విద్యార్ధుల క్షేత్రము

తెలుగు పిల్లల కోసం
[ భారత స్వాతంత్ర్య పోరాటయోధులు ]



[Learn Calligraphy and Penmanship Writing]
[ Mr DUNCUM IN ENGLAND]
[ RHYMES,  ALPHABES, COLORS, NUMBERS  AND  MORE FOR ALL LEVEL CHILDREN AND STUDENTS ]
[ VOCABULARY GAMES FOR CHILDREN ]
[ ఇంగ్లిష్ తెలుగు నిఘంటువు ]
[ Through Eleven Mediums ]
[ English, Spanish, German, French, Italian, Chinese, Portuguese, Dutch, Norwegian, Greek, Arabic, Polish, Turkish, Russian ]
[ Online Graphical Dictionary ]
[ pronounciation, Usage of Words ]
[ Free English Learning Resources ]
[ A Guide to Grammer, Punctuation and Style ]
Indian Childrens' Monthly Magazine
Telugu Childrens World
 
Your Mother Language On Net

[ COMPLETE  TELUGU  PRIMER ]
తెలుగు బాలశిక్ష  
[ నేటి తరం బాలలకు పాత తరం విషయాలు ]





__________________________________________________________


జాతీయపతాక నియమావళి  ::
 63 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 

జాతీయపతాక నియమావళి అనేది భారత జాతీయపతాక వాడకాన్ని నిర్దేశించే చట్టాల సమాహారం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాతీయపతాకం ఉత్పత్తి తగు నిర్దేశకాల ప్రకారమే జరిగేటట్లు పర్యవేక్షిస్తుంది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్ష తప్పదు. ఈ నియమావళిని Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 (No.12 of 1950) and the Prevention of Insults to National Honour Act, 1971 (No. 69 of 1971) అనే రెండు చట్టాల్లోని అంశాలను కలిపి 2002లోరూపొందించారు.
ఈ నియమావళి చాలా కఠినంగా ఉందనీ, సాధారణ పౌరులు తమ ఇండ్లమీద, ఇతర భవంతులమీద జెండానెగరేసే అవకాశం లేకుండా చేసిందనీ విమర్శలుండేవి. చాలా సంవత్సరాలు కేవలం ప్రభుత్వ భవంతులమీదనూ, ప్రభుత్వాధికారులకూ మాత్రమే జెండానెగరేసే ఆధికారముండేది. 2001 లో నవీన్ జిందాల్ సుప్రీమ్ కోర్టులో ఒక కేసు గెలవడంతో ఆ పరిస్థితి మారిపోయి దేశపౌరులందరికీ జెండానెగరేసే అవకాశం కలిగింది. జెండాను నడుం కిందిభాగంలోగాని, లోదుస్తులమీదగానీ ధరించరాదని నియమావళిని 2005లో సవరించారు.

2002కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగతాటప్పుడు జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాని ఎగురవేయగా అధికారులు దాని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. జిందాల్ నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని వాదించాడు.మూస:Inote ఆ కేసుమూస:Inote సుప్రీమ్‌కోర్టుకు వెళ్ళింది. సుప్రీమ్‌కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002-01-26నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీమ్‌కోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్[1] కేసులో పేర్కొంది. జాతీయపతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణహక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారతరాజ్యాంగంలోని 51A ఆర్టికల్‌లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది.

పతాకాన్ని గౌరవించడం


భారతీయ చట్టం ప్రకారం జెండాను ఎల్లవేళలా "గౌరవంతో, విధేయతతో" చూడాలి. The Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 స్థానంలో వచ్చిన జాతీయపతాక నియమావళి - 2002 పతాకం వాడకం, ప్రదర్శనలకు సంబంధించిన నియమాల సమాహారం.

దీని ప్రకారం పతాకం ఎప్పుడూ నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్ గా గానీ, ప్లాట్ ఫాం ముందుగానీ వాడరాదు. విగ్రహాలమీద, ఇతర వస్తువుల మీద గానీ కప్పరాదు. 2005 వరకు దుస్తులమీద, యూనిఫారాల్లో జెండాను వాడడం నిషిద్ధంగా ఉండేది. 2005-07-05 న సవరించబడిన నియమావళి ప్రకారం దుస్తులమీద, యూనిఫారాల్లో జెండాను వాడవచ్చు. ఐతే, నడుం కిందిభాగంలో, లోదుస్తులమీద వాడరాదు. జెండాను దిండుగలీబులమీద, చేతిరుమాళ్ళమీద ఎంబ్రాయిడర్ చేయడం కూడా నిషిద్ధం.

ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయడం, దేంట్లోనైనా ముంచడం, ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం కూడా నిషిద్ధం.

పతాకానికి తీసుకోవలసిన జాగ్రత్తలు


జెండా గౌరవాన్ని కాపాడడానికి పాటించవలసిన సాంప్రదాయిక నియమాలు అనేకం ఉన్నాయి. బహిరంగప్రదేశాల్లో వాతావరణపరిస్థితులతో నిమిత్తం లేకుండా సూర్యోదయమప్పుడు ఎగురవేసి, సూర్యాస్తమయమప్పుడు దించివేయాలి. ఐతే ప్రత్యేకపరిస్థితుల్లో పబ్లిక్ భవంతి మీద రాత్రిపూట కూడా ఎగరనివ్వవచ్చు.

జెండాను ఎప్పుడూ తలకిందులుగా చూపించరాదు, ఎగురవేయరాదు, చిత్రించరాదు. నిలువుగా ధరించినప్పుడు సరిగ్గా 90 డిగ్రీలు తిప్పడంతో బాటు జెండాను తిప్పి ధరించాలి. దారాలు ఊడిపోయిన, మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించడమంటే జెండాను అవమానించడమే. పతాకావిష్కరణకు వాడే జెండాకఱ్ఱలకు, జెండాను కఱ్ఱకు కట్టే తాడుకు కూడా ఇలాంటి నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ సరైన స్థిలో ఉండేట్టు జాగ్రత్త వహించాలి.

జాతీయపతాక ప్రదర్శన


IndiaFlagTwoNations.png
పతాకప్రదర్శనను నిర్దేశించే నియమాల ప్రకారం రెండు జెండాలను పూర్తిగా విస్తరించి పోడియం వెనుక గోడ మీద సమాంతరంగా ప్రదర్శించినప్పుడు వాటికి కర్రలను తగిలించే చివరలు రెండూ ఒకదానికొకటి అభిముఖంగా ఉండాలి. జెండాను చిన్నకర్రకు తగిలించినప్పుడు గోడకు వాలుగా అందంగా కనిపించేటట్లు వేలాడదీయాలి. రెండు జాతీయపతాకాలను X ఆకారంలోని కర్రలకు తగిలించినట్లైతే రెండుజెండాలూ వ్యతిరేకదిశల్లో విస్తరించుకునేటట్లు తగిలించాలి. జాతీయపతాకాలను టేబుళ్ళు, వేదికలు, పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.

ఇతరదేశాల జాతీయపతాకాలతో


మనదేశంలో బహిరంగప్రదేశాల్లో ఇతరదేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసేటప్పుడు ఇది కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) మొట్టమొదటిదిగా ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లీషులో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. ఏ పతాకమూ ఈ పతాకం కంటే పెద్దదిగా ఉండకూడదు. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలేగానీ ఏ ఒక్క జాతీయపతాకమూ మరొక జాతీయపతాకం మీద ఉండకూడదు.

అలాంటి సందర్భాల్లో పతాకాల వరస మొదట, చివర, అక్షరక్రమాన్ని బట్టి మధ్యలోనూ కూడా ఈ పతాకాన్ని ఎగరేయవచ్చు. పతాకాలను వృత్తాకారంలో ఎగరేసినప్పుడు ఈ పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. ఈ పతాకాన్ని అన్నిటికంటే ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి.

