
అంతరిక్షంలో అనేకానేక ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. సాధారణంగా ఇవి సౌరశక్తిపై ఆధారపడుతున్నాయి. అయినా, వాటిలో కాస్త భారీ స్థాయిలోనే ఇంజన్లు ఉంటాయి. అవి ఉపగ్రహం ముందుకు కదలడానికి అవసరమైన 'థ్రస్ట్' (శక్తి) ని అందిస్తాయి. చిన్న ఉపగ్రహాలకు అటువంటి భారీ ఇంజన్లు భారమే. ఈ తరుణంలో అమెరికాలోని మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పాలో లొజానో అనే శాస్త్రవేత్త అతి చిన్న థ్రస్టర్‌ని రూపొందించాడు. కేవలం ఒక రూపాయి నాణెమంత పరిమాణంలో కంప్యూటర్ చిప్ రూపంతో ఉండే ఈ పరికరం చాలా చిన్న ఉపగ్రహాలను ముందుకు నడిపించగలదు. ఈ పరికరంలో సుమారు 500 సూక్ష్మ బొడిపెలు ఉంటాయి. విద్యుత్ అవసరమైనపుడు ఈ బొడిపెల నుండి అయాన్లు ఏకధాటిగా విడుదల అవుతాయి; అవే శక్తిని అందిస్తాయి.
No comments:
Post a Comment