా ఇవి సౌరశక్తిపై ఆధారపడుతున్నాయి. అయినా, వాటిలో కాస్త భారీ స్థాయిలోనే ఇంజన్లు ఉంటాయి. అవి ఉపగ్రహం ముందుకు కదలడానికి అవసరమైన 'థ్రస్ట్‌' (శక్తి) ని అందిస్తాయి. చిన్న ఉపగ్రహాలకు అటువంటి భారీ ఇంజన్లు భారమే. ఈ తరుణంలో అమెరికాలోని మాసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పాలో లొజానో అనే శాస్త్రవేత్త అతి చిన్న థ్రస్టర్‌ని రూపొందించాడు. కేవలం ఒక రూపాయి నాణెమంత పరిమాణంలో కంప్యూటర్‌ చిప్‌ రూపంతో ఉండే ఈ పరికరం చాలా చిన్న ఉపగ్రహాలను ముందుకు నడిపించగలదు. ఈ పరికరంలో సుమారు 500 సూక్ష్మ బొడిపెలు ఉంటాయి. విద్యుత్‌ అవసరమైనపుడు ఈ బొడిపెల నుండి అయాన్లు ఏకధాటిగా విడుదల అవుతాయి; అవే శక్తిని అందిస్తాయి.

జీవసాంకేతికాలు ... వినియోగం ... జాగ్రత్తలు ...



         జీవసాంకేతికాలు ఆధునికాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్నాయి. సాంప్రదాయ ప్రజననం (బ్రీడింగ్‌) తో రూపొందిన అధికదిగుబడి వంగడాలు, హైబ్రిడ్‌లు, ఇతర ఉత్పత్తి సాంకేతికాలు, స్వాతంత్య్రం తర్వాత 65 ఏళ్లలో వ్యవసాయోత్పత్తిని ఎన్నోరెట్లు పెంచాయి. కొత్త గా అందుబాటులోకి వచ్చిన టిష్యూ కల్చర్‌, జన్యు మార్పిడి సాంకేతికాలు మరిన్ని అవకాశాల్నిచ్చాయి. వీటి వినియోగం రాజకీయ నిర్ణయాలతో ఇమిడి వున్నాయి. కొత్త సాంకేతికాలు, ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, ఎన్నో ఆరోగ్య, పర్యావరణ, సుస్థిరోత్పత్తి సమస్యలను సృష్టిస్తున్నాయి. గత పదేళ్లుగా విస్తారంగా సేద్యమవుతున్న బిటి పత్తి విరు ద్ధ, వైవిధ్య ధోరణు లను వెల్లడిస్తోంది. ఈ సమయంలోనే అంతర్గత విష (ఎండో టాక్సిన్‌) సాంకేతికాలతో రూపొందే ఆహా రాన్ని (బిటి వంగ) మనదేశంలో అనుమతించాలనే వత్తిళ్లూ పెరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేకతతో దీని విడుదల నిలిచిపోయింది. ఇలా నిలిపేసిన మంత్రిని ఆ శాఖ నుండి తప్పించారు. బిటి వంగనే అనుమ తిస్తే, ఇలాంటివే మరో 15-20 పంటలు విడుదలకు ఎదురుచూస్తున్నాయి. ఇదే జరిగితే, రాబోయే పర్యా వరణ, ఆరోగ్య, అస్థిరసమస్యల్ని ఎదుర్కోడానికి మన వ్యవస్థ సిద్ధంగా ఉన్నదా? అనే ప్రశ్న ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్‌కమిటీ వాసుదేవ ఆచార్య అధ్యక్షతన ఈ సమస్యల్ని అన్నికోణా ల్లో అధ్యయనం చేసింది. విస్తృత సాక్ష్య సేకరణ తర్వాత జీవ సాంకేతికాలను మరింత సురక్షితంగా విని యోగించడానికి ఎన్నో విలువైన సూచనల్ని చేసింది. వీటిలో ముఖ్యాంశాల్ని ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
సాంప్రదాయ జీవసాంకేతికాలు (ప్రజననంతో) వ్యవసాయోత్పత్తిని ఎన్నో రెట్లు పెంచాయి. పశుపోషణ, చేపల పెంపకం, పాడి, పౌల్ట్రీరంగాలూ అభివృద్ధి చెందాయి. అందుబాటులోకొచ్చిన టిష్యూ కల్చర్‌ పండ్లతోటల ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడింది. వీటి ఉత్పత్తి పెరుగుదలలో వచ్చిన స్థబ్ధత, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో వుంచుకొని, ఆధునిక జీవ సాంకేతికాల వినియోగంపై దృష్టి మరల్చారు. వీటికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జన్యు మార్పు, మార్పిడి (రీకాంబి నెంట్‌ డిఎన్‌ఎ) సాంకేతికాలతో గతంలో సాధ్యపడని విధంగా సమస్యలకు కొత్త పరిష్కారం చూపిస్తూ, దిగుబడిని బాగా పెంచటానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు.
ఈ కొత్త సాంకేతికాలను పూర్తిగా అదుపులో వుంచి (కంటైన్‌మెంట్‌) వినియోగించినప్పుడు మంచి ఫలితాలనిచ్చాయి. ఉత్పాదకతను పెంచాయి. ఫర్మెంటేషన్‌లో, వ్యాక్సిన్‌ లు, ఎంజైమ్‌ల తయారీలో, వైద్య రంగంలో ఇవి మంచి ఫలితాల్నిచ్చాయి. కానీ, వ్యవసాయోత్పత్తిలో ఈ సాంకేతికాల్ని ఇదే విధంగా అదుపులో వుంచి వినియోగించడం సాధ్యంకాదు. ప్రధానంగా పర్యావరణ, సుస్థిరోత్పత్తి సమస్యలు, ఆరోగ్యసమస్యలు ముందుకొస్తున్నాయి. అందువల్ల, వ్యవసాయోత్పత్తిలో జన్యుమార్పు, మార్పిడి (జన్యు ఇంజనీరింగ్‌) పద్ధతులను ఎంతో జాగ్రత్తగా వినియోగించాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కమిటీ అంతిమంగా సూచించింది. కమిటీ సూచనలను వెంటనే అమలుచేయాలనీ సూచించింది. ఈ సూచనలకు అనుగుణంగా నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థలనూ అమలుచేయాలనీ పేర్కొంది. అంతవరకూ జన్యుమార్పిడి పంటల పరిశోధనలను కచ్ఛితంగా పూర్తి అదుపులో వుండే వాతావరణంలోనే కొనసాగించాలనీ, క్షేత్రస్థాయిలో బహిరంగ పరిశోధనలకు అనుమతించకూడదనీ సూచించింది.
నియంత్రణ వ్యవస్థ..
ఇప్పటి నియంత్రణ (రెగ్యులేటరీ) వ్యవస్థను ప్రధానంగా 'జన్యు మార్పిడి ఇంజ నీరింగ్‌ అంచనా కమిటీ (జి.ఇ.ఎ.సి)' నిర్వహిస్తుంది. గతంలో ఈ కమిటీని జన్యుమార్పిడి ఇంజనీరింగ్‌ ఆమోదకమిటీగా వ్యవహరించేవారు. బిటి వంగ అనుమతి సమయంలో తలెత్తిన సమస్యల్ని దృష్టిలో వుంచుకుని కేంద్రప్రభుత్వం ఈ మార్పును చేసింది. అయితే, ఈ కమిటీ పనివిధానంలో ఏ మార్పునూ చేయలేదు. ఈ కమిటీ పనిలో ఎన్నో లోపాలను పార్లమెంటరీకమిటీ గుర్తించింది. ఈ కమిటీ కేవలం ప్రభుత్వ కార్యనిర్వాహణ, నియమాలకు లోబడి ఏర్పర్చబడింది. నేరుగా, పార్లమెంటు పర్యవేక్షణలోకి రాదు. ఈ కమిటీ నిర్వర్తిస్తున్న అతి కీలక, ముఖ్య బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది సమర్థవంతంగా పనిచేయడానికి కావలసిన వనరులనూ సమకూర్చాలనీ పేర్కొంది. తద్వారా, పార్లమెంటు నిర్ణయాలకు లోబడి ఈ కమిటీ పనిచేసేలా నియమాల్ని, నిబంధనల్ని మార్చాలని స్టాండింగ్‌ కమిటీ సూచించింది.
నిరోధకశక్తి లేని విజ్ఞాన వినియోగం..
యాంటిబయాటిక్‌ నిరోధకశక్తి లేని జన్యు సాంకేతిక విజ్ఞానాన్ని జన్యుమార్పిడి పరిశోధనలో వినియోగించాలని ఐరాసకు సంబంధించిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థల నిపుణుల కమిటీలు, అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర సాంకేతి కాభివృద్ధి అధ్యయనం సూచించాయి. జీర్ణకోశంలోవున్న బ్యాక్టీరియా, తదితర సూక్ష్మజీవులకు ఈ జన్యుమార్పిడి అవకాశాలు తక్కువుగా ఉన్నప్పటికీ, ఆరోగ్యభద్రత దృష్టిలో పెట్టుకొని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్టాండింగ్‌ కమిటీ సూచించింది. అయితే, ఇప్పటివరకు జన్యుమార్పిడి పంటల రూపకల్పనలో ఈ ప్రక్రియ అమలుచేయలేదు. అన్ని పంటల్లో కేవలం యాంటిబయాటిక్‌ నిరోధకశక్తిగల జన్యు ప్రక్రియల్నే వినియోగించారనీ కమిటీ గుర్తించింది. ఇది విధానపర నిర్ణయమని, జన్యుమార్పిడి పంటల రూపకల్పనలో నిరోధకశక్తి లేని జన్యు సాంకేతిక ప్రక్రియల్నే వాడాలనీ నిర్ణయిస్తే, ఇప్పుడున్న ఫలితాలన్నీ నిరుపయోగంగా మారతాయనీ స్టాండింగ్‌ కమిటీకి జన్యుమార్పిడి కమిటీ సూచించింది. అయితే, కొత్తగా రూపొందే జన్యుమార్పిడి పరిశోధనల్లో ఈ నూతన సాంకేతికాన్ని అమలుచేయవచ్చని కమిటీ చెప్పింది. దీనిపై పార్లమెంటరీకమిటీ తన తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తూ ఇలాంటి సూచనలు కంపెనీలకు అనుగుణంగానే ఉన్నాయేగానీ, ప్రజాప్రయోజనాల పరిరక్షణకు తోడ్పడవనీ, ఇది జన్యుమార్పిడి కమిటీ పనివిధానాన్ని తెలుపుతుందని విమర్శించింది. పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహారభద్రతల విషయంలో పర్యవేక్షించాల్సిన సంఘం ఇలాంటి సూచనలు చేయడం తప్పని విమర్శించింది. అందువల్ల, ఇంత బాధ్యత కలిగిన అంశాలను కేవలం కమిటీకి వదలకూడదని, పార్లమెంటు పర్యవేక్షించాలని సూచించింది.
ఆరోగ్య సమస్యలు..
పశు దాణాలో బిటి పత్తిగింజల్ని వాడటంవల్ల పశువుల్లో ఎర్ర రక్తకణాలు పెరి గాయని, తెల్లరక్త కణాలు తగ్గాయని, కాలేయం, వృషణాల బరువు, కొవ్వుశాతం పెర గడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యంపై బిటి ఉత్పత్తుల ప్రభావాన్ని క్షుణ్ణంగా అధ్యయ నం చేయించాలని కోరింది. గొర్రెపిల్లల్లో కూడా ఇలాగే మూత్రపిండాలు, క్లోమ గ్రంథి, గుండె, ఊపిరితిత్తులు బరువు బిటి పత్తిగింజల ఆహారంవల్ల పెరిగాయనీ కమిటీ గుర్తించింది. అందువల్ల, బిటి ఆహార ప్రభావాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించింది. ఏ కారణంతోనూ కేంద్ర ప్రభుత్వం ఈ అధ్యయనాన్ని ఆటంకపరచవద్దని కూడా కమిటీ స్పష్టంగా పేర్కొంది. కానీ, ప్రభుత్వం మాత్రం జన్యుమార్పిడి సాంకేతికం కొత్తదైనందున పర్యావరణం, జీవవైవిధ్యం, జీవరక్షణ, మానవ ఆరోగ్యం, జంతుజాలాల ఆరోగ్యంపై గల ప్రభావాల్ని ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే బిటి ఉత్పత్తులకు అను మతిస్తున్నామని స్టాండింగ్‌ కమిటీకి చెప్పింది.దీర్ఘకాలం బిటి ఆహారాన్ని వినియోగిస్తూ ఆరోగ్యంపై దీని ప్రభావాలు అధ్యయనం చేయాలనీ కమిటీ సూచించింది. ఈ విషయంలో ఏ ప్రయత్నమూ లేదనీ కమిటీ విమర్శించింది.
భారాలు, లాభాల పంపిణీ..
ఆధునిక జీవ సాంకేతిక ప్రక్రియలు ఖర్చుతో కూడినవనీ, అదే సమయంలో లాభాల్ని అందిస్తాయనీ కమిటీ గుర్తించింది. పర్యావరణవ్యవస్థ, సమాజంలో ఈ సాంకేతికాలను ఇమిడ్చినతీరు భారాలు, లాభాల పంపిణీని నిర్దేశిస్తాయని కమిటీ పేర్కొంది. వీటివల్ల, జీవవైవిధ్యం తగ్గిపోతుందనీ, సాంప్రదాయ ఆహారాన్ని దూరం చేస్తుందనీ గుర్తించింది. ఇవి అసమానతల్ని పెంచుతున్నాయనీ, పేదలు, ఉత్పత్తిదారులు భారాల్ని స్వీకరిస్తుండగా, కంపెనీలు, ముఖ్యంగా విత్తన కంపెనీలు, లాభాల్ని పొందుతున్నాయని స్టాండింగ్‌కమిటీ పేర్కొంది. బిటి పత్తి వల్ల ఉత్పత్తి పెరిగినప్పటికీ, రైతుల ఖర్చులు పెరిగాయని. వారి రిస్క్‌ పెరిగిందనీ, అదేమేర ఆదాయం పెరగలేదనీ కమిటీ గుర్తించింది. ఫలితంగా, స్థానిక వ్యవసాయ ఆర్థికవ్యవస్థ కొన్ని సంవత్సరాల్లోనే దెబ్బతిందనీ కమిటీ పేర్కొంది. అందువల్ల పరిశోధనలు, స్థానికంగా సమాజం ఆధ్వర్యంలో మాత్రమే కొనసాగాలనీ, సమాజంలో ఈ కొత్త సాంకేతికాలు ఇమడ్చబడాలనీ, పేదలకు లాభాలు అందేలా (ప్రభుత్వం) జోక్యం ఉండాలనీ కమిటీ సూచించింది.
లేబులింగ్‌..
జన్యుమార్పిడి ఉత్పత్తులను వినియోగించాలా? లేదా? అని పూర్తిపరిజ్ఞానంతో నిర్ణయించుకునే అవకాశం, హక్కు వినియోగదారునికి ఉండాలనీ, దీనికనుగుణంగా నిబంధనల్ని చేర్చాలనీ కమిటీ అభిప్రాయపడింది. చైనాలాంటి అతి పెద్ద దేశంలోనే జన్యుమార్పిడి పంటల ఉత్పత్తులను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్‌ ఉన్నప్పుడు, మన దేశంలోనూ ఇది ఎందుకు సాధ్యం కాదనీ, బిటి ఉత్పత్తులను గుర్తించేలా స్పష్టమైన లేబులింగ్‌ ఉండాలనీ కమిటీ పేర్కొంది.
దేశ జన్యు వనరుల దుర్వినియోగం..
మహికో-మోన్‌శాంటో కంపెనీ సాధికారిక, జాతీయ, జీవవైవిధ్య సంస్థ అను మతిలేకుండానే స్థానిక వంగను బిటి వంగగా రూపొందించడానికి వినియోగించింది. ఇలా ఉల్లిపాయల వినియోగానికి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంది. ఇలాంటి జన్యుపర దుర్వినియోగాన్ని తప్పక నిరోధించాలనీ కమిటీ ఎత్తి చూపింది.
ఎంత తేడా..?
ఆరోగ్య ప్రభావాల్లో బిటి పత్తి, బిటి వంగలలో ఎంతో తేడా వుంది. వంగను కోసే సమయానికి ఆ కాయల్లో బిటి విషం కాయతొలుచు పురుగును చంపగలిగే స్థాయిలో వుంటుంది. అది కోసిన వెంటనే తినడం వల్ల బిటి విషం నేరుగా మన జీర్ణకోశంలోకి ప్రవేశి స్తుంది. దానిలోని సూక్ష్మజీవులను ఈ విషం ప్రభావితం చేసే అవకాశాలు న్నాయి. కానీ, పత్తి అలాకాదు. దీని దూదిని సేకరించాక చాలాకాలం తర్వాత దుస్తులు తయారీలో ఉపయోగిస్తారు. గింజల్ని కూడా ఎంతోకాలం నిల్వ వుంచాక, నూనె తీసి వాడుతున్నారు. పత్తి గింజల చెక్కను పశువుల దాణాగా వాడతారు. అందువల్ల, ఈ పత్తి వల్ల ఆరోగ్య సమస్యలు ఆలస్యంగా వస్తాయి. కాబట్టి, బిటి వంగ హానికరంకాదనీ చేసే ప్రచారం పూర్తిగా తప్పు.
ఎందుకిలా..?
రైతులే తమ విత్తనాన్ని సొంతంగా సేకరించుకుని, వినియోగించుకోవడానికి అధిక దిగుబడి వంగడాలు ఉపయోగపడతాయి. వరిలాంటి పైర్లలో జరిగేది ఇదే. ఈ లక్ష్యంతో ధార్‌ వార్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, పూనాలోని పత్తి పరిశోధనా కేంద్రం, బికనీర్‌ నార్మాలో బిటి జన్యువును (క్రైవన్‌ ఏసి) పెట్టింది. ఈ జన్యువును ప్లాంట్‌ బయోటెక్నాలజీ జాతీయ పరిశోధనా కేంద్రం సరఫరా చేసింది. అయితే, విడుదల చేసే సమయంలో దీనిలోని బిటి జన్యువు మహికో మోన్‌శాంటో పేటెంట్‌ను పోలి వుందనీ ఫిర్యాదు రావడంతో దీని విడుదలను కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలి నిలిపివేసింది. ఇదే విధంగా ఎన్‌హెచ్‌హెచ్‌ 44లోనూ బిటి జన్యువు ప్రవేశపెట్టారు. చివరినిమిషంలో దీని విడుదలా ఆగిపోయింది. పరోక్షంగా ఇది మహికో, మోన్‌శాంటోకూ పత్తిలో గుత్తాధిపత్యం కొనసాగడానికి తోడ్పడింది. ఇలా ఎందుకైంది అనేదే ప్రశ్న. స్టాండింగ్‌ కమిటీ దీనిపై అత్యంత ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పరిశోధనా సంస్థల్లో జరిగిన, జరుగుతున్న పరిశోధనల ఆలస్యాన్నీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలి చర్య తీసుకోవాలని కోరింది. ఇది అమలవుతుందా? అమలైతే ఎంత కాలానికి? వేచి చూడాల్సిందే.
సాధికార జీవ సురక్షిత వ్యవస్థ
సాధికార జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు గురించి ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ఆలోచిస్తుంది. కానీ, జీవవైవిధ్యం, పర్యావరణం, మానవుల, ఇతర జీవాల ఆరోగ్యం, తదితర నియంత్రణ అన్నీ జీవ సాంకేతిక విజ్ఞాన సాంకేతికంలో ముఖ్యమైనవి. వీటన్నింటినీ ఒకే పరిధిలోకి తీసుకొస్తూ పార్లమెంటు చట్టం ద్వారా సాధికార జీవ సురక్షిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా జన్యుమార్పిడి ఉత్పత్తుల వినియోగ ప్రోత్సాహం ప్రమాదకరమైందని కమిటీ అభిప్రాయపడింది. జీవ సాంకేతిక సురక్షణ విషయంలో భయాలున్నప్పటికీ, ఉత్పత్తిదారులపై ఏ బాధ్యతనూ ఉంచకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. రైతుల, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా జవాబుదారీగా వుంటూ బాధ్యత తీసుకునే ఏర్పాటు ఉండాలని కమిటీ పేర్కొంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