X ఆకారంలో వాలుగా ఉంచిన కర్రలకు వేలాడదీసేటట్లైతే, పైన ఉన్న కర్ర మీదే ఈ జెండా ఉండాలి. అది కూడా కుడివైపున (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. ఒక్క ఐక్యరాజ్యసమితి జెండా మాత్రం ఎటువైపునైనా ఉండొచ్చు. వరసలో అన్నిటికంటే మొదట ఈ జెండాయే ఉండడం సంప్రదాయం.

జాతీయేతర పతాకాలతో


IndiaFlagNonNational.png
జాతీయపతాకాలు కాని ఇతర పతకాలతో - కార్పొరేట్ పతాకాలు, అడ్వర్టైజింగ్ బానర్లు లాంటివాటితో - కలిపి ఎగరేసేటప్పుడు అన్నీ వేర్వేరు జెండాకర్రలమీద ఉన్నట్లైతే జాతీయపతాకం మధ్యలోనైనా ఉండాలి లేదా అన్నిటికంటే మొదట్లో - చూసేవారికి ఎడమవైపు చివరన వచ్చేటట్లు - ఉండాలి లేదా మిగతా పతాకాలన్నిటికంటే కనీసం ఒక జెండా వెడల్పు ఎత్తులో ఉండాలి. మిగతా జెండాలన్నీ దీనికి వెనుకే ఉండాలి. ఒకవేళ జెండాలన్నీ ఒకే కర్రమీద ఉన్నట్లైతే ఇదే అన్నిటికంటే పైన ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకువెళ్ళేటప్పుడు ఇది ఊరేగింపు మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్ళేటప్పుడు ఇది కుడివైపున మొదటిదిగా ఉండాలి.

గదిలో పతాకాన్ని ప్రదర్శించడం


పతాకాన్ని హాళ్ళలోగానీ, గదుల్లోగానీ నిర్వహించే సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ప్రదర్శించాలి - ఇది అధికారాన్ని సూచించే స్థానం కాబట్టి. వక్తలు ఉపన్యసించేచోటికి దగ్గరలో ఉన్నట్లైతే ఇది వారికి కుడిచేతి వైపునే ఉండాలి. వేరే ఎక్కడైనా ఉన్నట్లైతే సభికులకు కుడివైపున ఉండాలి.
IndiaFlagIndoors.png
కాషాయరంగు పైన ఉండేటట్లు పూర్తిగా విస్తరించి ప్రదర్శించాలి. నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి.

కవాతులు మరియు సంబరాల్లో


ఊరేగింపుల్లోగానీ, పెరేడ్‌లలోగానీ, ఇతర జెండా(ల)తో కలిపి తీసుకువెళ్తున్నప్పుడు ఊరేగింపు ముందుభాగాన కుడివైపు మొదటిదిగా గానీ, మధ్యలో ఇదొక్కటే అన్నిటికంటే ముందుగానీ ఉండాలి. విగ్రహాలను, కట్టడాలను, శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్నప్పుడు ప్రత్యేక చిహ్నంగా జాతీయపతాకాన్ని వాడొచ్చు. కానీ వాటిని కప్పడానికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా దీనిని కిందికి దించరాదు. రెజిమెంట్ల పతాకాలను, వివిధ సంస్థల పతాకాలను మాత్రం దించవచ్చు.
IndiaFlagParade.png
పతాకావిష్కరణ జరుగుతున్నప్పుడు, పతాకాన్ని దించుతున్నప్పుడు, పెరేడ్‌లో పతాకాన్ని తీసుకువెళుతున్నప్పుడు, అక్కడున్నవాళ్ళందరూ పతాకం వైపు తిరిగి అటెన్షన్‌లో నిలబడాలి. యూనిఫాం లో ఉన్నవాళ్ళు తగినవిధంగా సెల్యూట్ చెయ్యాలి. పతాకవందనం అయిన తర్వాత జాతీయగీతం ఆలపించాలి.

వాహనాలపై ప్రదర్శన


జాతీయపతాకాన్ని తమ వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతిఉపరాష్ట్రపతి,ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లుముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు మరియు శాసనసభల సభ్యులు, లోక్‌సభ మరియు శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ మరియు రాష్ట్రాల శాసనమండళ్ళ అధ్యక్షులు, సుప్రీమ్‌కోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, మరియు వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది.

వారికి అవసరమనిపించినపుడు తమ కార్ల మీద ఎగరేసుకోవచ్చు. కారు బాయ్‌నెట్ ముందు భాగంలో సరిగ్గా మధ్యలోగానీ, కుడివైపు చివరగానీ స్థిరంగా నిలబడిన కమ్మీకి తగిలించాలి. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు మన జాతీయపతాకం వాహనానికి కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేదా ప్రధాన మంత్రి విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న విమానం మీద ఎగరేయాలి. దీనితోబాటు పర్యటిస్తున్న దేశపతాకం కూడా ఎగరేయాలి. ఐతే మధ్యదారిలో వేరే దేశంలో ఆగినట్లైతే పర్యటిస్తున్న దేశపతాకం స్థానంలో మర్యాదపూర్వకంగా ఆ దేశ పతాకాన్ని ఎగరేయాలి. రాష్ట్రపతి మనదేశంలోనే పర్యటిస్తున్నట్లైతే వారు ఏవైపునుంచి విమానంలోకి ఎక్కి దిగుతారో ఆ వైపున ఎగరేయాలి. ఒకవేళ వారు ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్నట్లైతే రైలు బయలుదేరిన స్టేషన్ లోని ప్లాట్‌ఫారం వైపు కనిపించేటట్లు ఇంజన్ మీద ఎగరేయాలి. ఈ రైలు ఆగి ఉన్నప్పుడుగానీ, ఆగబోతున్న స్టేషను సమీపిస్తున్నప్పుడుగానీ మాత్రమే ఎగరేయాలి.

అవనతం


రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. సంతాప కాల అవధి ఎంతో కూడా ఆ ఆదేశంలోనే పేర్కొనబడుతుంది. అవనతం చేసేటప్పుడు మొదట పతాకాన్ని పూర్తిగా ఎగరేసి తర్వాత నెమ్మదిగా కిందకు దించాలి. పతాకాన్ని తీసేసేముందు దాన్ని పూర్తి ఎత్తుకు ఎగరేసి తర్వాతనే కిందికి దించాలి. భారతజాతీయపతాకం ఒక్కదాన్నే అవనతం చెయ్యాలి. ఇతరదేశాల పతాకాలు మామూలుగానే ఎగురుతాయి.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేయబడుతుంది. లోక్‌సభ స్పీకరు లేక సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరణిస్తే ఢిల్లీలోను, కేంద్ర క్యాబినెట్ మంత్రి మరణిస్తే ఢిల్లీ మరియు రాష్ట్రాల రాజధానుల్లోను, సహాయమంత్రి మరణిస్తే ఢిల్లీలోను, రాష్ట్రాల లేక కేంద్రపాలితప్రాంతాల గవర్నరు/లెఫ్టినెంట్ గవర్నరు లేక ముఖ్యమంత్రి మరణిస్తే ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లోను అవనతం చేయబడుతుంది.

పైవారిలో ఎవరైనా చనిపోయినట్లు మధ్యాహ్నం తర్వాత సమాచారం తెలిసి, మరుసటిరోజు సూర్యోదయం లోపల అంత్యక్రియలు జరగకపోయినట్లైతే పైన పేర్కొన్నచోట్ల మరుసటిరోజు కూడా అవనతం చేసి ఉంచాలి. పైవారికి అంత్యక్రియలు జరిగేరోజు అవి జరిగేచోట కూడా అవనతం చేసి ఉంచాలి.

స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం, గాంధీ జయంతి, జాతీయవారోత్సవాలప్పుడు (ఏప్రిల్ 6 నుంచి 13 వరకు), ఏదైనా రాష్ట్రావతరణం రోజు అవనతం చెయ్యవలసి వస్తే సదరు మృతదేహమున్న భవంతి మీద మాత్రమే అవనతం చేసి ఉంచాలి - అది కూడా మృతదేహాన్ని అక్కడినుంచి బయటకు తెచ్చేటంతవరకు మాత్రమే.