Friday 17 August 2012

యాగాలు-ఫలితాలు..


  • అశాస్త్రీయ ఆచారాలు16
'కాంతారావుగారూ! యాగాల వలన ఫలితాలు ఉంటాయా?' తిరుపతి నుండి 1.7.2012న మిత్రుడు రాజయ్య ఫోన్‌ చేశారు.
'యాగాలు అనే ప్రయోగాలు ఇటీవల మన రాష్ట్రంలో మూడుసార్లు జరిగాయి! ప్రకటించిన ఫలితాలేవీ రాలేదు' అన్నాను నేను.
'ఆ ప్రయోగాలు ఎప్పుడు, ఎక్కడ జరిగా యండీ?' మరల ప్రశ్నించారు రాజయ్య.
'చెబుతాను. మొదటిప్రయోగం 24.6. 2009 నుండి మూడురోజులు రాష్ట్రంలోని 1100 దేవాల యాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణయాగాన్ని నిర్వహించారు. యాగం తర్వాత వానలేమీ పడలేదు. ఇది మొదటి ప్రయోగఫలితం. రెండోసారి 2.7.2009 నుండి మూడురోజుల పాటు తిరుపతి, హైదరాబాదుల్లో 'అష్టోత్తర శతకుండాత్మక మహావరుణయాగం' పేరిట నిర్వహించబడింది. అయినా, వానలు కురవలేదు. దీనికి ఋజువు 9.7.2009 నాటి పత్రికల వార్తలు. ఆనాటి 'ఈనాడు' దినపత్రిక 'చినుకమ్మా! రాలమ్మా!' అనే శీర్షికతో వర్షాభావాన్ని వార్తగా ప్రచురించింది.
అలాగే 'డక్కన్‌ క్రానికల్‌' పత్రిక 'ఓన్లీ క్లౌడ్స్‌, నో రెయిన్స్‌' అనే శీర్షికతో ఫొటో సహా వార్తను మొదటిపేజీలో ఇచ్చింది. ఇది రెండోప్రయోగ ఫలితం.
మూడవ ప్రయోగం 2012 ఏప్రిల్‌ 21 నుండి మే 2 వరకు భద్రాచలంలో 'అతిరాత్ర యాగం' పేరు తో జరిపారు. దాని ఫలితం వానలు బాగా వస్తాయనీ, పంటలు బాగా పండుతాయనీ, అతిరాత్రం చివరి రోజున కుంభవృష్టి కురుస్తుందనీ ఒక కరపత్రంలో ప్రకటించారు. ఆ ప్రయోగ ఫలితమేమిటి?
ఈ ఏడాది ఏప్రిల్‌ 25,29 తేదీల్లో బీభత్సంగా గాలివాన కురిసి అరిటి, మామిడి, బొప్పాయి తోటలకు, అలాగే మిరప, వరి పంటలకు అపారనష్టం జరిగిందని (26/4 మరియు 30/4) నాటి పత్రికలన్నీ ఫొటోలతో సహా ప్రచురించాయి. ఇదేనా మంచివాన అంటే? ఇదేనా పంటలు బాగా పండుతాయనే ప్రచారానికి అర్థం? అన్నిటికంటే ముఖ్యంగా అతిరాత్రం చివరిరోజున ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. ఇదేనా కుంభవృష్టి అంటే? కాబట్టి, ఈ ప్రయోగంలో చెప్పిన ఏ ఒక్క ఫలితమూ రాకపోగా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇంతకీ మీరు ఈ యాగాలు, ఫలితా లను గూర్చి ఎందుకడిగారు?' అడిగాను నేను.
'ఏంలేదండీ! ఈ రోజు (జులై) నుండి 5వ తేదీ వరకూ దక్షిణ మండల విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో వరుణయాగం జరుగుతోంది. దాని ఫలితాలను గూర్చి మీ అభిప్రాయం తెలుసుకుందామ'ని జవాబిచ్చారు రాజయ్య.
'రాజయ్యా! నా అభిప్రాయం కాదిక్కడ కావల సినది. తిరుపతిలో 'వరుణ యాగం' అనే మరో ప్రయోగం జరుగుతోంది. దాని ఫలితాల కోసం వేచి ఉందాం' అని ఫోను పెట్టేశాను.
మరునాటి నుండి రాజయ్యకు రోజూ ఫోన్‌ చేస్తూనే ఉన్నాను. ఆయన అందించిన వివరాలే మిటి? 5వ తేదీ యజ్ఞం ముగిస్తే 8 వరకు చినుకు లేదు' 9, 10, 11 తేదీలలో రాత్రిపూట కొద్ది పాటి జల్లులు. 12న మాత్రమే మంచి వర్షం పడింది. 15-7-2012న విస్తారంగా వర్షాలు పడ్డాయని 16-7-2012 నాడు పత్రికలన్నీ మొదటిపేజీ వార్తలు ప్రచురించా యి. ఆ రోజున రాజయ్యకి ఫోను చేసి 'వరుణయాగాలు, అతిరాత్ర యాగాలను గూర్చి మీ అభిప్రా యం ఇప్పుడు చెప్పండి' అన్నాను.
ఆయన 'ప్రయోగ ఫలితాలే నా అభిప్రాయం. మీరు చెప్పిన ప్రకారం ఇటీవలి కాలంలో నాలుగు సార్లు యాగాల ప్రయోగం చేయబడింది. ప్రతిసారీ పండితులుగా చెప్పుకునేవారు చెప్పిన ఫలితాలకు వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. వరుణయాగాల వలన వానలు పడలేదు. అతిరాత్రం వలన సువృష్టిగానీ, సస్య సమృద్ధిగానీ జరగలేదు. యాగం చివరిరోజున కుంభవృష్టి కురవలేదు; అసలు వానపడలేదు. కాబ ట్టి పై ప్రయోగాలన్నీ వరుణయాగాల వలన వానలు పడవనీ, అతిరాత్రం వలన మంచి వానలు పడవనీ, పంటలు పండవనీ నిరూపణైంది. అందువల్ల, ఈ ప్రయోగ ఫలితాలను అర్థంచేసుకని, అందరూ యాగాలను నమ్మడం మానుకుంటే చాలు' అన్నారు.
'ప్రయోగాల ద్వారా రుజువైన ఫలితాలను అంద రూ నమ్మేరోజు వస్తుందండీ' అన్నాను నేను. 'అలాగే ఆశిద్దాం' అని ఫోను పెట్టేశారు రాజయ్య.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

మరో హరిత విప్లవం.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి..


పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల అవసరాలను తీర్చాలన్నా, కొనసాగుతున్న రైతుల సంక్షోభాన్ని పరిష్కరించాలన్నా 'మరో హరిత విప్లవం' రావాలని, ఇది తప్పదని 'ప్రపంచీకరణ సమర్థకులు' ప్రచారం చేస్తున్నారు. దీనిని 'రెండో హరిత విప్లవం'గా లేక 'శాశ్వత హరిత విప్లవం'గా పిలుస్తున్నారు. ఇది ఎలా సాధించబడుతుందో స్పష్టంగా తెలపనప్పటికీ వ్యవసాయరంగ కార్పొరేటీకరణ ద్వారా రావాలని వీరు ఆకాంక్షిస్తున్నారు. ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు రైతుల్ని దుర్భిక్ష పరిస్థితుల్లోకి నెట్టి, వారి బతుకుల్ని అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతరం కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2011 మార్చి నాటికి దాదాపు 2.68 లక్షల మంది రైతులు ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారని అధికార గణాంకాలే తెలుపుతున్నాయి. అయినా, పాలకులు చలించడం లేదు. సంక్షోభకారక విధానాలను పునరాలోచించి, మార్చడం లేదు. ఈ పరిణామాలు స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా లేవని ఎంతోమంది మేధావులు విమర్శిస్తున్నా, వీటిని వేగంగా అమలుపరచిన వారిని ఎన్నికల్లో ఓడిస్తున్నా, వీటి సమర్థకులు పట్టించుకోవడం లేదు. పైగా, సంక్షోభకారక విధానాలను మరింత జాగ్రత్తతో మభ్యపూర్వకంగా రూపొందించి, అమలుచేస్తున్నారు. ఇలా వస్తున్నవే 'కంపెనీ, కాంట్రాక్టు సేద్యాలు'. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో అమలుచేసిన, చేస్తున్న సాంకేతికాలు, పద్ధతులు, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకి విరుద్ధంగా వున్నాయి. రాగల దుష్పరిణామాలను 'రైతు విత్తనహక్కుల వేదిక - ఆంధ్రప్రదేశ్‌' సంయుక్త కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
''వలసపాలన నశించాలి.. విదేశీ (బ్రిటీష్‌) పాలకులారా! మా దేశం విడిచి వెళ్లండి. మా దేశాన్ని మేమే పాలించుకుంటాం. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌... స్వాతంత్య్రం వర్థిల్లాలి.. స్వాతంత్య్రం మా జన్మహక్కు'' ఇదీ ఆనాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి. ఈ పోరాటంలో 'దున్నేవాడికే భూమి' అనే నినాదం ముందుకొచ్చింది. ఆనాటి కాంగ్రెస్‌ దీనికను గుణంగా ఓ తీర్మానాన్ని కూడా చేసింది. కానీ, గత రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు ఈ స్ఫూర్తిని వమ్ముచేస్తున్నాయి.
స్వాతంత్య్రం తర్వాత తెచ్చిన భూసంస్కరణల్లో జమిందారీ, ఇనాందారీ వంటి మధ్యదళారీ వ్యవస్థ సంబంధాలు నిర్మూలించబడ్డాయి. దున్నేవానికి భూమి అందక పోయినా కొంతమేర భూ వికేంద్రీకరణ జరిగింది. ఇది ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడింది.
రూపొందించిన అధిక దిగుబడి వంగడాలు, విస్తరించిన సాగునీటి సౌకర్యాలు, పరిశోధన, విస్తరణ సేవల మద్దతు, అవసర ప్రాతిపదికన చేపట్టిన పరిమిత యాంత్రీకరణ, రుణ సౌకర్యం, కనీస మద్దతు ధరల రూపంలో మార్కెట్‌ మద్దతు, ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోళ్లు వ్యవసాయోత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇవన్నీ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనసాగాయి. ఈ పెరుగుదలనే 'హరిత విప్లవం'గా పిలుస్తున్నాం.
ఈ కాలంలో ఉత్పత్తి పెరుగుదల అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. సాగునీటి వసతి గల చోటే బాగా ఉంది. ఇది వేరే విషయం - అధిక దిగుబడి వంగడాల నుండి రైతులు సొంత విత్తనాల్ని తయారుచేసుకుని, వాడుకునేవారు. ఇవన్నీ సమిష్టిగా మొదటి హరిత విప్లవానికి కారకాలుగా కొనసాగాయి.
పెరుగుదల స్తబ్ధత...
అయితే, సాంకేతికాల అమలులో ముఖ్యంగా, పోషక యాజమాన్యం, సస్యరక్షణ అమలులో, ఉపకరణాలను సమయానుకూలంగా అందించే వ్యవస్థలో లోపాలు జరిగాయి. ఈ లోపాలు ఉత్పాదకతను పెంచడానికి అవరోధంగా మారాయి. స్తబ్ధత ఆవిర్భవించింది. కానీ, 1980 దశకంలో పెరిగిన ఉత్పత్తి ప్రధానంగా అన్నిరకాల ఉపకరణాల వినియోగాన్ని పెంచడం ద్వారా సాధ్యపడింది. ఫలితంగా, వీటి వినియోగ సామర్థ్యం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల అమలు ప్రారంభమైంది.
వ్యవసాయ కార్పొరేటీకరణ...
చిన్న కమతాలు వ్యవసాయ కార్పొరేటీకరణకు ఆటంకమని, ఖర్చుతో కూడిన కొత్త సాంకేతికాలను ఇవి ఇముడ్చుకోలేవని పాలకులు భావిస్తున్నారు. అలా ప్రచారమూ చేస్తున్నారు. ఈ విషయంలో జపాన్‌, చైనాలాంటి దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం లేదు.
వ్యవసాయ కార్పొరేటీకరణకు 2000 ప్రాంతంలో విడుదల చేసిన ద్రవ్య వినియోగ సంస్కరణల నివేదిక నాలుగు మార్గాల్ని సూచించింది. దీనిలో కౌలుకు భూముల్ని తీసుకునే జాయింట్‌ స్టాక్‌ కంపెనీ నమూనాను చిత్తూరుజిల్లా కుప్పం వద్ద భారీ ఖర్చుతో అమలుచేశారు. రైతులకు కంపెనీ కౌలు చెల్లించలేకపోయింది. ప్రభుత్వమే చెల్లించాల్సి వచ్చింది. ఇది పూర్తిగా విఫలమైంది. రెండో నమూనాలో జాయింట్‌ స్టాక్‌ కంపెనీ సేద్యాన్ని సహకార సేద్యం పేరుతో అమలుచేయ ప్రయ త్నించింది. కంపెనీకి ఇచ్చిన భూములకు బదులుగా రైతులు షేర్ల సర్టిఫికెట్లను పొందాలి. కంపెనీ పిలిచినప్పుడే కూలి పనికి పోవాలి. లాభాల్ని చూపిస్తే షేర్లకను గుణంగా రైతులకు ఆదాయం వస్తుంది. దీనిలో వాస్తవాలను గ్రహించిన రైతులు ఈ నమూనాను ప్రారంభానికి ముందే తిరస్కరించారు. ఫలితంగా కాంట్రాక్టు సేద్యాన్ని ఇప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. దీనికోసం చట్టబద్ధమైన ఏర్పాట్లను చేస్తోంది. కార్పొరేటీకరణ వల్ల రైతులు కొత్తరకం బానిసలుగా మారతారు.
కాంట్రాక్టు సేద్యం.. దుష్ప్రభావాలు...
మన రాష్ట్రంలోనే కోళ్ల పెంపకంలో అమలుచేసిన కాంట్రాక్టు సేద్యం చిన్న ఉత్పత్తిదారుల్ని పూర్తిగా కనుమరుగు చేసింది. కోళ్ల ఉత్పత్తిరంగం పూర్తిగా కంపెనీల వశమైంది. వృత్తి కోల్పోయిన రైతులు ఇతర రంగాల్లోకి మళ్లాల్సి వచ్చింది. దీనిలో ఇప్పుడు కేవలం కూలీలు పనిచేస్తున్నారు. ఇదే నమూనాను వ్యవసాయరంగానికి పూర్తిగా విస్తరిస్తే రానున్న పరిణామాలు భయంకరంగా వుంటాయి. చిన్న ఉత్పత్తిదారులు కొన్ని పంటల్లోనే కనుమరుగవుతారని పౌల్ట్రీ కాంట్రాక్టు పెంపకం నిర్ద్వందంగా నిరూపిస్తుంది.
ఇపుడు అమలవుతున్న కాంట్రాక్టు సేద్యం పూర్తిగా అసమానతలతో కూడినది. కాంట్రాక్టు కంపెనీలకి ఏ అర్హతా అవసరం లేదు. కేవలం రిజిస్ట్రేషన్‌, కొంత పెట్టుబడి వుంటే చాలు. ఇంతా చేస్తే, కాంట్రాక్టు ఉత్పత్తిని తప్పనిసరిగా కొనాల్సిన నిబంధన లేదు. ఏదో పేరుతో కొనకుండా తప్పించుకునే అవకాశం కంపెనీలకు కల్పించబడింది. అసలు రాతపూర్వక ఒప్పందాలు లేకుండానే 90 శాతం కమతాల్లో ఈ సేద్యం కొనసాగుతోంది. ఏ చట్టమూ, నియమమూ నిర్దేశించిన విధంగా అమలుకావడం లేదు.
కూరగాయ రైతుల అనుభవాలు..
రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పాల ఉత్పత్తిని చిన్న రైతులే చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలో రెండు గ్రామాలను ఈ నెల 10వ తేదీన పరిశీలించడం జరిగింది. వీరంతా మిశ్రమ సేద్యం చేస్తున్నారు. నీటి లభ్యతను బట్టి వరి, ఆ తర్వాత కూరగాయలు (ఎక్కువగా ఆకుకూరలు), పాడి పశువుల్ని పెంచుతున్నారు. రెండెకరాలలోపు రైతులు కూడా తమ శ్రమతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం ఖర్చులకు ఇబ్బందులు పడుతు న్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా (బోరుబావులు, భూగర్భజల వనరు, కరెంటు సరఫరా) తమ సేద్యాన్ని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోగలుగుతున్నారు. బీమా పథకం సాయం లేకున్నా సేద్యంలో రిస్క్‌ను తమదైన పద్ధతిలో తట్టుకోగలుగు తున్నారు. ఈ గ్రామాల్లో కూరగాయల కాంట్రాక్టు సేద్యాన్ని ప్రవేశపెడితే ఇలా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం సాధ్యం కాదు.
ఈ రైతుల ఆదాయం ప్రధానంగా అమ్మే సమయంలో ఉత్పత్తికి గిట్టే ధర మీద ఆధారపడుతుంది. కాంట్రాక్టు ఉత్పత్తిలో ఒకవేళ కంపెనీ కొనకపోతే రైతులు బాగా నష్టపోవాల్సి వస్తుంది. తక్షణం ప్రత్యామ్నాయ మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్మాల్సి వస్తోంది (అమ్ముడుపోతే). ఈ కంపెనీల స్థానంలో ఉత్పత్తిదారుల సహకార, సేవా, మార్కెట్‌ సంఘాలు లేదా రైతుల కంపెనీల ఆధ్వర్యంలో ఉత్పత్తి కొనసాగితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సుస్థిర ఉత్పత్తి పద్ధతుల ద్వారా మిశ్రమ ఉత్పత్తిని కొనసాగించవచ్చు. ఇదే ప్రయివేటు కంపెనీల కాంట్రాక్టు సేద్యంలో సాధ్యం కాదు.
సరళీకరణ కాలంలో..
హరిత విప్లవ కాలంలో రైతులకు మద్దతుగా ఏర్పర్చిన అన్నిరకాల ప్రభుత్వవ్యవస్థలు క్రమంగా క్షీణింపజేయబడ్డాయి. వీటన్నింటిలో ప్రయివేటు సంస్థల పాత్ర పెంచబడింది.ప్రయివేటు కంపెనీలు విత్తనోత్పత్తి, సరఫరా లపై కేంద్రీకరించాయి. అధిక దిగుబడి వంగడాలకు బదులు లాభాల్నిచ్చే హైబ్రిడ్‌ విత్తన సరఫరాపై కేంద్రీకరించాయి. తద్వారా వ్యవసాయోత్పత్తిలో వినియోగించే అన్ని సాంకేతికాలను ప్రభావితం చేయగలుగుతున్నాయి. రైతుల్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సబ్సిడీతో విత్తనాలను అందిస్తూ సొంత విత్తనం బదులు కొని, వాడేలా ప్రభుత్వం అలవాటు చేసింది, చేస్తోంది. ఫలితంగా, విత్తనమార్పిడి రాష్ట్రంలో ఇప్పుడు 75 శాతానికి చేరింది. దీన్ని నూరు శాతానికి పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. తరగిపోతున్న ప్రభుత్వ పరిశోధనలు, విస్తరణ సేవల మద్దతు, మార్కెట్‌ జోక్యం, రైతులపై ప్రయివేటు కంపెనీలు, పెట్టుబడి దారుల, బహుళజాతి పట్టును ద్విగుణీకృతం చేశాయి. కొనేటప్పుడు, అమ్మేటప్పుడు రైతులు నష్టా లకు గురవుతున్నారు. పెట్టిన ఖర్చులను పూర్తిగా రాబట్టుకోలేక, పెరుగుతున్న కుటుంబఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోలేక రైతులు రుణభారాల్లో పడిపోయారు. సబ్సిడీల్ని (ముఖ్యంగా ఎరువులు, సాగునీరు) తగ్గిస్తూ ప్రభుత్వమే అన్ని ఉపకరణాల రేట్లను పెంచుతోంది. రుణ సౌకర్యాన్ని పెంచుతున్నామని చెప్తున్నా, రుణభారాల్లో వున్న రైతులకు రుణపెంపు పరిష్కారం కాదు. రుణ భారంలో మునిగిపోయిన రైతులు వాస్తవాల్ని గుర్తించలేక, ఒకవిధమైన మభ్య ప్రపంచంలోకి నిస్సహాయులుగా నెట్టబడుతున్నారు. కంపెనీలు, కాంట్రాక్టు సేద్యమే తమ సమస్యలకు పరిష్కారమనే భ్రమల్ని రైతుల్లో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ, ఎంతోమంది రైతులు దీనిని అంగీకరించడం లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోవాల్సిన పంటల బీమా రైతులు ఆకాంక్షిస్తున్న విధంగా ఉపయోగపడటం లేదు. ఈ పరిణామాలన్నీ రైతుల జీవితాల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇవన్నీ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకి విరుద్ధమైనవే.

ప్రత్యామ్నాయ పత్తి సేద్యం..