విదేశీ ప్రముఖులు చనిపోయినప్పుడు అవనతం చెయ్యడం హోం మంత్రిత్వశాఖ ఇచ్చే ప్రత్యేక సూచనలను బట్టి ఉంటుంది. ఐతే ఎవరైనా దేశనేత చనిపోయినప్పుడు ఆ దేశంలోని భారతకార్యాలయం అవనతం చెయ్యవచ్చు.

అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం/దహనం చేసే ముందు తీసేయాలి. శవంతోబాతు గుంతలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.

విసర్జన


పతాకం ఉపయోగించుకోలేని పరిస్థితికి చేరినపుడు దానిని సగౌరవంగా విసర్జించాలి. తగులబెట్టడం లేదా భూమిలో పాతిపెట్టడం చేయాలి.
_________________________________________________________________________

తెలుసుకుందామా...

  • -సేకరణ: శ్రీహర్ష
  • 24/03/2012
------------------------------------------------------------------------------
సంఖ్య ఎంతకి సమానం ఎన్ని సున్నలు
------------------------------------------------------------------------------
వెయ్యి పది వందలు 3
మిలియన్ వెయ్యి వేలు 6
బిలియన్ వెయ్యి మిలియన్లు 9
ట్రిలియన్ వెయ్యి బిలియన్లు 12
క్వాడ్రిలియన్ వెయ్యి ట్రిలియన్లు 15
క్వింట్రిలియన్ వెయ్యి క్వాడ్రిలియన్లు 18
సెక్స్టిలియన్ వెయ్యి క్వింట్రిలియన్ 21
సెప్టిలియన్ వెయ్యి సెక్స్టిలియన్ 24
ఆక్టిలియన్ వెయ్యి సెప్టిలియన్ 27
నానిలియన్ వెయ్యి ఆక్టిలియన్ 30
డెసిలియన్ వెయ్యి నానిలియన్ 33
అండెసిలియన్ వెయ్యి డెసిలియన్ 36
డ్యుడెసిలియన్ వెయ్యి అండెసిలియన్ 39
ట్రెడెసిలియన్ వెయ్యి డ్యుడెసిలియన్ 42
క్వాట్యుయార్డెసిలిన్ వెయ్యి ట్రెడెసిలియన్ 45
క్విండెసిలియన్ వెయ్యి క్వాట్యుయార్డెసిలిన్ 48
సెక్సెసిలియన్ వెయ్యి క్విడెసిలియన్ 51
సెప్టెండెసిలియన్ వెయ్యి సెక్సెసిలియన్ 54
ఆక్టోడెసిలియన్ వెయ్యి సెప్టెండెసిలియన్ 57
నవెండెసిలియన్ వెయ్యి ఆక్టో డెసిలియన్ 60
వింగ్టిలియన్ వెయ్యి నవెండెసిలియన్ 63
ఇంతకన్నా పెద్ద అంకెలున్నాయి. ట్రగెంట్-బిల్లిలియన్ (60,000,003 సున్నలు), సెక్సెంట్-బిల్లిల్లియన్ (1,800,000,003 సున్నలు), గూగల్ అంటే 1 తర్వాత వంద సున్నలు.
_________________________________________________________________

అందమైన రాత.. అభివృద్ధి గీత...

చిన్నారులూ..! పరీక్షలు వచ్చేస్తున్నాయి కదూ! అయితే ఎంతబాగా చదివినా.. అర్థమయ్యేలా అక్షరాలు రాయకపోతే మార్కులు వేయరర్రా! అందుకని చదువుతో పాటు రాత మీదా కాస్తంత శ్రద్ధ పెట్టాల్సిందే..! అందంగా అక్షరాల్ని తీర్చిదిద్దితే మీ అభివృద్ధికి అదొక మెట్టయినట్లేనర్రా! చాలా మంది చూడచక్కని రాత కొందరికే పరిమితమనుకుంటారు. మరికొందరు అది మొదటి నుండి ఉండాలిగానీ ఇప్పటికిప్పుడు వస్తుందా అంటారు. మా ఇంట్లో వాళ్లందరి రాత ఇంతే అంటూ సర్దిచెప్పుకునేవారూ ఉన్నారు. అదేంకాదర్రా! ఏదైనా సాధన చేస్తే సాధించడం సుసాధ్యమే! దీనికితోడు కొన్ని చిట్కాలు తెలుసుకుంటే చాలు. చక్కగా రాయడం ఎంత సులువో మీకే అర్థమవుతుంది. అందమైన రాత ఏ ఒక్కరి సొత్తూ కాదర్రా! అందుకే నిరాశపడకుండా ప్రయత్నించండి. ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా?! ప్రయత్నించకుండానే నాకు రాదని నిర్ధారణకు రావడం కూడా పొరపాటేనర్రా..! అందుకే ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో 'సుందరయ్య విజ్ఞానకేంద్రం, ప్రజాశక్తి సాహితీ సంస్థ, మరికొన్ని ప్రజాసంఘాలు' సంయుక్తంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని 'మల్లికార్జునరావు' మామయ్య సహకారంతో నిర్వహించాయర్రా! ఈ మామయ్య 'జాతీయ చేతిరాత అకాడమీ'కి డైరెక్టర్‌. అక్షరాల్ని అందంగా రాయడం ఎలాగో కొన్ని మెళకువలు చెప్పారు. వాటిని ఈ వారం క్లుప్తంగా తెలుసుకుందామే..!
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!
ఈ పద్యంలో వేమన ఎంత బాగా చెప్పారో కదా! సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు. అందుకని సాధన చేస్తే దేన్నయినా సాధించవచ్చన్న మాట! మరి సాధన ప్రారంభిద్దామా..?!
మనం చక్కగా రాయాలంటే ఈ ఏడు చిట్కాలు తెలుసుకుంటే సరిపోతుంది. అవేంటంటే..
1. పెన్ను / పెన్సిల్‌ ఎలా పట్టుకోవాలి..?
ముందసలు పెన్నుగానీ, పెన్సిల్‌గానీ చక్కగా పట్టు కోవడం రావాలంటర్రా! ఎలా పడితే అలా పట్టుకుంటే చేతిరాత సరిగా రాదంట. పెన్నుని సుమారు మూడు సెం.మీ. దూరంలో పట్టుకోవాలి. చూపుడువేలు, బొటనివేలు మధ్య పెన్‌ పెట్టి మధ్యవేలును పెన్ను కిందభాగంలో ఆధార మిస్తూ (పక్క చిత్రంలో వలే) పట్టుకోవాలి. ఇలా పట్టుకుని రాయడం వల్ల సౌకర్యంగా ఉండి వేళ్లు నొప్పిపెట్టవు. వేగంగా కూడా రాయవచ్చు. చేతిని మోచేతి వరకూ కదుపుతూ రాయాలంటర్రా! మనం హాయిగా రాసుకునేలా ఉండాలి. అంతేకానీ పెన్ను జారిపోయేలానో, కదిలిపోయే లానో పట్టుకుంటే రాయడం కష్టమే మరి! అందుకే ముందు పట్టుకోవడంలో సాధన చేయండే..!
2. అక్షరాల గురించిన అవగాహన
మనం రాసే ముందు తెలుగు / ఇంగ్లీషు ఎన్ని అక్షరాలున్నాయి? అవి ఎలా ఉన్నాయి? అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. ఆ అక్షరాలు ఎలా ఉంటాయో తెలియకుండా రాయడం కష్టమే కదా! అందుకని ముందు ఆ విషయంలో అవగాహన పెంచుకోండే..! ఇంగ్లీషు కర్సివ్‌ (కలిపిరాత) రాసేటప్పుడు అక్షరాలు 600లో, విడి అక్షరాలు రాసేట ప్పుడు 900లో రాయాలి. కొందరు ఓ వైపుకు బాగా వంచేస్తారు. ఇంకొందరు ఏకంగా పడుకోబెట్టేస్తారు. అలా రాయకూడదు.
3. అక్షరాల్ని కలపడం ఎలా?
ఇది ఎక్కు వగా ఇంగ్లీషు రాసేటప్పుడు అవసరమవు తుంది. కలిపిరాత రాసేటప్పుడు ఒక అక్షరం నుండి మరో అక్ష రానికి ఎలా కలుపుకుంటూ రాయాలో తెలుసుకోవాలి. మొద లెక్కడీ చివరెక్కడో తెలియాలి.
4. అక్షరాలు ఏ ప్రాంతాల్లో ఉండాలి?
అక్షరాలు కొన్ని పైకి రాసేవి ఉంటాయి. కొన్ని దిగువకి రాసేవి ఉంటాయి. మరికొన్ని సమాంతరంగా ఉంటాయి. అవి ఏ అక్షరాలు ఎలా ఉండాలి అన్న విషయం తెలుసుకోవాలి. అక్షరాల్ని 'పైన, మధ్య, కింద' అని మూడు ప్రాంతాలుగా విభజించారు. పై భాగంలో రాసేవి రెండింతలు పైకి ఉంటాయి.
5. ఎక్కడెక్కడ ఖాళీలు వదలాలి?
ఖాళీలు వదిలిపెట్టడంలో కిటుకు తెలుసుకుంటే చేతిరాత ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అక్షరానికి అక్షరానికి మధ్య, పదాలకి పదాలకి మధ్య, వాక్యానికి వాక్యానికి మధ్య, పేరా పేరాకి మధ్య ఖాళీలు వదలడం ఒక పద్ధతిగా ఉండాలి. అక్షరాల మధ్య ఖాళీ ఒక క్రమంలో ఉండాలి. అలాగే పదానికి పదానికి మధ్య ఒక అక్షరమంత ఖాళీ వద లాలి. వాక్యాల మధ్య, పేరాల మధ్య కూడా ఒకే క్రమంలో ఖాళీ వదులుతూ రాయాలి. అలాగే వాక్యం ముగింపులో పెట్టే చుక్క (పులుస్టాప్‌ / ఎండింగ్‌ డాట్‌) తర్వాత రెండు లక్షరాల ఖాళీ వదలాలి.
6. ఎలా ప్రారంభించాలి?
ఏదైనా రాసేటప్పుడు ఎలా ప్రారం భించాలి అన్నదీ ముఖ్యమేనర్రా! మొదటి అక్షరానికి ప్రాముఖ్యత ఉండేలా ప్రారంభిస్తే ఎంత అందంగా ఆ వాక్యం ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇంగ్లీషు మీడి యంలో ఇది చాలా ప్రాముఖ్యమైంది. మొదటి అక్షరం క్యాపిటల్‌ లెటర్‌ రాయాలి.
7. రాతకు లైనే ఆధారం..
ఏ భాషలో రాయాలన్నా లైను ఆధారంగా రాయడం ముందు నేర్చుకోవాలి. అందు కు సింగిల్‌ రూల్‌ పేపరు మీద సాధన చేస్తే సరిపో తుంది. లైనుకు పైభాగంలోకి ఏ అక్షరం రాయాలి? లైనుకు సమాంతరంగా ఏ అక్షరం రాయాలి? దిగువకు ఏ అక్షరం రాయాలి? అన్నది అవగాహన ఉండాలి. దీన్ని తెలుసుకుంటే అక్షరాల పొందిక అందంగా అమరినట్లే..!
అందంగా రాయడానికి కూడా ముందుగా మనకు అమ్మ భాష (మాతృభాష) బాగా వచ్చి ఉండాలంటర్రా! అమ్మను ఎంత ప్రేమిస్తామో అక్షరాల్ని అంతగా ప్రేమిం చాలి. మాతృభాషను, మాతృదేశాన్ని ప్రేమించినవారు తప్పక అభివృద్ధి దిశలోనే పయనిస్తారర్రా!
పైన చెప్పినవి పాటిస్తూ రాస్తే ఆ రాత చదవడానికి హాయిగా ఉంటుంది. శుభ్రమైన దుస్తులు వేసుకుంటే ఎలా ఉంటుందో అంత చక్కగా ఉంటుందర్రా! సీతాకోక చిలుకలు ఎగిరనట్లు రాయండి. అంతేగానీ పులి వెంట పడుతుంటే పరిగెత్తే కుందేలులా రాయకండే..! మీ దగ్గర ఇంకు పెన్ను ఉందా? లేకపోతే ఒకటి కొనుక్కోండి. అందులో ఎంచక్కా సిరా (ఇంకు) నింపుకుని ప్రతి రోజూ ఒక పేరా రాయండి. ఈ పెన్నుతో రాస్తే రాత చక్కగా వస్తుంది. ఇది కేవలం సాధన చేయడానికే సుమా! పరీక్షల్లో కుదరదండోరు..! రాస్తేనే అనుభవం వచ్చేది. అంతేకదా! కాస్త ఇబ్బందిపెట్టేవి పదే పదే రాస్తే బాగా వస్తాయి. సాధనతోనే ఏదైనా సాధించవచ్చు కదా!
రాసేటప్పుడు మనం కూర్చొనే స్థితి (పొజిషన్‌) కూడా ముఖ్యమేనర్రా! పాదాల్ని నేలమీద ఆనేలా కూర్చో వాలి. మనం మెడ వంచితే పుస్తకానికి మనకు స్కేలు దూరం ఉండాలి. కుదురుగా కూర్చోవాలి. కొందరు ఓ పక్క పడుకుండిపోతారు.. అలా కాదన్నమాట. అంటే అక్షరాలు రాసేటప్పుడు వాటికి విలువ ఇస్తే మీకూ విలువ (మార్కుల్లో) వస్తుంది. మీరెలా ఉంటారో పేపరు దిద్దేవారికి తెలియదు. కానీ మీ చేతిరాత మాత్రం వాళ్లకు బాగా తెలుస్తుంది.
తెలుగులో మాత్రం సున్నాని సవ్య, అపసవ్య దిశల్లో చుట్టడం, గీతల్ని ఏటవాలుగా, నిలువుగా, అడ్డంగా చక్క గా గీయడం నేర్చుకుంటే గుండ్రని చేతిరాత మీ సొంతమేనర్రా!
పరీక్షల్లో పదాలు విడగొట్టకుండా రాయండి. అలాగే పెన్ను / పెన్సిల్‌ ఒత్తిపెట్టి రాయకండి. అంటే ఈ పేజీలో రాస్తే వెనుక పేజీలో పేపరు ఉబ్బుగా వచ్చేలా రాయ కూడదు. ఇలారాస్తే పేపరు నాసిరకంగా ఉందనుకోండి కొన్నిసార్లు చినిగిపోతుంది కూడా! అలాగే అంకెలు వేసేటప్పుడూ ఇష్టానుసారం వంపులు తిప్పకుండా సాధారణంగా రాస్తే సరిపోతుంది.
స్పష్టంగా పలుకుతూ చదివితే రాసేటప్పుడు తప్పులు కూడా రావర్రా! అందుకే ఎవరూ లేని చోటకెళ్లి బిగ్గరగా చదవండి. అప్పుడు పలకడం బాగా వస్తుంది. ఇలా వచ్చాక మామూలుగా చదివితే సరి!
మరి అందమైన చేతి రాత సాధనకు ఈ రోజే శ్రీకారం చుట్టండే..!
__________________________________________________________________