గుంటూరు జిల్లాలో ఇటీవల ఏర్పడిన పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో 26 మండలాల్లో 58 గ్రామా ల్లో రెండువందలకు పైగా రైతులు బిటి పత్తికి ప్రత్యామ్నాయంగా మామూలు హైబ్రిడ్‌ పత్తిని సుస్థిర సాంకేతిక ప్రక్రియ లతో చేపట్టారు. వీటిలో కీలకాంశాలు...
* పత్తిని ఏక పైరుగా కాక మిశ్రమ / అంతర పైరుతో సాగు చేయాలి.
* భూసారాభివృద్ధికి ప్రయోజనకర జీవుల్ని పెంచగల 'అలసంద' (లేక ఇతర లెగ్యూమ్‌ జాతి పైరు) వంటి పైరును పత్తిలో అంతర పంటగా వేయాలి.
* రసాయన ఎరువులకు తక్కువ ప్రాముఖ్యతనిచ్చి, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలి.
* బాక్టీరియా బూజులవంటి జీవుల ద్వారా పైరుకు అందించే నత్రజని, భాస్వరాల్ని కూడా పొదుపు చేసుకోవాలి. వాటి కల్చర్లను విత్తనాలకు కలపాలి.
* ఆముదం, బంతి వంటి ఎర పంటల ద్వారా పొలాల్లో వైవిధ్యతను పెంచాలి.
* పురుగుల వలసల్ని ఆపగలిగే జొన్న వంటి పైరును పత్తి చేను సరిహద్దుల్లో వేయాలి.
* పంచగావ్య (ఆవు మూత్రం), జీవామృతం, వేప కషాయం వంటి సహజ రసాయ నాల్ని పురుగు, తెగుళ్ల అదుపుకు వాడాలి.
* ఎంతో అవసరమైనప్పుడు మాత్రమే కృత్రిమ రసాయనాల జోలికి వెళ్లాలి.
* పురుగులపై నిఘా ఉంచుతూ లింగాకర్షణ ఎరల్ని వాడాలి.
* పురుగుల్ని తినే పక్షుల్ని ప్రోత్సహించగల పక్షి స్థావరాల్ని ఏర్పరచాలి.
* పత్తి మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత (65-70 రోజులు) తలల్ని, (పై రెమ్మల్ని) తుంచితే పురుగుల ఉధృతి తగ్గుతుంది. కాబట్టి వీటిని తెంచాలి.
* అనుభవజ్ఞులతో, తోటి రైతులతో నిత్యం చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
* పత్తి పొలం నుండి వచ్చిన ఆకు, కట్టెలను పొలంలోనే దున్నేయాలి.
* మరుసటి సంవత్సరం, వీలైన చోటల్లా పంట మార్పిడి చేయాలి.
మీకు తెలుసా..?
శ్రీ విత్తనం : క్రోడీకరించిన సంక్షిప్త సాంకేతిక విజ్ఞానం.
సవరణ: 'గతవారం'జీవనధార మందులు.. అవరోధాలు..అవకాశాలు..' లో 'నాణ్యత పోలిక' బాక్స్‌ఐటమ్‌లో 270 ప్రయోగాలు అని వచ్చింది. దీనిని 2,070 ప్రయోగాలుగా సవరించి చదువుకోవలసిందిగా మనవి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. - విజ్ఞానవీచిక డెెస్క్‌
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

జల రహిత ప్రొటీన్‌..!


ఒకపక్క భూగోళంపై నీటి కోసం అల్లాడుతున్నా, మరోపక్క ఇతర గ్రహాలపై నీటి ఆనవాలు కోసం అన్వేషిస్తున్నా, అసలు మానవ ఉనికికి నీటి అవసరం ఎంతమేరకు ఉందో అని కొందరు పరిశోధిస్తున్నారు. మిగతా విషయాలు ఏమోగానీ, ఆక్సిజన్‌ను కండరాలకు అందించే ఒక ప్రొటీన్‌ మాత్రం నీరు లేకుండానే పనిచేస్తున్నదని పరిశోధకులు తేల్చారు. ఆ ప్రొటీన్‌ స్థానంలో వాళ్ళు ఒక కృత్రిమ పాలిమర్‌ను వెలుగులోకి తెచ్చారు. బ్రిస్టల్‌లోని పరిశోధకులు మయోగ్లోబిన్‌ అనే రక్త ప్రొటీన్‌ స్థానంలో కృత్రిమ పదార్థంతో చేసిన దాన్ని అమర్చారు. ఆ కృత్రిమ ప్రొటీన్‌ అసలు ప్రొటీన్‌లాగే పనిచేసిందట! ఈ కొత్త ప్రొటీన్‌ గాయాలపై డ్రెస్సింగ్‌గా వాడటం ద్వారా చర్మానికి ఆక్సిజన్‌ సరఫరాకు బాగా ఉపయోగపడుతుందని గమనించారు. అయితే, ఇటువంటి జల రహిత ప్రొటీన్‌ సహజంగా ఎన్నటికీ లభ్యం కాదు. కానీ భవిష్యత్తులో అవే ఎక్కువగా ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

పచ్చదనమే టమాటాకి రుచి..!


ఇపుడు మనం తింటున్న టమాటాలు బహుశ మన ముత్తాతల ముత్తాతలు తిన్న టమాటాలకంటే ఎంతో భిన్నంగా, రుచిగా ఉన్నాయేమో? నిజానికి అసలు టమాటాలు మరింత రుచికరంగా, నేరుగా కోసుకుని ఆపిల్‌లా తినేవిధంగా ఉండి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. టమాటాలు పచ్చిగా ఉన్నపుడు వాటి తొడిమి దగ్గర మరింత ఆకుపచ్చ రంగు ఉంటుంది. రైతులకి అది నచ్చడం లేదు. ఎందుకంటే ఇప్పటి రైతులు టామాటాలు మొత్తం ఒకే విధమైన పచ్చని రంగుతో ఉంటేనే సరిగ్గా మగ్గుతాయని భావిస్తున్నారు. ఆ ఆకుపచ్చ రంగు లేకపోవడం వల్ల టమాటాల రుచిలో తేడా వస్తుందట! టమాటాలు పండుతున్న కొద్దీ చక్కెర పదార్థాల తక్కువ అవుతాయి. ఆకుపచ్చ రంగు (తొడిమి దగ్గర) లేని టమాటాలు తక్కువ చక్కెర ఉత్పత్తికి దోహదపడే జన్యువు కలిగి ఉంటాయి. అందువల్ల, అవి మంచి ఎరుపు రంగు పొందినా రుచిలో మాత్రం అంత బాగా ఉండవు. అలాగే, తక్కువ క్లోరోప్లాస్టు ఉన్న టమాటాలు తమ రుచిని ఎక్కువ చేసే వాయువులను విడుదల చేయవు. అందువల్ల, మనం వీటి రుచిని ఆస్వాదించలేము. మరో మాట.. ఆధునిక టమాటాలు ఫ్రిజ్‌లో నిలువ ఉంచితే మరింత చప్పగా ఉంటాయి! నిల్వ సమయంలో చక్కెరలో జరిగే రసాయనిక మార్పులే దీనికి కారణం.

వ్యవసాయం కన్నా ముందే కుండలు..!


చైనాలోని ఒక గుహలో తవ్వకాలు జరుపుతున్న బృందానికి సుమారు 20వేల సంవత్సరాల క్రితం నాటి కుండ పెంకులు దొరికాయి. అంటే, అవి భూమిపై దట్టమైన మంచు పెళ్ళలు కప్పబడి వున్న 'మంచు యుగం' నాటివి. అటువంటి శీతల పరిస్థితులలో ఆహారం లభించడం బహు కష్టమైన పని. కాబట్టి వేడిని 'ఉత్పత్తి' చేయడానికి ఉడికించడం అవసరమై ఉంటుంది. అయితే, ఆ నాటి మంచు యుగంలో మానవులు గుహలలో ఏం వండుకున్నారో తెలియరాలేదు. బహుశ వాళ్ళు నత్తలూ, ఆల్చిప్పలూ వండుకుని వుండవచ్చు. ఎందుకంటే, ఆ గుహలో భారీ సంఖ్యలో నత్తల ఆనవాళ్ళు కనిపించాయట. విశేషమేమిటంటే, వ్యవసాయం ఆరంభించిన తరువాతే కుమ్మరి పనులు మొదలయ్యాయి అనుకుంటున్నాము. కానీ, ఇప్పటివరకూ అనేక ప్రదేశాలలో లభించిన ఆధారాల వల్ల కుండలు చేయడం వ్యవసాయం కంటే కనీసం 10 వేల సంవత్సరాలకు ముందే ఆరంభమైందని సూచనలు వస్తున్నాయి..

ఎన్నటికీ మునగని ద్వీపం..!


మహాసముద్రాలలో ద్వీపాలకి ముందు ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకి మాల్దీవులు సముద్ర మట్టానికి సగటున కేవలం ఐదు అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ 1,192 ద్వీపాల సమూహం ప్రపంచంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న దేశం. గత వందేళ్లలో ఈ ద్వీపాలున్న హిందూ మహాసముద్రం ఎత్తు ఏడు అంగుళాల మేర పెరిగింది. రానున్న వందేళ్ళలో మరో రెండు అడుగుల ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే మాల్దీవుల ప్రభుత్వం 'డాక్కాండ్‌ ఇంటర్‌ ఛానల్‌' అనే డచ్‌ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం తేలే ద్వీపాన్ని కృత్రిమంగా నిర్మిస్తుంది. ఇది నీటిమట్టం పెరుగు తున్న కొద్దీ పైకి పెరుగుతుంది. ఇటువంటి నిర్మాణాల్ని చేయడం లో ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సంస్థ. ఈ సంస్థ ఇంతకు ముందూ ఇటువంటి ప్రాజెక్టులను ఎన్నిటినో నిర్మించింది. ఇటువంటి ప్రాజెక్టువల్ల సముద్రజీవులకూ,

క్రీముతో జన్యు వ్యాధుల చికిత్స...!


భవిష్యత్తులో జన్యు వ్యాధుల చికిత్స చర్మంపై లోషన్‌లూ, క్రీములూ రాసుకున్నంత సులభం కానుంది. మనిషి వెంట్రుక కంటే వెయ్యిరెట్లు తక్కువ పరిమాణంలో ఉండే న్యూక్లిక్‌ ఆమ్లాలు లోషన్‌ రూపంలో చర్మంపై రాస్తే, అవి చర్మంలోని కణాలలోకి వెళ్ళిపోతాయట. ఈ మందు కణంలో చేరాక అది వ్యాధిని కలిగించే జన్యువులను నిర్వీర్యం చేస్తుంది. ఇటువంటి క్రీమ్‌ని ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఎటువంటి దుష్ఫలితాలూ కలగలేదు. భవిష్యత్తులో ఇంకా అద్భుత విషయాలు సూక్ష్మస్థాయివే అయి ఉంటాయనేది వాస్తవం కావచ్చు.

Saturday 11 August 2012

‘మార్స్’లోనూ భారతీయ ముద్ర



హోస్టన్, ఆగస్టు 6: సృష్టికి మూలమైన దైవకణాన్ని కనుగొనే ప్రయత్నంలో నిరుపమాన పాత్ర పోషించిన భారతీయ శాస్తవ్రేత్తలు ఇప్పుడు అమెరికా అంగారకుడిని అందుకోవడంలోనూ నిరుపమాన కృషిని అందించారు. అంగారకుడిపై నీటి ఆనవాళ్ళను నిర్ధారించే లక్ష్యంతో ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ను ఎక్కడ దించాలన్నదానిపై నాసా శాస్తవ్రేత్తలు తర్జనభర్జన పడుతున్న నేపధ్యంలో గేల్ క్రేటర్ స్థల నిర్దేశన చేసింది భారతీయ శాస్తవ్రేత్తే. గేల్ క్రేటర్ ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్‌ను దించితే తదుపరి పరిశోధనలకు మార్గం సుగమం అవుతుందని అలాగే అరుణ గ్రహాన్ని అన్ని కోణాల్లోనూ శోధించడం సాధ్యమవుతుందని సూచించింది భారతీయ శాస్తవ్రేత్త అమితాబ్ ఘోష్. నాసా మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ మిషన్‌లోని సైన్స్ ఆపరేషన్ల విభాగం అధిపతిగా ఘోష్ పనిచేశారు. క్యూరియాసిటీ రోవర్ భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో విజయవంతంగా దిగడం తమకు ఆనందాన్ని, విస్మయాన్ని కలిగించిందని స్పష్టం చేశారు. అసలు ఏమాత్రం పరిచయం లేని అంగారకుడి ఉపరితలంపై రోవర్‌ను దించడం అంటే మామూలు విషయం కాదని, మానవ సాంకేతిక నైపుణ్యానికి అద్భుతమైన మేథస్సుకు అది తార్కాణమేనని ఘోష్ తెలిపారు. గత ఆరేళ్ళుగా మార్స్ మిషన్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విజయం అమితానందాన్ని కలిగించిందని వెల్లడించారు. ఈ ప్రయోగం విఫలమయినట్టయితే ఆ తరువాత ఏమీ ఉండదని ఇప్పుడు విజయవంతం అయింది కాబట్టే ఈ రోవర్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలమన్నది అడుగడుగునా సవాళ్ళను విసిరేదేనని ఆయన వెల్లడించారు. గేల్ క్రేటర్ ప్రాంతంలో ఉన్న ఖనిజాలను, అక్కడ భూమి పొరలను, ఉపరితల తేమను అక్కడి మట్టిని పరిశీలించిన తరువాత ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందని, ఇది భూమి నుంచి 24 కోట్ల 78 లక్షల 38 వేల 976 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన వెల్లడించారు. తేమకలిగిన ఖనిజాలు చల్లదనం కలిగిన వాతావరణంలోనే ఉంటాయని గేల్ క్రేటర్ ప్రాంతంలో ఆ రకమైన వాతావరణం ఉన్నందునే ఈ పరిశోధనలు మరింత ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. భూమి మీద కూడా అనేక శిలల్లో తేమ ఉండడానికి వాటి పొరల్లో ఈ చల్లదనం ఉండడానికి కారణం నీరేనని అలాంటి నీరే అంగారకుడిపై ఉండడం వల్ల లేదా ఒకప్పుడు ప్రవహించడం వల్ల ఈ రకమైన తేమ ఏర్పడి ఉంటుందని ఘోష్ స్పష్టం చేశారు. ఈప్రాంతంలోని ప్రతిపొర కూడా ఎన్నో అద్భుతాలకు నిలయమే కాబోతోందని ఆ విధంగా కుజ గ్రహానికి సంబంధించి ప్రతి విషయాన్ని ఈ రోవర్ అందించబోతోందని తెలిపారు. అంగారక గ్రహంపై జీవరాశి మనుగడగు ఆస్కారం ఉందా లేదా అనే వౌలిక ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికే క్యూరియాసిటీ రోవర్‌ను పంపారు.
మా సాంకేతిక ప్రగతికి నిదర్శనం: ఒబామా
వాషింగ్టన్: క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా చేరుకోవడాన్ని అమెరికా అద్భుత సాంకేతిక ప్రగతికి నిదర్శనమని అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని సాధించినందుకు నాసా శాస్తవ్రేత్తలను అభినందించిన ఆయన ‘ఈ నిరుపమాన సాంకేతిక విజయం ద్వారా అమెరికా జాతీయ గౌరవాన్ని, ఘనతను సుదూర భవిష్యత్‌కు తీసుకెళ్లారు’ అని అన్నారు. ఇంతవరకూ కనీవినీ ఎరుగని సాంకేతిక సంపత్తితో రూపొందిన ఈ రోవర్ అమెరికా సాధించిన సాంకేతిక నైపుణ్యానికి తలమానికం లాంటిదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా అమెరికా స్థాయి విజయాలు అంత సులభం కాదన్న వాస్తవం ఈ ప్రయోగంతో రుజువైందని వ్యాఖ్యానించారు.
అమెరికా సృజనాత్మకతకు, సాంకేతిక విస్తృతికి ఎవరూ సాటిలేరని, ఎన్ని అవరోధాలు ఎదురైనా తమదే పైచేయి అవుతుందన్న వాస్తవానికి ఈ ప్రయోగ విజయమే నిదర్శనమని వెల్లడించారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి శాస్తవ్రేత్తనూ ఆయన ప్రశంసించారు.

'అణు'మానం లేని... సురక్షిత పౌర సమాజం సాధిద్దాం





  • నాగసాకి బాంబుదాడి 67వ వార్షికోత్సవంలో జపాన్‌ అధికారుల ఆకాంక్ష
అణు ఇంధనం మీద అతి తక్కువగా ఆధారపడే పౌర సమాజాన్ని సాధించాలని జపాన్‌ అధికారులు ఆకాంక్షించారు. జపాన్‌లోని నాగసాకి పట్టణం మీద జరిగిన అణు బాంబు దాడి ప్రపంచంలో రెండో అతి పెద్ద విషాదంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. గురువారం ఆ విషాద ఘటనకు 67 ఏళ్ళు నిండాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకొచ్చిందని అంతా అనుకుంటున్న తరుణంలో జపాన్‌ను లొంగదీసుకోవడమే లక్ష్యంగా అమెరికా వాయుసేన అణు బాంబులను వర్షించింది. 1945 ఆగస్టు తొమ్మిదో తేదీన జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అమెరికా వాయుసేన విమానాలు అణు బాంబులతో విరుచుకుపడ్డాయి. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు హిరోషిమా మీద ఇదే తరహా అణు బాంబు వర్షాన్ని అమెరికా కురిపించింది. హిరోషిమాపై బాంబు దాడిలో లక్షా 40 వేల మంది, నాగసాకిపై బాంబు దాడిలో 70 వేల మంది అమాయక జపనీయులు దుర్మరణం చెందారు. అణు బాంబు విధ్వంస విపత్తు నుంచి వాస్తవానికి ఇంకా కోలుకోకమునుపే గత సంవత్సరం జపాన్‌లోని ఫుకుషిమ దాయిచి అణు విద్యుత్కేంద్రం రేడియేషన్‌ ప్రమాదానికి జపనీయులు గురయ్యారు. 2011 మార్చి 11న సంభవించిన సునామీ, దాన్ని వెన్నంటిన భూకంపం దెబ్బకు జపాన్‌ కోస్తా తీరంలోని ఫుకుషిమ దాయిచి అణు విద్యుత్కేంద్రం తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకర స్థాయిలో రేడియేషన్‌ వెదజల్లిన 'విషా'దం జపనీయుల ఆత్మస్థైరాన్ని మరింత దెబ్బతీసింది. దీనిపై ఇటీవల జపాన్‌లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో 90 శాతం జపనీయులు 'అణు విద్యుత్‌ వద్దేవద్దు' అని గట్టిగా నినదిస్తున్నారని ప్రభుత్వ నిర్వహణలో కొనసాగే ప్రజాభిప్రాయసేకరణ సమాచారాన్ని ఉటంకిస్తూ 'ది అసాహి' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇంతలోనే అణు బాంబు దాడి ఘటన జరిగిన ఆగస్టు తొమ్మిదో తేదీ రావడంతో మరోమారు అణు విద్యుత్‌ మీద వీలయింనంత తక్కువగా ఆధారపడాలని, తద్వారా విపత్తులకు ఆస్కారం లేని పౌర సమాజాన్ని స్థాపించాలనే ఆకాక్షను జపాన్‌ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం 1945 నాటి బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో నిర్మించిన శాంతివనంలో జరిపిన సంస్మరణ సభకు సుమారు ఆరు వేల మంది జపనీయులు హాజరయ్యారు. ఈ ఘోర విపత్తుకు కారణమైన అమెరికా, తొలిసారిగా ఈ ఏడాది జరిగిన సంస్మరణ సభకు తమదేశ ప్రతినిధిగా రాయబారి జాన్‌ రోస్‌ను సాగనంపడం గమనార్హం. గతేడాది ఫుకుషిమా దాయిచి విద్యుత్కేంద్రం విపత్తుకు గురైన పట్టణ మేయరు కూడా ఇందులో పాల్గొన్నారు. ఏదాడిన్నర గడిచినా ఫుకుషిమా దాయిచి అణు విద్యుత్కేంద్రం రేపిన భయాందోళనలకు జపనీయులు ఇంకా దూరం కాలేకపోతున్నారు. ఇంకా వారిలో మృత్యు భీతి పురులు విప్పుతూనే ఉంది. ఈ సందర్భంగా నాగసాకి మేయర్‌ తొమిహిసా తాయీ మాట్లాడుతూ అణు సాంకేతికత నుంచి జనించే ప్రమాదాలను ఆహూతులతో పంచుకున్నారు. అణు ఇంధనానికి తావులేని పౌర సమాజ స్థాపనకు నిర్ణయాత్మకంగా జపాన్‌ కృషి జరుపుతోందని తాయీ వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అణ్వాయుధాలపై సంపూర్ణ నిషేధానికి ప్రపంచమంతా కట్టుబడి ఏకతాటిపై నడవాలని పునరుద్ఘాటించారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించే ఇంధన పునర్నిర్మాణ రూపకల్పన జరుపనున్నట్లు జపాన్‌ ప్రధాని యోషిహికొ నోదా గతంలో తను చేసిన వాగ్దానాన్ని స్మరించారు. కొద్ది వారాల్లోనే దీర్ఘకాల విధాన వేదికను ప్రకటిస్తామన్నారు.

అక్షరంలో ఒదిగిన 'హిరోషిమా'




హిరోషిమా.. ఓ చేదు జ్ఞాపకం. తప్పదు, గుర్తుంచుకోవాల్సిందే.
మానవాళి మనుగడను సవాలు చేసే ఇటువంటి దుస్సంఘటనలను మర్చిపోతే ఎలా? ఎన్నో ప్రాణాలను మసి చేసిన దారుణాన్ని కాలమైనా మాన్పలేదు. మరోసారి మళ్లీ, ఎక్కడా ఇలాంటి ఉదంతాలు కానరాకూడదు.. సాంకేతికత మానవ జాతి మనుగడకే కానీ, మారణహోమానికి కాదని, పదే పదే వెన్నుతట్టే వైనం.. హిరోషిమా. హిరోషిమాపై వ్యాసం రాయని పత్రిక అంటూ
ప్రపంచంలో ఏ మూలైనా ఒకటైనా వుంటుందా? అలా అని కొన్ని అక్షరాల్లోనో, కొన్ని పంక్తుల్లోనో, కాసిన్ని పేరాల్లోనో ఒదిగే దారుణమా అది? కాదు కదా. అందుకే పత్రికలో తప్పని సరిప్రకటనలు వదిలి, మిగిలిన పేజీలన్నీ హిరోషిమాతో నింపేసిందిఓ విదేశీ పత్రిక ఓసారి.
ఒక వారపత్రికగా పలు శీర్షికలూ, కార్టున్లూ, ప్రకటనలతో వారం వారం అచ్చులో కన్పించే ‘ది న్యూయార్కర్’- ఆగస్టు 31, 1946 సంచికను హిరోషిమా సంగతులతో నింపేసింది.
‘1945 ఆగస్టు 6న ఒక నగరంపై ఆటం బాంబు వేసి సమూలంగా నాశనం చేసిన దారుణంపై, అక్కడి ప్రజలపై ఎటువంటి పరిణామాలు కలిగాయో చెప్పే వాస్తవ నివేదికగా ‘ది న్యూయార్కర్’ సంచిక మొత్తాన్ని అందజేస్తున్నాము. మనలో కొందరైనా అణ్వాయుధాలకు ఉన్న అపరిమితమయిన వినాశనశక్తి పట్ల, అసలు వీటిని మానవులపై ప్రయోగించవచ్చా? అనే అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోగలుగుతారనీ, పాఠకలోకమంతా ఈ బాంబులవల్ల కలిగే భయంకర ఫలితాల గురించి కొద్దిపాటి సమయాన్ని వెచ్చించాకయినా సరే ఒక ఆలోచనకు వస్తార’ని ఆ పత్రిక ముందు మాటలో పేర్కొంది. తన తేలికపాటి రచనల స్వభావానికి విరుద్ధంగా సమకాలిక పత్రిక ‘ది న్యూయార్కర్’ మొత్తంగా ఒక సంచికను ఒకే కథనానికి కేటాయించి కొత్త చర్చను లేవదీసింది. హిరోషిమాలో రెండు లక్షల నలభయి అయిదు వేల ప్రజలలో దాదాపు లక్ష మంది ఏమయ్యారో అందరికీ తెలుసు. వారు బాంబు దాడిలో చనిపోయారు. వేలాదిమంది అవశేషాలు సైతం మిగలకుండా, మిగిలిన ప్రజా జీవితాలను, ఆరు సజీవ సామాన్య వ్యక్తుల పాత్రల ద్వారా, వాస్తవ జీవన కథనంగా ‘ది న్యూయార్కర్’ పాత్రికేయుడు జాన్ హెర్సీ ‘హిరోషిమా’ పేరిట అందించిన రచన ఎంతో ప్రాధాన్యతను సంతరిం చుకుంది. బాంబు దాడి తర్వాత సైతం ఎలా అక్కడి ప్రజలు జీవిస్తున్నారో తెలియచెప్పిన రచన ఇది. అమెరికన్ సమాజంలో మనం, కొత్తగా మనకు లభ్యమైన సైనిక ఆయుధశక్తి గురించి, ఇతర దేశాలపై దీని ప్రయోగిస్తే ఏమవుతుందో జోకులు వేసుకున్నట్టుగా కాక, ఇతర సాంకేతిక ఆవిష్కరణలయిన కార్లూ, ఫోన్లూ, విమానాలూ వంటి వాటికీ, ఈ ప్రత్యేక ఆయుధ ఆవిష్కరణకూ మధ్యగల తేడాను అర్థం చేసుకోవడానికి ఈ రచన ఉపకరిస్తుంది. పుస్తకంగా అచ్చులో రావడానికి ముందే ఓ క్లాసిక్‌గా ‘హిరోషిమా’ రచన గుర్తింపు పొందింది.
దీంతో జాన్ హెర్సీకి స్టార్ జర్నలిస్ట్ హోదా వచ్చి పడింది. సాక్షాత్తూ ఐన్‌స్టీన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త, తనకు ఆ సంచిక కాపీలు ఒక పదివేలు కావాలని అడిగినా, వాటిని సరఫరా చేసే పరిస్థితిలో పత్రిక ప్రచురణకర్తలు లేరు. బి.బి.సి ఈ రచన బ్రాడ్ కాస్టింగ్ హక్కులుపొందగా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో ఇది ప్రసారమయ్యింది. తమ విభేదాలతో ప్రమేయం లేకుండా రోమన్ కాథలిక్ పత్రికలూ, ప్రొటెస్టెంట్ పత్రికలూ బాంబు దాడిపట్ల తాము అంతవరకూ వింటూ వచ్చిన దానికన్నా బహు శక్తివంతమైన రచనగా హెర్సీ రచనను ప్రస్తుతించాయి.
అనేక దేశాలలో పలు అనువాదాలు ముద్రణ జరిగి ముప్ఫయి లక్షల కాపీలు పైగా అమ్ముడైన రెండో ప్రపంచ యుద్ధ కాలపు ఏకైక రచనగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది- జాన్ హెర్సీ రాసిన ‘హిరోషిమా’.
అయితే ఎవరి సమాజపు దురవస్థల గురించి ఈ రచన చేయబడిందో, ఆ జపాన్ ప్రజలకు మాత్రం 1949 వరకూ ఈ రచన చదివే అవకాశం దక్కలేదు. ఇందుకు కారణం. జపాన్‌ను సైనిక పరిపాలనలో వుంచిన అమెరికన్ ప్రభుత్వ సైన్యాధిపతి జనరల్ మెక్ ఆర్తర్. ఈ రచనపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేసాడు. జాన్ హెర్సీ ‘హిరోషిమా’ వెలువడి నేటికి అరవై ఆరేళ్లు. ఒక పెను వినాశానికి కటువైన స్మరణగా, మళ్లా ఎప్పుడూ అణు బాంబుద్వారా జన హననం జరగకూడదనే సంకల్పంతో దేశ దేశాల ప్రజలు, తమ ప్రభుత్వాలను నిలదీయాలిసన అవసరం అప్పటికన్నా ఇప్పుడు ఎంతో ఎక్కువగా వున్నది. అందుకే హిరోషిమా, నాగసాకి నగరాలలో ఆహుతైపోయిన సామాన్య ప్రజలకు నివాళిగా, అణ్వాయుధ వ్యతిరేక శాంతి సంఘీభావ ప్రకటనగా, జాన్ హెర్సీ స్మృతికి అభినందనగా మనం సంకల్పం చేసుకోవాల్సిన తరుణం ఇది. ఈయన మార్చి 24, 1993 సంవత్సరంలో కన్నుమూశాడు. ఆ సందర్భంలో ‘ది న్యూయార్కర్’ పత్రిక తన నివాళిలో ‘ఎన్నో పత్రికలు, ఇతర మాధ్యమాలు చెప్పి చెప్పి అరగదీసిన ‘హిరోషిమా’పై అణుబాంబు దాడి గురించి, అత్యంత తాజా కథనంగా, ఉత్తమ పాత్రికేయ నిబద్ధతతో తన రచన చేసిన ఉన్నత జర్నలిస్ట్‌గా జాన్ హెర్సీని నుతించి తమ గౌరవాన్ని తెలిపింది. ‘హిరోషిమాలు ఇక వద్దు’ అని బలమైన అవగాహనకు రావడమే మనందరి కర్తవ్యం.