టీవీ మాయ

చిన్నారులూ! టీవీ వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయా? ఏమో మాకైతే తెలియదర్రా!.... ఇదిగో సుస్మిత రాసిన ఈ ఇంగ్లీషు కథ చదివేంత వరకూ. మీలో ఎవరికైనా అనుభవమేమో మరి..! అయినా సుస్మిత తన కథలో ఏం చెప్తుందో తెలుసుకుంటే పోలా..! మరి చదివేయండి..
''అనగనగా అవంతిపురం అని ఒక ఊరు ఉండేది. అది గతంలో పచ్చని పొలాలతో, కాల్వల నిండా నీళ్లతో చాలా బాగుండేదట! అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. ముందు రేడియో వచ్చింది. ఆ తర్వాత టీవీ, మోటారుసైకిల్‌, కారు అలా అలా కంప్యూటర్‌, దానికి అంతర్జాలం ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయి. అయితే ఆ ఊళ్లో చాలా మంది టీవీ వల్లే చెడిపోయారంట!
అదెలా అంటే.. ఆ ఊళ్లో ఆడవాళ్లు, మగవాళ్లు టీవీలో వచ్చే సీరియల్స్‌ చూడటానికి బాగా అలవాటుపడ్డారంట. అందరూ అలా చూడటం మొదలుపెట్టేసరికి చేయాల్సిన పనులన్నీ ఆగిపోయాయంట. దీంతో వాళ్లంతా సోమరులైపోయారంట. పొలంలో పనుల సమయాలన్నీ అటూఇటూగా మారిపోయాయంట! దీంతో చక్కగా పండాల్సిన పంటలు పండకుండా ఒక మాదిరిగా పండాయంట! పనిచేసుకునేవాళ్లు సరిగా రావడం లేదు. ఒకరోజు వస్తే ఇంకోరోజు రాకపోవడం చేస్తున్నారు. వచ్చినా సమయానికి రావడం లేదంట! దీంతో పక్క ఊరు వారికి పనులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకేముంది ఊళ్లో వాళ్లకి పనుల్లేకుండా పోయాయి. ఇదంతా టీవీ వల్లే..!
ఇదంతా ఒక నష్టమైతే చదివే పిల్లల మీదా దీని ప్రభావం బాగానే పడింది. అదెలా అంటే..?!
ఆ ఊళ్లో శృతి అనే అమ్మాయి ఉండేది. శృతి చాలా తెలివైనది. ఎంతో ఇష్టంగా పాఠ్యపుస్తకాలు చదుకునేది. మంచి మార్కులతో తరగతిలో మొదటిస్థానంలో ఉండేది.
శృతి టీవీ వల్ల ఎలా చెడిపోయిందంటారా? అదెలా అంటే..?!
శృతికి ఒక తమ్ముడున్నాడు. వాడి పేరు శరత్‌. శరత్‌కో స్నేహితుడు ఉన్నాడు. వాడి పేరు చరణ్‌. చరణ్‌ వాళ్లింట్లో టీవీ ఉంది. రోజూ శరత్‌కు తను ఇష్టంగా చూసే టీవీ కార్యక్రమాలన్నీ పూసగుచ్చినట్లు చెప్తుండేవాడు. శరత్‌కి వాటిన్నింటినీ చూడాలనే కోరిక రోజురోజుకు పెరిగిపోయింది. వాళ్ల నాన్నను టీవీ తేవాల్సిందేనని పేచీ పెట్టేశాడు. చివరికి ఇంటికి టీవీ రాక తప్పిందికాదు. శరత్‌ తన మిత్రుడు చరణ్‌ చెప్పిన కార్యక్రమాలన్నీ చూస్తం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్న శృతికి కూడా ఆవైపుకు దృష్టి మళ్లింది. తనూ చూడటం మొదలుపెట్టింది. రాత్రి పన్నెండైనా టీవీ చూడటం, ఉదయం ఆలస్యంగా లేవడం మొదలుపెట్టారు. సోమరితనం వచ్చేసింది.
ఈ క్రమంలోనే పరీక్షలు జరిగాయి. పరీక్షల్లో శృతికి మార్కులు తగ్గాయి. పేపర్లు దిద్దిన టీచర్లు ఆశ్చర్యపోయారు. 'శృతిలో ఏంటి ఇంత మార్పు? ఎందుకింత వెనకబడిపోయింది? ఒకవేళ ఆటల మీదే ఎక్కువ దృష్టిపెడుతుందా ఏమిటి? అదేంలేదే స్కూలు వదిలి పెట్టగానే వెళ్లిపోతుందే.. ఎక్కువసేపు నిద్రపోతుందా?..' ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్లు ఆలోచనలు చేయడం మొదలుపెట్టారు. కానీ అసలు కారణమైన టీవీ చూస్తున్న విషయం ఎవరూ కనిపెట్టలేకపోయారు.
శృతి ఎంతగా అలవాటుపడిపోయిందంటే.. తనకు ఇష్టమైన కార్యక్రమం రాకపోతేనో.. తను చూస్తున్న ఛానల్‌ని శరత్‌ మారిస్తేనో.. ఏడ్చే పరిస్థితికి వచ్చింది.
ఇదంతా వాళ్ల తండ్రి రామారావుకి అర్థమైంది. టీవీ తీసికెళ్లి అమ్మేశాడు. 'టీవీ లేదనే' బాధతో శృతి తల్లడిల్లిపోయింది. అయితే కొన్నిరోజులే. తర్వాత దాన్ని మర్చిపోయి, హాయిగా గతంలోలా బుద్ధిగా చదవడం ప్రారంభించింది.''
అమ్మానాన్నలు టీవీలను అమ్మేస్తే పిల్లలకు దానిమీద కోరిక మరింత ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకని ఈ సమస్యను మనం అర్థం చేసుకోవడంలోనే అసలు 'మందు' ఉందర్రా! పరీక్షలు దగ్గరపడుతున్నాయి కదా! అందుకని పిల్లలంతా టీవీ చూసే అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. 'టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు..' వీటి విజ్ఞానాన్ని మనం పొందడం తప్పా? అని ప్రశ్నిస్తే.. తప్పేం లేదనే సమాధానం వస్తుంది. కానీ వీటికి అలవాటుపడిపోతేనే అసలు ప్రమాదం. అలా అలవాటు కాకుండా ప్రణాళికా బద్ధంగా చదువుకుంటూ మధ్యలో కాసేపు రిలాక్స్‌ కావడానికి చూస్తే ఏం కాదు. అయినా మనం ఈ సాంకేతికాల్ని వినోద కాలేక్షాపాలకే ఉపయోగించుకోకూడదర్రా! మీలో విజ్ఞాన తృష్ణ పెంచేందుకు దోహదపడాలి. ఈ విషయంలో చైనా, జపాన్‌ దేశాల పిల్లలు మనకు ఆదర్శంగా ఉన్నారు. వాళ్లలాగా మనమూ ఈ వస్తువులు ఎలా పనిచేస్తున్నాయి? మరింత నేర్పుగా, ఉపయోగకరంగా తయారుచేయడం ఎలా? అనే పద్ధతుల్లో ఆలోచించాలి.
ఇంతకూ టీవీ ఎలా పని చేస్తుందో తెలుసా? అందులో ఏమేం ఉంటాయి? అసలు టీవీ తయారుచేయాలంటే ఏమేం కావాలి? సెల్‌ఫోన్‌ లోపల ఏ ఏ భాగాల్ని ఎలా తయారుచేస్తారు? ఏ భాగం ఏ పని, ఎలా చేస్తుంది? ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రశ్నలేనర్రా!
ఇలాంటి వాటికి సమాధానాల్ని కనుక్కోండి మరి..!
ఆగండాగండి.. ఇప్పుడుకాదర్రా! పరీక్షలు అయిపోయాక. ఎంచక్కా వేసవి సెలవులు వస్తాయి కదా! అప్పుడు మొదలుపెట్టండి మెదడుకు మేత. సరేనా..! ఇప్పుడు మాత్రం పరీక్షలకు సిద్ధంకండే..!!
___________________________________________________________

బాలలు...తెలుసుకోవలసిన పద్ధతులు..!