Wednesday 8 August 2012

దేవుని ఊహాశక్తి నుండే విశ్వం సమస్తం ఏర్పడినట్లు ఎందుకు అనుకోకూడదు?





      ఇంతవరకు మనకు తెలిసిన విజ్ఞానశాస్త్రం మేరకు ఈ విశాల విశ్వంలో 3 రకాల కణాలే ఉన్నాయని తెలుసుకున్నాం. అత్యంత సూక్ష్మమైన ప్రాథమికమైన ఈ కణాల సంఖ్య మొత్తం 60. ఇందులో సాధారణ ప్రాథమిక కణాలు, వాటి ప్రతికణాలు (aఅ్‌ఱజూaత్‌ీఱషశ్రీవర) ఉన్నాయి. ఈ 60 ఏమిటో మరోసారి నెమరేసుకుందాం.
(ఎ) 6 క్వార్కులు + 6 ప్రతిక్వార్కులు = 12 క్వార్కుల వర్గం. అయితే ప్రతిక్వార్కు 3 రకాల రంగుల్లో ఉంటుందని క్వాంటం క్రోమోడైనమిక్స్‌ ఋజువు చేసింది. అంటే ఈ 12 క్వార్కులు 3 భంగిమల్లో (శక్తిస్థాయిల్లో) మనగలవు. కాబట్టి మొత్తం క్వార్కుల జాతి ప్రకృతిలో 12×3=36 విధాలు. (బి) 6 లెప్టానులు + 6 ప్రతిలెప్టాన్లు = 12 లెప్టానుల జాతి. వీటికి వేరే భంగిమలు ఏమీ లేవు. (సి) 4 గాజ్‌ బోసాన్లు. ఇందులో ష బోసానుకు మాత్రమే ప్రతికణం ఉంది. మిగిలిన 3 కణాలకు ప్రతికణాలు తమకుతామే. అయితే గ్లూయాన్‌ అనే జిగురు కణం 8 రకాల భంగిమల్లో (అషచేష్టల్లో) తనను చూపుతుంది. కాబట్టి మొత్తం 12 రకాలుగా ఈ 4 గాజ్‌ బోసాన్లు ద్యోతకమవుతాయి. వెరసి 36 క్వార్కుల జాతి + 12 లెప్టాన్ల జాతి + 12 గాజ్‌ బోసాన్ల జాతి = 60 అతి ప్రాథమిక కణాలతో ఈ ప్రకృతి నిర్మితమయి ఉంది. ఇందులో క్వార్కులు ఎప్పుడూ విడిగా ఉండవనీ జట్టుగా (మీసాన్లు) గానీ త్రికాలుగా (బేరియాన్లు) గానీ ఉంటాయనీ ఈ క్వార్కుల బృందాన్నే హేడ్రాన్లంటారనీ గుర్తు తెచ్చుకుందాం. మనకు తెలిసిన సాధారణ పదార్థంలో ద్రవ్యరాశి ఆగారం (reservoir of mass) గా భావించే పరమాణు కేంద్రకం (atomic nucleus) లోనే దాదాపు 99.998 శాతం ద్రవ్యరాశి పోగుపడి ఉంది. ఇందులో ఉన్నవి ప్రోటాన్లు, న్యూట్రాన్లు. వీటిలో 3 క్వార్కుల చొప్పున ఉన్నాయి. ఒక ప్రోటానులో రెండు బ ఒక స ఉన్నాయి. రెండు బ క్వార్కుల మొత్తం ద్రవ్యరాశి = 8.54×10-30కి.గ్రా. ఒక స క్వార్కు ద్రవ్యరాశి = 8.54 × 10-30కి.గ్రా. మొత్తం క్వార్కుల వల్ల ప్రోటానుకు సంతరించే ద్రవ్యరాశి = 17.07×10-30కి.గ్రా. వాస్తవంగా ప్రోటాను ద్రవ్యరాశి =1670×10-30. కాబట్టి అదృశ్య ద్రవ్యరాశి (hidden mass) = 1653 ×10-30కి.గ్రా. ఇదెక్కడుంది? ఇది ప్రోటాను వాస్తవ ద్రవ్యరాశిలో సుమారు 99 శాతం. అలాగే న్యూట్రాను వాస్తవ ద్రవ్యరాశి =1675×10-30కి.గ్రా. కానీ 2 d, ఒక u క్వార్కుల వల్ల న్యూట్రాను సంతరించుకున్న ద్రవ్యరాశి = 21.34 ×10-30కి.గ్రా. కాబట్టి న్యూట్రానులో అదృశ్య ద్రవ్యరాశి = 1654×10-30కి.గ్రా. ఇది న్యూట్రాను వాస్తవ ద్రవ్యరాశిలో సుమారు 99 శాతం. దీనికి కారణమెవరు?

విద్యుదావేశం ఆధారంగా కణాల మధ్య సంధానాల్ని ఏర్పర్చే గాజ్‌ బోసాను ఫోటాను. దీనికి ద్రవ్యరాశి లేదు. అంటే ప్రకృతిలో వున్న విద్యుదయస్కాంత బలాలకు, కాంతికి ప్రతినిథిó ఫోటానేనన్నమాట. క్వార్కులను బంధించి ప్రోటానుగా లేదా న్యూట్రానుగా జిగురు పెట్టినట్లు కలిపి ఉంచే కణం గ్లుయాను లేదా జిగురుకణం. దీనికీ ద్రవ్యరాశి లేదు. అంటే ప్రకృతిలో ఉన్న బలమైన కేంద్రకబలాలకు ప్రతినిథిó గ్లుయాను. ప్రోటానును, న్యూట్రానును కలిపి ఉంచే బలహీనమైన కేంద్రక బలాలకు కూడా కొంతమేరకు గ్లుయాను సహకరిస్తుంది. గ్లుయాను వల్ల ప్రోటాను, న్యూట్రాను ఏర్పడ్డపుడు కలిగే బంధశక్తి (binding energy) ని ఐన్‌స్టీన్‌ సూత్రమైన E=mc2 లో ప్రతిక్షేపిస్తే అదనంగా మరో 1 శాతం ద్రవ్యరాశి ప్రోటాన్లకు, న్యూట్రాన్లకు సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ష బోసాను, ఓ బోసాను కూడా ప్రోటాన్ల మధ్య న్యూట్రాన్ల మధ్య అవి ఏర్పడ్డాక మనిషికి డ్రస్సు వేసినట్లుగా సంబంధాలు కుదర్చడం వల్ల మరో 2 శాతం మేరకు ద్రవ్యరాశికి కారణమవుతాయని కూడా అంటున్నారు. అంటే ఇలా అనుకున్నా ప్రోటాను, న్యూట్రానుల ద్రవ్యరాశిలో 96 శాతం మేరకు ఎక్కడ్నుంచి వచ్చిందో అర్థంకావడం లేదు.

ఆ లోటును భర్తీ చేసేవే హిగ్స్‌ బోసాన్లని పీటర్‌హిగ్స్‌ సిద్ధాంతీకరించాడు. హిగ్స్‌ కణాలు లేదా దైవకణాలు బోస్‌-. ఐన్‌స్టీను గణాంకాలననుసరిస్తాయని సైద్ధాంతికంగా హిగ్స్‌ ప్రతిపాదించాడు. అందుకే వాటిని దైవకణాలు అనే అశాస్త్రీయపు, అసంబద్ధమైన పేరుకు బదులుగా హిగ్స్‌ బోసాన్లు అనడమే సశాస్త్రీయం. పదార్థంలో దాగున్న దాదాపు 96 శాతం మేర ద్రవ్యరాశికి (పాదార్థికతకు అదే కొలబద్ద) మూలం హిగ్స్‌ కణాలే. అయితే ఈ విశ్వపు ఆవిర్భావ దశలో వాటి పాత్ర గణనీయంగా, ఉత్కృష్టంగా ఉండి ఉండాలన్న ఉద్దేశ్యంతోనే విశ్వావిర్భావానికి, హిగ్స్‌ కణాల ఆవిష్కరణకు లింకు పెట్టి LHC ప్రయోగాన్ని బిగ్‌బ్యాంగ్‌ ప్రయోగమన్నారు. అంతేకాదు. విశ్వంలోని నాలుగు బలాల్లో 3 బలాలకు పునాదులు g, g, z, w, అనే గాజ్‌ బోసాన్లలో ఉన్నాయి. కాబట్టి విశ్వంలో పదార్థాల మధ్య సంభవించే గురుత్వాకర్షక బలాల (gravitational forces) కు కూడా పునాదిగా ఏవో కణాలుండాలని శాస్త్రవేత్తలు సూత్రీకరించారు.
 


దానిపేరు కూడా గ్రావిటాన్‌ (graviton) అంటూ సార్థకం చేస్తున్నారు. కానీ హిగ్స్‌ బోసాన్‌కున్న పాటి సైద్ధాంతిక ప్రాతిపదిక గ్రావిటాన్‌కు లేదు. ఇపుడు LHC ప్రయోగంలో హిగ్స్‌కణాల ఉనికి దాదాపు ఖాయమైంది. వాటి వల్ల సంభవించే పాదార్థిక ద్రవ్యరాశి కూడా అదృశ్య ద్రవ్యరాశికి సరిపోతోంది. కాబట్టి నేటి విజ్ఞానపుటంచుల వరకు మనకు తెలిసిన ఈ విశాల విశ్వంలో అతి మౌలికమయిన కణాలు (హిగ్స్‌ బోసానుతో కలిపి) 61గా భావించాలి. ఎందుకంటే హిగ్స్‌ కణానికి కూడా ప్రతి కణం లేదు. వివిధ భంగిమలూ లేవు. కణాలకు ద్రవ్యరాశిని ఒనగూర్చే అసలుసిసలు కణం హిగ్స్‌ కణమేనన్నది రూఢి అయ్యింది.

ఇక చివరగా పదార్థానికీ శక్తికీ మధ్య ఉన్న అంతర్వినిమయం (mutual interconversion) గురించి ప్రస్తావిస్తాను. ాఎ్ణ విలువ గల పదార్థం పూర్తిగా ాజ్ణు అనే శక్తిగా మారితే ఆ రెండింటి మధ్య అనులోపాత సంబంధం(proportionality) ఉంటుందని ఐన్‌స్టీన్‌ ఋజువు చేశాడు. ఆ అనుపాత స్థిరాంకం (proportionality constant) విలువ శూన్యంలో కాంతివేగపు వర్గానికి (C2) కి సమానమన్నాడు ఐన్‌స్టీన్‌. ఇది సుమారు 9×1016 మీ2 సె-2 తద్వారా కేవలం ఒక గ్రాము ద్రవ్యరాశి ధ్వంసమైనా ఏర్పడే శక్తి విలువ E=0.001×9×1016 = 9× 1013 జౌళ్లు ఉంటుంది. ఈ శక్తితో ఒక కోటి 25 వాట్టుల(CFL) బల్బుల్ని 100 గంటల పాటు వెలిగించగలమన్న మాట. అంటే ఓ చింత గింజను శక్తిగా మటుమాయం చేసేస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల ఇళ్లల్లో 4 బల్బుల్ని దాదాపు వారంపాటు వెలిగించగలం.

దీనికి వ్యుత్క్రమం (inversion) ఏమిటంటే ఒక గ్రాము పదార్థాన్ని శూన్యం నుంచి పుట్టించాలంటే ఆ వ్యక్తిలో 9×1013 జౌళ్లశక్తి ప్రాణశక్తి (జీవ రసాయనిక శక్తి)గా ఉండాలి. ప్రాణంతో ఉన్న వ్యక్తి ఇంత శక్తిని తనలో ఉంచుకోలేడు. ఆ శక్తే ఉంటే ఆ వ్యక్తిలో రక్తం ఆవిరైపోతుంది. శరీరం మమ్మీలాగా ఎండిపోతుంది. అందుకే జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు, సశాస్త్రీయపుటాధారాల ప్రాతిపదికన సత్యసాయిబాబా బూడిదను, లింగాల్ని సృష్టించడం అసాధ్యమనీ అది కేవలం మోసమనీ కోడై కూస్తున్నాయి. కానీ రాష్ట్రపతుల, మంత్రుల, ఘనాపాటి (పరిమిత లేదా యాంత్రిక) శాస్త్రవేత్తల బుర్రల్ని ఆ కూత నిద్రలేపలేకపోతోంది. కానీ ప్రజలమీద మనకు నమ్మకం ఉండాలి. ఇపుడుకాకున్నా రేపైనా వింటారు. మారడం లేదని మనం మారాము చేసి మార్పును సమకూర్పు చేసే విజ్ఞాన ప్రచారం ఆపలేము కదా!
E=MC2 ప్రకారమే ఇదేరోజు (ఆగస్టు 9, 1945) జపాన్‌ దేశపు నాగసాకి నగరం మీద అమెరికా ఆటంబాంబు వేసింది. దాదాపు కొన్ని కిలోగ్రాముల మేరకు ఫ్లుటోనియం మూలకపదార్థం మటుమాయమైంది. అంతకుముందు రెండ్రోజుల క్రితం (ఆగస్టు 6, 1945) యురేనియం బాంబును హీరోషిమానగరం మీద వేసింది. అపుడూొన్ని కిలోల యురేనియం మూలకం మటుమాయమైంది. ఇపుడు దాదాపు సర్వసాధారణమైన కేంద్రక విచ్ఛిత్తి(nuclear fission), కేంద్రక సంలీనం (nuclear fusion)లలో జరిగేది పదార్థం, శక్తిగా మారడమే.

పదార్థం శక్తిగా మారుతుందన్న విషయాన్ని ఒట్టోహన్‌ స్టాస్‌మన్‌లు, ఇతర శాస్త్రవేత్తలు ఋజువుచేశారు. పోజిట్రాన్‌ను ఎలక్ట్రానును ఢ కొట్టించి వాటిని మటుమాయం (annihilation) చేశారు. తద్వారా ఏర్పడ్డ కాంతిశక్తి విలువ సరిగ్గాE=(me+me+)c2 కి సరితూగింది. ఇక్కడ me+ అంటే పోజిట్రాన్‌ ద్రవ్యరాశి, Me అంటే ఎలక్ట్రాను ద్రవ్యరాశి. దీనికి వ్యుత్క్రమంగా కాంతికణం E=hnఅనే శక్తితో పదార్థంగా మారడాన్ని క్లౌడ్‌ ఛాంబర్‌ ప్రయోగంలో ఋజువు చేశారు. తద్వారా hn శక్తిగల కాంతికణం ఎలక్ట్రాను, పోజిట్రానులు ఉత్పత్తికి దారితీసింది. ఈ ప్రక్రియను యుగళోత్పత్తి(pair production) అన్నారు. కాబట్టి శక్తి, పదార్థం పరస్పర వినిమయాలనీ సృష్టిలో మరెవరి ప్రమేయమూ లేదనీ పదార్థమే ఆది, అంతం లేని సర్వవ్యాపితం అనీ అర్థం. మరి దైవానికి స్థానమెక్కడీ

యాంటిబయాటిక్స్‌ విఫలం.. ప్రత్యామ్నాయాలు..


అనుకోకుండా 1928లో గుర్తించిన 'పెన్సిలిన్‌' అంటురోగాల (ఇన్‌ఫెక్సువస్‌ డిసీజెస్‌) చికిత్సను సులువుగా మార్చింది. కానీ, దీనిని పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన నాలుగు సంవత్సరాలలోనే 'స్టాఫిలోకోకస్‌ ఆరియన్‌' అనే బ్యాక్టీరియాలో పెన్సిలిన్‌కు నిరోధకశక్తి వచ్చిందని 1947లోనే గుర్తించారు. అప్పటి నుంచి అంటురోగాల చికిత్సకు కొత్త కొత్త మందులను రూపొందించే పరిశోధనలు తీవ్రమయ్యాయి. దీనితో ఈ కొత్త మందులకు కూడా రోగక్రిముల నిరోధకశక్తి వేగంగా పెరుగుతోంది. అయితే, ప్రపంచ వాణిజ్యసంస్థ వల్ల మేధో సంపత్తి హక్కుల సమస్య తీవ్రంగా ముందుకొచ్చిన తర్వాత కొత్తమందుల రూపకల్పన పరిశోధనల వేగం తగ్గిపోయింది. ఇదే సమయంలో మందుల కంపెనీలు కూడా అధికలాభాలను తెచ్చే దీర్ఘకాలిక రోగాల చికిత్స మందులపైనే పరిశోధనలను కేంద్రీకరిస్తున్నాయి. అంటురోగ చికిత్సకవసరమైన కొత్త మందుల పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వడం లేదు. ఫలితంగా, ఎప్పుడో నియంత్రణలోకి వచ్చాయని భావిస్తున్న సాధారణ అంటురోగాలు, ముఖ్యంగా క్షయ (టిబి), మలేరియా వంటివి తిరిగి పుంజుకుంటున్నాయి. నయం కావడం లేదు. ఇవి మరణ కారకాలగానూ మారుతున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అవసరం వచ్చింది. కొత్తమందుల పరిశోధనలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరమూ ఏర్పడింది. మందుల పరిశోధనలో మన దేశానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని పరిరక్షించుకుంటూనే చౌక మందుల ఉత్పత్తి, సరఫరాలకు నాయకత్వం వహించాల్సిన అవసరం వుంది. ఈ నేపథ్యంలో 'చికిత్సలో యాంటిబయాటిక్స్‌ విఫలం.., ప్రత్యామ్నాయాల'ను క్లుప్తంగా తెలుపుతూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
యాంటిబయాటిక్‌ (సూక్ష్మజీవ నాశని) మందు నిరోధకశక్తి పరిణామాత్మకంగా వస్తుంది. ఈ మందు కలియక వల్లనే సూక్ష్మజీవిలో నిరోధకశక్తి రూపొందాలనే నియమమేమీలేదు. బ్యాక్టీరియాలో సహజంగానే మందుల్ని తట్టుకునేశక్తి ఉండవచ్చు. లేదా పర్యావరణ వత్తిళ్ల వల్ల ఈ శక్తి కలగవచ్చు. నిరోధకశక్తిని కలిగించే ఈ జన్యువులు అదే జాతికి చెందిన మందు పనిచేసే బ్యాక్టీరియాలో ప్రవేశించినప్పుడు, ఆ బ్యాక్టీరియాకు కూడా మందుల నిరోధకశక్తి కలుగుతుంది.పెన్సిలిన్‌ చికిత్స కనుగొనక ముందే బ్యాక్టీరియాలో పెన్సిలిన్‌ నిరోధకశక్తి ఉన్నట్లు గుర్తించారు. జన్యువులలో సహజంగా వచ్చే మార్పులు లేదా సహజంగానే ప్రకృతిలో ఉత్పత్తయ్యే 'బ్యాక్టీరియా నాశిని' వల్ల ఈ నిరోధకశక్తి కలగవచ్చు. వైద్యం, ఇతర రంగాలలో విస్తారంగా వాడబడుతున్న యాంటిబయాటిక్‌ మందులు కూడా నిరోధకశక్తిని వ్యాపింపజేస్తున్నాయి. ముఖ్యంగా, విచక్షణారహితంగా యాంటి బయాటిక్‌ మందులను వాడినప్పుడు సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తిని పెంచుతాయి. చికిత్సలో ఒకే ఒక డోసు మందును వాడినప్పుడు నిరోధకశక్తి ఉద్భవించే అవకాశం ఎక్కువగా ఉంది. వైద్యులు సూచించిన మోతాదు సరిగ్గాలేకున్నా లేక సూచించిన మోతాదులోనే మందును వాడకపోయినా నిరోధకశక్తి రావచ్చు. ముఖ్యంగా తక్కువ మోతాదులో దీర్ఘకాలం వాడే యాంటిబయాటిక్‌ మందులు నిరోధకశక్తిని పెంచుతాయి. మామూలుగా అవసరమైన మోతాదులో 72 గంటలు (3 రోజులు) వాడితే నిరోధకశక్తి రాదని వైద్యశాస్త్రం భావిస్తుంది.
జంతువుల పాత్ర..
కోళ్లు, ఇతర పశువులు, జంతుజాలాలకు దాణాతో కలిపి మందులు వాడినప్పుడు, ఆ మందులు వాటి జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి. ఆ జీవాల్లోని సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తిని కలిగిస్తాయి. జీవాల శరీరంలో అవశేషాలుగా మిగిలిపోతాయి. వీటి ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్నప్పుడు మన శరీరంలోకి మందు ప్రవేశించి, మనలో నిరోధశక్తిని కలిగించవచ్చు. అయితే, జీవాల ఆహారంలో వాడే యాంటిబయాటిక్స్‌ మందులపై నియంత్రణ అమెరికాలాంటి దేశాల్లో కూడా లేదు. ఫలితంగా ఈ జీవాల ఉత్పత్తుల్ని వాడినప్పుడు మానవుల్లో నిరోధకశక్తి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్నిరకాల పశుదాణాల్లో యాంటిబయాటిక్స్‌ మందుల్ని ఎదుగుదల వేగానికి వాడరాదని, ఆపేయాలని సూచించింది.

దీనితో ఇప్పుడు అసలు యాంటిబయాటిక్స్‌ కలపని ఆహారంతో పెరిగిన పశు ఉత్పత్తులు ఇపుడు ప్రత్యేకంగా మార్కెట్‌లోకి వస్తున్నాయి.
అమెరికాలో వినియోగపడే యాంటిబయాటిక్స్‌లో 70 శాతం పశుదాణాలో కలపబడుతున్నాయి. ఫలితంగా, వీటికి నిరంతరం చికిత్సకన్నా తక్కువ మోతాదులో ఈ యాంటిబయాటిక్స్‌ అందుతున్నాయి. ఇది వాటి సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తిని వేగంగా పెంచుతుంది. ఈ విధంగా యాంటిబయాటిక్స్‌ను వాడటం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య, మొత్తం మీద తగ్గనప్పటికీ, వాటి మిశ్రమ స్వభావంలో మార్పులొస్తున్నాయని పలు సందర్భాలలో గమనించారు. ఈ పదార్థాలను మనం తిన్నప్పుడు ఈ మందు అవశేషాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి. తద్వారా మన జీర్ణకోశ సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తి పెరుగుతుంది. ఈ అనుభవాల నేపథ్యంలో, పౌల్ట్రీ, పశుపోషణలో వాడే దాణాలో యాంటిబయాటిక్స్‌ వినియోగాన్ని నియంత్రిస్తూ జాగ్రత్త వహించాలి.
మన దేశంలో పశువుల పాల ఉత్పత్తిని పెంచడానికి ఆక్సిటోసిన్‌ అనే మందును అక్రమంగా ఇంజెక్షన్‌ రూపంలో వాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీని వినియోగం మన దేశంలో నిషేధించినప్పటికీ అనైతికంగా ఇది కొనసాగుతుంది. పాలనా యంత్రాంగం దీన్ని నివారించలేకపోతుంది. ఇది మన ఆరోగ్యంపై దుష్ప్రభావాల్ని కలిగి ఉంది.
నిరోధకశక్తి ఆవిర్భావం...
సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తి కింది పద్ధతుల్లో ఆవిర్భవించవచ్చు.
* ప్రకృతి ఒత్తిళ్ల వల్ల వచ్చే మార్పులు బ్యాక్టీరియా జన్యువుల్ని మార్చుతాయి. తద్వారా నిరోధకశక్తి గల జన్యువులు రూపొందుతాయి. ఈ జన్యువులు మందు పనిచేసే ఇతర బ్యాక్టీరియాల్లోకి ప్రవేశించి, ఆ కణాలలో నిరోధకశక్తిని కలిగిస్తాయి.
* జన్యుమార్పిడి (జీన్‌ ట్రాన్సఫర్‌): మందులకు ప్రభావితం కాగల సూక్ష్మజీవుల్లో నిరోధకశక్తి కలిగున్న సూక్ష్మజీవుల జన్యువు ప్రవేశం ద్వారా నిరోధకశక్తి పొందవచ్చు.
* ప్రత్యేక ఎంజైమ్‌: దీని ఉత్పత్తి వల్ల మందులకు నిరోధకశక్తి ఏర్పడవచ్చు.
* సూక్ష్మజీవుల్లోకి మందులు ప్రవేశించే కణ స్థావరాలలో జరిగే మార్పుల వల్ల మందు పనిచేయకపోవచ్చు.
* జీవక్రియ (మెటబాలిజం) మార్గంలో జరిగే మార్పుల వల్ల కూడా నిరోధకశక్తి ఏర్పడవచ్చు.
* సూక్ష్మజీవుల కణాల్లోకి మందు ప్రవేశానికే అడ్డంకులు ఏర్పడవచ్చు.
మీకు తెలుసా..?
* 'సూక్ష్మజీవి నాశిని - యాంటిబయాటిక్‌' :ఇది గ్రీకు పదం నుండి వచ్చింది. 'యాంటి' అంటే 'ఎదుర్కొనేది'. 'బయాస్‌' అంటే 'జీవం'. యాంటిబయాటిక్‌ అంటే జీవాన్ని ఎదుర్కొనేది.
* ప్రకృతిలో సహజంగా మందు పనిచేయగల, చేయని సూక్ష్మజీవులు కలిసి ఉంటాయి. కానీ, మందు పనిచేసే సూక్ష్మజీవులే అధికంగా ఉంటాయి.
* మొదటి యాంటిబయాటిక్‌ 'పెన్సిలిన్‌' సర్‌ అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ 1928లో కనుగొన్నారు.
* బ్యాక్టీరియా సంక్రమణ రోగాల చికిత్సకు వాడే మందును యాంటి బ్యాక్టీరియల్స్‌ అంటారు.
* క్షయ (టిబి), అతిసార, సిఫిలిస్‌, మెదడువాపు వ్యాధులు బాక్టీరియాల వల్ల వస్తాయి.
* అన్ని బ్యాక్టీరియాలు జబ్బుల్ని కలిగించవు. కొన్నే కలిగిస్తాయి. మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలూ ఉన్నాయి.
* యాంపిసిల్లిన్‌, ఎమోక్జో సిల్లిన్‌, బెంజైల్‌ పెన్సిలిన్‌ మందులు పెన్సిలిన్‌ జాతికి సంబంధించినవి. ఇవి ఎన్నో రకాల సంక్రమణ జబ్బుల చికిత్సకు ఉపయోగపడతాయి.
* వైరస్‌ జబ్బులకు యాంటిబయాటిక్‌ మందులు పనిచేయవు.
* సాధారణ జలుబు, తుమ్ములు వంటివి వైరస్‌ల వల్లే వస్తాయి. వీటికీ యాంటి బయాటిక్‌ మందులు పనిచేయవు. వారంరోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి.
డాక్టర్‌ మాదాబ్‌ కె.ఛటోపాధ్యాయ
సిసిఎంబి, హైదరాబాద్‌.

రాత్రి డ్యూటీలతో గుండెపోటు..!


రాత్రి డ్యూటీలు చేసేవారిలో లయ తప్పిన అనారోగ్యకర ఆహారపు అలవాట్లూ, నిద్ర సమయాల వల్ల ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీరిలో ప్రత్యేకంగా హృద్రోగ సమస్యలు అధికం అవుతున్నాయట. రాత్రి డ్యూటీ వల్ల ఆరోగ్య సమస్యలు అనేకం వస్తున్నా చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. కానీ అటువంటి వేళల మార్పుపై పరిశోధనలు మాత్రం చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటివారిలో సుమారు 25 శాతం హృద్రోగ ప్రమాదం అధికంగా వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి.
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

అంటార్కిటికాలో వృక్షాలు..!