apr  -   Sat, 25 Feb 2012, IST
బాలప్రభ
ఉదయం లేవగానే పళ్ళు తోము కోవడం:
పిల్లలకి ఉదయం నిద్రలేవగానే పళ్ళు తోముకోవడం అలవాటు చేయాలి. లేదంటే వాళ్లు అలాగే పాలు తాగడం కానీ, లేదంటే టిఫినో, బిస్కెట్లనో తినడం గానీ చేయవచ్చు. ఉదయం నిద్రలేపి మొదటగా వారిని బ్రష్‌ చేసుకోమని, పేస్టు వేసి మరీ బ్రష్‌ అందిస్తే, వారికి అదే అలవాటై మొదటగా ఆ పనిని పూర్తి చేస్తారు. అపðడు వారికి బూస్టో, హార్లిక్సో, పాలో కలిపి ఇవ్వవచ్చు.
2. వారానికోసారైనా తలస్నానం చేయ డం:
బాలబాలికలకు వారానికోసారన్నా తల స్నానం చేయించాలి. అలా చిన్నప్పటి నుంచీ ఓ పద్దతిగా ఓ ఆదివారవెూ, లేదా వారంలో ఏదో ఒకరోజున వారికి క్రమం తప్పకుండా తలస్నానం చేయించటం నేర్పాలి. ఇలా చేయటం వలన తల దుమ్ముతో నిండు కోకుండా ఉండడమే కాక, చుండ్రు (డాండ్‌రఫ్‌), పేనుకొరకడం లాంటి వాటికి పుల్‌స్టాప్‌ పెట్ట వచ్చు. జుట్టు కూడా అం దంగా, ఆరోగ్యంగా నిగనిగలాడు తూం టుంది.
3. వారానికోసారి గోళ్లు కత్తిరించుకోవడం:
అలాగే వారానికోసారి వాళ్లకి గోళ్లు కత్తి రించుకునేలా తర్ఫీదు నివ్వాలి. ఎందుకంటే, అక్కడా ఇక్కడా వారు ఆడుకుంటుంటారు కాబట్టి త్వరగా వారి గోళ్లల్లో మట్టి చేరే అవ కాశముంటుంది. అలాగే మట్టి నిండిన గోళ్ల తో ఆహారాన్ని భుజించడం వల్ల బ్యాక్టీరియా సోకే ప్రమాద ముంది. ఈ అలవాటు వలన బ్యాక్టీరియాను అరికట్టవచ్చు. ఇలా గోళ్లు కత్తి రించుకోవడమనే మంచి పద్ధతిని నేర్పే ముందు వారికి నైల్‌కట్టర్‌నే వాడాలని సూచిం చాలి. బ్లేడు వాడటంవల్ల వారు వేళ్లు కోసు కునే ప్రమాదముంది. నైల్‌కట్టర్‌తో గోళ్లను ఎలా కత్తిరించుకో వాలో వాళ్లకి పెద్ద వాళ్లు నేర్పాలి. మరీ చిన్నపిల్లలైతే పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఈ పనిని చేయించటం మంచిది.
4. రాత్రిపూట త్వరగా పడు కోవడం:
పిల్లలు కనీసం 8 గంట లన్నా నిద్రించేలా చేయాలి పెద్దలు. ఎందుకంటే రాత్రి ఎక్కువసేపు మేలుకున్నం దువల్ల ఉదయం వారు స్కూల్లో పాఠాలను శ్రద్ధ గా వినలేరు. పేరెంట్స్‌ వా రిని వీలైనంత వరకు సెకండ్‌షో సిని మాలకు తీసుకెళ్లరాదు. సెలవురోజుల్లో ఎపðడన్నా సర దాగా తీసుకెళ్తే ఫర్వాలేదు కానీ, అదే పనిగా తమకు అనువుగా ఉంటుంది కదా అని పెద్దలు అపðడపðడూ తీసికెళ్తే వారికి నిద్ర సమయానికి పట్టకపోవచ్చు. అందుకనే ఓ క్రమపద్ధతిలో వారిని నిద్ర పోయేలా చేయాలి. ఇందువల్ల వారి శారీరక ఆరోగ్యమే కాక, మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది.
5. పెద్దల పట్ల గౌర వాన్ని ప్రదర్శించడం:
పిల్లలు, పెద్దల్ని గౌరవించేలా తల్లిదం డ్రులు శిక్షణనివ్వాలి. అలా పెంచడం వలన మీ మిత్రుల ముందు మీ పరువు పోకుండా ఉండ డమే కాక, పెద్దలు చెప్పిన మాటలు వినేం దుకు కూడా వారు అలవాటు పడి పోతారు. ఇందువల్ల చెడుమార్గంలో నడిచేందుకు ఆస్కార ముండదు.
6. అందరితో మర్యాదగా ప్రవర్తించడం:
పిల్లలు పెద్దలపట్లనే కాక తోటిపిల్లలతో కూడా మర్యాదగా ప్రవర్తించేలా వారిని తీర్చిదిద్దాలి. ఇలా చేయడం వలన చీటికి మాటికీ తోటి పిల్లలతో గొడవ పడడం అనే సమస్యుండదు. అలా పెంచకుంటే తోటి పిల్లలను ఏదో అన డం, లేదా వారి వస్తువులు లాక్కోవడం లాంటి పనులు చేయవచ్చు. ఇలాంటి పనులు తప్పనీ, చేస్తే పనిష్మెంట్‌ ఉంటుందనీ చెప్పడం వల్ల వారు అలాంటి పనులు చేయక బుద్ధిగా ఉంటూ చదువుమీద దృష్టిని కేంద్రీకరిస్తారు.
7. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం:
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లి దండ్రులు కేర్‌ తీసుకోవాలి. పిల్లలు చేయలేరు కదా అని అన్నీ మనమే ముందు గానే చేసే స్తుంటే వారికి ఏ పనీ చేతకాదు. 'నీవు ఈ పని చేయగలవు, చేయి' అని వారిని ప్రోత్స హిస్తే, వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఆ పను లను ధైర్యంగా చేస్తారు. అలా వారిలో స్వం తంగా ఆలోచించే స్వభావం ఏర్పడు తుంది. ఎవరిమీదా ఆధారపడకుండా వారి పనులను వారే చేసుకోగల్గుతారు.
8. ఆరోగ్యంగా ఉండడం:
పిల్లలకు ఆరోగ్యం గురించీ, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయాలను వారు అర్థం చేసుకునేలా చెప్పాలి. అలా చెప్పకుంటే వారు ఎక్కడంటే అక్కడ శుభ్రత లేనిచోట, తినుబండారాలను కొనుక్కొని తినడం వల్ల రోగాలు రావచ్చు. వారి ఆరోగ్యాన్ని వారు కాపాడు కునేలా వా రికి శిక్షణ నివ్వ డం చాలా మంచిది.
8.పరిశుభ్రత పాటించడం:
పిల్లలకు పరిశుభ్రత గురించి బోధిం చాలి. మాసిన యూనిఫాం వేసు కుని స్కూలు కు వెళ్లకుండా, యూనిఫాంతోనే ఆటలాడు కోకుండా, స్కూలునుంచి రాగానే యూనిఫాం తీసేసి, వేరే బట్టలేసుకోవడం, ఆహా రం తీసుకునేముందు చేతులు కడుక్కోవడం లాంటి విషయాలను నేర్పాలి.
10. టైం ప్రకారం చదువుకునేలా తర్ఫీదు నివ్వాలి:
పిల్లల్ని రోజూ తల్లిదండ్రులు చదువుకో మని చెప్పకుండానే ఓ పద్ధతిగా టైం ప్రకా రంగా వారు చదువుకునేలా తల్లిదండ్రులు చిన్నప్ప ట్నుంచీ నేర్పిస్తే వారు ఎవరూ చెప్ప కుండానే స్కూలు ప్రారంభంనుంచీ ఓకేలా చదవడం వల్ల పరీక్షలపðడు పెద్దగా కష్టపడా ల్సిన పనుండదు.
కాబట్టి పిల్లలకు ఇలాంటి మంచి పద్ధతుల్ని తప్పకుండా పెద్దలు నేర్పడం వల్ల, మంచి పద్ధతులను అలవాటు చేయడం వల్ల వారు ఓ క్రమ పద్ధతిలో పెరిగి తల్లిదండ్రులకు మంచిపేరు తెస్తారు.
_________________________________________________________

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే...

apr -   Sat, 25 Feb 2012, IST
 బాలప్రభ
సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేవెూ గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు. ఇలా మరిచిపోయేందుకు కారణం వారిలో పరీక్ష అంటే వున్న భయం, టెన్షన్‌ కావచ్చు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్లా, భయం వల్లా పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి టెన్షన్లకు పిల్లలు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ మెదడు చలాకీగా పనిచేయాలన్నా, అనారోగ్యం, నిద్రలేమి, ఆందోళన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పోలేట్‌ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది. నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్‌, ఆంథోసియానిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. కొంతమంది ఆపిల్‌ తొక్కను తీసేసి పండును మాత్రమే పిల్లలకిస్తుంటారు. ఆపిల్‌ తొక్కలో కూడా మంచి పోషకాలు ఉంటాయనే సంగతిని మరవరాదు. ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్‌, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం అందించాలి.
_________________________________________________________

సునిశిత మేధావి..!