అత్యంత శీతల ప్రదేశంగా ప్రస్తుతం పరిగణించబడుతున్న అంటార్కిటికాలో 55 మిలియన్‌ సంవత్సరాల క్రితం చక్కగా మొక్కలు, చెట్లు పెరిగేవట. అప్పట్లో అక్కడి వాతావరణం సగటు ఉష్ణమండల వాతావరణంలాగా ఉండేదట. విచిత్రంగా అప్పట్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ వంటి హరిత గృహ వాయువులు కూడా ఇప్పటికంటే మూడురెట్లు అధికంగా ఉండేవట. కొనసాగుతున్న వాతావరణమార్పులు, హరిత గృహ వాయువులు కూడా ఇప్పటికంటే మూడు రెట్లు అధికంగా ఉండేవట. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ మార్పులు, హరిత గృహ వాయువుల మోతాదు పెరుగుదలను చూస్తుంటే మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది జరిగితే, రానున్నకాలంలో ఇప్పటి మంచు ప్రదేశాలలో కూడా మొక్కలను చూడవచ్చన్నమాట.

గజ గాయకులు..!


పాటలు పాడటం అటు కోయిలకీ, ఇటు మానవులకీ మాత్రమే చేతనయ్యే పని అని ఇప్పటివరకూ అనుకుంటున్నాం. కానీ, ఏనుగులు కూడా పాటలు పాడగలవని శాస్త్రజ్ఞులు గమనించారు. పైగా, అవి అచ్చం మనలాగే పాడగలవట. కాకపోతే, వాటి పాట ఫ్రీక్వెన్సీ మాత్రం చాలా తక్కువగా, మనం వినలేని స్థాయిలో ఉంటుందట. అటువంటి పాటలను పాడుతూ ఏనుగులు తమ మంద నుండి తప్పిపోకుండా, మగవి తోడు వెదకడానికి ఉపయోగించుకుంటున్నాయట. మనుషులకి ఆ పాటలు వినిపించకపోయినా, తోటి ఏనుగులకు మాత్రం అవి సుమారు ఆరు మైళ్ల దూరంలో ఉన్నా వినిపిస్తాయట. విశేషమేమిటంటే పిల్లుల్లా కాకుండా స్వరపేటిక నుండి గాలి బయటికి వదిలి (మనుషులు చేసినట్టే) ఏనుగులు శబ్దాన్ని పుట్టిస్తాయి.

నీటితో నడిచే వాహనం..!


పెరిగే పెట్రోలు ధరలు చూస్తుంటే నీటితోనో, గాలితోనో నడిచే వాహనం ఉంటే ఎంత బావుంటుంది అని కలలు కనడం సహజమే. కానీ, ఆ కలని నిజం చేశాడట ఒక పాకిస్తానీ ఇంజినీరు. ఇతను అభివృద్ధి చేసిన టెక్నాలజీతో పెట్రోలుకు బదులు నీరు వాడి వాహనాన్ని నడిపించవచ్చట. వకార్‌ అహ్మద్‌ తాను రూపొం దించిన టెక్నాలజీతోనే తన కారులో నీరు నింపి, దాన్ని నడిపి మరీ చూపించాడు. ఒక లీటరు నీటితో కారు నలభై కిలోమీటర్లు, బైక్‌ నూట యాభై కిలోమీటర్లు దూరం వెళ్లిందట. ఈ టెక్నాలజీ లో నీటి నుండి విడుదలైన హైడ్రోజన్‌ వాయువు ఇంధనంగా పనిచేస్తుందట. ఇలాంటి పరిశోధనలు కొత్తవి కావుకానీ, ఈ ఫలితాల్ని అన్ని కోణాల నుంచి నిర్ధారినంచుకోవాల్సి వుంది.

స్తీల ఆయుష్షు ఎందుకెక్కువ?


సాధారణంగా స్త్రీలు పురుషులకంటే ఎక్కువకాలం జీవిస్తారు. ఈ విశేషానికి కారణాన్ని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్శిటీ పరిశోధకులు వివరించారు. అందుకు కారణం స్త్రీల జన్యువులలోనే వుందని వారు గమనించారు. వారి జీవకణాలలో ఉండే మైటోకాండ్రియా అనే భాగం మామూలుగా మనకి శక్తిని విడుదల చేయడానికి, అందించడానికి ఉపయోగపడతాయి. వాటిలో ఉత్పరిణామాలు గనక వస్తే ఆయుష్కాలంలో వ్యత్యాసాలు కనిపిస్తాయట. ఆ మార్పులు పురుషులలోనే కనిపిస్తాయనీ, స్త్రీలలో కనిపించవనీ వీరు కనుగొన్నారు. చిన్నపాటి ఈగల వంటి కీటకాలపై వీరు పరిశోధనలు చేశారు. ఆయుష్కాలం పరిధి జన్యువులలో వుందని వీరు నిర్ధారించారు.

Wednesday 1 August 2012

దేవుని ఊహాశక్తి నుండే విశ్వం సమస్తం ఏర్పడినట్లు ఎందుకు అనుకోకూడదు?

 

 


            గతవారం క్వార్కుల గురించి అవి ఎలా కలుస్తాయన్న విషయం గురించి తెలుసుకున్నాం. క్వార్కుల తర్వాత మరో తరగతి అతి ప్రాథమిక కణాలు లెప్టానులు. ఇవి కూడా 6 ఉంటాయని తెలుసుకున్నాం. వీటిలో మూడు తల్లుల్లాంటివి కాగా, మిగిలిన మూడు ఈ మూడు తల్లులకు పిల్లల్లాంటివి. ముందుగా తల్లుల పేర్లు : (1) ఎలక్ట్రాను (e), (2) మ్యూయాను (m), (3) టౌ (t). పిల్లల్లాంటివి : (1) ఎలక్ట్రాను న్యూట్రినో (ne), (2) మ్యూయాను న్యూట్రినో (nm), (3) టౌ న్యూట్రినో (nt). ఇందులో తల్లులన్నింటికీ 1.6 ఞ 10-19 కూళుంబుల ఋణ విద్యుదావేశం ఉంటుంది. కానీ పేరుకు తగ్గట్టే న్యూట్రినోలకు ఆవేశం ఉండదు. (పాపం, పాపలు కదా! కోపమే రాదు). లెప్టానులలో అత్యధిక బరువున్నది టౌ లెప్టాను. లెప్టాన్‌లన్నింటికీ క్వార్కులన్నింటికీ ఉన్నట్టే భ్రమణ సంఖ్య (spin quantum number) 1/2. క్వార్కులు ఎప్పుడూ విడివిడిగా ఉండవని తెలుసుకున్నాం. అవి జతలుగా (మీసాన్లు) గానీ లేదా త్రికాలుగా (బేరియాన్లు) గానీ ఉంటూ హేడ్రానులను ఏర్పరుస్తాయని కూడా గతవారం తెలుసుకున్నాం. లెప్టానులకు కూడా ప్రతిలెప్టాన్లు (anti leptons) ఉంటాయి. దాదాపు అదే ద్రవ్యరాశి ఉన్నా విద్యుదావేశం విరుద్ధంగా ఉండేవి ప్రతికణాలు (anti particles) అని తెలుసుకున్నాం కదా! కాబట్టి 6 లెప్టాన్లకు 6 ప్రతిలెప్టాన్లు ఉన్నాయి కాబట్టి ప్రకృతిలో మొత్తం 12 లెప్టాన్లు ఉన్నట్లు అర్థం. అలాగే క్వార్కులకు కూడా ప్రతిక్వార్కులు వున్నాయని గుర్తించాం కదా! అయితే క్వార్కులకు మరో లక్షణం రంగు (colour) అనేది ఆపాదించారు. ఈ రంగులు మూడురకాలు. అంటే ఆరు సహజ క్వార్కులకు ఒక్కోదానికి మూడేసి రంగుల చొప్పున మొత్తం 18 రకాల క్వార్కుల సంచయం ఉంది. దీనర్థం 18 వేర్వేరు సహజ క్వార్కులున్నట్లు భావించకూడదు.

       సహజక్వార్కులు 6, ప్రతిక్వార్కులు 6 మాత్రమే. కానీ ప్రతిక్వార్కు 3 విధాలుగా (రంగుల్లో) మసలగలదు. అందువల్ల క్వార్కులకు 18 రూపాలున్నట్టు, ప్రతిక్వార్కుకు కూడా 18 రూపాలు (రంగులు) ఉన్నట్లు అర్థంచేసుకోవాలి. వెరసి 36 విధాలుగా క్వార్కులు మనకు ద్యోతకమవుతాయి. లెప్టాన్లకు రంగులు లేవు. కాబట్టి సహజ లెప్టానులు (6), ప్రతి లెప్టానులు 6 కలసి వెరసి మనకు ప్రకృతిలో నికరంగా 12 రకాల లెప్టానులున్నాయన్నమాట. ఎలక్ట్రానుకున్న ప్రతి ఎలక్ట్రాను పేరు పోజిట్రాన్‌. దీని ఆవేశం +1.6ఞ10-19 కూళుంబులు భ్రమణ విలువ బేసి సగాలుగా (1/2, 3/2, 5/2, 7/2 మొదలైనవి) ఉండడమే కాకుండా మిగిలిన లక్షణాలలో సారూప్యత రీత్యా కొన్ని ప్రాథమిక కణాల్ని ఫెర్మియాన్లు (fermions) అంటారు.

       ఆ విధంగా అన్ని క్వార్కులు, అన్ని లెప్టానుల ఫెర్మియాన్లు, ఇదే శీర్షికలో మరో వ్యాసంలోనే గతవారం మరింత వివరంగా తెలుసుకొన్నట్లు ఫెర్మి, డైరాక్‌ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించిన గణాంకాల (statistics) కనుగుణంగా ప్రవర్తించే కణాల్ని ఫెర్మియాన్లు అంటారు. అలా కాకుండా భ్రమణసంఖ్య పూర్ణ సంఖ్య (integer) లుగా (0, 1, 2, 3, 4........ మొదలైనవి) ఉండడంతో పాటు మరికొన్ని లక్షణాలలో సారూప్యతరీత్యా కొన్ని కణాలను బోసాన్లు (bosons) అంటారు. భారతీయ శాస్త్రవేత్త సత్తేంద్రనాథ్‌ బోస్‌, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్లు సంయుక్తంగా రూపొందించిన గణాంకాలకు లోబడి ప్రవర్తించే కణాలను బోసాన్లు అంటారు. ఆ విధంగా క్వార్కులు, లెప్టాన్లు ఏవీ బోసాన్లు కావు. కానీ క్వార్కులతో ఏర్పడే కొన్ని హేడ్రాన్లు (ముఖ్యంగా మీసాన్లు) బోసాన్లు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హేడ్రాన్లు ఎప్పుడూ క్వార్కుల ముఠా కాబట్టి 1/2+1/2ొ1 లాగా భ్రమణసంఖ్య సంయుక్తమై పూర్ణ భ్రమణ సంఖ్య కాగలదు కదా! అయితే మూడు క్వార్కులతో ఏర్పడే బేరియాన్లు 1/2+1/2+1/2ొ3/2 లేదా 1/2+1/2-1/2ొ1/2 లుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి బేరియాన్లు కూడా ఫెర్మియాన్లు అవుతాయి.

       క్వార్కులు, లెప్టాన్ల తర్వాతి వర్గం గాజ్‌ బోసాన్లు. అతి ప్రాథమిక కణాలే కలసి ఆ తదుపరి పైస్థాయి పదార్థాల్ని ఏర్పరుస్తాయి. అంటే ప్రాథమిక కణాలైన క్వార్కులను కలిపి ప్రోటాన్లుగా మార్చేవి, ప్రోటాన్లను, న్యూట్రాన్లను సమన్వయపర్చి పరమాణు కేంద్రకాలను నిర్మించేవి, ఎలక్ట్రాన్లను కేంద్రకాల చుట్టూ తిరిగేలా చేసి పరమాణువుల్ని నిర్మించేవి, పరమాణువుల్ని కలిపి అణువులుగా మార్చేవి అణువులు లేదా పరమాణువుల సమన్వయంతో, ఘన, ద్రవ, వాయుపదార్థాల్ని కూడగట్టేది ఎవరు? ఏ ఆకర్షణ బలాలా ద్వారా ప్రాథమికకణాలు అణువులయ్యాయి. ఏ వికర్షణ బలాలమూలాన విశ్వంలోని పదార్థమంతా ఒకే ముద్దలా కాకుండా విడివిడి పదార్థాల కలగూర గంపలాగా ఉంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ గాజ్‌ బోసాన్లు. ఈ విశ్వంలో నాలుగంటే నాలుగే బలాలున్నాయని ఈ శీర్షికలోనే గతంలో తెలుసుకుని ఉన్నాము. వాటి పేర్లు (1) బలమైన కేంద్రక బలాలు(strong nuclear forces), (2) బలహీనమైన కేంద్రక బలాలు (weak nuclear forces), (3) విద్యుదయస్కాంత బలాలు (electro magnetic forces), (4) గురుత్వాకర్షణ బలాలు (gravitational forces) అని గుర్తు తెచ్చుకుందాం. ఇందులో గురుత్వాకర్షక బలాలు మినహాయిస్తే మిగిలిన 3 బలాలకూ ప్రతినిధులు ఆలంబన, ఆధారం ఈ గాజ్‌ బోసాన్లే. ఇవి 4 ఉన్నాయి. వాటిపేర్లు ఫోటాను లేదా కాంతి కణం (g), గ్లుయాను లేదా జిగురు కణం (g), జెడ్‌ బోసాను లేదా అంతిమ కణం (z), డబ్ల్యు కణం లేదా ద్విక కణం (w+). వీటి అన్నింటి భ్రమణ సంఖ్య ఒకటి. కాబట్టి గాజ్‌ కణాలన్నీ స్వభావరీత్యా బోసాన్లు. ద్విక కణానికి తప్ప మిగిలిన మూడింటికీ ప్రతికణాలు (aఅ్‌ఱజూaత్‌ీఱషశ్రీవర) లేవు. అంతేకాదు, ఆవేశం కూడా లేదు. కానీ ద్విక కణానికి ప్రతికణం ఉంది. ఆవేశం ధన, ఋణ 1.6ఞ10-19 కూళుంబులు ఉంటుంది.