చిన్నారులూ..!
'అమ్మ' అన్నమాట ఎంత మధురంగా ఉంటుందో.. 'అమ్మ' గురించి మాక్సింగోర్కి రాసిన కథ అంతకంటే సుమధురంగా ఉంటుంది కదా! ఈ వారం తో 'అమ్మ' బొమ్మలకథ అయిపోతుందర్రా! ఒత్తిడిలో చదవలేకపోయారా..? ఒకవేళ చదివితే మంచిదే. చదవలేని వారూ బెంగపడకండి. 'అమ్మ' బొమ్మల కథ త్వరలో పుస్తక రూపంలో రాబోతుందర్రా! 'భలే..!' అని అనుకుంటున్నారా?! బహుశా ఈ వేసవిలోనే మీకందరికీ 'అమ్మ' బొమ్మలకథ పుస్తకం చల్లగా మీ చేతుల్లో ఉండొచ్చు. ఇంత మంచి కథని విశ్వజనావళికి అందించిన మాక్సింగోర్కీ' జయంతి ఈ నెల 28నే. అనుకోకుండా మన 'బొమ్మలకథ' ముగింపురోజే 'మాక్కింగోర్కీ' తాతయ్య గురించీ తెలుసుకోబోతున్నామర్రా! మనిషి ప్రగతి ప్రస్థానంలో ప్రపథమ ఆయుధం ఊహ. ఊహే మనిషిని ముందుకు నడిపిస్తోందనడంలో ఏమాత్రం సందేహం లేదర్రా! ఊహ వల్లే కొత్త విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాం. కొత్త ఆవిష్కరణల్ని, కళాఖండాల్ని సృష్టించగలుగుతున్నాం. అంతేకాదర్రా! అద్భుతమైన కథలు కూడా ఊహల్లో నుండే పుడతాయి కదా! పరిశోధకులు ఏమంటున్నారో తెలుసా? 'ఊహ' అనేది 'నిక్షిప్తిజ్ఞానం' అని అంటున్నారర్రా! నిజమే. అయితే ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలను బట్టి భావోద్రేకాల్ని కలిగిస్తుందర్రా! ఆయా పరిస్థితులు, వ్యక్తి స్థాయి, ఆలోచనా సామర్థ్యం, జీవన స్థితిగతులపై కూడా ఊహాశక్తి ఆధారపడి ఉంటుందర్రా! అయితే ఈ ఊహాశక్తి నిర్మాణాత్మకంగా సాగితే ఆ వ్యక్తికి, సమాజానికి మేలు జరుగుతుందర్రా! అలా తన ఊహాశక్తితో సమాజానికి ఎంతో తోడ్పడినవాడు 'మాక్సింగోర్కీ' తాతయ్య. అంతటి మహనీయుని గురించి తెలుసుకుందామే..!
గోర్కీ.. ఈ పదంకు అర్థమేమిటో తెలుసా? 'చేదు'. తన ఊహాశక్తితో 'చేదు' లాంటి వాస్తవాల్ని ప్రతిబింబించగల సునిశిత మేధావి 'గోర్కీ'! వాస్తవం చేదుగానే ఉంటుంది. చక్కెర పూసిన అసత్యం తియ్యగా ఉంటుంది.
కొడుకు అందించే విప్లవస్ఫూర్తిని అమ్మ కూడా పొందింది. ముందుకు అడుగులు వేసింది. వేయించింది. ఇదేమీ అంత సులభం కాదు. అదీ నూరేళ్ల నాడు. అందుకేనేమో మమతానుబంధాల్ని సాయుధులుగా మలిచాడు గోర్కీ.
ఇలా విప్లవోద్యమంలో దూసుకుపోతున్న కొడుకును అనుసరించిన తల్లుల్లో 'అమ్మ' మొదటిదేమో..' అంటాడు రీబిన్‌.
'జీసస్‌ కీర్తికోసం ప్రాణాలర్పించే మనుషులే లేకపోతే.. జీసస్‌ ప్రభువే అయ్యేవాడు కాదు' అంటుంది అమ్మ. తన అంతరంగంలోని భావాల్ని ఆమె ఎంతబాగా విశ్లేషించిందో కదా!
పావెల్‌, సాషాలను ముచ్చటైన జంటగా చూడాలని ఎంత సహజంగా అమ్మ కోరుకుంటుందో.. కొడుకు ఉద్యమంలో చాలారోజుల ప్రవాస జీవితాన్ని ఎదుర్కోవడాన్నీ అంతే గంభీరంగా స్వీకరిస్తుంది. అక్షరం ముక్క రాని అమ్మ ఒక ఆదర్శనాయికగా ఆవిర్భవించడం సామాన్యమైంది. కాదు. అంతేకాదు సాషా, నతాషా, లుద్మీలా, నికొలొరు, ఇవాన్‌, రీబిన్‌ వంటి వారందరితో ఆమె ఎంతగానో ప్రభావితమవు తుంది. అంతేకాదు.. ఆ తర్వాత ఆమె కూడా వారిని ప్రభావితం చేస్తోంది.
ఇంత హృద్యంగా గోర్కీ ఆ పాత్రలను మలచడం అపూర్వం. అత్యద్భుతం.!
సామాన్య ప్రజానీకంలో నుండి గొప్ప రచయితగా ఎదిగిన వ్యక్తిగానో.. గొప్ప సాహితీవేత్తగానో.. కొందరికి కంటగింపుగా మారినవాడిగానో. ఏ ఒక్క రూపంతోనో గోర్కీని మనం స్మరించుకున్నా సరిపోదర్రా!
ఆధునిక రష్యా జీవితంలోని సంక్లిష్టమైన నైతిక వర్తనను గుర్తించిన తొలి రచయితగా ప్రపంచం మొత్తం 'గోర్కీ'ని గుర్తించిందీ.. గౌరవించిందీ..!
విప్లవం రేకెత్తించిన ఆశలనూ.. చూపిన అద్భుత ఫలితాల్లోని పరిమితులనూ.. ఆ విప్లవపథంలో కనబడని సున్నితమైన నైతిక ప్రమాదాలనూ.. ఎంతో ముందుగా.. ఎంతో సునిశితంగా గుర్తించిన మేధావిగా గోర్కీని ప్రతి ఒక్కరూ గుర్తించక తప్పదు.
సోషలిస్టు నిర్మాణంలో అన్ని రంగాల్లో ఎంతో ముఖ్యమైనపాత్ర నిర్వహిస్తున్న సోవియట్‌ మహిళను అంత వివరంగా చిత్రించడం ఆయనకే సాధ్యమైందేమో అనిపిస్తుంది. అదీ ఎన్నో ఏళ్ల కిందట..!
గోర్కీని అజరామరం చేయడానికి మనందరిలో అణువణువును ఆక్రమించుకున్న 'అమ్మ' కన్నా నిదర్శనం ఇంకేం కావలర్రా!
ఇక ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళితే..
గోర్కీ తన తండ్రి పేరును కూడా కలుపుకుని 'మాక్సింగోర్కీ'గా ప్రాచుర్యంలోకి వచ్చాడిరా! గోర్కీ మార్చి 28, 1868న రష్యాలోని నిజ్ని నోవోగార్డ్‌లో పుట్టాడిరా! మూడేళ్లప్పుడు.. అంటే చాలా బుజ్జిగా ఉన్నప్పుడు గోర్కీ వాళ్ల నాన్న చనిపోయాడు. దీంతో అమ్మమ్మ దగ్గర గోర్కీని వదిలి తల్లి వెళ్లిపోయింది. గోర్కీ కేవలం రెండేళ్లే బడిలో చదువుకున్నాడంట! ఆ తర్వాత అమ్మా చనిపోయింది. 'ఏదైనా పనిచేసుకుని బతుకు ఫో..!' అంటూ తాతయ్య ఇంటి నుండి గోర్కీని గెంటేశాడంట! పాపం గోర్కీ అంత చిన్నప్పుడే బతకడం ఎలాగా? అంటూ జీవనసమరం మొదలుపెట్టాడిరా! గోర్కీకి పుస్తకాలంటే చాలా ఇష్టం. పగలంతా పనిచేసి, రాత్రిపూట పుస్తకాలు చదువుకునేవాడంట! మొదట పుష్కిన్‌ కథలు, కవితలు చదివాడంటర్రా! అందులోని పద సంపదకు గోర్కీ పరవశించిపోయాడంట!. భావాలు జీవితంపై ఆసక్తిని పెంచుతాయర్రా! అలా ఆ పుస్తక పఠనతో గోర్కీ తన కొత్త జీవితానికి రెక్కలు తొడిగాడు ఆ తర్వాత లెర్మాంటవ్‌, గొగోల్‌ రచనల్ని చదివాడు. అవి చదవడంతో ప్రజల కడగండ్లను అర్థంచేసుకోగలిగాడు. అంతేకాదు చదువురాని శ్రామికులకు విషయాలు తెలియజేయాలనే తపన గోర్కీలో కలిగిందంటర్రా! అలా గోర్కీలో కథలు ప్రాణం పోసుకున్నాయర్రా! తన చుట్టూతా జరిగే అనేక విషయాల్నే కథలుగా వారికి చెప్పడం ప్రారంభించాడు. అలాగే అనేక కథల్ని చదివి వినిపించేవాడంటర్రా! అంతే కాదు ఆ కథలు చెప్పేటప్పుడు తన మోములో సందర్భా నుసారం అనేక భావాల్నీ ప్రదర్శించేవాడంటర్రా! భలే..! మీరూ అలా చేస్తారా మరి? ఇది ఎంతో మంచిపనో కదా! చదువురాని వారికి మంచి విషయాల్నీ, మంచి కథల్నీ ఈ వేసవి సెలవుల్లో చదివి వినిపించండే!
ఇలాంటి పనులతో శ్రామికుల్లో ఓ కదలిక తీసుకురా గలుగుతున్నానన్న విషయాన్నీ గోర్కీ గమనించాడు. అందుకే విప్లవానికి దాన్నే ఆయుధంగా మలిచాడు.
ప్రజల గురించి చేసిన అధ్యయనాలు, అందుకు చేసిన ఆలోచనలే గోర్కీకి విశ్వవిద్యాలయంలో చదవ గలిగినంత విజ్ఞానాన్ని సమకూర్చాయంటర్రా! తనలోని రచయితను తెరపైకి తెచ్చాడు. తనకు తెలిసిన ప్రజల గురించి వాళ్లు మాట్లాడుకునే భాషలోనే 'మకర్‌ చుద్ర' అనే కథ రాశాడిరా! అలా గోర్కీ రచన ప్రారంభమై అనేక కథలకు ప్రాణం పోసి, నవలలు రాసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత నాటకాలకు ఆయువులూదాడు. ఆ తర్వాత రచించిన 'అమ్మ' నవల గోర్కీని ప్రపంచ మంతా స్ఫూర్తిని పొందిందంటే అతిశయోక్తి కాదు. అది ఆచరణలో రుజువైంది కూడా! ఆ తర్వాత రాసిన నవల ప్రపంచంలో జరుగుతున్న చారిత్రక సత్యాల్ని వెల్లడిం చింది. ఒక సామాన్యుడికి అవకాశమిస్తే ఎలా ఎదుగు తాడో అందులో ఎంతో సజీవంగా చిత్రించాడిరా! అలా ప్రజా రచయితగా గోర్కీ పేరుపొందాడిరా!
'యుద్ధాలు వస్తుంటాయి. అయితే మనం దాన్ని ఎదుర్కొనడానికి సన్నద్ధులమై ఉండాలి' అంటూ తన చివరిదశలోనూ గోర్కీ చెప్పిన మాటలు ఆణిముత్యాలు! తన 68వ ఏట 1936, జూన్‌ 18న గోర్కీ మనకు భౌతికంగా దూరమయ్యారు. కానీ ఆయన చూపిన మార్గం మనందరికీ ఆదర్శనీయమర్రా..!
'నేను పెద్దయ్యాక ఈ ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తా' అని గోర్కీ తనచిన్నప్పుడే ప్రతినబూనాడంటర్రా! మరి మీరూ అలాంటి ప్రతిన తీసుకుంటారని ఆశిస్తున్నా!
మరి ఇంత గొప్ప ప్రజా రచయిత 'మాక్సిం గోర్కీ' తాతయ్యకి జేజేలు చెప్పేద్దామే..!
__________________________________________________________

ఆంధ్రప్రదేశ్‌లో నదులు

  • - రమణకుమార్
  • 17/03/2012
1. శ్రీకాకుళం- బాహుద, మహేంద్రతనయ, వంశధార, నాగావళి, వేగావతి
2. విజయనగరం- వేగావతి, సువర్ణముఖి, నాగావళి, చంపావతి, గోస్తని
3. విశాఖపట్నం- గోస్తని, శారద, మేఘాద్రిగెడ్డ, వరహాలుగెడ్డ, తాండవ
4. తూర్పుగోదావరి- తాండవ, పంప, ఏలేరు, గోదావరి
5. పశ్చిమ గోదావరి- గోదావరి, ఎర్రకాలువ
6. కృష్ణా- బుడమేరు, మునే్నరు, తమ్మిలేరు, కృష్ణా
7. గుంటూరు- కృష్ణ, గుండ్లకమ్మ, నాగులేరు, చంద్రవంక, ఓగేరు
8. ప్రకాశం- గుండ్లకమ్మ, పాలేరు, మూసీ
9. నెల్లూరు- పెన్న, స్వర్ణముఖి, కండలేరు, ఉప్పుటేరు
10. చిత్తూరు- పాపాఘ్ని, గొడ్డువంక, స్వర్ణముఖి, వించ, అరణి
11. కడప- పెన్న, పాపాఘ్ని, కుందు, చెయ్యేరు, చిత్రావతి, పగిలేరు
12. అనంతపురం- పెన్న, తుంగభద్ర, చిత్రావతి, వేదవతి
13. కర్నూలు- తుంగభద్ర, కృష్ణ, హంద్రీ, కుందేరు
14. మహబూబ్‌నగర్- దిండి, కృష్ణ, తుంగభద్ర
15. రంగారెడ్డి- మూసీ
16. హైదరాబాద్- మూసీ
17. నల్గొండ- కృష్ణ, మూసీ, ఆలేరు, పెదవాగు, దిండి
18. ఖమ్మం- మునే్నరు, కినె్నరసాని, వైర, శబరి, పాలేరు, గోదావరి
19. వరంగల్- గోదావరి, వైర, మునే్నరు, పాలేరు, ఆలేరు
20. మెదక్- మంజీర, హల్ది
21. నిజామాబాద్- మంజీర, గోదావరి, పులాంగు
22. కరీంనగర్- గోదావరి, మానేరు
23. ఆదిలాబాద్- పెన్‌గంగ, ప్రాణహిత, వార్ధ, కడెం
_____________________________________________________________

No comments:

Post a Comment